మా రచయితలు

రచయిత పేరు:    పి చంద్

నవలలు

కూలి బతుకులు (నవల) 

కూలి బతుకులు (నవల) – మొదటి భాగం

            మూసివేతకు గురైన ఫర్టిలైజర్‍ కార్పోరేషన్‍ ఆఫ్‍ ఇండియా చిమ్నీనీల మీదుగా సూర్యుడు ఉదయించిండు.

            ఎన్టీపిసి ఫస్టుగేటు ముందున్న నేషనల్‍ హైవే రోడ్డుకు అవలివైపున ఉన్న మైదానంలో లేబర్‍ అడ్డాకాడ దాదాపు రెండు మూడు వందల మంది కూలీలు పనుల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు అప్పటికింకా తెరుచుకోలేదు. రోడ్డు మీద ఎడతెగని ప్రవాహంలా వాహనాలు రోద పెడుతూ పరుగెడుతున్నాయి.

            ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు పూట గడవని కూలీలు చాల మందే ఉన్నారు. కొంత మంది దూర ప్రాంతాలనుండి సద్దులు కట్టుకొని చీకటితోనే వచ్చిండ్లు. మరి కొంత మంది చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి వచ్చిన వాళ్ళు... కూలీలలో ఆడవాళ్లు, మొగవాళ్లు ఉన్నారు. అందరి మొఖాల్లో ఆ రోజు కూలి దొరుకుతుందో లేదో అన్న అందోళన ఉంది.

            ‘‘రెండు రోజుల నుండి ఇక్కడే పడిచస్తున్నా. ఇవ్వాలైనా పని దొరుకుద్దో లేదో?’’ అంటూ ఓ యువకుడు నిరాశగా ప్రక్కనున్న మరో యువకుడితో అంటున్నాడు. ఆ యువకుడు నిర్లిప్తంగా ఏమోఅన్నట్టుగా తలాడించిండు.

            గతంలో అయితే లెబర్‍ అడ్డాకాడ ఉదయం తొమ్మిది పది గంటలదాక మనష్యుల అలికిడి ఉండేది. కాంట్ట్రార్లు తమ దగ్గర పనిచేసే మేస్త్రీలను పంపి  ఆ రోజు కావాల్సిన కూలీలను తీసుకపోయే వాళ్ళు. కాని ఇప్పుడు పరిస్థితులు మారినవి.    ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపే లేబర్‍ అడ్డా మీద కూలీలు ఎవరు కన్పించటం లేదు.  ఇదివరలో అయితే తీరిపారి వచ్చే కాంట్రాక్టర్లు పొద్దున్నే వస్తున్నారు. 

            ‘‘ఇదిగో ఇదివరకు లెక్క పదింటికి పని మెదలు పెట్టి అయిదింటికే పోతామంటే కుదరదు.  ఎనిమిది గంటలకే పని మొదలు పెట్టాలి... సాయంత్రం అరుగంటల దాక పని చెయ్యాలి... అట్లా ఇష్టపడితేనే పనుల్లోకి రండి లేకుంటే లేదు’’ అంటూ కాంట్రాక్టర్లు కరాఖండిగా చెప్పుతాండ్లు. అట్లా ఇష్టపడ్డ వారినే పనులకు తీసుకుంటాండ్లు.

            ‘‘ఇదేందని’’ ఎవరన్నా అంటే...

            ‘‘ఇదివర లెక్క రూల్స్ లేవు. మోడి సాబ్‍ వచ్చిన తరువాత ఎనిమిది గంటల పని విధానం పోయింది. ఇప్పుడు కూలోల్లు పన్నెండు గంటలు పనిచెయ్యాలి. కాందంటే మీ ఇష్టం’’ అంటూ కాంట్రాక్టర్లు నిష్టూరంగా మాట్లాడుతాండ్లు.

            కూలీలు చేసే ప్రతి పనిలో యంత్రాలు వచ్చిన తరువాత పనులు దొరకటం కష్టమైంది. గతంలో పదిమంది పనిచేసేకాడ ఇప్పుడు ఒకరిద్దరితోనే  ఎల్లదీసుకుంటాండ్లు. దాంతో కూలీల మధ్య పోటీ పెరిగింది. ఎంతకైనా పనిచేయటానికి సిద్దపడుతాండ్లు. రూల్స్ సంగతి చాలా మంది కూలీలకు తెలియదు. గతంలో అయితే కాంట్రాక్టు కూలీ సంఘం వాళ్ళు ఏదైనా ఎటమటం అయితే వచ్చి మాట్లాడే వాళ్ళు... ఎనిమిది గంటల పని విధానం గురించి, కూలీ గురించి కొట్లాడేటోళ్ళు... కాని ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చి వాళ్ళ కాళ్ళు, చేతులు కట్టేసింది. ఏమన్నా అంటే అంతా చట్టప్రకారమే జరుగుతాంది... మీరు పోయి ఎక్కడ చెప్పుకుంటరో చెప్పుకొండ్లీ మాకేమి భయం లేదుఅంటూ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతాండ్లు.

            మాదిగ నాగన్న పొద్దున్నే చీకటితోని పనికోసం వచ్చిండు. రెండు రోజులుగా పనికోసం వచ్చి పోతున్నడు. కాని ఎవరు పనిలోకి పిలువలేదు. మేస్త్రీలు యువకులను, కాస్త నజర్‍గా ఉన్నవారిని తీసుకొని కాస్త వయసు మల్లిన వారిని ప్రక్కన పెడుతున్నారు. అయినా ఈ రోజైన పని దొరకుతుందనే అశ అతన్ని పొద్దున్నే మళ్ళీ వచ్చేలా చేసింది...

            మాదిగ నాగన్న ఎన్టిపిసి పెద్ద బొంగు పడ్డప్పుడు రామగుండం వచ్చిండు. ఆయనది స్వంత వూరు సిర్‍పూర్‍కాగజ్‍ నగర్‍ దగ్గర మానేపల్లి.

            అ రోజుల్లో ఎన్టీపిసికి అవసరమైన చెఱవుకట్ట నిర్మాణపు కంట్రాక్టు చేపట్టిన పి.కే రామయ్య దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ కూలీలు దొరుకుతరో ఆ ప్రాంతాలకు మనష్యులను పంపించి కూలీలకు అడ్వాన్స్లు ఇచ్చి, ఆశలు చూపి దాదాపు నాలుగైదు వేల మంది కూలీలను సమీకరించిండు. వాళ్ళు ఉండటానికి ఒక చోటు చూయించిండు. అదే పి.కె. రామయ్య కాలనీ... అక్కడ దేశంలో అన్ని ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన వలస కూలీలున్నారు... ఒక వైపు ఒరిస్సా కూలీలు గుడిసెలుంటే, మరోవైపున బెంగాలీ నుండి వచ్చిన కూలీల వాళ్ళు ఉండేది. ఇంకా పాలమూరు, ఒంగోలు, చత్తీస్‍ఘడ్‍, జార్ఖండ్‍ చెందిన వాళ్ళు ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే  పి.కె. రామయ్య కాలనీ కష్టాలు కన్నీళ్ళతో కూడుకున్న మని భారతదేశంలా ఉండేది.

            ఎన్టీపిసి నిర్మాణపు పనులున్నప్పుడు వేల సంఖ్యలో కూలీలు పనులు చేసేవాళ్ళు. దాదాపు ఐదు సంవ్సరాలు నిర్మాణపు పనులు జరిగినవి. అప్పుడు ఆ ప్రాంతమంతా కూలీలతో కళకళలాడింది. నిర్మాణపు పనులు అయిపోయిన తరువాత ఇప్పుడంతా మెయింటనేన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలిపోయి చాలా మందికి కూలీ దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా మంది వెళ్ళిపోయిండ్లు. ఎటు పోలేని వాళ్ళు మిగిలి పోయిండ్లు.

            నాగన్న వచ్చిన కొత్తలో పి.కె. రామయ్య దగ్గర పనిచేసిండు. ఆయన భార్య శాంతమ్మ. ఇద్దరు కూలి చేసేవాళ్ళు. దాంతో కుటుంబం ఒకింత సాఫీగానే జరిగిపోయింది. అక్కడ పని అయిపోయిన తరువాత కొన్ని రోజులు ఇర్కాన్‍ కంపినిలో రైల్వే లైను పనులు చేసిండు. ఇట్లా ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేసుకుంటూ వచ్చిండు. కాని ఎన్నేండ్లు పనిచేసిన పొట్టకు గడిసింది తప్ప దమ్మిడి మిగిల్చుకున్నది లేదు. వయసు మీద పడ్డది కాని చేసుకుంటే తప్ప ఎల్లని పరిస్థితి ఏర్పడింది.

            ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సత్తెయ్య పెండ్లి చేసుకొని కూలీపనులు చేసుకుంటూ వాని బతుకుకు వాడు బతుకుతాండు. చిన్నోడు శీను చదువు మధ్యలో ఆపి కాంట్రాక్టర్‍ దగ్గర ట్రాక్టరు డ్రైవర్‍గా పనిచేస్తున్నాడు.

            సివిల్‍ పనులు చేసే కాంట్రాక్టర్‍ నర్సింగరావు దగ్గర పనిచేసే మేస్త్రీ తిరుపతి రెడ్డి వచ్చే సరికి కూలీలంతా దూరం దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆయన చుట్టు మూగిండ్లు.

            ‘‘అరేయ్‍ ఎంట్రా ఈగల్లా ముసురుతాండ్లు... దూరం దూరం జరుగుండ్లీ’’ అంటూ కసురుకొని అందరికేసి పరీక్షగా చూసిండు. ‘‘నాకు ఎనిమిది మంది కావాలి’’ అన్నాడు.

            నేనంటే నేను అన్నట్టుగా అందరూ మరోసారి సొచ్చుకొచ్చిండ్లు...

            ‘‘అరేయ్‍ మీద మీద పడ్తాండ్లేందిరా దూరం జరగండి’’ అంటూ తిరుపతిరెడ్డి మరోసారి కసురుకొని అందర్ని పరీక్షగా చూస్తూ  ‘‘అరేయ్‍ నువ్వురా... నవ్వురా’’ అంటూ వేలెత్తి చూయిస్తూ ఎనిమిది మందిని ఏరుకొని ‘‘అరేయ్‍ మీరంతా దొరల బంగ్లాకాడికి పొండి.  అక్కడ పని చేయాలి’’ అంటూ పురమాయించిండు.

            ‘సరేనయ్యఅంటూ వాళ్ళు తలలు ఆడించి బయలు దేరిండ్లు. అది చూసి తిరుపతిరెడ్డి మోటారు సైకిల్‍ స్టార్టు చేసిండు.

            కూలీ దొరకని వాళ్ళు నిరాశగా చూసిండ్లు. మరోవైపు కూలీకోసం వచ్చి అరువై, డెబ్బైమంది స్త్రీ కార్మికులు పులుకు పులుకు చూస్తూ నిలబడి పోయిండ్లు.

            ‘‘ఏందే పెద్దయ్య! ఇవ్వాల కూడా ఉత్తదే అయ్యేట్టుంది’’ అంటూ రాధ నిరాశగా చూస్తూ నాగన్న దగ్గరికి వచ్చింది.

            అంత వరదాక ఎటో చూస్తున్న నాగన్న ఆ మాటకు ప్రక్కకు తిరిగి చూసి ‘‘ఏమో బిడ్డా ఎమైతదో’’ అన్నాడు.

            ‘‘నిన్న కూడా వచ్చన కాని పనిదొరకలే’’ అంది.

            రాధను చూసి నాగన్న మనసు భారమైంది. రాధ భర్త శశికుమార్‍ చాలా ఏండ్లు బొగ్గు ప్లాంటులో పనిచేసిండు. ఏడేండ్ల క్రింద బీమారి చేసి చనిపోయిండు. ఏండ్లకు ఏండ్లు బొగ్గు ప్లాంటులో పని చేయటం వలన బొగ్గు వాని ఊపిరి తిత్తులను తినేసింది. రెండు మూడేండ్లు వస్సర వస్సర దగ్గుతూ ఊపిరి సలుపక నానా అవస్థలు పడి చనిపోయిండు. ఒకప్పుడు అమురుకుంటే అమురనటువంటి వాడు చచ్చి పోయ్యేనాటికి కట్టెపుల్ల తీర్గ అయిపోయిండు. వారి ముగ్గురు పిల్లలను రాధ కూలీనాలి చేసుకుంటూ సాదుకొస్తాంది. పోయినేడు పెద్ద పిల్ల పెండ్లి చేసింది.

            నాగన్న మాట మార్చుతూ ‘‘బిడ్డ అల్లుడు ఎట్లున్నడు?’’ అని అడిగిండు.

            రాధ మొఖం విప్పారగా ‘‘మంచిగున్నరు’’ అంది...

            ‘‘ఏందో తీయ్‍బిడ్డా, నువ్వు కష్టపడ్డందుకు పొల్ల మంచిగ బతికితే సరిపాయే’’ అంటూ క్షణమాగి ‘‘పొల్లగాడు ఏం పని చేస్తాండు?’ అన్నాడు.

            ‘‘రైల్వేల కూలీ’’ అంది.

            ఇంతలోనే కాంట్రాక్టర్‍ రంగయ్య గుమస్తా దాడి శ్రీను రావటం చూసి ఆడోల్లల్ల్లో కదలిక ఏర్పడింది. అది చూసి రాధ గబగబ అటు కేసి పరుగు పెట్టింది.

            కాంట్రాక్టరు రంగయ్య ఎన్టీపిసిలో గడ్డిపని, తోటపని చెట్ల పెంపకం కాంట్రాక్టు పట్టిండు. ఎన్టీపిసిలో ప్రతి పని కాంట్రాక్టు కార్మికులే చేస్తారు. సివిల్‍ వర్క్, మెయిన్‍టనెన్స్ పనులు, బాయిలర్స్ క్లీన్‍ చేయటం వంటి అరొక్క పనిని కంపెనీ ఔట్‍ సోర్సింగ్‍ చేసింది. ప్లాంటులో పర్మినెంటు ఉద్యోగుల కంటే కంట్రాక్టు కూలీలు రెట్టింపు మంది పనిచేస్తరు.

            ఎన్టిపిసి పచ్చని చెట్లలో విశాలమైన రోడ్లతో తీర్చి దిద్దినట్టుగా ఉంటుంది. మధ్య మధ్య వివిద స్థాయిలను బట్టి ఉద్యోగుల క్యాటర్స్ ఉంటాయి. అట స్థలాలు, క్లబ్‍లు పిల్లల పాఠశాలలు, పార్కులతో ఒక పచ్చిని తోటలా అహ్లదపూరిత వాతావరణం కల్గి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో చెసిన కృషికి గాను రామ గుండం ఎన్టిపిసికి వరుసగా రెండో సారి కేంద్ర ప్రభుత్వంచే బహుమతి పొందింది.

            కాని ప్రతి సంవతకసరం పది మిలియన్ల బొగ్గును కాలుస్తూ, ఎన్టీపిసి చిమ్నీలు అకాశంలోని చిమ్మే బొగ్గుపులుసు వాయువుల గురించి కాని నిరంతరం వెలువడే వేల టన్నుల బూడిద, విషవాయువుల గురించి కాని, అవి సృష్టించే పర్యావరణ విధ్వంసం గురించి ఎవ్వరికి పట్టింపులేదు.

            దాడి శ్రీను పొట్టి మనిషి, అంత పాతిక ముప్పయేండ్ల వయసుకు మించి ఉండదు. సన్నటి గడ్డం పెంచుకున్నాడు. మోటారు సైకిల్‍ను స్టాండు చేసి నేరుగా ఆడ కూలీలు ఉన్న దిక్కు పోయిండు.

            గడ్డిపని తోటపని చేయ్యటంలో మొగొళ్ళకంటే అడోళ్ళే బాగా చేస్తరని అతని నమ్మకం.

            ఎన్టీపిసిలో రక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి అందుకు సంబందించి సభలు సమావేశాలు జరుగనున్నాయి. ఫుట్‍బాల్‍ గ్రౌండ్‍ ప్రక్కన ఉన్న అడిటోరియంలో జరిగే సదుస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ఎక్కువ మంద కూలీల అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆయన వచ్చి రావటంతోనే పాతిక ముప్పయి మంది అడ కూలీలను ఎరుకున్నాడు. అప్పాయమ్మ ముందుకు వస్తే అది చూసిన శ్రీను చేతిని గాల్లో ఆడిస్తూ...

            ‘‘ఏయ్‍ ముసల్దాన నువ్వెటు వస్తానవు... పోపో అవతలికిపో’’ అంటూ వారించిండు...

            ‘‘అదేబిడ్డా నేను పని చేయనా?’’ అంది అప్పాయమ్మ దీనంగా....

            ‘‘చూద్దామంటే చటాకు మాంసం లేదు... నువ్వేమి పనిచేస్తవు పోపో’’ అంటూ కసిరిండు.

            ‘‘లేదు బిడ్డా నే చేస్తా... చెయ్యకుంటే మరోసారి పిలువకు’’ అంటూ ఎండిపోయిన రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది.

            ‘‘ఏయ్‍ ముసల్దానా, నన్ను వొర్రియ్యకు’’ అన్నాడు మరోసారి చీదరింపుగా....

            ‘‘లేదు బిడ్డ రెండు రోజులుగా తిండిలేదు. ఇంటికాడ అందరికి అందరం అకలికి చస్తానం’’ అంది మరింత దీనంగా...

            ‘‘దానికి నన్నేమి చెయ్యమంటవు?’’ అంటూ కసిరిండు.

            అయినా అప్పాయమ్మ ఇంకా దీనంగా బ్రతిమిలాడుతుంది. కాని దాడి శ్రీను మనసు కరుగటం లేదు. బంకలా పట్టుకున్న ముసల్దాన్ని చూసి కోపానికి వచ్చిండు.

            ‘‘నీయవ్వ ముసల్దాన చెప్పుతాంటే నీకు కాదు... నీ అటువంటి దాన్ని పనిలకు తీస్కపోతే మా సేఠ్‍ నన్ను పనిలనుండి తీసేస్తడు’’ అంటూ విసురుగా ముసల్దాన్ని ప్రక్కకు తోసి మిగితా వాళ్ళను వెంట తీస్కపోయిండు.

            అప్పాయమ్మ పరిస్థితి చూసినాగన్న మనసు చివుక్కుమన్నది. కాస్త కుడిఎమలుగా తన పరిస్థితి అలాగే ఉంది. తననే తోసేసినట్టుగా అన్పించి ఖిన్నుడై పోయిండు.

            అప్యాయమ్మ కారు సముద్రం భార్య. అంతర్గాంమిల్లులో వీవింగ్‍ సెక్షన్లో పనిచేసేవాడు. బర్మా కాందిశీకుడుగా వచ్చిండు. మిల్లు మూత పడ్డ తరవాత కొన్ని రోజులు ఎన్టిపిసి క్యాంటిన్‍లో కూలీగా పనిచేసిండు. ఒక రోజు రాత్రి పనిచేసి వచ్చే క్రమంలో కలు జారి పెద్ద మోరిలో పడి చనిపోయిండు. అప్పటి నుండి వాళ్ళకు కష్టాలు మొదలైనవి. వారికి ఒక కూతురు ఉంది. దానికి పెండ్లి చేసిండు. ముగ్గురు పిల్లలైన తరువాత కూతురుకు ఏదో మాయ రోగం తాకి నానా అవస్థ పడి చనిపోయింది. దాని మొగడు పెండ్లాం పిల్లలను వదిలేసి మరో దాన్ని లేపుకొని ఎటో బ్రతక పోయిండు. ఇప్పుడు పిల్లలకు ఆధారం అప్పాయమ్మే. అమె పని చేస్తే ఎల్లినట్టు లేకుంటే లేదు.

            ‘‘ఎవరిని చూసిన బ్రతుకు ఒక్క తీరుగానే ఉంది. ఏం పాపం చేసుకున్నమో బ్రతుకు ఇట్లా కాలబడ్డది’’ అనుకొని నిట్టూర్చిండు.

            దూరం నుండి కొంత మంది హౌజ్‍ బిల్డింగ్‍ కంట్రాక్లర్లు వస్తూ కనిపించిండ్లు. వాళ్ళంతా ప్రైవేటుగా ఇల్లుకట్టే       వాళ్ళు. రోజువారి పనులతో పాటు ఏదైనా స్లాబ్‍ పనులు జరిగినప్పుడు అదనపు కూలీలు అవసరం పడుతారు. ఎండకాలం సీజన్‍లో అయితే ఇంటి నిర్మాణపు పనులు జోరుగా సాగుతాయి. అటువంటప్పుడు కూలీలకు చేతినిండా పని దొరుకతది.

            ఇండ్ల నిర్మాణపు పనులు గుత్తకు తీసుకొని పని చేసే కాంట్రాక్టర్లు చాలా మంది ఆంధప్రాంతం నుండి వచ్చిన      వాళ్ళు. మాములుగా అయితే ఇండ్ల నిర్మాణం ఫీటుకు ఇంత అని కూలీ లెక్కకట్టి తీసుకుంటారు. మరికొంత మంది మొత్తం ఇంటి నిర్మాణం  గుత్తకు తీసుకొని పన్జేస్తారు. ఇట్లా గుత్తకు పట్టినవాళ్ళు తోటి కూలీలతో పాటు తాము కూడా పన్జేస్తారు. మరికొంత మంది రెండు మూడు దిక్కుల పని ఉంటే వాటి సూపర్‍వైజ్‍ చేస్తూంటారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన         వాళ్ళు తమతో పాటు కూలీలను కూడా వెంట తెచ్చుకుంటారు. ఇక్కడి వాళ్ళయితే సరిగా పని చెయ్యరని వాళ్ళకో నమ్మకం. ఏ బిల్డంగ్‍లకు స్లాబులు పోయటం వంటి అదనపు పనులు పడ్డప్పుడు కూలీ అడ్డ మీదికి వచ్చి అవసరమైన కూలీలను అపూటకు తీస్కపోతరు.

            వాళ్ళను చూసి మిగిలిన కూలీలల్లో ఆశలు రేగినవి. అట్లావచ్చిన వాళ్ళు పాతిక ముప్పయి మందిని ఏరుకొని వెంట తీస్కపోయిండ్లు.

            ఈ సారి కూడా నాగన్న పని ఉత్తదే అయింది. కాంట్రాక్టర్లు ఎవరు తనవైపు చూడనైన చూడలేదు. వెనక్కి చేతులు కట్టుకొని ఎవరైనా కూలీకి పిలుస్తారమోనని ఆశగా చూసిండు. కాని ఎవరు పిలువలేదు.

            ఎన్టీపిసిలోని పచ్చగా, గుబురుగా అకాశంలోకి ఎదిగిన చెట్లపైనుండి సూర్యుడు ఎగబాకుతున్నాడు. రోడ్డుమీద వాహనాల రోద పెరిగింది. రోడ్డు అవలవైపున కూరగాయలమ్మెకాడ జన సంచారం ఎక్కవైంది. రోడ్డు ప్రక్క చాయ్‍ అమ్మేవాడు నాలుగు గీరల బండి తీసుకొచ్చి సామాన్లు సర్దుకుంటాండు.

            ‘‘ఇక లాభం లేదు ఇవ్వాళ కూడా పని దొరికేట్టు లేదు’’ అంటూ దగ్గర వచ్చిండో ఓ వ్యక్తి... ఆయన మొఖంలో నిరాశ నిస్పృహలు  కనిపించినవి.

            నాగన్న అతనికేసి పరీక్షగా చూసిండు. కాస్త వయస్సు మళ్ళిన వాడు, నలుబై యాబై ఏండ్ల మధ్య వయస్కుడు. పీక్కపోయిన నల్లటి  మొఖం. మొలకు పంచే కట్టుకొని పైన బుషట్‍ వేసుకొని ఉన్నాడు. సగం నెరిసిన తల... చేతిలో చెయ్యి సంచి ఉంది. బహుశా అందులో సద్ది తెచ్చుకున్నట్టుంది.

            ‘‘ఎక్కడి నుంచి వచ్చినవు?’’ అని అడిగిండు నాగన్న...

            ‘‘పారుపల్లి’’

            ‘‘అంటే మంథని దగ్గర పారుపెల్లా?’’

            ‘‘అవును’’

            ‘‘అంత దూరం నుంచి వచ్చినవా?’’ అంటూ నాగన్న అశ్చర్యపోయిండు.

            ‘‘మరి ఏం చెయ్యాలి... పనులేమి లేవు.  బ్రతకటం కష్టమైతాంది.. ఇక్కడ కూలీపనులు దొరుకుతయంటే వచ్చుడైతాంది’’ అన్నాడు బాధగా..

            ‘‘ఇది వరకు ఏం పని చేసినవు?’’

            ‘‘వ్యవసాయం’’

            ‘‘మరి వ్యవసాయం చేసినోడివి గీ పనిలకు ఎందుకొచ్చినవు? వ్యవసాయం నడువటం లేదా?’’

            ‘‘కిందికో మీదికో మాగ నడుస్తుండే’’ అంటూ అతను అర్దోక్తిలో అగిపోయి దూరంగా ఎటో చూస్తుండిపోయిండు.

            ‘‘ఇప్పుడేమైంది?’’ అంటూ నాగన్న మాట పొడిగించిండు.

            అతను భారంగా నిట్టూర్చిండు... క్షణకాలం ఏం మాట్లాడకుండా నిలువు గుడ్లేసుకొని బీరిపోయిండు. కండ్లలో ఏదో తడి... కాసేపటికి తేరుకొని చెప్పసాగిండు.

            ‘‘నాకు రెండు ఎకరాల చెలక ఉండేది. అందులో ఇంత మక్కలో, పెసర్లో వేసుకొని కాలం గడుపుకొస్తుంటి. పని పాటలేనప్పుడు బావులు తవ్వపోయ్యేది. నా పెండ్లం యింత కూలినాలి చేసేది. అట్లనో ఇట్లనో బ్రతుకు వెళ్ళేది’’

            ‘‘మరిప్పుడేమైంది?’’

            ఎర్రటి ఎండ మొఖం మీద పడ్తుంటే అతను మరోసారి భారంగా నిట్టూర్చి ‘‘నా భూమి నాకు కాకుండా పోయింది’’ అన్నాడు భారంగా...

            ‘‘అదే...?’’

            విషాదం అలుముకున్న మొఖంతో అతను మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘అ భూమి మా అయ్య ఇచ్చిందికాదు. ఆయన బ్రతుకంతా దొర దగ్గర పాలేరుగానే గడిచింది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు మన కంటూ గుంటెడు భూమి ఉండాలని బమిసే వాడు. కాని ఆయన జీవితంలో ఆ కోరిక తీరకుండానే పోయిండు’’

            ‘‘మరైతే ఆ భూమి ఎట్లా వచ్చింది. నువ్వు సంపాదించుకున్నవా...?’’

 

            అతన మొఖం ఒక్కసారిగా గంభీరమైంది. దృఢమైన స్వరంతో అవును నేనే సంపాదించుకున్నాఅన్నాడు.

            ‘‘ఎట్లా?’’

            ‘‘ఎట్లా అంటే ఏం చెప్పాలి?’’ అంటూ నిట్టూర్చి మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘ముప్పయేండ్ల క్రిందటి మాట... మా ఊర్లెకు అన్నలు వచ్చిండ్లు. ఊళ్ళో సంఘం పుట్టింది. అంత వరదాక దొర కబ్జాలో ఉన్న పొరంబోకు దొరల భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేని పేదోళ్ళకు పంచిండ్లు... అట్లా నా పేరట రెండు ఎకరాలు వచ్చినవి’’ అన్నాడు.

            నాగన్నలో ఆసక్తి రేగింది. తన ఊరిలో నాగన్నకు వారసత్వంగా ఎకరమంతా భూమి వచ్చింది. కూలీనాలి చేసుకొని మరో ఎకరం కొనుక్కుంటే హాయిగా వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకంటూ బ్రతక వచ్చని కలగన్నడు. కాని ఆ కల నేరవేరలేదు. అయినా భూమి మీద మమకారం చావక అది అట్లాగే ఉంచిండు. వాళ్ళు వీళ్ళు నాగన్న నువ్వు వచ్చి ఇప్పటికే ముప్పయేండ్లు గడిచిపాయే...ఇక నువ్వుపోయి మళ్ళీ వ్యవసాయం చేసేదెప్పుడు? ఉత్తగా పడావు పెట్టుడెందుకు? ఆయింత అమ్మకపోయినవా?’’ అని అన్నప్పుడు నాగన్న ‘‘భూమిని ఎవరైనా అమ్ముకుంటరా... నేను కాకుంటే ఎప్పుడో నా పిల్లలకు అక్కరకు రాకపోద్దా?’’ అని భూమిని అమ్మకుండా అట్టే పెట్టిండు. అలోచన నుండి తేరుకున్న నాగయ్య తర్వాత ‘‘ఏమైంది?’’ అని అడిగిండు.

            ‘‘చాన లొల్లులు జరిగినయి. దొర కోపానికి వచ్చి పోలీసులను తెచ్చిండు. కొట్లాటలు కేసులు జరిగినయి. అయినా భూమిని వదిలేది లేదంటూ సంఘం తీర్మానం చేసింది’’ అంటూ క్షణ మాగిండు. బాధతో గొంతు వణుకగా మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘సంఘంలో చురుగ్గా తిర్గే మాదిగ సాయన్న కొడుకు కొమురయ్య సంఘం నాయకుడుగా ఉన్నప్పుడు అంతా బాగానే జర్గింది. ఎప్పుడైతే పోలీసులు ఓ దొంగ రాత్రి వచ్చి కొమురయ్యను పట్టుకొని చెఱువు కట్టకాడ కాల్చిచంపిండ్లు. అయినా సంఘం ఎనకడుగు వెయ్యలేదు. అంత కంత ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించి దొర ఇంటిమీద ఊరోల్లంతా పోయి దాడి చేసిండ్లు. ఆ సంగతి దొర కెట్లా తెలిసిందో కాని తెలిసింది. రాత్రికి రాత్రే తట్ట బుట్ట పట్టుకొని పట్నం పారిపోయిండు. అటు తరువాత మళ్ళీ ఊరు మొఖం చూడలేదు’’ అంటూ భారంగా నిట్టూర్చిండు. దూరంగా దృష్టి సారించి మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘కాలం కలిసిరాలే... ఏండ్లకు ఏండ్లు ఎదురులేకుండా దొరతనం చెలాయించుకున్న దొరలు ఊళ్ళు విడిచి దెంక పోయే సరికి ప్రభుత్వం ఊళ్లమీదికి పోలీసులను పంపింది. గొర్రెల మంద మీద తోడేల్లు పడ్డట్టు పోలీసులు బారు తుపాకులు వేసుకొని ఊర్ల మీద పడి అయినొన్ని కానోన్ని కాల్చిచంపిండ్లు.. మొత్తానికి ఏమైతేనిమి ప్రభుత్వంది పై చెయ్యి అయ్యింది’’ అన్నాడు.

            ‘‘మరి ఆక్రమించుకున్న భూముల సంగతి ఏమైంది?’’ అన్నాడు నాగన్న. ఆసక్తిగా అతను మళ్లీ చెప్పసాగిండు.

            ‘‘కొన్ని దిక్కుల దొరలు పోలీసులను పట్టుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళు లాక్కున్నరు. మరికొన్ని ఊర్లల్ల పడావు  పడ్డయి. కాని మా ఊర్లే మాత్రం ఆక్రమించుకున్న భూమిని వదలలేదు. సాయన్న కొడుకు కొమురయ్య పేరు మీదమేం ఆక్రమించుకున్న భూమిల స్థూపం కట్టినం. అందరికి అందరం ప్రాణాలు పోయిన భూమిని వదిలేది లేదనుకొని ఇన్నేండ్లు  సాగు చేసుకున్నం’’ అన్నాడు.

            ‘‘ఇప్పుడేమైంది?’’

            ‘‘ఏం చెప్పాలే... అటు తరువాత తెలంగాణ లొల్లి వచ్చింది. తెలంగాణ వస్తే  బ్రతుకులు బాగు పడ్తయని పోరగాండ్లకు ఉద్యోగాలు వస్తయని చిన్నా పెద్ద, ముసలి ముతక అనుకుంటూ తెలంగాణ లొల్లిలో పాల్గొన్నం... కాని తెలంగాణైతే వచ్చింది కాని మా బ్రతుకుల మన్ను పోసింది’’ అన్నాడు అవేశపడిపోయి...

            ‘‘ఏమైంది?’’

            ‘‘ఆ మధ్యన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని  రైతు బందు పథకం పెట్టింది. అబ్బో, మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సంబర పడ్డం. కాని వాడు ఎరవేసి చాపను లాగుతాండని ఊహించలేదు’’ అన్నాడు బాధగా...

            ఆయన మాటల కోసం నాగన్న ఆసక్తిగా చూసిండు అతను మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘మేం దొరల భూములు ఆక్రమించుకొని ఇరువై ఏండ్లుగా సాగు అయితే చేసుకుంటానం. కాని అ భూముల మీద పట్టా మా పేరు మీద లేదు. ఇంకా దొరల పేరు మీదే ఉంది. ఎప్పుడైతే రైతు బందు పథకం వచ్చి పట్టాదారులకు పైసలు పంచిందో ఆ పైసలన్నీ దొరకు ముట్ట చెప్పింది. భూములను మళ్ళీ దొరపేరు మీద మార్చిండ్లు’’ అన్నాడు.

            ‘‘మారిస్తే  ఏమైంది?’’

            ‘‘ఎనకటి లెక్కన సంఘాలు లేవు. అన్నలు లేరు. అడిగే వాడు లేడు... దాంతో దొర పోలీసులను వెంటేసుకొని వచ్చి నా భూమిని మీరెట్లా సాగుచేస్తరని బలవంతంగా ఆక్రమించుకున్నడు.  మేం ఎంతో ప్రేమతో కట్టుకున్న కొమురన్న స్థూపాన్ని బుల్‍డోజర్‍తో కూల్చివేసి భూమి చుట్టూ కంచె వేసుకున్నాడు’’ అన్నాడు బాధగా...

            అదంతా విన్న నాగన్న మనసు కలత చెందింది. ఇంత పోరాటం చేసి ఇన్ని త్యాగాలు చేసినా బ్రతుకు మళ్ళీ  మొదటికి వచ్చింది కదా అన్న బాధ కల్గింది. ఆ బాధలో అప్రయత్నంగానే

            ‘‘ఎవన్ని నమ్మెతట్టు లేదు. నమ్మించి గొంతులు కోస్తాండ్లు’’ అన్నాడు బాధగా...

            అప్పటికి కూలి కోసం వచ్చిన వాళ్ళు నిస్పృహగా ఎటోల్లు అటు వెళ్ళిపోతాండ్లు...

            ‘‘అన్నా ఇక నేను పోతా’’ అన్నాడు అతను...

            ‘‘మళ్ళీ రేపు వస్తవా?’’

            ‘‘వచ్చి ఏం చెయ్యాలి... చార్జీలు దండగైతనయి. అక్కడే ఏదైనా పని చూసుకుంటా..’’ అంటూ అతను దూరంగా బస్సు వస్తున్నది కనిపెట్టి, వడివడిగా అడుగులు వేసుకుంటూ పరుగు పెట్టిండు..

 

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

కూలి బతుకులు – మూడవ భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                        3

            రాముని గుండాల గుట్టకు దివాకర్‍ రావు క్వారి పనులు చేపట్టిన తరువాత చాల బీజి అయిపోయిండు. దానికి తోడు ఇటివల కంట్రాక్టర్ల సంఘానికి అధ్యక్షడుగా ఎన్నికైన తరువాత క్షణం తిరిక లేకుండాపోయింది.

            రాముని గుండాల గుట్టకు ఆయనవి రెండు క్రషర్లునడుస్తానయి. దాదాపు మూడు నాలుగు వందలామంది కూలీలు పనిచేస్తున్నారు. వ్యవహరాన్ని బగనే మేసి చూస్తండు.

            దివాకర్‍రావుకు యూబైఎండ్ల పైబడే వయస్సు ఉంటుంది. కాని చూడటానికి అంత వయస్సు ఉన్న వాడిలా కనిపించడు. ఎవరైన కొత్తగా చూస్తే ఓ నలుబైయేండ్లు ఉంటాయేమో అనుకుంటరు. మనిషి కాస్త బక్కగా ఒక తీరుగా ఎప్పుడు చిర్నవ్వులు చిందిస్తూ తెల్లటి బట్టల్లో మెరిసి పోతు పొద్దంత తిరిగిన కాని మనిషి ఎక్కడ అలిసినట్టుగా కన్పించక ఉషారుగా ఉంటాడు.

            భూస్వామి కుటుంబం నుండి వచ్చిండు. పెద్దపల్లి దగ్గరలోని కొత్తపల్లి వాళ్ళ స్వగ్రామం అక్కడ వందల ఎకరాల భూమి ఉండేది. చాల ఎండ్లు ఆయన త్రడి రాజెశ్వర్‍రావు ఊరిలో మకుటంలేని మహరాజులుగా ఒక వెలుగు వెలిగిండు. చాల ఎండ్లు ఆయనే ఎదురులేకుండా ఎకగ్రీవంగా సర్పంచుగా పనిచేసిండు. కాని అటు తరువాత గ్రామపంచాయితీ యస్సీ రిజర్వు అయింది దాంతో ఆయన తన క్రింద పాలేరుగా పని చేసే వెంకటిని సర్పంచుగా చేసి చక్రంతిప్పిండు.

            కాని అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండయి్ద ఆ! తరతరాలుగా ఎదురు లేకుండా సాగిన భూస్వాములకు వ్యతిరేకంగా ఊళ్ళల్లో రైతుకూలి సంఘాలు పుట్టుకొచ్చినవి. నిన్న మొన్నటి దాక ్యనీ బాంచేను అంటూ బ్రతికిన మాదిగ మల్లిగాని కొడుకు పోషమల్లు సంఘానికి నాయకుడైండు. దొరలకు ఎదురు తిరిగిండు. దొరల అదీనంలో ఉన్న పోరంబోకు భూములు పేద సాదలకు పంచిండ్లు. చివరికి ఇది ఎంత వరకు పోయిందంటే దొరల పట్టాభూముల్లో కూడా ఎర్రజెండాలు పాతే వరకు పోయింది.

            ఇదంతా దివాకర్‍రావు తండ్రి రాజెశ్వర్‍రావుకు మింగుడు పడలేదు. కాళ్ళక్రింద దుమ్ముకంట్లో పడ్డట్టుగా విలవిలలాడిండు. తనకాళ్ళ కాడ బ్రతికేనా కొడుకులు నాకే ఎదురుతిరుగుతారా అంటూ అగ్గి మీద గుగ్గిలం అయిండు. ఇట్లా జరుగుతుందని అతను ఎప్పుడు ఊహించలేదు. కాగల కార్తవ్యం గందర్వులే నిర్వహిస్తడన్నట్టుగా ఊరిలో పోలీసు క్యాంపు పెట్టించిండు... ఊరిలోకి పోలీసులు వచ్చిన తరువాత పరిస్థితులే మారిపోయింది. అరెస్టు కేసులు తన్నుడు మొదలైంది. పోషమల్లు పోలీసుల దొరకకుండా తిరగుతు జెండాలు పాతిన దొర భూముల్లో కూలీలతో దున్నించిండు. ఊరిలో సంఘం రోజు రోజుకు బలపడుతుంటే ఎదురులేని రాజెశ్వర్‍రావు దొర పలుకుబడి మసకబారసాగింది.

            సరిగ్గా అ పరిస్థితిలోనే ఒక నాటి అర్థరాత్రి పోషమల్లును పట్టుకున్న పోలీసులు అదే రాత్రి కొత్తపల్లి గుట్టలకాడ ఎన్‍కౌంటర్‍ పేర కాల్చిచంపిండ్లు.

            అటు తరువాత ఊరు ఊరులెక్కలేదు. కొన్ని రోజులు రాజెశ్వర్‍రావు ఊరిడిచిపోయిండు. అర్నెల్ల తరువాత అంత సద్దుమణిగిందని బావించి మళ్ళీ ఊరిలోకి వచ్చిండు. అది తెలిసి ఓ అర్థరాత్రి అన్నలు వచ్చి దాడి చేసిండ్లు. కాని దొర అదృష్టం బాగుండి బ్రతికి పోయిండు. అటు తరువాత ఆయన ఎప్పుడు ఊరి మొఖం చూడలేదు. పట్నం మకాం మార్చిన దొర అక్కడే ఉండిపోయి ఇటివల మూడెండ్ల క్రింద కాలం చేసిండు.

            రాజెశ్వర్‍ రావు ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు ఎదో ఇండస్ట్రీపెట్టి పారిశ్రమిక వెత్తగా సెటిల్‍ అయ్యిండు. చిన్నవాడు దివకర్‍రావు, ఎంబిఏ చదివి కంట్రాక్ట పనులు చేస్తు ఏవన్‍ కంట్రాక్టర్‍గా ఎదిగిండు. తెలంగాణరాష్ట్రం వచ్చిన తరువాత అంతవరదక రాజకీయల జోలికిపోని దివకర్‍రావు టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి చెరిండు. పార్టీలో కుల రాజకీయాలు ప్రబలి పోవటం, అదినాయకుని కులం దివాకర్‍రావు కులం ఒటగి కావటంతో ఆయన రోట్టెవిరిగి ప్రవేశ పెట్టిన రైతుబందు పథకం క్రింద భూముల క్రమబద్దికరణ పేరుమీద అంత వరదాక దొరలు పోయినవని బావించిన భూములకు చట్టబద్దత కల్పించటమే కాకుండా ఎకరాకు ఇంతా అని లక్షల్లో డబ్బులు చెల్లించింది. అవిదంగా కోల్పోయిన భూములు తిరిగి రావటంతో రాజేశ్వర్‍రావు వారసులకు తిరుగు లేకుండా పోయింది.

            మిషన్‍ భగీరథ క్రింద పోసిన చెఱువులు మొదలుకొని రోడ్లు, బ్రిడ్జిల వరకు చాల పెద్ద కంట్రాక్టులు చేపట్టిన దివాకర్‍రావు తక్కువ కాలంలోనే ఎవరు ఎదగనంత ఎత్తుకు ఎదిగిండు. అర్థబలం అంగబలం ఎర్పడటంతో కంట్రాక్టర్లంతా కలిసి తమ సంఘానకి అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. అంతకు ముందు కంట్రాక్టర్ల సంఘానికి రంగయ్య అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. అంతకు ముందు కంట్రాక్టర్ల సంఘానికి రంగయ్య అధ్యక్షుడుగా ఉండే రంగయ్యది గుండా టైపు రాజకీయల ఒక స్థాయిలో అది నడిచింద కాని, వ్యవస్థీకృత మైన అధికారం ముందు పాత తరహ రాజకీయాలు నడువకుంటా అయినవి.

            దివాకర్‍రావు ఇటివలికాలంలో ఎక్కువ కాలం హైద్రాబాద్‍లోనే ఉంటున్నాడు. ఇక్కడి పనులు చూసుకోవటానికి గుమస్తాలున్నారు. ఎదైనా పనిబడిఆతే తప్ప రామగుండం రావటంలేదు.

            ఎన్టిపిసి ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికి, కంట్రాక్టు కూలీలు పని చేయకుండా ఒక్క రోజుకుకూడా గడువదు. దాదాపు రెండు వెలవరకు పర్మినెంటు ఎంప్లాయిస్‍ ఉంటే అంతకు రెంట్టింపు మంది కంట్రాక్టు కార్మికులు పనిచేస్తుంటారు. పనులను కంట్రాక్టు ఇవ్వటం ద్వారా మేనేజుమెంటు లాబం ఉంది. తక్కువ ఖర్చుతో కంట్రాక్టుకూలీలతో పనులు చెయిచుకోవచుఓచ. పర్మినెంటు కార్మికులతో ఉండే సమస్యలు ఏమి ఉండవు. అటు మేనేజుమెంటు, ఇటు కంట్రాక్టర్ల దోపిడి మధ్య నలిగిపోయేది, శ్రమ దోపిడికి గురయ్యేది కూలీలు ఎదైనా ప్రమాదం జరిగగి కూలీలు చనిపోయినా మేనేజుమెంటుకు ఏ బాధ్యత ఉండదు.

            ప్రతి సం।।రము జనవరి నెలలో వివిద పనులకు గాను టెండర్లు పిలుస్తుంది. అటెండర్లలో ఎవరు తక్కువకు కోట్‍ చేస్తే వారికి టెండర్లు దక్కెవి. దాంతో కంట్రాక్టుర్ల మధ్య పోటీ పెరిఇ ఒకరికంటే ఒకరు తక్కువకు పాడినష్టపోయిన సందర్భలున్నాయి. ఇక ఇట్లయితే లాభం లేదని కంట్రాక్టర్లు అందరు రింగ్‍గా ఎర్పడి ఒకరికి ఒకరు పోటీ పడకుండా వాళ్ళ దాండ్ల వాళ్ళె సర్దుబాటు చేసుకొని ముందే ఒక అవగహనకు వచ్చి పనులు పంచుకొనే వాళ్ళు ఇట్లా కంట్రాక్టర్స్ను ఒకటి (రింగ్‍) చెసినడిపించటానికి ఒక పెద్ద దిక్కు కావాలిసి వచ్చింది. అన్ని విదాలుగాఅర్హతలు కలిగిన దివాకర్‍రావును కంట్రాక్టర్ల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికవ్వటంతో ఎవరికి పేచీలేకుండా పోయింది.

            గౌతమి నగర్‍కు ఒక ప్రత్యెకత ఉంది... అక్కడున్న ఇండ్లన్ని చాలవరకు అర్థికంగా బాగా బలపడి రాజకీయనాయకులు, బడా కంట్రాక్టర్లు ఎక్కువ మంది ఇండ్లు కట్టుకున్నారు. ఎవరికి వారే అన్నట్టుగా ఉండే విశాలమైన భవనాలు, అందమైన రోడ్లు, పచ్చగా పెరిగిన చెట్లమధ్య అహ్లోదపురిత మైన వాతావరణం ఉంటుంది. గౌతమినగర్‍ కాలనీకి ఒక వైపు ఎఫ్‍.సి.ఐ. మరోవైపు ఎన్టిపిసి, ఇంకోవైపున గోదావరిఖని పారిశ్రామిక పట్టణం ఉంటుంది. అవిదంగా అన్ని విదాలుగా సౌకర్యంగా అందుబాటులో ఉండేది. కాని అటు తరువాత కాలంలో ఎఫ్‍.సి.పై మూత పడిపోవటంతో గౌతమినగర్‍ కొంత కళతప్పింది. కొంత మంది కంట్రాక్టర్లు వెల్లి పోయినా ఇంకా చాల మందే మిగిలి పోయిండ్లు.

            గౌతమినగర్‍ కళకళలాడినప్పుడు లాడి నప్పుడు ఓ కంట్రాక్టురు ఎన్టిపిసి నుండి ఎఫ్‍.సి.ఐకి పోయ్యే రోడ్డులో ఒక సినిమా హల్‍ కట్టిండు. అది కొంత కాలం బాగానే నడిచింది. కాని ఎఫ్‍.సి.ఐ మూత పడి పోవటం ఎక్కువ జన సాంద్రత కల్గిన గోదావరిఖని కాస్త దూరంలో ఉండటంతో వచ్చె జనం కూడా తగ్గి పోయిండ్లు. కొన్నిరోజులు ఆ ధీయిటర్‍లో ఏ సర్టిఫికెట్‍, ఇంగ్లీష్‍, మాళయాళి సినిమాలు నడిపించారు. రోడ్ల మీద కూడలిలో అసహ్యం కొద్ది ఏ సర్టిపికెట్‍ పోస్టర్లతో యువతను అకర్షించే వాళ్ళు. క్రమంగా అది కూడా తగ్గి పోయి చివరికి థియేటర్‍ను మూసివేసి గోదాంగా మార్చిండ్లు.

            ఉదయం పదిగంటల నుండే దివాకర్‍రావు ఇంటికి కంట్రాక్టర్లు రాకడ మొదలైంది. ఆయన విశాలమైన భవంతిలో ఒక ప్రక్కన పెద్ద వరండా ఉంది. అది చిన్న పాటి మినిహాల్‍లా ఉంది. హాల్‍ మధ్యలో పొడవాటి టెబుల్‍కు ఇరువైపుల మెత్తటి కుర్చిలువేసి ఉన్నాయి. ఎసిగాలి చల్లగా హాయి కొల్పుతుంది.

            కంట్రాక్టర్లకు కూడా మునుపటి లెక్కపనులు ఉంటలేవు. దానికి తోడు కాస్త హుషారుతనం ఉండి, నాలుగు అక్షరం ముక్కలు తెలిసినోడల్లా కంట్రాక్టు పనులకు ఎగడే సరికి మజ్జిగ పలుచనైంది.

            ఎన్టిపిసి నిర్మాణపు పనులన్ని బడాబడా కంట్రాక్టుసంస్థలే చేసాయి. దేశ విదేశాలకు చెందిన కార్పోరేటు సంస్థలు నిర్మాణపు పనులు చేసాయి. సెస్ట్రా కంపిని ప్లాంట్‍ నిర్మాణం చెపడితే, బిహెచ్‍ ఇఎల్‍ పని అండ్‍టి కంపిని వ్యాగన్‍ టిప్పరు పనులు, ఇర్కాన్‍ కంపిని రైల్వెలైను, ఇనికకంపిని బిల్డింగ్‍ పనులు, డ్యామ్‍పను పి.కే రామయ్య ఇట్లా పెద్దపెద్ద కంపినిలు పనులు చేసినవి.

            పని విదానం కూడా దొంతరు దొందర్లుగా ఉండేది. ఎన్టిపిసిలో మేజర్‍ కంట్రాక్టు పనులు కార్పోరేటు సంస్థలు చేపట్టినవి వారు అపనులను విభజించి లోకల్‍ కంట్రాక్టర్లకు ఇచ్చేవాళ్ళు,లోకల్‍ కంట్రాక్టరు వాటిని మళ్ళీ సబ్‍ కంట్రాక్టులకు ఇచ్చేవాళ్ళు, సబ్‍, కంట్రాక్టర్ల క్రింద పనులు చేయించే మేస్త్రీలు వారిక్రింద కూలీలు పనులు చేసేది మొత్తం నిర్మాణానికి కేంద్ర బిందువుగా కూలీలు ఉండేవాళ్ళు... వాళ్ళ చమట చుక్కలే ఎన్టిపిసిని నిర్మించినవి. కాని వారి శ్రామకు ఎక్కడ విలువలేదు.

            కంట్రాక్టు పనులు తక్కువై కంట్రాక్టర్ల మధ్య పోటీ ఎక్కువ కావటంతో ఇక ఇట్లయితే లాబం లేదనుకున్న కంట్రాక్టుర్లు ఓ సంఘం పెట్టుకొని సిండికేట్‍ అయిండ్లు. ప్రతి సం।।రము నూతనంగా జరుగబోయే టెండర్లను ఈ సిండికెట్‍ వాళ్ళు సమావేశమై ఎవరు ఏ పనులు చేయ్యాలో నిర్ణయించుకొని దానికి అనుగుణంగా టెండర్ల వెసి పనులు దక్కించుకుంటారు. ఈ వ్యవహరమంతా సంస్థతెలియంది కాదు. తెలిసి కూడా ఏం చెయ్యలేని పరిస్ధితి. సంస్థ మాత్రం టెండర్‍ పక్రియను సూత్రబద్దంగా నడిపిస్తుంది. అంతకు మించి వాళ్ళు చెయ్యగలిగిందేమి ఉండేదికాదు. ఎవరైనా సిండికేట్‍ను కాదని కొత్తగా టెండర్‍ వేస్తే వారికి దక్కకుండా చేయటానికి సిండికేట్‍ అదిరింపులు బెదిరింపులే కాకండా అటు అధికారులను పట్టుకొని మెనేజు చేసి కొత్తవారికి టెండర్లు దక్కకుండా చేస్తరు. అంత బలమైనది సిండికేట్‍. దివాకార్‍రావు వచ్చిన తరువాత అదిమరింత బలపడింది.

            అందరు వచ్చిండ్లని తెలుసుకొని ఉదయం పదకొండు గంటల తరువాత దివాకర్‍రావు బంగ్లాదిగి వచ్చిండు. ఉల్లాసంగా అందరితో కలుపుకొలుగా పలుకరించిండు.

            ఒకరిద్దరు తప్ప చాల మంది కంట్రాక్టర్లు భూస్వాముల కుటుంబాలనుండి వచ్చిన వాళ్ళే. మురుమూరుకుచెందిన అయిలయ్య మాత్రం తన స్వంత కాళ్ళ మీద ఎదిగిండు. ఒకప్పుడు ఆయన సైకిల్‍ మీద వచ్చినోడు మెల్లగా ట్రాన్స్పోర్టు కంట్రాక్టులోకి దిగి బాగా ఎదిగిండు. ఇప్పుడాయన దగ్గర లారీలు, టిప్పర్లు జెసిబిలు, చిన్నపాటి డంపర్లు డోజర్లతో ట్రాన్స్పోర్టు రంగంలో నెంబర్‍ వన్‍గా నిలిచిండు. అమధ్య రాజకీయాల్లోకి వచ్చిండు కాని కాలం కలిసిరాక నిలదొక్కుకోలేదు.

            లింగాపూర్‍ భూస్వామి నర్సింగరావు రైల్వెట్రాక్‍ మెయింటెనెన్స్ పనులు చేస్తున్నాడు. మంథినికి చెందిన లక్ష్మిమనోహర్‍రావు సివిల్‍ కంట్రాక్టరుగా నిలదొక్కున్నాడు. ఇంకా వేంకటరామరావు, రామేశ్వరావు కంట్రాక్టు చేస్తాండ్లు. అందరికంటే బిన్నమైన వాడు రంగయ్య, చాల పేద కుటుంబం నుంచి వచ్చిండ్లు. మొదట్లో చిల్లర మల్లరగాతిరిగేవాడు.వాన్ని వీన్నిబెదిరించి డబ్బులు గుంజెవాడు. పోలీసు స్టెషన్‍లో రౌడిషీటర్‍గా నమోదైండు. అటువంటివాడు నిర్వాసితులైన మాలమదిల పేరు మీద ఒక సొసైటీ పెట్టి, మెనేజుమెంటును బ్లాక్‍మెయిల్‍ చేసి మెల్లగా కంట్రాక్టు చేపట్టి సంసాదించిండు. రాజకీయాల్లోకి వచ్చి బిజెపి నాయకుడడైండు. నిన్న మొన్నటి దాక కంట్రాక్టర్ల సంఘానికి అధక్షుడుగా పనిచెసిండు కాని దివాకర్‍రావు వచ్చిన తరువాత ఆయన ప్రభమసక బారింది.

            లింగాపూర్‍కు చెందిన నర్సింగరావుకు నిన్నమొన్నటి దాక సివిల్‍ వర్క్లో ఆయనకు ఎదురులేకుండా ఉండేది. కాని లింగాపూర్‍కు చెందిన నిర్వాసితులంతా ఎకమై సొసైటీ పెట్టుకొని ఈ సారి పోటికి వస్తున్నారని తెలిసిన కానుంచి ఆయనకు భయం పట్టుకున్నది.

            దాంతో ఆయన ‘‘లింగాపూర్‍ సొసైటీ వాళ్లు పోటికి వస్తాండ్లు. వాళ్ళెమో మనతోని కలిసిలేరు. ఎంతకైతే అంతకు పని చేయాటానికి సిద్దమైండ్లు. ఇటువంటికాడ మనకేం ఏం మిగులతది’’ అంటూ తన బాధ వెల్ల బోసుకున్నడు.

            ‘‘ఆ వాళ్ళతోని ఎమైతది. కంట్రాక్టు పనులంటే మాటలా’’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిండు రంగయ్య...

            ‘అమాట అంటే నేను ఓప్పుకోను’... అంటూ లక్ష్మిమనోహర్‍రావు తల అడ్డంగా తిప్పిండు. ‘‘ఇయ్యల లింగపూర్‍ సోసైటీ వచ్చింది. రేపు అట్లాగే ఇంకో సోసైటీ పుట్టుకొస్తది’’ అన్నాడు.

            ‘‘వస్తే రానియ్యండి... ఇది వరకు ఎన్ని సోసైటీలు రాలేదు’’ అన్నాడు రామేశ్వర్‍ రావు...

            ‘‘వాటికి వీటికి తెడాఉందండి... ఇది వరకు ఏ సొసైటీ పెట్టిన అవి మనం ఎర్పాటు చేసుకున్నవి... పేరుకు సొసైటీయే కాని అంతా మన చెప్పు చేతులో ఉండేది. కాని లింగపూర్‍ సొసైటీ అట్లాకాదు’’ అన్నాడు నర్సింగరావు...

            ‘‘ఎంటీ వీళ్ళ ప్రత్యెకత’’ అంటూ దివకర్‍రావు సాలోచనగా దృష్టి సారించిండు.

            ‘‘అయ్యా భూములు పోయిన కూలి నాలీలంత ఒక్కటైండ్లు... చేసుకోవటానికి పనులు లేక దిగిండ్లు’’ అన్నాడు నర్సింగరావు బొమ్మలు సారించి...

            ‘‘అసలు ఇటువంటి వారిని మెనేజుమెంటు ఎట్లాప్రోత్సహిస్తుంది’’ అంటూ అయిలయ్య ప్రశ్నార్థకంగా మొఖం పెట్టిండు.

            దివాకర్‍రావు చిన్నగా నవ్వి’’ మెనేజుమెంటు ప్రోత్సహిస్తుందంటే ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఎన్టిపిసి సంస్థ మొదట గ్రామలనుండి భూములు సెకరించినప్పుడు వాళ్లకు అదిఇస్తాం ఇది ఇస్తాం అంది.... సంస్థలో ఉద్యోగాలు ఇస్తామంది. కాని సంస్థ అ మాట మీద నిలబడలేదు. దాంతో భూములు కోల్పోయిన వాళ్ళు ఉద్యోగాలకోసం అందోళనలు చేసిండ్లు. అంయినా మెనేజుమెంటు మధ్య మార్గంగా నిర్వాసిత గ్రామాల ప్రజలు కలిసి సొసైటీలు ఎర్పాటు చేసుకుంటే వారికే కంట్రాక్టపనులు ఇస్తామని ఒప్పుకుంది. అదిగో అట్లా పుట్టుకొచ్చిందే లింగపూర్‍ సొసైటీ’’ అన్నాడు.

            ‘‘నిజమే’’ అంటూ రంగయ్య తలాడించిండు.

            ‘‘ఇట్లా ఊరికో సొసైటీ ఎర్పడితే... సంస్థలోని కంట్రాక్టు పనులన్ని వారికే ఇస్తే ఇక మనటువంటి వాళ్ళ పనేమి కావాలి’’ అంటూ రామేశ్వరావు దీర్ఘంతీసిండు.

            ‘‘నాబాధ కూడా అదేనండి’’ అంటూ నర్సింగరావు వంత పాడిండు.

            ‘‘అటువంటిది ఏం జరుగదు. అంతాకు మునుపటిలాగే జరుగుతుంది’’ అన్నాడు దివాకర్‍రావు చిరోసాగా...

            కాని నర్సింగరావుకు నమ్మకం కల్గలేదు. మిగిత కంట్రాక్టుర్లు కూడా అసక్తిగాచూసిండు.

            ‘‘లింగపూర్‍ సొసైటీవాళ్ళు టెండర్లు వేస్తరు వేసుకొని వాళ్ళకంటే ఒక రూపాయికి తక్కువకు మనం వేస్తాం’’ అన్నాడు దివకర్‍రావు..

‘‘వాళ్ళు టెండర్‍ ఎంతకేసింది మనకెట్లా తెలుస్తది’’ అన్నాడు రామేశ్వరరావు అమాయకంగా...

            ‘‘ఎట్లా తెలుస్తది అంటె తెలుస్తది. ఆ ఎర్పాట్లు మనకున్నాయి’’ అన్నాడు దివాకర్‍రావు మార్మికంగా నవ్వుతూ...

            ‘‘లేకి ముండా కొడుకులు ఎంత తక్కువకైనా టెండర్‍ వేస్తరు. వాళ్ళకంటే తక్కువకు మనం టెండర్‍ వేస్తే మనకు ఏం మిగులుతది’’ అన్నాడు నర్సింగరావు.

            ‘‘నష్టమేవస్తది. కాని ఇవ్వాల లింగపూర్‍ సొసైటీలాగా మరిన్ని సొసైటీలు పుట్టుకొస్తె మొత్తానికే మన అందరి పని పంటది... కాబట్టి అటువంటి ట్రెండ్‍ ఎర్పడకుండా ఉండాలంటే కొంత నష్టం భరించకతప్పదు. అంటూ అందరికేసి చూసి దివాకర్‍రావు మళ్ళి మాట్లాడ సాగిండు.

            ‘‘మనం కంట్రాక్టు చేసేది నాల్గుపైసలు సంపాధించుకోవటానికి, ఎవరు కూడా నష్టాలు వచ్చెపని చేయ్యాలని ఉండదు. అందుకే నేను ఏమంటానంటే వాళ్ళు రాకుండా చెయ్యాలంటే అ నష్టమేదో మన సంఘం భరిస్తుంది. అప్పుడు ఎవరికి బారం కాదు’’ అన్నాడు.

            మరి నా సంగతేంది’’ అన్నాడు నర్సింగరావు...

            ‘‘నీకు సిండికేట్‍ వేరేపని కెటాయిస్తుంది’’ అంటూ దివాకర్‍రావు బరోసా ఇచ్చిండు. దాంతో నర్సింగరావు సంతృప్తి చెందిండు.

            అటు తరువాత వాళ్ళంతా ఎన్టిపిసిలో మొత్తం కంట్రాక్టు పనులను సమీక్షించి,ఎవరు ఎవరు ఏపనులు చేపట్టాలో ముందే నిర్ణయిచుకొని, అమెరు ఎక్సెస్‍రేట్లకు టెండర్లు వేయాలని ఒఒక అవగాహనకు వచ్చిండ్లు. పనుల కెటాయింపులో కంట్రాక్టర్ల మధ్య కొంత గందరగోళం, పోటి ఎర్పడినప్పటికి దివాకర్‍రావు వారందరిని ఓప్పించగలిగిండు.

            ఎన్టిపిసి క్రింద నిర్వసితులైన చాల గ్రామాల్లో లింగపూర్‍ ఒక్కటి. భూముల సేకరణ చేసినప్పుడు ఎన్టిపిసి ఇచ్చిన ఏ వాగ్దనం నేరవేర్చలేదు. భూములకు ఇచ్చెనష్టపరిహరంకూడా సరిగా ఇవ్వలేదు. భూముల వాల్యుయేషన్లో కూడా చాల అవక తవకలు జరిగాయి. డబ్బు దస్కం ఉండి పలుకుబడి కల్గిన భూస్వాములు, అధికారులను కట్టుకొని, చట్టంలో ఉన్న లొసుగులను అఅసరగా చేసుకొని గ్రామస్థుల భూములకు ఎకరానికి ముప్పయి నలుబైవేలు చెల్లించినకాడ భూస్వాములు మాత్రం లక్షల్లో నష్టపరిహరం పొందిండు. ఈ అన్యాయం సహించలేక రైతులు కోర్టుకు పోయిండ్లు కాని కేసులు ఎండ్లకు ఎండ్లుగా ఎటు తేలకుండా ఉన్నాయి.

            భూములు తీసుకునేటప్పుడు ఎన్టిపిసి తెలివిగా వ్యవహరించింది. వ్యవసాయ భూములు తీసుకున్న ఎన్టిపిసి, ఇండ్లకు ఎక్కువ నష్టపరిహరం చెల్లించాల్సి వస్తుందని వాటిని తీసుకోలేద. దాంతో వాళ్ళ పరిస్థితి నీళ్ళు లేని కాడ బొండిగ కోసినట్టు అయ్యింది. ఎందుకంటే చేసుకుందామంటే భూములు లేకుండా పోయింది. పనులు లేక బ్రతుకు తెరువు లేక  చాల మంది గ్రామస్థులు బ్రతక పోయిండ్లు. ఉన్న కొద్ది మంది అందిన కూలినాలి చేసుకుంటు చావలేక బ్రతుకుతున్నారు.

            భూములు సేకరించినప్పుడు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నా మాట కూడా ఎన్టిపిసి నిలబెట్టుకోలేదు. పనులు లేక అరిగోస పడే పరిస్థితి వచ్చింది. న్యాయం కోసం అనేక సార్లు అందోళనలు చేసిండ్లు, ఎన్టిపిసి ఆపీసు ముందు దర్నాలు చేసిండ్లు. కాని వాళ్ళ అందోళనంతా ఎటుకాకుండా పోయింది. ఇటువంటి సమయంలో ననిర్వాసితులు సొసైటీలు ఎర్పాటు చేసుకుంటే వారికి కంట్రాక్టు పనులు ఇస్తామని మేనేజుమెంటు ఒక అశకల్పించింది.

            ‘‘సరే ఎదీ అయితే అది అవుతుంది. కంట్రాక్టు పనులేమన్నా బ్రహ్మవిధ్యా చేస్తాంటే అన్ని వస్తయి’’ అంఊ నిరుద్యోగ యువకులు ముందు పడ్డరు. అవిదంగా లింగపూర్‍ నిర్వాసితుల సొసైటీ ఎర్పాడింది. దానిఇక లక్ష్మయ్యను అధ్యక్షున్ని చేసిండ్లు.

            లక్ష్మయ్య నిజాయితీ పరుడు, కట్టాం సుఖం తెలిసిన వ్యక్తి గతంలో కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీగా పని చేసిన అనుభవం ఉంది. జనం పనులు లేక అరిగోస పడుతున్నాది చూసి కనీసం పనెదైనా దొరుకుతుందని ముందుకు వచ్చిండు.

            ‘‘టెండర్‍ వేయాలంటే దరావత్‍ కట్టాలి ఎలా అన్నాడు లక్ష్మయ్య కాసేపు తర్జన భర్జన పడ్డారు జనం. చివరికి ‘‘మనిషింత వసులు చేసికడ్తాం’’ అన్నారు.

            లక్ష్మయ్యకు ధైర్యం వచ్చింది. అందరు కలిసి పోయి టెండరు వేసిండ్లు.

            ‘‘గతంలో ఇదే పనికి కంట్రాక్టురు నర్సింగరావు ఇరువై వాతం ఎన్స్స్‍కు వేసిండు. ఈ సారి మనం అసలు రేటుకు ఊదుశాతం తక్కువకు వేసినం ఈ సారి టెండర్‍ మనదే. అయినా లాబమే అందరికి పని దొరుకుద్దీ అన్నాడు లక్ష్మయ్య బరోసాగ...

            కాని విచిత్రంగా లింగాపూర్‍ సొసైటీకి టెండర్‍ దక్కలేదు. కంట్రాక్టరు నర్సింగరావు వీళ్లకంటే తక్కువకు టెండర్‍ కోట్‍చేసి చేజిక్కించుకున్నాడు.

            ‘‘ఇందులో ఎదో మతలబుఉంది’’ అంటూ యువకులు అవేశపడ్డారు. అందోళన చేసారు.

            టెండర్‍లో ఎటువంటి అవకతవకలు జరుగలేదు. అన్ని చట్టాప్రకారమే జరిగింది. ఎవరు తక్కువ కోట్‍ చేస్తే వారికే ఇచ్చాం అంటూ మేనేజుమెంటు చెతులు ఎత్తెసింది. ఇది అన్యాయం అంటూ అందోళనకు దిగిన లింగపూర్‍ సొసైటీ సభ్యులపై పోలీసులు శాంతి బద్రతలకు బంగం కల్గిస్తున్నరంటూ లాటీ చార్జీచేసి అందోళనకారులను చెదరగొట్టిండ్లు.

(తరువాతి భాగం వచ్చే సంచికలో )

 

కూలి బతుకులు

 

(గత సంచిక తరువాయి భాగం )     

 

                                                          2

 

   నాగన్న ఇంటి దారి పట్టిండు. రోడ్డుకు ఆవలవైపు ఎన్టీపిసి సెకండ్‍ గేటు వద్ద స్కూల్‍ బస్సు అగి ఉంది. సీతకోక చిలుకల్లాంటి పిల్లలు స్కూలు డ్రెస్‍లు వేసుకొని ఒక వరుసలో బస్సు ఎక్కుతున్నారు. పిల్లలను స్కూలుకు పంపించటానికి వచ్చిన తల్లులు ఇంకా అక్కడే నిలబడి బస్సు పోయేంత వరకు వేచి సూస్తాండ్లు...

   నాగన్న ఒక క్షణం నిలబడి పోయి అందమైన ఆ పిల్లలకేసి చూస్తుండి పోయిండు. కంతలు తేలి, ఒంటి మీద చెటాకు మాంసం లేకుండా ఆకలితో దేబిరించే రామయ్య కాలనీలోని కూలీల పిల్లలు మనుసులో మెదిలిండ్లు. ఏమి బ్రతుకులో ఏమో అని నిట్టూర్చిండు. తమ బ్రతుకులే ఆగమైనవి, రేపు పిల్లల బ్రతుకులు అగమయి పోతయి అన్న అలోచన  మనసును బాధించింది.

   పరధ్యానంలో నడుస్తున్న నాగన్న  ప్రక్కనుండే నల్లటి అందమైన కారు ఒకటి సర్రున పోయింది. ముందు సీట్లో         ఉన్న అతను మొఖం బయట పెట్టి ‘‘అరే ముసలోడా, ఎటు చుసుకుంటూ పోతానవు...చస్తవా?’’ అంటూ కోపంగా అరిచిండు.

   నిజమే క్షణమైతే కారు డాష్‍ ఇచ్చేది. సెకండ్‍ గేటునుండి సర్రున వచ్చిన కారు కుడికి తిరిగి నాగన్న ముందు నుండే పోయింది. ఒక క్షణం అటు కేసి చూసి మారు మాట్లాడకుండా ముందుకు కదిలిండు.

   ఎన్టీపిసి టౌన్‍షిప్‍ చుట్టూ నిలువెత్తు ప్రహరిగోడ ఉంది. దాని అనుకొని ఉన్న కాలి బాట వెంట కాస్త ముందుకు పోయి కుడివైపు తిరిగితే సి.కే రామయ్య కాలనీకి పోయే తోవ వస్తుంది.  పని యావలు పడి పోయి పొద్దున చీకటితోని బయలు దేరివచ్చిండు. చూసి చూసి కండ్లు కాయలు కాసినవి కాని పనికి మాత్రం  పిలిచినోడు లేడు....

   ఎండ ముదిరి చిటపటలాడిస్తుంది. కాని నాగన్నకు దాని మీద జ్యాసే పోలేదు. మూలమలుపు తిర్గెకాడ బినయ్‍ మండల్‍ ఎదురైండు. ఆయన వెంట అశుతోక్ష , ఆయన భార్య రూబిన్‍ ఉంది.

   నాగయ్యను చూసి బినయ్‍ మండల్‍ మొఖం విప్పారగా...

   ‘‘పొద్దున్నె ఎటో పోయినవు?’’ అని అడిగిండు.

   ‘‘అడ్డా కాడికి’’ అన్నాడు నాగయ్య నిర్లప్తంగా...

   ‘‘మరేమైంది?’’

   ‘‘వయసు వయసోల్లకే పనులు దొరకతలేవు? నన్నెవ్వడు కానిండు’’ అన్నాడు.

   ‘‘ఏం రోజలు వచ్చినయి పాడు రోజులు. చేయకుంటెనో ఎల్లదాయే. చెద్దామంటే పనులు దొరుకత లేవాయే’’ అంటూ బినయ్‍ మండల్‍ భారంగా నిట్టూర్చిండు.

   బినయ్‍ మండల్‍ బెంగాల్‍ నుండి ప్లాంటు పడ్డప్పుడు వచ్చిండు. కాంట్రాక్టర్‍ అవతార్‍ సింగ్‍ దగ్గర ప్లాంట్‍ ఎరక్షన్‍ పనులు చేసే వాడు. జర్మనీకి చెందిన సెప్ట్రా కంపనీ ప్లాంటు నిర్మాణపు పనులు చేసేది. దానికి సబ్‍కంట్రాక్టరు అవతార్‍సింగ్‍. బినయ్‍ మండల్‍ వెల్డింగ్‍ పనులు చేసేవాడు. మంచి పనోడు ఉండే. 1984 పిబ్రవరిలో మొదటి యూనిట్‍ విద్యుత్‍ ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు అవతార్‍ సింగ్‍ దగ్గర పనిచేసిండు. 1990నాటి ఎన్టీపిసిలో పూర్తిస్థాయి (2100యండబ్లూ) ఉత్పత్తి ప్రారంభం అయ్యే వరకు పనికి డోకా లేకుండే. అటు తరువాత పనుల్లేక పోవటంతో కాంట్రాక్టర్లు చాలా మందిని తీసివేసిండ్లు. అట్లా బినయ్‍ మండల్‍కు కూడా పనిపోయింది.

   ప్లాంటు నిర్మాణపు పనులు జరిగినప్పుడు బెంగాల్‍ నుండి దాదాపు వంద కుటుంబాల దాక వచ్చినవి. కొంత మందిని కాంట్ట్రార్లు తీసుక వస్తే, చాలా మంది బెంగాల్‍ కరువు పరిస్థితుల వల్ల వాల్ల వీల్ల సొల్తి పట్టుకొని బ్రతక వచ్చిండ్లు. నిర్మాణపు పనులు పూర్తి అయిన తరువాత చాలా మంది వెళ్ళి పోయిండ్లు. ఓ ఇరువై కుటుంబాలు మాత్రం ఎటు పోక ఇక్కడే మిగిలి పోయిండ్లు. చాలా ఏండ్లు ఒకే చోట కలిసి పనిచేయటం ద్వారా ఇద్దరి మధ్య చనువు ఉంది.

   ‘‘పొద్దున్నె మీరెటో బయలు దేరిండ్లు?’’ అని అడిగిండు నాగయ్య.

   ‘‘మార్కెటుకు’’ అంటూ అశుతోష్‍ బదులిచ్చిండు.

   ‘‘ఏదీ చేపల మార్కెటుకేనా?’’

   ‘అవునుఅంటూ తలాడిస్తూ బినయ్‍ మండల్‍ పొద్దుపోతే చాపలు దొరుకుత లేవు’’ అంటూనే ముందుకు సాగినోడు. ఒక క్షణం వెనక్కితిర్గి ‘‘సాయంత్రం ఓసారి రారాదే చాపలు తిస్కపోదువు’’ అన్నాడు.

   ‘‘బ్రతుక్కి చాపలు తినెట్టుందా’’ అంటూ నాగన్నా...

   ‘‘ఎట్లయ్యేది గట్ల అయితది. ఉన్నన్ని రోజులు ఉంటం.. పోయ్యేనాడు పోతం... రందిపడ్తె అయితదా’’ అన్నాడు మండల్‍.

   పొద్దుపోతే చాపలు దొరకయి అనే తొందరలో ఉన్నాడు.

   డ్యాం నుండి చేపలు కంట్రాక్టు పట్టిన కంట్రాక్టర్లు పొద్దున్నె వ్యాన్లల్ల రాత్రి పట్టిన చాపలను తెచ్చి చిల్లరగా అమ్ముకునే వాళ్ళ వేస్తరు.

   బినయ్‍, అశుతోష్‍ చాపలు అమ్మితే రూబిన్‍ అమ్మిన చాపలను సాపు చేసి ఇస్తది. పొద్దుగుకే సరికి రెండు మూడు వందలకు డోకా ఉండదు.

   బినయ్‍ మండల్‍కు అపని కొత్తెమి కాదు... బెంగాల్‍లో ఉన్పప్పుడే చిన్నప్పటి నుండి అపని అవాటైంది. ఇప్పుడాపనే అసరకు వచ్చింది. ప్లాంటులో పనిపోయిన కొత్తలో బెంగాల్‍ కుటుంబాల వాళ్ళు చాల మంది డ్యాంలో చాపలు పట్టి అమ్ముకునేది.అందుకు గాను ఎన్టిపిసి మెనేజుమెంటుకు అంతో ఇంతో రుసుము చెల్లించేది. అట్లా కొన్ని ఎండ్లు సాపిగానే సాగింది. ఈ లోపున ఎల్కపల్లి, రాణాపూర్‍కు చెందిన చేస్తలంతా ఒక్కటై డ్యాంలో చేపలు పట్టె హక్కు మాకే ఇవ్వాలని అందోళనకు దిగిండ్లు.

   ఎందుకంటే డ్యాం విస్తరించి ఉన్న ఐదారు కిలోమీటర్ల మెరకు ఉన్న భూమి అంతా ఎల్కపల్లి, రాణాపూర్‍ గ్రామాల నుండి సేకరించింది. దాంతో నిర్వాసితులైన బెస్తలు ‘‘ఎన్టిపిసి ప్లాంటుకు క్రింద భూములు కోల్పోయింది మేము. బ్రతుకు కోల్పోయింది మేము అటు వంటిమాకు డ్యాంలో చెపలు పట్టె హక్కు మాకే ఇవ్వాలి’’ అంటూ చాల రోజులు అందోళన చేసిండ్లు. చివరికి మెనేజుమెంటు దిగివచ్చి బెస్తలు ఎర్పాటు చేసుకున్న సొసైటీలకు చాపలు పట్టుకొని హక్కులు ఇచ్చింది. అది కూడా వెలం పాటలో ఏ సోసైటీ అయితే ఎక్కువ పాట పాడుతుందో వారికి కట్ట బెట్టెలా  ఒప్పందాలు చేసుకున్నది. ఒప్పందాలు జరిగిన తరువాత నిర్వాసితుల పేరు చిల్లర మల్లరగా తిర్గేవాళ్ళు బొగసు సోసైటీలు ఎర్పాటు చేసింది. వాళ్ళలో వాళ్ళు పోటీలు పడి వెలం పాట పాడటంతో పేదకుటుంబాల వాళ్ళు పోటీ పడలేక పోయిండ్లు. వెలం పాట పాట్టి మెనేజుమెంటు లాబపడ్డది. బొగసు సోసైటీలు ఎట్టిన వాళ్ళు బాగు పడ్డారు. ఎటు చేడి పేదకుంటుంబాలకు చెందిన బెస్తల బ్రతుకు మాత్రం ఎప్పటి ఆటే అయ్యింది.

   సొసైటీలు వచ్చిన తరువాత చేపలు పట్టుకొని బ్రతికే బెంగాలీల పరిస్థితి తారుమారైంది. చాల మందికి బ్రతుకు తెరువు కరువైంది. బినయ్‍ మండల్‍ లాంటి కొద్ది మంది మాత్రం ఇట్లా చిల్లరగా చేపలు అమ్ముకొని బతుకుతాండ్లు.

   కాంపౌండ్‍ గోడ మూలమలుపు తిర్గె కాడ పికే రామయ్య కాలనికి పోయే కాలి బాట మొదలైతది. బాటకు అవలివైపున పెద్ద మురికి కాలిబాట మొదలైతది. బాటకు అవలివైపున పెద్ద మురికి కాలువ పోతది. ఎన్టిపిసి కాలనీ నుండి వచ్చే మురుగు నీరంత కలిసి పెద్ద కాలువలా మారింది. కాలువకు ఇరువైపుల దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగినవి. కాలువ రోడ్డు క్రింద కట్టిన చిన్న బ్రిడ్జి కిందుగాపోయి చివరికి గోదావరిలో కలుస్తుంది.

   కాలువకు కాలిబాకు మధ్యన ఉన్న ఖాళీ స్థలలో రాజన్‍ హోటల్‍ ఉంద. చిన్న గుడిసె హోటల్‍ ఉంది. డాంబర్‍ రెకులు వేసి ఉంది. ముందు చిన్న పందిరి అక్కడ రెండు టేబుళ్ళు వాటి మధ్యన కూచోవటానికి వీలుగా చెక్కబల్లలున్నాయి. అటు రామయ్య కాలనీ నుండి వచ్చి పోయేవారికి ఇటు రోడ్డు మీద చిల్లర మల్లర పనులు చేసుకొని బ్రతికే బీది బిక్కి జనాల ఎక్కువగా రాజన్‍ హోటల్‍కు వాస్తారు. రోడ్డు మీద పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కాని వాటిలో ఖరీదు ఎక్కువ.

   రాజన్‍ కెరళ నుండి బ్రతక వచ్చిండు మంచి స్కిల్‍డెడ్‍ వర్కర్‍. రికండో కంపినిలోపని చేసిండు. ఆ కంపిని కూలింగ్‍ టవర్‍ నిర్మాణం చేసేది. పని చేసే క్రమంలో ఒక సారి ఒక సారి హోమర్‍ పడి కుడి చెయ్యి మధ్య వేలు తిగిపోయింది. అప్పటి నుండి హోటల్‍ నడిపించుకుంటాండు.

   రాజన్‍ భార్య కమల తెలుగు అమ్మాయి. వాళ్ళకు ఎట్లా కూదిరిందో కాని కుదిరింది. కమల తండ్రి దేవాదాసుది కొలనూరు గ్రామం. హరిజనులు, అక్కడ బ్రతుకు ఎల్లక ఏప్‍సిఐకి ఇందిరాగాంధీ పునాది రాయి వేసినప్పుడు రామగుండం వచ్చిండు. ఎప్‍సిఐకి బిల్డింగ్‍ నిర్మాణపు పనులు చేసిన గ్యామన్‍ కంపనిలో చాల ఎండ్లు పని చేసిండు. అటు తరువాత ఉప్పరి పనులు చేసేది. రామయ్య కాలనలో నాగయ్య ఇంటికి నాల్గిండ్ల అవల గుడిసే వేసుకొని ఉండేది. అట్లా నాగయ్యకు ఆ కుటుంబంతో పరిచయం ఉంది. కమల చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి తెలుసు.

   వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. భార్య భర్తలు ఇద్దరు కలిసే పనిచేస్తరు. సహజంగానే కేరళ వారికి చదువు పట్ల శ్రద్దఎక్కువ. చదువుకోకుంటే బ్రతుకు లేదనే యావ ఉంది రాజ్‍ ఎంత కష్టమైనా సరే పిల్లలను చదివియ్యాలని తన పిల్లలను ఇంగ్లీష్‍ మీడియం స్కూల్లో చదివిస్తున్నాడు.

   పొద్దున్నె పిల్లలను స్కూలుకు తయారు చేసి బడికి పంపేక్రమంలో బయిటికి వచ్చిన కమలకు నాగయ్య కన్పించిండు. నాగయ్యను చూస్తే ఆమేకు చనిపోయిన వాళ్ళ నాన్న గుర్తుకు వస్తడు.

   ‘‘ఎందే పెద్దయ్య కనిపిస్తలేవు’’అంటూనిండారగా నవ్వుతూ పలకరించింది.

   నేనేటు పోయిన బిడ్డా ఇంటి కాన్నె ఉంటాన’’పనిపాట ఏమిలేకపాయే’’ అన్నాడు నాగయ్య నిలబడిపోయి..

   ‘‘ఇంకా ఎన్ని రోజులు చేస్తవే... చేసి చేసి బొక్కలు తెల్లబడిపాయే.. అయినా తమ్ముడు పని చేస్తాండు కదా’’ అంది...

   ‘‘దివాకర్‍రావు సేఠ్‍ దగ్గర పనిచేస్తాండు’’

   ‘‘ఇంకేందేమరి’’ అంది.

   ‘‘ఏం చేసుడు బిడ్డా.. ఒక్కడు చేస్తే ముగ్గురు తినాలి’’ అన్నాడు నిర్లిప్తంగా...

   ‘‘సత్తెన్నా ఏమి ఇస్తలేడా’’

   ‘‘వాడా వాడేమి ఇస్తడు వాడు వాని పొరగాండ్లు బ్రతుకుడే కష్టమైతాంది.

   ‘‘అదే’’

   ‘‘అదే అంటే ఏం చెప్పాలి బిడ్డా... ఓ రోజు కూలి దొరికే మరో రోజు దొరకకపాయే’’ అన్నాడు.

   ఇంతలోకే స్కూల్‍ వ్యాన్‍ వస్తే కమల పిల్లలను అందులో ఎక్కిచింది. అంత వరదాక నిలబడి చూసిన నాగన్న మళ్ళీ బయలు దేరుతుంటే ఇంటి దాక రారాదే’’ అంద కమల.

   ‘‘మళ్ళీ ఎప్పుడైనా వస్తా’’ అంటూ ముందుకు పోతుంటే...

   కమల అడ్డం తిరిగి ‘‘నీయవ్వ నువ్వు ఎప్పుడు గిట్లనే అంటవు. పాపా మా హోటల్‍ చూసి పోదువు’’ అంటూ వెంట తీస్కొని పోయింది.

   రాజన్‍ దూరం నుండే చూసి ‘‘మామ దారి తప్పి వచ్చిండు’’ అన్నాడు నవ్వుతూ. పొయ్యి మీద మంటలు నాలుక చాచుతాంద. మూకుట్లో బొండాలు కలకలాడుతానయి.జల్లిగంటేతోని వాటిని అటు ఇటు పోర్లించిండు.

   ‘‘పనులే లేకపాయే అప్పుడప్పుడన్నా రావచ్చుకదా’’ అంటూనే జల్లిగంటేతోని కాలిన బొండాలు ఒకిసాలో వేసిండు.

   ‘‘ఏడతీరిక ఉంటాంది బిడ్డా’’ అన్నాడు నాగన్న ఏం మాట్లాడాలో అర్థంకాక...

   ‘‘అంతగనం పనులేమున్నయే’’

   ‘‘పనులా పాడా... ఎదన్నా పని దొరుకుద్దెమోనని పొద్దున్నె అడ్డాకాడికి పోయిన కాని పాయిదలేకుండా పోయింది. ఎక్కడ చూసిన కూలీలతోని కళకళలాడేది. ఇప్పుడంత పరిగే ఏరుకున్నాట్టు అయితాంది. అయిన ప్రతి పనిలో మిషన్లు వచ్చిన తరువాత ఇక మనషులకు పనెక్కడ ఉంది’’ అన్నాడు రాజన్‍...

 

   కమల చాయ్‍తెచ్చి ఇచ్చింది. నాగన్న వారిస్తూ ‘‘నాకెందుకుబిడ్డా’’ అన్నాడు.

   చాయ్‍చప్పరిస్తూ నాగన్న ‘‘ఎట్లానడుస్తాంది బిడ్డా’’ అన్నాడు కమలతో...

   ‘‘ఎదో ఒకరికి చెయ్యి చాచకుండా నడుస్తాంది’’ అంది.

   ‘‘ఎద్దబిడ్డ ఏం చదువుతాంది’’

   ‘‘తొమ్మిదిల పడ్డది.. వచ్చె ఏడు పదిలకు వస్తది’’ అంది రాధ...

   ‘‘ఎదో తీయ్‍ బిడ్డ పిల్లగాండ్లు బుద్దిగ బ్రతికితే అదిచాలు’’

   చాయ్‍ తాగి గ్లాసు టేబుల్‍ మీద పెట్టి కాసేపు అది ఇది మాట్లాడి పోవటానికి లేచినోడు. రోంటికి కట్టుకున్న డబ్బులు తీసి చాయ్‍ డబ్బులు ఇవ్వ బోయిండు.

   మాగ ఇచ్చినవ్‍ తీయ్‍... నీ యవ్వ నువ్వోకటి మానాన్న ఒకటానే ‘‘అంటూ కమల వారించి’’తమ్ముని పెండ్లికి అడబిడ్డ కట్నం తీసుకుంటా, అప్పుడు అన్ని కలిపి ఇద్దువు కాని అంది నవ్వుతూ...

   ‘‘అంత కంటే మహబాగ్యమా... నీ నోటి వాక్యాన అట్లనే కానియ్‍’’ అంటూ నాగన్న నిండారగ నవ్విండు.

   నాగన్నకు ఒక బిడ్డ ఉండేది. కమలతో టిది బ్రతకి ఉంటే కమలంత అయ్యేది. పదెండ్లు బ్రతికింది. అప్పుడు పనులు జోరుగా సాగుతుండే... ఒక రోజు పిల్లకు నలత చేసింది. ఆ ఎమైతదిలే అని ప్రసాద్‍ డాక్టర్‍ దగ్గర సూదిమందు ఇప్పించి భార్య, భర్తలు ఇద్దరు పనులకు పోయిండ్లు.  వాళ్ళు పని చేస్తున్నకాడికే దానికంటే చిన్నాడు సత్తెయ్య ఉరికి వచ్చి అక్కంతా ఎట్లనో చేస్తాంది అంటే పరుగున వచ్చిండు. కాని పిల్ల అప్పటికే సల్లబడ్డది. ప్రసాద్‍ డాక్టరు దగ్గరకి తీస్కపోతే  అయిపోయినంక తీస్కవచ్చిండ్లు’’ అన్నాడు.

   సరస్వతి గుర్తుకు వస్తది. మనసు బారమైతది.

   నాగయ్య కూచున్న కానుంచి లేచి ‘‘ఇక నేను పోతా బిడ్డా ఇంటికాడ పెద్దమ్మ ఒక్కతే ఉంది’’ అంటూ బయటకు వచ్చిండు. ఎదురుగా ఇటేవస్తూ బొందయ్య కన్పించే సరికి అట్లాగే నిలబడి పోయిండు.

   పాత జ్ఞాపకాలు ముసిరినవి. బొందయ్యది వాంకిడి లోని మన్నెగూడెం డ్యాం కట్ట నిర్మాణపు పనిలో ఇద్దరు చాల ఎండ్లు కలిసి పనిచేసిండ్లు. కట్ట పనులు పూర్తయిన తరువాత మునుపటిలెక్కన పనులు లేకపోయింది. బొందయ్యకు ఊరిలో కూలినాలి చేసుకుంటూ బ్రతక వచ్చుఅని తిరిగి ఊరెల్లిండు. అట్లా పోయిన వాన్ని మళ్ళీ చూడటం ఇదే... సంతకల జోలే సంచి, బుజల గడ్డం చారుగా పెరిగి ఉంది. చెతిలో కర్ర మాసిన బట్టలు చూసి నాగన్న మనసు తరుక్క పోయింది.

   ‘‘ఎందే బొందన్నా గిట్లయినవు’’ అన్నాడు నాగయ్య అక్చర్యపోతు..

   ‘‘తెగిన గాలిపటం ఎట్లుంటది’’ అంటూ బొందయ్య నిర్వికరంగా నవ్విండు.

   అతని నవ్వు చూసి నాగయ్యకు అక్చర్యం కల్గింది. మనిషి కొంత వరకే బాధ తెలుస్తదట.. అంతకు మించి బాధకల్గితే శరీరం బరించలేదు. బాద తెలియకుండా పోతుందట. సరిగ్గా బొందయ్య పరిస్థితి అలాగే ఉందనిపించింది.

   బొందయ్య హోటల్లోకి వచ్చి కూచున్నాడు.

   ‘‘ఎన్నిరోజులైందే నిన్ను చూడక. దాదా ఇట్లా వచ్చికూచో’’ అంటూ తాను కూచున్న బెంచి మీద ప్రక్కకు జరిగిండు.

   నాగయ్య పోయ్యేవాడల్లా అగి వచ్చి బొందయ్య ప్రక్కన కూచున్నాడు.

   ‘‘ఊళ్ళ పొంటి తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇటు వచ్చే సరికి ఎందుకోగాని అందర్ని చూడాలనిపించి ఇటు వచ్చిన’’ అంటూ బొందయ్య మాట పొడిగించిండు.

   ‘‘అదంత సరేగాని అంతా మంచేనా’’ అని అడిగిండు.

   ‘‘ఎమి మంచో ఎమో చావలేక బ్రతుకుతాండ్లు’’ అంటూ నాగయ్య విచారపడ్డాడు.

   ‘‘ఎక్కడ చూసిన కూలోల్ల బ్రతుకు గట్లనే ఉన్నది’’ అన్నాడు బొందయ్య బారంగా... అవెంటనే తెరుకొని ‘‘కమల మాకు రెండు చాయ్‍లు ఇయ్యి’’ అన్నాడు.

   ‘‘లేదే ఇప్పుడే చాయ్‍ తాగి బయటికి వస్తాంటీ నువ్వు కన్పించినవని ఆగిన, కావాలంటే కమలను అడుగు’’ అంటూ కమలకేసి చూసిండు. అవునన్నట్టు కమల తలాడించేసరికి ‘‘సరేనాయియ్‍’’ అన్నాడు బొందయ్య...

   ఎదీ ఎట్లా జరుగనుందో అట్లా జరుగుతుందని నిర్వీకారమైన బావన ఎదో మనిషిలో కనిపిస్తుంది. మనసులోతోస్తున్న ప్రశ్నను నాగయ్య అడుగలేక ఉండలేక పోయిండు.

   ‘‘ఊరికి పోయినోడివి ఇదేం అవతారం’’ అన్నాడు బొందయ్య మొఖంలో విషాదం అలుముకున్నది.

   ‘‘ఊల్లే బ్రతికె పరిస్థితి ఉంటే గీ కూలి పనులకు ఎందుకు వచ్చెటొల్లం’’ అంటూ దూరంగా దృష్టి సారించిండు.

   ‘‘ఇక్కడ పనులు లేక పోయేసరికి మళ్ళి ఊరికైతే పోయిన కాని అక్కడ మళ్ళి గదే పరిస్థితి’’ అన్నాడు నిర్లిప్తంగా...

          ‘‘ఇదే ఇంత వ్యవసాయం ఉండేకదా’’

   ‘‘మాగున్నది ఎకరమంత... కాని ఏం లాబం, నడువకుంటా అయింది’’

   ‘‘అదే’’

   ‘‘పేపర్‍ మిల్లోడు ప్యాక్టరీలో తయారైన చెత్త చెదారం అంతా పెద్దవాగుకు మళ్ళించిండు. దాంతో వాగు నీళ్ళు పనికి రాకుండా పోయినవి. మనష్యులు కాదు కదా పశురాలు నీళ్ళు తాగుకుంటైంది. నాభూమి వాగు ఓడ్డునే ఉందికాని ఏం లాబం లేకుండా పోయింది. ఎంత చేసినా కష్టం చేతికి అందకుంటా పోతే చేసేదిమి లాబం చెయ్యక ఏం లాబం అన్నాడు బారంగా...

   నాగయ్యకు బొందయ్య భార్య శ్యామల గుర్తుకు వచ్చి ‘‘శ్యామలక్క ఎట్లున్నది’’ అని అడిగిండు.

   బొందయ్య మొఖంలో విషాదం అలుముకోన్నది.

   క్షణకాలం ఏమి మాట్లాడలతేదు. మెల్లగా తెరుకొని ‘‘పోయి నాల్గెండ్లయింది’’

   ‘‘శ్యామలక్క చనిపోయిందా’’ అంటూ నాగయ్య అక్చర్యపోయిండు. ఆమె నల్లటి కోలమొఖం కండ్లముందు మెదిలింది.

నాగయ్య ఇంటికి పోవటానికి లేచిండు.

   ‘‘పదనేను అటే వస్తానా’’ అంటూ బొందయ్య నాగయ్య వెంట నడిచిండు.

   కాలిబాట పోను పోనుగతుకుల రోడ్డుగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మురికి నీరు పదునుకు దట్టంగా పెరిగిన పాలపొరక చెట్లన మధ్య నుండిముందుకు నడిచిండ్లు.

   ఒకప్పుడు వందలు వేలుగా కూలీలు నడిచిన అదారిలోఇప్పుడు పల్లేరు చెట్లు మొలిసినవి. కాస్త ముందుకు పోయే సరికి కాలనీ ముఖద్వారం వద్ద గంగమ్మ కల్లు సొసటి కన్పించింది. అక్కడ ఒక గుడిసే ఉంది. అందులోనే కల్లు అమ్మెది.

   నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం నిలబడి పోయి అటుదిక్కు చూసిండు బొందయ్య.

   ‘‘అన్ని మారినయి కాని కల్లు పాక మాత్రం మారలేదు’’ అన్నాడు.

   ‘‘ఎట్లా మారుతది సాయంత్రం అయితే చాలు ఎర్రిలేసినకుక్కల తీర్గ పోతాండ్లు అన్నాడు నాగయ్య.

   ‘‘ఏం చేస్తరు మరి’’ అన్నాడు బొందయ్య నిర్లిప్తంగా తాను పని చేసినప్పుడు కూడా పనిదిగగానే అటు నుంచి అటే కల్లు పాకకు దారి పట్టెది. లేకుంటే కట్ట కీవలివైపున లంబాడి వాళ్ళు గుడిసెల్లో అమ్మె గుడంబా కాడికన్నా పోయేది. పొద్దంతా మొద్దుకష్టం చేసే సరికి ప్రాణం సొడసొడలు పోయ్యేది. సీసోరెండు సీసలో తాగుతే కాని మనసు కుదట పడేది కాదు. మంచిగ నిదుర పట్టేదికాదు. తాగుడుకు పనికి ఎదో సంబందం ఉంది. లేకుంటే అంతగనం ఎందుకు తాగుతరు అనుకున్నడు ఇప్పుడు ఏ పనిలేదు. ఏ తాగుడు లేదు. దొరికిన వాడు తింటడు.. దొరకని వాడు కాళ్ళు కడుపులకు ముడుచుకొని పంటడు.

   మరికాస్త ముందుకు పొయ్యేసరికి ఓరియా కూలీలుండే గుడిసెలు మొదలైతవి. వాటికి కుడి వైపున ఎన్టిపిసి గోడకు అనుకొని బెంగాలీ కూలీల గుడిసెలున్నయి. చాల గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. మొండడి గోడలు.. చీకిపోయి మిగిలి పోయిన పాత గుంజలు, ఒకప్పుడు అక్కడ మనష్యులు బతికే వాళ్ళు అన్న జాడ చెప్పుతుంది.

   ‘‘అయితే చాల మంది ఎల్లి పోయిండ్లన్న మాట’’ అన్నాడు తనలోతానే అనుకున్నట్టుగా బయిటికే అన్నడు.

   ‘‘పనులు లేవాయే ఎట్ల ఉంటరు’’ అన్నాడు నాగయ్య...

   బొందయ్య బారంగా తలాడించిండు. రామయ్య కాలనీలో కూలీలు ప్రాంతాల వారిగ గుడిసెలు వేసుకున్నారు. ఒక వైపు పాలమూరు లేబర్ల గుడిసెలుంటే, మరో దిక్కు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళ గుడిసెలుండేవి. ఇంకా ఓరియా, చత్తీస్‍ఘడ్‍, బెంగాలు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు మరోవైపు ఉండేది. వీరు కాకుండా కొంత మంది కూలీలు ఎక్కడ స్థలం దొరక అక్కడ గుడిసెలు వేసుకున్నారు. దాంతో గుడిసెలన్ని ఒక క్రమపద్దతి లేకుండా అడ్డ దిడ్డంగాఉండి పోయినవి. ఇరుకైన గుడిసెల ప్రాంతం నుండి వచ్చిన మురికి నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోయి మరింత దుర్గందబరితమయ్యేది. అక్కడే పిల్లల అటపాటలు సాగేవి. అటువ ంటి బ్రతుకు బ్రతుకు తున్నామన్న సృహ కూడా ఉండేది కాదు.

   మూడు బాటల కాడ కూలి సంఘం వాళ్ళు కట్టిన జెండా గద్దె కాడికి వచ్చిండ్లు.

   ‘‘బొందన్న ఇకనేను పోతనే చాలసేపాయ్యేవచ్చి’’ అంటూ నాగన్న తెలుగోళ్ళ గుడిసెల కేసి నడిచిండు.

   బొందయ్య క్షణకాలం అక్కడే నిలబడి పోయిండు. కూలీ సంఘం జెండాగద్దె కట్టినప్పుడు చంద్రయ్య మొత్తం పనంత తన మీదేసుకొని నడిపించిండు. కంట్రాక్టర్ల జులుం ఎదుర్కొవాలంటే కూలీలకు సంఘం ఉండాలి’’ అనేటోడు.

   బొందయ్య ఒక క్షణం గద్దె మీదున్న జెండాకేసి చూసిండు. తుప్పుపట్టిన ఇనుప బొంగుకు ఎర్రజెండా ముడుచుకపోయి వ్రెలాడుతుంది. చాల రోజులుగా  అలన పాలన లేనట్టు ఎర్రజెండా రంగు వలిసిపోయి ఉంది.

   రామయ్య కాలనీలో వేలాది మంది కూలీలు పనిచేస్తున్నప్పుడు కూలి సంఘం జోరుగా సాగింది. మేడే వస్తే  ఆడ మొగ అన్న తేడాలేకుండా ఒక పండుగ వాతవరణం ఉండేది. ఇప్పుడు ఆ కూలీలు లేరు. ఆ జోరులేదు. ఉన్న కొద్దిమంది కూడా చాలీ చాలని బ్రతుకు బ్రతుకు తాండ్లు. దానికి తోడు కూలి సంఘంలో చీలకలు వచ్చి ఎవరి దుకాణం వారిదైంది. పేరుకైతే కూలీ సంఘం ఉన్నదికాని ఉండి లేనట్టు అయ్యింది.

   ఎర్రజెండా చూస్తే బొందయ్యకు కొడుకు గుర్తుకు వచ్చిండు ఎర్రజెండా మీద ఎంత అద్భుతంగా పాడేది గుర్తుకు వచ్చి కండ్లు చెమర్చినయి.

   బొందయ్య బారంగా అక్కడి నుంచికదిలిండు. జెండా గద్దెనుండి నాల్గు అడుగులు వేసి కుడికి తిరిగితే ఒకప్పుడు తాను ఉన్న గుడిసే వస్తుంది. పాత జ్ఞాపకాలు ముసరంగా బొందయ్య అటువైపు తిర్గిండు.

   నాల్గు అడుగులు వేసే సరికి ‘‘బొదన్న ఎప్పుడోస్తివి’’ అన్న మాట విన్పించి అటు వైపు చూసిండు.

   ఓరియా కార్మికుడు రాంలాల్‍ చింకి పాతదైన తన గుడిసేకప్పు సవరించుకుంటూ బొందయ్యను చూసి మందలించిండు.

   ‘‘ఇప్పుడే’’ వస్తాన’’ అంటూ బొందయ్య క్షణకాలం నిలబడిపోయిండు.

   నల్ల ప్లాస్టిక్‍ కవర్‍తో గుడిసెకు పొక్కలు పడ్డ కాడ కప్పుతు రాంలాల్‍ అది చూసి బొందయ్య...

   ‘‘అవి ఎన్ని రోజుఅగుతదే.. ఇంత పొరక తెప్పించకపోయినవా’’

   ‘‘పొరకా... ఇప్పుడెక్కడ దొరకుతాంది’’ అంతా రేకుల షెడ్లేనయే...

   ‘‘పోనియ్‍ రేకులే వెయ్యకపోయినవా’’

   ‘‘రేకులు వేసుకునెట్టుందా బ్రతుక్కి’’ అంటూ రాంలాల్‍ బారంగా నిట్టూర్చిండు.

   కూలోడు బుడుగులో పడ్డ దున్నలా బతుకు రోజురోజుకు కూరకపోతుంది. కూలోడు ఉండటానికి ఇంత నీడ ఎర్పాటు చేసుకుందామన్న ఎల్లని బ్రతుకులైపోయినవి. అనుకున్నడు బొందయ్య.

   తెలుగగొళ్ళ గుడిసెల కాడికి వచ్చేసరికి దాసరి మణెమ్మ భర్త లింగయ్య, గుడిసే ముందున్న వేప చెట్టు నీడన మంచంలో అతుక్కపోయి పండుకున్నవాడల్లా తల ఎత్తి చూసి ‘‘ఎవరది’’ అని అడిగిండు.

   దాసరి లింగయ్య ఒకప్పుడు అమురుకుంటే అమరనటువంటి వ్యక్తి. ప్రవేటు లారీమీద డ్రైయివర్‍గా పనిచేస్తూ ఒక సారి బొగ్గు బంకర్‍లో పడి చావు తప్పి బ్రతికిండు. అప్పటినుండి ఏ పని చెయ్యలేడు. ఆయన బార్య మణెమ్మ కూలినాలి చేసుకుంటూ సంసారం నెట్టుకొస్తాంది.

   ‘‘నేను బొందయ్యను’’

   ‘‘నువ్వ బొందన్నా’’ అన్నాడు జీవంలేని నవ్వునవ్వుతూ అతని చూసే సరికి బొందయ్య ప్రాణం తరుక్కపోయింది.

   ‘‘ఎట్లున్నదే ప్రాణం’’ అని అడిగిండు.

   అ మాటకు లింగయ్య కండ్లల్ల నీళ్ళు ఊరినయి. ‘‘అ లంజకొడుకు ఒక్కపైస ఇయ్యలే’’ అంటూ కంట్రాక్టరును తిట్టిండు.

   ప్రమాదం జరిగినప్పుడు కంట్రాక్టర్‍నష్ట పరిహరం క్రింద పదివేలు ఇస్తనని ఓప్పుకున్నాడు. కాని కంట్రాక్టరు నష్టపరిహరం ఇవ్వకుండానే బిచానఎత్తేసిండు. అది ఎప్పుడో జరిగిన సంఘటన అయినా లింగయ్య అకోపాన్ని కాసేపు అదిఇది మాట్లాడిన నాగయ్య పోవటానికి లేచిండు.

   అదిచూసి లింగయ్య ‘‘కాసేపు ఉండిపోరాదే’’ అన్నాడు.

   లింగయ్యకు మాట్లాడ టానికి మనిషి దొరకటంలేదు. రాత్రి పగలు మంచానికి అతుక్కపోయి నరకయాతన పడుతాండు.

   ‘‘గంగవ్వను కలిసి వస్తా’’ అన్నాడు.

   ‘‘రెండు మూడు రోజులాయే గంగవ్వకనిపిస్తలేదు. కాళ్ళు చేతులు అడకుంటా అయినంక ముసల్ది దేక్కుంటూ దేక్కుంట వచ్చి ఎవరన్నా దయతలిచి బుక్కెడు పెడ్తె తింటది. లేకుంటే లేదు’’ అన్నడు లింగయ్య మంచంలోనుండే...

   అ మాటలకు బొందయ్య కండ్లలలో నీళ్ళూరినయి. బలవంతంగా అడుగులు ముందుకు వేసిండు.

   కాస్త దూరంలో ఒకప్పుడు తన స్వంత చేతులతో వేసుకున్న గుడిసె కన్పించింది. ఇప్పుడది పాతబడి, బీడుపడి కప్పులు ఎగిరి పోయిఉంది. గుడిసే పొందించిన కొత్తలో ఆయన భార్య శాంత నాటిన వేపచెట్టు ఇప్పుడు పెద్ద వృక్షమైంది. వేపచెట్టుకేసి అప్యాయంగా చూసిండు. కూలిపోయిన మొండిగోడలకేసి దృష్ఠి సారించిండు. పాడు బడిన గోడల మధ్యన పిచ్చి మొక్కలు మొలిసినవి. పాత జ్ఞాపకాలు ముసుకుకోగా మనసు బారమైంది.

   వాళ్ళ గుడిసెకు రెండు గుడిసెల అవల గంగవ్వ వాళ్ళు ఉండేది. ఒకేవూరు, ఒకే కులం వారు కావటంతో రెండు కుటుంబల వాళ్ళు ఎంతో కలిసి మెలిసి ఉండే వాళ్ళు, గంగవ్వ భర్త రాములు ఆ మధ్య ప్రాణం బాగాలేక కాలం చేసిండు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది. అన్ని చక్కగా ఉంటే రంగవ్వ కూతురును చంద్రయ్యకు చేసుకుకోవాల్సిఉండే... కాని చంద్రయ్య సంఘం సంఘం అం తిరుగుతు తన్నులాటలు కొట్లాటలు, పోలీసుకేసులుచూసి రాములు ససేమిరా తన బిడ్డను ఇయ్యనని మొండికేసి గోదావరిఖనిల బాయిపని చేసే పొల్లగాన్ని చూసి బిడ్డ పెండ్లి చేసిండు.

   రంగవ్వ గుడిసే సమీపించే సరికి బొందయ్య గుండే అదుర్దగా కొట్టుకోసాగింది. గుడిసెకు చిల్లులు పడి వాసాలు తేలినవి. ఇంట్లో మనుషులున్న  జాడ కనిపించటంలేదు.

   గుడిసే ముందు నిలబడి ‘‘రంగవ్వ...రంగవ్వ’’ అని పిలిచిండు.

   లోపలి నుండి ‘‘ఎవరది’’ అంటూ నీరసమైన గొంతు విన్పించింది.

   ‘‘నేను బొందయ్యను’’ అంఊ లోపలికి నడిచిండు.

   ‘‘ఎమైందక్కా ప్రాణంబాగాలేదా’’ అని అడిగిండు.

   గుడిసెనిండా దారిద్రం తాండవిస్తుంది. పాత గుడ్డలు కొన్ని కుండలు, కుక్కిమంచంలో రంగవ్వను చూసి బొందయ్య కండ్లలో నీళ్ళూరినయి.

   యాడాది క్రితం వరకు రంగవ్వ కూలి పనిచేసేది. ఒక రోజు పనిలో ఉండగానే సోయి తప్పిపడిపోయింది. అతరువాత మళ్ళి కోలుకోలే కాళ్ళు చేతులు అడకుంటా అయినవి. జీవిత అవస్యాదశలో అటువంటి పరిస్థితి ఎదురు కావడం కంటే దుర్బర పరిస్థితి ఏముంటది. ఓపిక ఉన్నప్పుడు రంగవ్వ దేక్కుంటూ దేక్కుంటూ పోయి ఆ పేదల గుడిసెల మధ్య పిడికెడు మెతుకుల కోసం దేబరిస్తది.

   బొందయ్యను చూసి రంగవ్వ ఎడ్వసాగింది.

   ‘‘ఎడ్వకక్క ఎడ్వవకు’’ బొందయ్య ఓదార్చటానికి ప్రయత్నించిండు.

   ‘‘పగవారికి కూడా ఈ కష్టాలు రావద్దన్నా’’ అంది.

   ‘‘ఏం చేస్తాం ఎట్లారాసి పెట్టి ఉంటే అట్లా జరుగుతది’’ అంటూ బొందయ్య సమాదాన పర్చిండు.

   రంగవ్వ దు:ఖం నుండి తేరుకోవటానికి సమయం పట్టింది. అక్కడి వాతవరణం చూసిన తరువాతల చాల రోజులనుండి వంట చేసిన జాడలు కన్పించలేదు. ఉండి ఉండి బొందయ్య ‘‘అక్కా బియ్యం ఉన్నాయి... వండుకోవాడానిఇక కుండలున్నాయా’’ అన్నాడు.

   రంగవ్వ ఓపిక తెచ్చుకొని లేచింది. బొందయ్య కొన్ని ఎండుపుల్లలు తెచ్చి పొయిరాజేసిండు. తన జోలేనుండి కొన్ని బియ్యం తీసి కుండలో ఎసరు పెట్టిండు.

   ఎప్పటియో విషయాలు, మనసు పొరల్లో పొంగి పోర్లే కష్టసుఖాలు, కష్టాలు కన్నీళ్ళు... అంతలేని ముచ్చట్లు కాస్త ఓదార్పుకోసం పరితపించే హృదయాలు.

   మంట నాలుక చాపుతుంది. కల పెల్ల లాడుతు పొయ్యిమీద బియ్యం కుతకుత లాడుతుంది.

   దూరం నుండే నాగయ్య రావటం చూసిన శాంతమ్మ ‘‘మళ్ళి ఇవ్వాల కూడా పనిదొరకలేదని’’ అర్థం చేసుకుంది.

   నీరసంగా వచ్చి ఇంటి ముందు మంచంలో కూచున్న మొగన్ని ఉద్దేశించి...

   రెండు రోజులైతే చిన్నొని అప్తా పడతది (జీతాలు ఇచ్చేరోజు, అంత వరదాక ఎదో విదంగా ఎల్లదీసుకోవచ్చు’’ అంది ధైర్యంచెప్పుతూ...

   నాగయ్య భార్యకేసి విచారంగా చూసిండు.

 

(తరువాతి భాగం వచ్చే సంచికలో )

కూలి బతుకులు – ఐదవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                                     5

            ఎన్టిపిసి రజితోత్సావాల సందర్భంగా అఫీసర్స్క్లబ్‍ ఎరియాలో నూతనంగా రిక్రియేషన్‍క్లబ్‍ నిర్మాణం జరుగుతుంది. దాని కంట్రాక్టలు మనోహర్‍రావు...

            ‘‘ప్రారంభోత్సవానికి అరోజు పొద్దున్నె వచ్చిన కంట్రాక్టర్‍ సత్తయ్యను పిలిచి’’ నిండా పదిహేను రోజులులేవు... ఇట్లా నత్తనడక పనులు సాగితే ఎప్పుడు పూర్తయ్యేను’’ ఎదన్నా అలస్యమైతే మాటపోతది’’ అన్నాడు.

            ‘‘లేదు సారు అయిపోతది’’ అన్నాడుసత్తయ్య వినయంగా...

            ‘‘పెంయింటర్‍ అది నారాయణ వచ్చిండా’’

            ‘‘నిన్న వచ్చిండు... ఇవ్వాళ అయితే ఇంకా రాలేదు వస్తడు కావచ్చు’’ అంటు బదులిచ్చిండు.

            ‘‘మంచి పనోడే కాని తాగుబోతు వెదవ ఎప్పుడు పనిలోకి వస్తడో ఎప్పుడు ఎగబెడ్తడో వానికే తెల్వదు’’ అన్నాడు కంట్రాక్టరు...

            సత్తయ్య మౌనంగా తలాడిచిండు.

            ‘‘ఒక వేళ అదినారాయణ వస్తే దుకాణంకు తీస్కపోయి రంగులు ఇప్పిస్తా’’ నా ఉద్దెశం ఏమిటంటే గిలాబులు అయిన దిక్కు రంగులు కూడా వెయిస్తే పని తొందరగా అయిపోతది’’ అంటూ ఎమంటావు అన్నట్టుగా సత్తయ్యకేసి చూసిండు.

            ‘‘అట్లాచేయవచ్చుకాని నాలుగు రోజులు అగితే ఇంకా బలంగా ఉంటది’’

            ‘‘బలం సంగతి ఎవ్వడికి కావాలి... అనుకున్న టైంకు పని పూర్తయితే చాలు’’ అన్నాడు.

            సత్తెయ్య తలాడించిండు.

            ‘‘పనోల్లను వేగరం పెట్టు లేకుంటే పనికాదు’’ అని సత్తయ్య హెచ్చరించి తనకు పని ఉందని కారలో వెల్లిపోయిండు.

            ఒళ్ళు దాచుకోకుండా పని చేసే సత్తయ్య అంటే కంట్రాక్టరుకు నమ్మకం. అనమ్మకంకు తగట్టుగానే సత్తయ్య పనులు చేస్తడు. మొదట తట్టమోసే పని చేసేది. కాని క్రమంగా స్లాబులు పోయాటం, గోడలు కట్టడం, గిలాబ్‍లు చేయటం వంటి అన్ని పనుల్లో అరితేరిండు. కూలీలతో పాటు తను పనిచేస్తు అన్ని పనులు మీదేసుకొని చెస్తడు. కాబట్టి సత్తయ్య మాట అంటే కంట్రాక్టర్లకు కూడా గురి.

            కంట్రాక్టర్‍ దగ్గర పని చేసే కూలీలకు ఒక వెసులు బాటు ఉంటుంది. కూలికోసం రోజు వెతుక్కొవలిసిన అవసరం ఉండదు. కంట్రాక్టరుకు పనులు లేనప్పుడు మాత్రం పని దొరకదా. కాని సం।।రము అరునెలలు ఎదో ఒక పని ఉండనే ఉంటది కాబట్టి, అ మాత్రం పనికోసమైనా కూలీలు తపత్రయ పడుతారు.

            తూర్పున సూర్యుడు కాస్త ఎక్కివచ్చే సరకి కూలీలు పనిలోకి వచ్చఇండ్లు. ఎండ ముదిరక ముందు పని మొదలు పెడతారు. చల్లపూటనే పని కాస్త దూగుతుంది. నిప్పులు చెరిగే ఎండల పని ముందుకు సాగదు. అదికాకుండా ప్రతిరోజు నిర్ధిష్టంగా ఇంత పని చెయ్యాలనే లెక్క ఉంటది కాబట్టి పని తొందరగా ముగించుకోవాలని చూస్తరు. పని సరిగా కాకుంటే కంట్రాక్టరు కూలీలను ఎక్కడ తీసివేస్తారో అన్న భయం ఉంటది.

            కండేలక్ష్మి అ రోజు పనికైతే వచ్చింది కాని ఆమె మనసంత ఇంకాడే ఉంది. ఇంటికాడ నల్గెండ్ల బిడ్డకు జ్వరం వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు బిడ్డకంటె పెద్దవాళ్ళు అయిన ఇద్దరు కొడుకులున్నారు పెద్దకొడుక్కు పదెండ్లు, వాని తరువాత వానికి పదెండ్లు. లక్ష్మి భర్త మల్లయ్య లారీడ్రయివర్‍గా పనిచేసేవాడు, చిన్నది బిడ్డ కడుపులో ఉన్నప్పుడే లారీ అక్సిడెంట్‍లు మల్లయ్య చనిపోయిండు. దాంతో లక్ష్మికి కష్టాలు మొదలైనవి. భర్తబ్రతికి ఉన్నంత కాలం ఇంటి పనులు చూసుకునేది, భర్త పోయినర తరువాత కూలి పనులు చేసుకుంటు బ్రతుకుతాంది.

            లక్ష్మివాలకం చూసిన సత్తయ్య ‘‘ఎందక్కాఎట్లనో ఉన్నావు’’ అని అడిగిండు.

            ‘‘అన్నా ఇంటికాడ పొల్లకు జ్వరం వచ్చింది. ఒళ్ళు అగ్గయి మండుతంది’’ అంది బాధగా....

            ‘‘అటువంప్పుడు పనికెందుకు వచ్చినవు. ప్రసాద్‍ డాక్టరుకు చూయించక పోయినవా’’ అన్నాడు ఓదార్పుగా...

            ‘‘చూయించిన అయన ఎవో మందులు ఇచ్చిండు. రాత్రి జర జ్వరం తగ్గినట్టు తగ్గింది కాని పొద్దున మళ్ళి వచ్చింది’’ అందిలక్ష్మి గుడ్లలో నీళ్ళూరినయి.

            చేసుకుంటే కాని ఎల్లని బ్రతుకులు ఎం బ్రతుకులు పాడు బ్రతుకులు అని తనలో ఆను అనుకొని’’ సత్తయ్య ‘‘కంట్రాక్టర్‍ అడిగితే నేను చెప్తా కాని సాయంత్రం కాస్త పొద్దుగాల ఇంటికి పోదవు’’ అన్నాడు ఊరడింపుగా..

            పని మొదలయింది. ఇసుక మోసే వాళ్ళు ఇసుక మోస్తున్నారు. సిమెఉంటు కలిపేవారు కలుపుతున్నారు. కలిపిన సిమెంటును తట్టలో ఎత్తుకొని అడకూలీలు మెస్త్రీలు అందస్తూంటె వాళ్లు తాపితో గోడకు ఎగజిమ్ముతు గిలాచీ పనులు చేస్తున్నారు.

            కీ ఇస్తే యాంత్రం తిరిగినట్టుగా కూలీలు పనులు చేస్తున్నారు. ఎక్కడ క్షణం అలస్యమైనా గిలాడు పనులు చేసే మెస్త్రీలు ‘‘మాల్‍ మాల్‍’’ అని అరుస్తున్నారు. ఎండ కాలం ఎండ దంచి కొడ్తాండి... మే మాసపు వడగాలులు మొదలైనవి. వడగాలికి రక్షణ కోసం తలకు గుడ్డలు చుట్టుకొని గుక్కెడు గుక్కెడు నీళ్ళు తాగుతు పనులు చేస్తున్నారు.

            మెస్త్రీ పని చేసే రాములు ‘‘సత్తెన్న ఇవ్వాళ పైసలు ఇస్తడా సేట్‍’’

            ‘‘ఎందుకొచ్చింది అనుమానం... ఇయ్యాల అప్తాయేనాయే’’

            ‘‘ఎమో ఎదన్నా ఎటమటమైతదో ఎమోనని’’

            ‘‘మనసేట్‍ అట్లా ఎప్పుడన్నా చేసిండా... ఎదీ ఎమైనా టంచన్‍గా పైసలు ఇసత్డఉ నువ్వెమి రందీ పడకు’’ అన్నాడు సత్తయ్య.

            ప్రతివారం శనివారం రోజున కంట్రాక్టర్‍ కలూఈలకు జీతాలు ఇస్తరు రోజు వారికూలీలకైతే ఏ రోఎజు కూలీ అరోజే ఇస్తరు. కంట్రాక్టర్‍ క్రింద పనిచేసే కూలీలకు మాత్రం వారం చివరన జీతం ఇస్తరు. అరోజు పండుగ వాతవారణం ఉంటది. ఎందు••ంటే మిగితా రెఓజుల్లో చేతిల పైస అడదదు.

            మధ్యహ్నం వేల వరకు రెండు గదుల్లో గిలాబు పనులు అయిపోయినవి.  సాయంత్రం వరకు మరో రెండు గదులు పూర్తి చేస్తే అరోజు పని పూర్తయినట్టులెక్క...

            అఫీసర్‍ క్లబ్‍కు ఎదురుగా ఉన్న గుబురు చెట్ల క్రింద కూచొని కూలీలు సద్దులు ఇప్పుకొని బోజనాలు చేసిండ్లు.  అట్లా మూతులు తడుచుకుంటూనే మళఙ్ళ పనిలో చేరిండ్లు.

            ‘‘లక్ష్మక్కా నవ్వుపో... నేను చుసుకుంటా’’ అన్నాడు. అది చూసి అక్ష్మితో పాటు పనిచేసే పోషమ్మ... ‘‘లక్ష్మికి ఎమైంది’’ అంది.

            ‘‘ఏం కాలేద.. ఇంటికాడ బిడ్డకు జ్వరం వచ్చింది. దాన్ని వదిలేసి వచ్చింది’’ అన్నాడు సత్తయ్య...

            ‘‘అయ్యో బిడ్డా పో...’’ అంది పోషమ్మ...

            అందరి మంచి చెడ్డలు విచారించే సత్తయ్య అంటితోటి కూలీలకు అభిమానం ఆయన మాటకు ఎదురు చెప్పరు. ఏం చేసిన సత్తన్న మంచే చేస్తడన్న అభిప్రాయం.

            అరోజు పని పూర్తియ్యే సరికి సాయంత్రంమైంది. పొద్దంత నిప్పులు కూరిసిన ఎండ సాయంత్రమైనా కూడా వేడిగాలితో ఊపరిసలుపనిస్తలేదు.

            పనులు ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని కూలీలంతా రిక్రియెషన్‍ క్లబ్‍ అవరణలోని టెన్నిస్‍ కోర్టు షెడ్డు నీడన కూచొని కంట్రాక్టర్‍కోసం ఎదురు చూస్తుండి పోయిండ్లు.

            కూలి డబ్బులు ఇవ్వటం కోసం వస్తాడనుకున్న కంట్రాక్టర్‍ మనోహర్‍ రావు అరోజు గంట అలస్యంగా వచ్చిండు. ‘‘ఆయన తో పాటు పెయింటర్‍ అదినారయణ ఉన్నాడు.

            కారుదిగిన మనోహర్‍రావు అక్కడ కూచున్న కూలీలనుఉద్దేశించి’’ అరేయ్‍ మీరు కొంత మంది ఇటు రాండ్లి డిక్కిలో ఉన్న రంగు డబ్బాలను లోపల పెట్టాలి’’ అంటూ కేకేసిండు.

            కొందరు కూలీలు కదిలిండ్లు...

            అన్ని సర్దుబాటు చేసిండ్లు లెక్కలు సరిచుసుకొని మనోహర్‍రావు అందరికి కూలీడబ్బులు ఇచ్చేసరికి  మరో గంట అలస్యమైంది.

            సత్తయ్య ఇంటి దారి పడుతుంటే, ఆదినారయణ వెనుక నుండి ‘‘సత్తన్నా అగే నేను కూడా వస్తాన’’ అంటూ కేకేసిండు. ఆదినారయణ మంచి పెంయింటర్‍ కాకుంటే తాగుబోతు తాగితాగి మొఖం నల్లబడ్డది.

            సత్తయ్య ఒక క్షణం నిలబడి పోయిండు.

            ఆదినారయణ గబగబ నాల్గు అడుగులు వేసైఇ సత్తయ్య దగ్గరికి వచ్చిండు.

            ‘‘పొద్దంతా తతిరుగుడే అయ్యింది’’ అంటూ మొదలు పెట్టిండు.

            ఆయన చెప్పుతున్నది ఏమిటో సత్తయ్యకు అర్థంకాలేదు.

            ‘‘నువ్వు షాపుకాడికి పా నేను వస్తాన అని పొద్దున పదకొండు గంటలకు పోను చేసిండు. నేరు అన్ని పనులు మానుకొని చమన్‍ లాల్‍ షేఠ్‍ రంగుల దకాణం కాడ చూస్తుంటే ఇగ రాడు అగరాడు, తీరిపారి నాల్గింటికి వచ్చిండు’’ అందేంది సారు అంటే అఫీసుల పనిచూసుకొని పోదామని బయటు దేరిండట కాన ఇఅక్కడే అలస్యమైందని చెప్పుకొచ్చిండు. ఏం చేస్తం పెద్దోల్లు’’ అంటూ నిటూర్చిండు.

            ‘‘మరి రంగులు తీసుకున్నారా’’

            మాగతీసుకున్నాం కంట్రాక్టరేమో చేరమాడుతడు, షేట్‍ ఏమో నీకు ఎక్కువ చెప్తనా అంటడు. ఇద్దరికి ఇద్దరే ఉచ్చల్లో మొట్టలు పట్టేరకం... బ్యారం కుదిరి సామన్లు తీసుకొని వచ్చే సరికి పొద్దు వంగనే వంగే’’

            ‘‘మరేమన్నా పడ్డలు పడ్డయా’’ అన్నాడు సత్తయ్య నవ్వుతూ...

            ‘‘సామన్యంగా బిల్డింగ్‍ సమాన్లు అమ్మె దుకాణం వాళ్ళు మెస్త్రీలను కట్టుకొని గిరాకి తీసుకవచ్చినందుకు అంతో ఇంతో కమిషన్‍ ముట్ట చెప్పుతారు. చివరికి ఈ కమీషన్‍ పద్దతి ఎంతవరకు పోయిందంటే కార్పోరేటు హాస్పటల్స్ వచ్చిన తరువాత పేషంట్లను తీసుకరావటానికి ఊర్లల్లో ఉండే అర్‍.యం.పి డాక్టర్ల వరకు ప్రాకిపోయింది. కేసులు తీసుకవస్తె కమీషన్లు ఇచ్చె పద్దతి మొదలైంది. తమ జెబులోకి పదిపైసలు వస్తాయంటే దేశాన్నె అమ్మె రాజకీయ నాయకులున్నా చోట అదో పెద్దవిషయం కాదు. అవినీతి అంతటా ప్రాకింది.

            ‘‘పడ్తలా పాడా ఎదో చిన్న చిన్నొళ్ళ దగ్గరైతే కమిషన్‍ వస్తదకాని పెద్దపెద్ద కంట్రాక్టర్ల దగ్గర ఆ అటలు సాగయి. సావుకార్లతోని వాళ్ళె మాట్లాడుకుంటారు’’ అన్నాడు ఆదినారయణ నిరసక్తంగా...

            ‘‘అయితే ఇవ్వాల ఏం గిట్టుబాటు కాలేదన్నామాట’’ అన్నాడు సత్తయ్య...

            ‘‘గిట్టుబాటా పాడా పొదద్దంత తిప్పుకుంటే ఇవ్వాల

            ‘‘ఐదువందలు ఇచ్చిండు కాని అదికూడా ఇచ్చే కూలీల వసులు చేసుకుంటడట...ఇంత పీసుగుద్దోడు కాబట్టె ఈయన దగ్గర పనిచెయ్యాలంటే మనసురాదు’’ అన్నాడు ఆదినారయణ...

            ఇద్దరు ఇంటి దారి పట్టిండ్ల పికే రామయ్య కాలనీ మొఖ ద్వారం వద్ద పాలవాగు ఒడ్డున కాస్త ఎత్తయిన స్థలంలో గంగమ్మ కల్లు కొట్టు కాడికి వచ్చిండ్లు. కాలనీలో పోయ్యే వాళ్ళు ఎవరైనా గంగమమ్మ కల్లుకొట్టు ముందు నుండే పోవాలి. ఇంకో దారిక లేదు. అక్కడికి వచ్చెసరికి పొద్దంతా మొద్దు కష్టం చేసి అలిసి పోయి ఇంటికి వచ్చే కూలీలంతా మంత్రమేసినట్టుగా అప్రయత్నంగానే కాళ్ళు అటువైపు గుంజుక పోతాయి. అందులో ఆ రోజు జీతాలు వచ్చె శనివారం కావటంతో గంగమ్మ కల్లుకొట్టు జనంతో కిటకిటలాడుతాంది.

            అటు చూడగానే ఆదినారయణ ప్రాణం గుంజింది. సత్తన్న ఒక సీస తాగి పోదాంపావే’’ అన్నాడు.

            సత్తయ్య మనసులో కూడా తాగలనిపించి గురిజాటన పడుతుండగానే, ఆదినారయణ అమాట అనేసరికి మారు మాట్లాడకుండా ఇద్దరు అటువైపు నడిచారు.

            కల్లుకొట్టు చిన్న గుడిసె... ఒక వైపున చిన్నగా బొంగకర్రలతో పార్చీసన్‍ చేసిన చోట...కాస్త ఎత్తయిన గద్దె మీద గంగమ్మ చిన్న స్కూలు మీద కూచొని ఉంది. అమె వెనుకాల తెల్లగా నురుగులు కక్కుతు కల్లు కేసులు ఒక దాని మీద ఒకటి పెర్చినట్టుగా ఉన్నాయి.

            గంగమ్మ నల్లటి చారి అకారం... నొసట ఎర్రటి బొట్టు... అసలేతాగుబోతులతో వ్వవహరం అయినా అమె అదేమి పట్టించుకోకుండా చాల సహజంగా తన వ్యాపారం కోనసాగిస్తుంది. నొరు పెద్దది గయ్యాలి గంప... అనోటికే అందరు బయపడుతారు.

            ‘‘పావులా తక్కువ ఉందా... ఇదేమన్నా కూరగాయల బేరమా చల్‍నడవ్‍’’ అంటూ ఓ తాగుబోతువాని మీద గయ్యిమంటుంది. ‘‘అదెందక్కా అట్లా అంటవు. నీ పావులాకే నేనేమన్నాదెంక పోతనా...రోజు వచ్చెదేనాయే...రేపు ఇస్తాలే’’ అంటూ ఇందకటి తాగుబోతు ప్రాదేయపడుతాండు...

            ‘మాగతాగినవ్‍పోఅంటూ కసురుకుంటానే వాని చేతిలో చిల్లర డబ్బులు తీసుకొని ఒక్క సారి వటికేసి చూసి’’ రేపు మరిచిపోవుకదా’’ అంది.

            ‘‘అవ్వతోడు మరిచిపోను’’ అన్నాడు ఇందకటి తాగుబోతు...

            ఒ కల్లు సీసా వాని చేతిలో పెట్టింది. తనచుట్టు ముగిన వారి నుండి డబ్బులు తీసుకొని కల్లు సీసాలు ఇస్తుంది.

            ‘‘అన్నా నేను తెస్తాను ఉండు’’ అంటూ ఆదినారాయణపోయి రెండు కల్లు సీసాలు పట్టుకొని వచ్చిండు.

            కల్లు పాక లో వారికి కూచునే చోటు కన్పించలేదు. తాగుబోతులతో అంతగా కిక్కిరిసి పోయింది. తల మత్తు ఎక్కగా బాగా తాగిన వాడు ఒకడు ఎదో పాట పాడుతున్నాడు. అ పాట ముద్దగా అరణగొణ ద్వనిలో కలిసి పోయి సరిగా విన్పంచటంలేదు.

            ‘‘ఇక్కడ కూచునేటట్టులేదు... బయట ఎక్కడన్నా కూచుందాం పదా’’ అంటూ ఆదినారాయణ కల్లు కాంపౌండడ్‍ అవరణలోకి దారి తీసిండు కల్లు సీసాలు ప్రక్కన పెట్టుకున్న ఎక్కడికి అక్కడ గుంపులు గుంపులుగా కూచొని ముచట్లు పెట్టుకుంటుతాగు తున్నారు.

            ఒక మూలన ములమే గంపలోగుడాలు శనిగలు పెట్టుకొని అమ్ముతుంది. అమె చుట్టు మూగిన తాగుబోతులు ఏలానో ఓలానో అంటూ తొందర పెడ్తున్నరు. కాని ముసల్ది మాత్రం ఏ మాత్రం తొందర లేకుండా నెమ్మదిగాపైసలు లెక్కబెట్టుకొని వారికి కావల్సింది అంతే నెమ్మదిగా ఇస్తుంది.

            పొద్దంతా మొద్దు కష్టం చేస్తూ అణిగి మణిగినట్టుండే వాళ్ళు, ఒక సీసాకడుపులో పడే సరికి ఎక్కడ లేని హుసారు వస్తది. ఎవ్వన్ని లెక్కచెయ్యని తెగింపు వస్తది. చిన్న చిన్న విషయాలకే రోషాలకు పోతారు. తీరా చూస్తే అందులో ఏముండదు... కడుపులో ఇంత పడేసరికి ఎక్కడో పేరుక పోయిన దు:ఖం కోపం అవేశం ఎగజిమ్ముకొచ్చి తన్నులాటకు దిగుతారు. కాని అమత్తు దిగే సరికి పిల్లికూనయిపోతారు.

            మొద్దు పని చేసే వారిలో తాగకుండా ఉండే వాళ్ళు చాలతక్కువ. చాలీచాలనీ జీతాలు హోళ్ళు హోనం చేసే మొద్దుకష్టంతో వొళ్లంతాతీపులు పెడుతాంటే ఆ పూట అయినా అన్ని మరిచి పోయి సుంగా నిదురపోవాలంటే వాళ్ళ అందుబాటులో ఉండే ఒకే ఒక్క దివ్యఔషదం తాగుడు. అట్లా మొదలైన తాగుడు క్రమంగా మనిషిని బానిసను చేసి అటు ఒళ్ళు, ఇల్లును గుళ్ళ చేస్తుంది. అంతిమంగాఅందపాతాళానికి తొక్కెసింది. తాగుడు బానిస అయిన వారి కుటుంబాల కష్టాలు అన్ని ఇన్ని కావు. తాగుడుకు బానిస అయిన వాళ్ళు చేసిన కష్టం తాగుడుకే పోగా ఇంట్లో ఎల్లక తిండికి కటకటలాడుతు అరిగోస పడే కుటుంబాలకు లెక్కలేదు. ప్రభుత్వం మాత్రం మత్తు పానీయాలను విచ్చలవిడిగా అమ్ముతు శవాలమీద పైసలు ఏరుకుంటుంది.

            తాగుబోతులతో వ్యవహరం మామూలు విషయంకాదు. కాని అడదై ఉండే గంగమ్మ దాన్ని చాల అవలీలగా నిర్వహిస్తుంది. ఎక్కడో ఓంగోలు నుండి బ్రతకవచ్చింది. ఆమె భర్త ఎండుకొండలు మెషన్‍ పనిచేచేది. కాని తాగుబోతు ఉండే చేసిన పైసలు సరిగా ఇంట్లో ఇచ్చెవాడు కాదు.

            మొదట గంగమ్మ ఎన్టిపిసి సెకండ్‍గెటు కాడ హోటల్‍ పెట్టి సంసారం ఎల్లదీసుకొచ్చేది. అసమయంలోనే కేరళకు చెందిన నాయర్‍ అనే మెకనిక్‍ ఉండేవాడు ఆయన కుటుంబం మాత్రం కేరళలో ఉండేది. ఇక్కడ మాత్రం అతను ఒక్కడే ఉండేవాడు. అలా ఒంటరిగా ఉండే నాయర్‍ గంగమ్మ హోటల్లో బొజనం చేసేవాడు.

 

            ఎట్లా కుదిరిందో గంగమ్మకు నాయర్‍కు సంబందం కుదిరింది. నాయర్‍ డ్యూటీ ముగించుకున్న తరువాత ఎక్కువ సమయం గంగమ్మ హోటల్‍ కాడే ఉండేది. కొత్తవారు ఎవరన్నా చూస్తే గంగమ్మ భర్త నాయారే అనుకునేవారు. భర్త తాగుబోతు కావాటం, గంగమ్మ ఒక్కతే హోటల్‍సగబెట్టడం కష్టమై నాయర్‍ను చేరదీసింది. కొన్నాల్లు చాటు మాటుగా సాగిన వ్యవహరం, ఏ అడ్డు అదుపు లేకుండా పోయింది. సరిగ్గా అ సమయంలోనే ఏడు కొండలు ఓ రాత్రి హఠత్తుగా చనిపోయిండు.

            పెయ్యంత నల్లగారంగు మారిపోయి సొంగకారిపోయి పడి ఉన్నఏడుకొండలు శవాన్ని చూసిన వాళ్ళు’’ వాడు ఉత్తగ చావలేదు. ఈ గొడ్డు ముండే వానికి ఎదో మందు పెట్టి చంపింది’’ అంటూ జనం గుసగుసలాడారు.

            గంగమ్మ స్థానికంగా తిరిగే సోషమల్లు అనే చోటా నాయకున్ని పట్టుకొని నాల్గు పైసలు ఖర్చుపెట్టి కేసుకుకుండా చూసింది. ఇప్పుడు నాయర్‍ పర్మినెంటుగా గంగమ్మతోనే ఉంటున్నాడు.

            గంగమ్మ హోటల్‍ మొదట బాగానే నడిచేది. కాని ఎన్టిపిసి మీదుగా పోయే చాతీయ రహదారి విస్తరణలో బాగంగా గంగమ్మ హోటల్‍ పోయింది. అటు తరువాత గంగమ్మ కల్లు దుకాణం పెట్టింద. ప్రతిరోజు సొసైటి కల్లు డిపో నుండి కల్లు సీసాలు వస్తాయి. పేరు కల్లు సీసాలు కాని అదంతా మందుకలిపి కుత్రిమంగా తయారు చేసిన కల్లు. ప్రభుత్వానికి ఎక్సయిజ్‍ డిపార్టుమెంటుకు ఈ వ్యవహరం తెలియకకాదు. ఎవని వాటా వానికి ముడుతంటే కల్తి కల్లు వ్యాపారం యాదెచ్చగా సాగిపోతుంది. ఎప్పుడైనా కల్తి••ల్లు తాగి చనిపోయినప్పుడు మాత్రం కొంత హడావిడి చేస్తరు. పత్రికలు వాటి గురించి వ్రాస్తయి. నిరసనతెలిపే వాళ్ళు తెలుపుతారు. చివరికి సొసైటీ పెద్దలు ఎవనిది వానికి ముట్టచెప్పి అంతా సర్దుబాటు చేస్తరు. మళ్ళి ఎప్పటి అటే అవుతుంది.

            పొద్దుగుకే కొద్ది గంగమ్మ కల్లు కొట్టుకాడ కూలీల రద్దీ ఎక్కువైంది. ఎక్కడ జనం ఉన్నా లేకున్నా కల్లు దుకాణం కాడ ఇసుక పోస్తే రాలనంత మంది జనం.. అంతా కూలినాలి జనం తప్ప కాస్త తెల్ల బట్టలోడుఎవడు అచాయలకు కూడా రాడు.

            శనగలు నములుకుంటా చేరో సీసా పూర్తి చేసిండ్లు.

            ‘‘సత్తన్నా ఇదేం పరిపొద్దే... అగు పోయి మళ్ళోటి తెస్తా అంటూ ఆదినారయణ లేచిండు.

            ‘‘నువ్వాగు తమ్మి నేను తెస్తా’’ అంటూ ఆదినారాయణను వారించి సత్తయ్య లేచి పోయిండు. కాసేపట్లో రెండు సీసాలు సంకలో పట్టుకొని మరో చేత ముసల్దాని దగ్గర గుడాలు పట్టుకొచ్చిండు.

            అయింత సీసాలు పూర్తి చేసేసరికి సత్తయ్యకు మత్తు ఎక్కింది.

            మందు కల్లు ఒక్కసీసా తాగితేనే మత్తేక్కుతుంది. ఇక రెండో సీసా తాగితే ఎంతటి వాడికైనా కాళ్ళు పట్టుతప్పుతయి. ఇక ఎవడైనా మూడో సీసా కల్లుతాగితే సోయి తప్పటం ఖాయం. అయినా అతిగా తాగే వాళ్ళు తాగుతున్నారు. అంత పొంతులేని ముచ్చట్లు ఎండిపోయిన చాతులు విరుచుకొని ఎక్కడి పేరుక పోయిన కోపాలు తపాలు చెలరేగుతాయి. అంతా గోళగోళగా ఉంది.

            ఉండి ఉండి ఆదినారయణ ఎడ్వటం మొదలు పెట్టిండు సత్తయ్యకు ఎందుకెడుస్తున్నాడో అర్థంకాక ‘‘ఎమైందితమ్మి’’ అని అడిగిండు.

            ‘‘అన్నా నేను దానికి ఏం తక్కువ చేసిన’’ అన్నాడు ఏడుస్తూనే...

            సత్తయ్యకు విషయం కాస్త అర్థమైంది. ఆదినారాయణ భార్య ఆదిలక్ష్మి అతన్ని వదిలేసి అవ్వగారింటికి పోయింది. పాపం అది మాత్రం ఏంచేస్తుంది. చేసిన పైసలు తాగుడుకే ఖర్చు చేస్తాంటే ఎన్నాల్లని బరిస్తది.

            ‘‘దాన్నే మన్నా కూలిపని చేయ్యమన్నానా! కాలు మీద కాలేసుకొని బ్రతకమన్నా... కాని అది ఏం చేసింది... నన్ను వదిలేసి అవ్వగారింటికి పోయింది. అక్కడే మున్నచి చిప్పలు కొట్లాడుతనయి. అన్నాడు ఊగుతు తల వ్రెలాడేసుకొని వెనక్కి ఓరిగిండు. అంగి గుండీలు ఊడి పోయి ఎండిపోయిన చాతి మీద చెత్తో చరుచుకుంటూ ‘‘లాబంలేదన్నా ఇకనేను బ్రతికేమి లాబంలేదు...నాకెవ్వరున్నారు నువవ్వుతప్ప’’ అంటూ మళ్ళీ ఎడ్వసాగిండు.

 

            నారాయణకు ఇప్పుడు ఎదీ చెప్పిన దండుగే అనుకున్నడు సత్తయ్య ‘‘నారాయణ ఇప్పుడు అదంతా ఎందుకు పద పోదాం’’ అన్నాడు చెయ్యిపట్టుకొని లేపటానికి ప్రయాత్నించిండు.

            విసురుగా చెయ్యిలాక్కొని నారాయణ ‘‘మత్తు బారిన కండ్లతో సత్తయ్యకేసి చూస్తూ ‘‘ఇంటికీ ఇల్లు లేదు గిల్లులేదు... ఇంటికాడ ఎవ్వరున్నరని పోవాలి’’ అన్నాడు.

            ‘‘అయితే ఇక్కడే పంటవా’’ అన్నాడు సత్తయ్య కాస్త కోపంగా..

            ‘‘పంటా ఇక్కడే పంటా’’ అంటు రెండు చెతులు చాచి కూచున్న చోటనే బొర్లపన్నాడు.

            సత్తయ్య ఒపిక తెచ్చుకొని మళ్ళి లేపటానికి ప్రయత్నించిండు.

            ఆదినారాయణ సొలుగుతూనే మెల్లగా లేచిండు.

            ‘‘పదపోదాం’’ అంటూ సత్తయ్య చెయ్యిపట్టుకొని ముందుకు నడపించిండు.

            ‘‘ఎక్కడికి’’ అంటూ నారాయణ కాళ్ళు నిర్రదన్నిండు.

            ‘‘ఇంటికి పోదాం’’ అన్నాడు సత్తయ్య...

            ‘‘ఇంటికానేను రాను నాకు సరిపోలే’’

            ‘‘ఇప్పటికే ఎక్కువైంది పద’’

            నారాయణ లాగు జేబులో నుండి పైసలు బయిటికి తీసి ‘‘సత్తన్న పైసలు లేవు అనుకోకు మస్తుగున్నాయ్‍’’ అంటూ చెయ్యిచాచి పైసలు చూయించిండు.

            ‘‘ఉంటే ఉన్నయ్‍ తీయ్‍... అవి జేబులో పెట్టుకో’’ అంటూ సత్తయ్య నారాయణ చెయ్యిపట్టుకోని పైసలు జేబులో పెట్టిండు.

            ‘‘అన్నా నీకంటే నాకు ఎవలు ఎక్కువా... పద బరండి తాగుతాం’’ అన్నాడు ఊగుతు...

            ‘‘ఇప్పటికే నాకు ఎక్కువైంది... నీ పరిస్థితి కూడా సరిగా లేదు.. ఇంక బరండి తాగుతావా’’

            ‘‘నాకే మైందన్నా నేను మంచిగానే ఉన్నా నాకేం కాలే’’ నాకు సరిపోలే అంటూ రెండు కాళ్ళు నిర్రతన్ని నిలబడ్డడు. కుడి చెతిని గాల్లో అడిస్తూ...

            ‘‘అన్నా కాదనకు...ఒక పవ్వ చేరిసగం తాగుతాం’’ అన్నాడు ప్రాదేయపడుతు.

            ‘‘నాకు ఏ పవ్వవద్దు... నేను పోతాఅంటూ సత్తయ్య విసుగ్గా ముందుకు కదిలిండు. నారాయణ గబగబ నల్గు అడుగులు వేసి రెండు చేతులు బార్ల చూపి ‘‘అన్నా నువ్వుపోతే నామీద ఓట్టు’’ అన్నాడు ఊగుతు...

            సత్తయ్యకు ఏం చెయ్యలో అర్థంకాక నిలబడిపోయిండు.

            ‘‘అన్నా నువ్వు తాగుకుంటెమానాయే... జరనువ్వు అక్కడ దాక నాతోరా’’ అన్నాడు ఎటు కదలకుండా నిలుచొన్నడు.

            ‘‘సరేపా’’ అంటూ సత్తయ్య కదిలిండు.

            రైల్వె కట్టకు వైపున మూడు నాలుగు లంబడొళ్ళ గుడిసెలున్నాయి. కల్లు బట్టి నుండి అడ్డదారిన కాలినడకన పోతే దగ్గరే.. అప్పటికే చీకటి కమ్ముకున్నది. లంబాడొళ్ళ గుడిసెల్లో గుడ్డి దీపం వెలుగుతున్నది. అక్కడ గుడంబా, చీప్‍లిక్కర్‍ అమ్ముతరు. అట్లా అమ్మటం నేరమే అయినప్పటికి ఎండ్లకు ఎండ్లుగా వాళ్ళ వ్యాపారం నడుస్తూనే ఉంది. ఎక్సైజ్‍ వాళ్ళు అప్పుడప్పుడు రైడింగ్‍ చేస్తారు. కేసులు పెడుతారు కాని రెండోరోజు నుండి ఏప్పటి అటే అవుతుంది.

            ఎక్సైజ్‍ డిపార్టుమెంటు వాళ్ళులంచాలకు మరిగి చూసి చూడనట్టుగా పోతుంటారు.

            అక్కడికి పోయే సరికి అక్కడ కూడా జనం ఉన్నారు.

            ఒక్కటే నిట్టాడు ఉన్న చిన్న గుడిసెలో చిన్న దీపం ముందుకుచున్న లంబాడతను అరువై రూపాయాలు తీసుకొని నారాయణ చెతిలో పవ్వ ఒకటి చెతిలో పెట్టిండు.

            దాని పని కానిచ్చి ఇంటికి తిరుగు మొఖం పట్టె సరికి సత్తయ్య కూడా కలు నిలువటంలేదు. బరాబరా ప్రపంచం అంత కూడా ఎటో తిరుగుతున్నట్టుగా మత్తుకమ్మింది.

            తూగుతు వస్తున్న భర్త వాలకం చూసి సత్తయ్య భార్య రాధకు పరిస్థితి అర్థమై కోపాం వచ్చింది.

            ‘‘ఇంకేందీ పైసలు అగుపిస్తే చాలు పిచ్చిలేస్తది ఆ తాగుబోతోని దోస్తి పట్టినవుకదా... వాని పెండ్లాం లెక్కనేను కూడా మా అవ్వగారింటికి పోతా’’ అప్పుడు నీ ఇష్టరాజ్యంగా తాగుతువు’’ అంటూ గయ్యిమంది.

            సత్తయ్య భార్య మాటలేమి పట్టించుకోకుండా వచ్చి ఇంటి ముందున్న మంచంలో వొరిగిండు.

(తరువాతి భాగం వచ్చే సంచికలో )

 

కూలి బతుకులు – నాల్గవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                            4

            పొద్దున్నె చీకటితోని శ్రీను బయటుదేరి కంట్ట్రార్‍ దివాకర్‍రావు ఇంటికి పోయిండు. అప్పటికే అక్కడికి చేరుకున్న భగవాన్‍ మేస్త్రీ ఎదురొచ్చి ‘‘ఇవ్వాళ పనులు బాగున్నాయి. నువ్వుతొందరగాపోవాలి’’ అంటూ క్షణమాగి జెబులోని చిన్న నోట్‍ బుక్‍తీసి లావు పాటి కండ్లద్దలనుండి ఒక సారి పరిక్షగా చూసి.

            ‘‘ఎలుకలపల్లి గేటు కాడ రోడ్డు పనులు జరుగుతానయి అక్కడ నాల్గు ట్రాక్టర్ల కంకరపోయ్యాలి. పొద్దున పదిగంటలకల్లా తిలక్‍ నగర్‍లో కన్‍స్టక్షన్‍ జరుగుతున్న బిల్డింగ్‍ల కాడికి బండ తీసుకపోవాలి. మధ్యహ్నం వరకల్లా పని పూర్తియితే అతరువాత ఏం చెయ్యలన్నది నేను వచ్చి చెప్పుతా అంటూ పని పురమాయించిండు.

            రోడ్డుకు కంట్రాక్టర్‍ బంగ్లాకు మధ్యన వేప చెట్టునీడలో నిలిపి ఉన్న ట్రాక్టర్‍ను తీసుకోవటానికి ముందుకు కదిలిన శ్రీనుకు హరత్‍గా ట్రాక్టర్‍ జాకిలు సరిగా పనులు చేస్తలేవన్న సంగతిగుర్తుకు వచ్చింది.

            ‘‘మెస్త్రీ జాకీలు సరిగా పనిచేస్తలేవు’’ అన్నాడు.

            ‘‘మెకానిక్‍ జానిమియాగానికి చూపించక పోయినవా’’

            ‘‘చూయించిన బాగా అరిగిపోయినవట కొత్తది మార్చాలంట’’

            ‘‘సరే ఈ పూటకు ఎట్లాగో నడవనియ్‍... సాయంత్రం దాని సంగతి చూద్దాం’’ అన్నాడు మెస్త్రీ...

            భగవాన్‍ మెస్త్రీ కంట్ట్రారు దివాకర్‍రావుకు నమ్మకమైన వ్యక్తి రామగుండాం కాడ కంట్రాక్టరుకున్న రెండు క్రషర్‍లు  ఆయనే చూస్తడు. అర్డర్‍ తీసుకోవడం, పనులు చేయించటం, సప్లయిచేసి వాటికి డబ్బులు వసలు చేయటం, వర్కర్స్ మంచి చెడు అన్ని ఆయనే నడిపిస్తడు.

            భగవాన్‍ మెస్త్రీ కూడా అందరిలాగే ఓరిస్సా నుండి బ్రతక వచ్చిండు. కాస్త రాతపూత తెలిసినోడు ఏ పని చేసిన ఓళ్ళుదాచుకోకుండా పనిచేస్తడు. అటు వంటి పని మంతుడు దొరకంటంతో కంట్రాక్టరుకు ఏ చీకు చింత లేకుండా పోయింది.

            శ్రీను ట్రాక్టర్‍ తీసుకొని బయలు దేరిండు.

            ట్రాక్టర్‍ మెయిన్‍ రోడ్డు దిగి మట్టి బాటలో కాస్త దూరం పోయే సరికి ‘‘శీనన్నా శీనన్నా’’ అన్న పిలుపు విన్పించి అటువైపు చూసిండు.

            దావన్‍ కూతురు హీరా, పదమూడు పద్నాల్గెండ్లు ఉంటాయి. కాని అంత వయస్సు ఉన్నట్టు అన్పించదు. బక్కగా ఉంటుంది.  నెత్తంతా దుమ్ముకొట్టుక పోయి,మసి బారిన బట్టలో ఉంది.

            ‘ఏంటిఅన్నట్టుగా చూసిండు శీను.

            ‘‘అన్నా జర మా ఇంటిదాక తీసుకపోవా’’ అంది.

            అతను పోయే తోవలోనే క్రషర్‍ నగర్‍ ఉంది. హిరా వాళ్ళు ఉండేది అక్కడే దాంతో శ్రీను ట్రాక్టరు అపి ‘‘అయితేరా’’ అన్నాడు.

            ‘‘ఒక్క క్షణం’’ అంటూ అంత వరదాక రోడ్డు దిగువన మొదుగు చెట్టు గుబురుకాడ ఉన్న బొగ్గు బస్తాను బలవంతంగా ఎత్తుకొని వచ్చి ట్రాక్టర్లోవేసి ఎక్కింది.

            ‘‘ఇంత పొద్దున్నే ఎటు పోయినవు బొగ్గుకా’’ అని అడిగిండు.

            ‘‘అవునన్నా రెండు రోజులనుండి తిరుగుతాంటే ఇవ్వాళ దొరికింది’’ అంది.

            ఇబ్బందేకాని దివాకర్‍రావు బండ్లను ఎవరు అపరు.

            దావన్‍ ఆయన భార్య ఇద్దరు క్వారీలో పనిచేస్తరు వాలికి ముగ్గురు పిల్లలు కూతురు హీరా పెద్దది. అతరువాత ఇద్దరు మగపిల్లలు భార్య భర్తలు ఇద్దరు పనిలోకి పోతే హీరాఇంటికాడ పనులు చేస్తది. తమ్ముల్లను చూసుకుంటది.

            వర్షకాలం కన్‍స్ట్రక్షన్‍ పనులు పెద్దగా సాగవు. వర్షలు పోయి ఎండకాలం మొదలవటంతోనే కూలీలకు క్రషర్‍నగర్‍ గుట్టబోరు మీద ఉంది. అక్కడ ఒక చెట్టు చేమలేదు. ఓరియా కూలీలు వంట చేసుకోవటానికి బొగ్గు పొయ్యిలను వాడుతారు. గతంలో అయితే ఏది ఇరువై రూపాయలకే సిమెంటు బస్తానిండా బొగ్గు దొరికేది. సింగరేణికంపినికి చెందిన డంపింగ్‍ యార్డులనుండి, సీలు కుప్పల నుండి పనిపాటలేని పిల్లలు బొగ్గు ఏరుకొని సైకిల్ల మీద తెచ్చి అమ్మెవాళ్ళు. వారికి అదోరకమైన  ఉపాధి. కాని ఎప్పుడైతే సింగరేణి కంపిని బొగ్గు దొంగతనాలు అరికట్టడానికి డంపింగ్‍ యార్డుల చుట్టు పెన్సింగ్‍ వేసి, అక్కడ మూడు పూటల వాచ్‍మన్‍ను పెట్టడంతో డంపింగ్‍ యార్డుల నుండి బొగ్గుతేవటం కష్టమై పోయింది. దాంతో సేలు కుప్పల కాడ బొగ్గు ఎరుకొని వచ్చేవారు. అక్కడేమో విపరీతమైన పోటి బొగ్గు బాయిలో బొగ్గుతో పాటు సేలుబండలు కూడా వస్తవి. అటువంటి సేలు బండలను ఏరి ఒక చోట కుప్పగా పోయే కంపిని తప్పిదారి పోయి అబండాల మధ్య అక్కడోకటి ఇక్కడోకటిగా మిగిలిపోయిన బొగ్గును ఏరుకొనేందుకు అడమగా పిల్లలు అనకుండా సంచులు పట్టుకొని పోయేవాళ్ళు. పొద్దంతా ఏరినా ఒక బస్తనిలడటం కష్టమయ్యేది.  దాంతో మునపటిలా బొగ్గు దొరకటం కష్టమైపోయి బస్తాబొగ్గు ధర యూబై రూపాయలకు పెరిగింది. అంత ధర పెట్టి బొగ్గు కొనే స్థోమతలేక వంట చెఱుకు కోసం అనివార్యంగానైనా బొగ్గు దొంగతనంగా తెచ్చుకోవలిసి వచ్చింది.

            ఎన్టిపిసిలో అకలోడింగ్‍ కోసం అగిన వ్యాగన్ల నుండి దొంగతనంగా బొగ్గు తెచ్చుకునేవాళ్ళు. దీన్ని అరికట్టడం కోసం ఎన్టిపిసి అక్కడ ముసలి వాచ్‍మెన్‍ పెట్టింది. వాడేమో కర్రపట్టుకొని ఇయ్యర, మయ్యర కొట్టెవాడు. దాంతో బొగ్గు కోసం వచ్చే పిల్లలకు వాడంటే ఎక్కడ లేని భయం. అయిన బొగ్గు తెచ్చుకోవటం అనివార్యమై వానికంట్లె పడకుండా బొగ్గు దొంగతనం చెయ్యాల్సి వచ్చెది. క్రషర్‍ నగర్‍లో నివసించే కూలీలు పనులు లేనప్పుడు తిండికి కటకట లాడుతారు. ఇతరత పనులు ఎమన్నా దొరికితే చేస్తరు లేకుంటే లేదు. అటువంటి సమయంలో ఇండ్లు సగబెట్టు కుంటూనో, సామాన్లు బాగు చేసుకుంటూనో కాలం గడుపుతారు. లేదంటే ఏ చెట్టుక్రిందనో కూచొని పొగాకు నములుతు ప్యాకాట అడుకుంటారు.

            హీరాను చూసే సరికి శీనుకు తులసిగుమారి గురించి అడగాలనిపించింది.

            ‘‘హీరా’’ తులసి కన్పిస్తలేదేమి’’ అన్నాడు యధాలాపంగా అడుగుతున్నట్టు...

            ‘‘ఉంది... తులసక్క ఇప్పుడు ఇటుకబట్టిల పనికి పోతాంది కదా’’ అంది.

            ‘‘ఇటుక బట్టిల పనికా’’

            ‘‘అవును’’

            ‘‘అదే ఎందుకు’’

            ‘‘కంట్ట్రారుతోని లొల్లి అయ్యింది కదా ఇక అపని బందుపెట్టింది’’ అంది.

            అ మాటలు విని శ్రీనుకు మనసులో బాధనిపించింది.

            తులసి గుమారిని మొదటి సారి కలిసింది. సుబాస్‍ నగర్‍లోని బాల కార్మికుల పాఠశాలలో కూలీల పిల్లలకు చదువు చెప్పాకే లక్ష్యంతో అంతార్జాతీయ కార్మిక సంఘం నిధులతో ఎర్పాటు చేసింది. దానికి హిందు మజ్దూర్‍ సంఘంకు చెందిన నరెందర్‍ దానికి బాధ్యుడు. ఆయనేమో ఎన్టిపిసిలో ఉద్యోగి, పైగా యూనియన్‍ నాయకుడు వాళ్ళ నాయకత్వాన్ని పట్టుకొని పాఠశాలను సాంక్షన్‍ చెయించిండు. అందుకోసం దాదాపు ఇరువై లక్షల దాక నిధులు వచ్చాయి,

            దాన్ని ఎర్పాటు చేసిన తనికి పిల్లలలకు సేవ చేయాటం కంటే వచ్చే నిధులమీదే అశ ఉండి పోయింది. అర్భాటంగా పాఠశాలను ప్రారంభించిండు. దాన్ని నిజాయితీగా నిర్వహించలేదు. పాఠశాల ఎర్పాటు చేసిన కొత్తలో పిల్లలను చేర్పించటం కోసం, కూలీలు ఎక్కువగా ఉండే వికే రామయ్య కాలని క్రషర్‍నగర్‍, కాకతీయనగర్‍, సుభాస్‍ నగర్‍ ఇంటింటికి తిరిగి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుతాం. మధ్యహ్నం తిండి కూడా పెడుతాం, పుస్తకాలు బట్టలు అన్ని ఫ్రీ అని నచ్చచెప్పి దాదాపు యాబై అరువై మంది పిల్లలను జమ చేసిండ్లు.

            ఎట్లాగు చదువు లేక తమ బ్రతుకులు అగమైనవి పిల్లలు చదువు కుంటేనైనా బాగు పడ్తరని నాగయ్య తన చిన్న కొడుకు శ్రీను ఆ పాఠశాలకు పంపించిండు.

            పరదేశిరాం కూడా తనకూతురు తులసి కుమారిని స్కూలుకు పంపించిండు. ఇద్దరు ఒక్కటే క్లాసు చేరిండ్లు అట్లా వారికి పరిచయం ఎర్పడింది.

            సుభాస్‍ నగర్‍ ఓర్రె ఓడ్డున ఉన్న విశాలమైన మైదానంలో ఒక్క గుడిసే వేసి అందులో స్కూలు నడిపించేది. చదువు కొని ఏం పనిలేకుండా తిరుగుతున్న ఇద్దరు యువకుల్ని తాత్కలిక టీచర్‍గా పెట్టిండ్లు.

            కొన్ని రోజులు స్కూలు బాగానే నడిచింది.  క్రమంగా నిధులు రాక క్రమంగా స్కూలు మూతపడింది. ఒకప్పుడు  స్కూలు ఉన్న చోట ఇప్పుడు మొండి గోడలు మిగిలాయి.

            తులసి కుమారిది మాతృబాష తెలుగు కాకున్నా తెలుగు చాల స్పష్టంగా మాట్లాడేది. చదువులో అందరి కంటే ముందు ఉండేది. నల్లగా బక్కగా, గుండ్రటి మొఖంతో మెరిసే కండ్లతో హుషారుగా ఉండేది. శ్రీను ఎంత కష్టపడ్డా అమెకు మించి పోలేక పోయేవాడు. ఇద్దరి మధ్య చదువులో పోటి ఉండేది.

            అశ్రామ పాఠశాలలో ఐదవ తరగతి చదివిన తరవాత శ్రీను రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలకు పోయిండు. కాలి నడకన రోజు ఐదారు కిలో మీటర్లు పోయి రావల్సి వచ్చేది. అంత దూరం పంపలేక పరదేశిరాం తులసిని బడి మాన్పించిండు. ‘‘అరే మంచిగా చదివే పిల్లను బడి మాన్పిస్తే ఎట్లా’’ అని సార్లు ఎంత చెప్పిన పరదేశి వినలేదు.

            పరదేశీరాంది రాజనంద్‍ గారి నుండి బ్రతక వచ్చిండు. ఆయన భార్య ఈశ్వరి బాయ్‍... వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు శత్రుఘన్‍ క్వారిలో బాల కార్మికుడుగా బండరేపని చేసేవాడు. కాస్త రెక్క ముదిరే సరికి బండలు కొట్టె పనికి కుదిరిండు. తల్లి దండ్రులు ఇద్దరు పనిలోకి పోతే తులసి ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసేది. శత్రుఘన్‍కు పెండ్లి అయిన తరువాత వేరు కాపురం పెట్టిండు.

            అప్పుడప్పుడు తులసి కన్పించి మాట్లాడేది. ఆమె మాట్లాడుతుంటే ఎందుకోగాని శ్రీను మంచిగ అన్పించేది. ఎంత సేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలనిపించేది. ఆమెలో చదువు పట్ల అసక్తి తగ్గలేదు. శ్రీను ఎప్పుడు కలిసిన చదువు గురించి అడిగేది. అసక్తిగా పుస్తకాలను చూసేది.

            తులసి పాటలు బాగా పాడేది. ఓరియావాళ్ళు తీరిక సమయాల్లో భారత, రామాయణగాధలు పాడుకోవటం వారి సంప్రదాయం అ పాటలేవి చదివి నెర్చుకున్నవి కావు. తరతరాలుగా పాడే వాడు. చాల ఎండ్లు ఆయన బండ పని చేసిండు కాని ఇప్పుడుచాత కాకుండా అయిపోయిండు. కండ్లు కూడా సరిగా కన్పించటం లేదు. ఆయన కొడుకు కిషన్‍ వద్ద ఉంటున్నాడు. ఎదైనా పండుగ పబ్బం అప్పుడు సామూహికంగా కోలాటం అడుతూ మహిర్‍తాతతోని పాటలు పాడించుకునే వాళ్ళు. ప్రతిరోజు దుర్బర మైన జీవితం గడిపినా, పండుగలప్పుడు మాత్రం ఉన్నంతలో గనంగాజరుపుకునే వాళ్ళు. అట పాట వాళ్ళజీవితంలో బాగం హోలి పండుగ అడమగ అనకుండా చాల సంబంరంగా జరుపుకుంటారు.

            తులసి మాహర్‍ తాత దగ్గర చాల పాటలు నేర్చుకున్నది. మహర్‍తాత చాల పెద్ద మనిషి కావటంలో ఇప్పుడు ఎదైనా పండుగలప్పుడు తులసి తోని పాటలు పాడించుకుంటున్నారు. సన్నటి శ్రావ్యమైన గొంతుతో పాడే తులసి పాటంటే అందరు ఇష్టపడేవాళ్ళు.

            ఒక సారి హోలి పండుగా రోజున ఎదో పనిబడి శ్రీను  మార్కెటుకు పోయినప్పుడు నిండారగా రంగు చల్లుకొన్న గుంపు ఒకటి క్షణాల్లో శ్రీనును చుట్టుముట్టెసి రంగుల్లో ముంచేసింది. తీరా చూస్తే వారితో కిలకిల నవ్వుతు తులసి కన్పించింది.

            ఒక విదంగా సాపిగా జరిగిపోతున్న వారి కుటుంబంలో పరదేశిరాంకు క్యారీలో దెబ్బతాకటంతో పరిస్థితులన్ని తలక్రిందులైనవి. అరోజున క్వారీలో ఎత్తయిన బండలను కూల్చటానికి నడుముకు తాడు కట్టుకొని వ్రెలాడుతు బ్లాస్టింగ్‍ కోసం బండకు రంద్రాలు చేస్తుంటే తాడు తెగి పరదేశి అంతఎత్తునుండి క్రిందపడ్డాడు. నడుముకు బలమైన దెబ్బతాకింది. కంట్రాక్టర్‍ నష్టపరిహరం ఏమి ఇవ్వలేదు. అడిగేవారు లేరు. అప్పటి నుంచి బండ పనులు చెయ్యలేని పరిస్థితి వచ్చింది. ఆయన పనులు ఆయన చేసుకో గలడు కాని బరువు పనులేమి చెయ్యలేడు.

            దేవునింట్ల మన్నుబోయా రాత ఇట్లా రాసేనని దు:ఖాన్ని దిగమింగుకొని ఈశ్వరిబాయి రాళ్ళు కొట్టె పనికి పోతుంది కాని ఇద్దరు చేస్తనే అంతంత మాత్రంగా వెళ్ళె సంసారంలో ఒక్క దానిసంపాధన ఎటు చాల కుండా పోయే సరికి తులసి ఊడా కొన్ని రోజులు బండ కొట్టె పనులకు పోయింది.

            వయస్సు తెచ్చిన అందంతో చూడచక్కగా ఉన్నా తులసి పై రంగయ్య అనుచరుడు మంగలి లక్ష్మన్‍ గాని కన్నుపడింది. వాడుత్తలంగ, అడది కనిపిస్తే చాలు చిత్తకార్తెకుక్కలా మారిపోతాడు. జీవనోపాధిలేని వాళ్ళును, భర్తలు చనిపోయి ఓంటరిగా  బ్రతికే వారిని, తిరుగుబోతు స్వబావం కల్గిన వారిని నిస్సయులను నయనా భయానా లొంగదీసుకోనేవాడు.

            అటువంటి వాడు ఒక రోజు తులసిని చూసి ‘‘క్యారిలో అ బండ పని ఏంచేస్తవు అపీసులో పనుంది చేస్తావా రోజు కూలి దొరుకుద్ది’’ అంటూ మెల్లగా మాట కలిపిండు.

            తులసికి చిన్నప్పటి నుండి అలవాటు లేనేఇ బండపని చేయటం కష్టంగా ఉంద. ఎదో తప్పని సరై అపనిలోకి పోతుంది. ఎప్పుడైతే లక్ష్మన్‍ అపీసు పని ఉంది చేస్తావా అనే సరికి నీడపాట్టున ఉండి పనిచేయ్యవచ్చు అని అశపడింది. అట్లా పనిలోకి కుదిరింది. నాల్గురోజులు బాగానే గడిచింది. కాని మెల్లగా లక్ష్మన్‍ దుర్భుద్ది బయట పడసాగింది.

            ఒక రోజు ఎవరు లేందీ చూసి తులసి మీద చెయ్యి వేసిండు. ఊహించని పరిణామానికి తులసి మొదట కంగుతిన్నా మరుక్షణం తెరుకొని ఎదురు తిరిగింది. అది తెలిసి ఓరియా కూలీలంత లొల్లి చేసిండ్లు. లొల్లి పెద్దదై పోలీసుస్టెషన్‍ దాక పోయింది. కాని కంట్రాక్టరు రంగయ్య తన పలుకుబడితోని పోలీసుల నోళ్ళు మూయించిండు. పైగా కంట్రాక్టరు దగ్గర డబ్బు గుంజటానికి తులసి అడిన నాటకంగా ఉల్టాకేసు బనాయించిండ్లు పోలీసులు. అక్కడి నుండి భయటపడటమే గగనమైంది.

            అలోచనలో పడిపోయిన శ్రీనుకు క్రషర్‍ నగర్‍ వచ్చింది గుర్తులేదు.

            ‘‘అన్న ఆపు’’ అని హిరా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ట్రాక్టర్‍ను అపిండు.

            హిరా క్రిందికి దిగి తన బొగ్గుల సంచి ఎత్తుకొని గుట్టమీద దొంతర్లుగా ఉన్న గుడిసెలకేసి పోయింది.

            మళ్ళీ బండి స్టార్టు చేస్తుంటే... దూరం నుండి అర్జున్‍ చూసి ‘‘శ్రీనన్న బండి ఆపు మేము అటే వస్తానం’’ అంటూ కేకేసిండు.

            అర్జున్‍, అత్మరాం, ఈశ్వరిబాయ్‍, భగవతిమరికొంతమంది సద్దులు పట్టుకొని బయలు దేరినవాళ్ళు పరుగు పరుగున ఉరికి వచ్చి ట్రాక్టర్‍ ఎక్కిండ్లు. లేకుంటే వాళ్ళు ఉండే చోటు నుండి క్వారీకి దాదాపు నాల్గుకిలో మీటర్లు నడిచి పోవలసివ చ్చేది. కూలీలు పొద్దున సద్దికట్టుకొని వస్తే మళ్ళి సాయంత్రం చీకటి పడ్డతరువాతనే ఇంటికి తిర్గివచ్చేది.

            ‘‘ఎంటీ ఇవ్వాళ పొద్దు పోయింది’’ అన్నాడు శ్రీను అర్జున్‍తో మాటకలుపుతు.

            ‘‘లలేచి వండుకొని తినివచ్చే సరికి ఈ యాల్ల అయ్యే’’ అన్నాడు అర్జున్‍.

            ఇవ్వాళ భగవాన్‍ మెస్త్రీ వస్తడా! అని అడిగిండు అత్మారాం...

            ‘‘అదే ఎందుకు’’

            ‘‘నిన్న కూలీ పైసలు ఇవ్వాల్సి ఉండే నిన్న రాలేదు ఇవ్వాలైనా వస్తడా లేదా’’ అన్నాడు.

            కరకరలాడుతు తుర్పున సూర్యుడు పొడుచుకొచ్చిండు.ఈ సారి ఎండలు తొందరగానే వచ్చినవి. బారెడు పొద్దు ఎక్కెసరికి ఎండ సురసుర లాడుతున్నది.  ఇక బండల మీద పని చేయ్యటం అం నిప్పుల కొలిమిలో మెసిలినట్టే అందుకే కూలీలు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దున పని ముగించుకోవాలని చూస్తరు.

            ‘‘నిన్న ఎందుకు రాలేదో ఎమోకాని...భగవాన్‍ మెస్త్రీ మాట తప్పె మనిషికాదు. ఇవ్వాళ తప్పకుండా వస్తడు’’ అన్నాడు శ్రీను.

            మాటల్లో పడిపోయి క్వారీ వచ్చింది తెలియలేదు.

            రామగుండంలోని రాముని గుండాలు గుట్టకు దివాకర్‍రావుకు మొదట ఒక్కటే క్వారీ ఉండేది కాని గిరాకి ఎక్కువగా ఉండటంతో గుట్టకు మరో వైపున ఇంకో క్వారీ మొదలు పెట్టిండు.

            రాముని గుండాల గుట్టకు తూర్పువైపున ఒక దోనే (చిన్నగుహ) ఉంది. పెద్ద బండ రాయికి  దిగువన నిలువెత్తున  దాదాపు పెండు గజాల వెడల్పున దోనే ఉంది. అందులోని ఒక చిన్న బండ మీద మారెండంత ఎత్తుఉండే రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రాహలున్నాయి. సెలవు రోజుల్లో ప్రతి శ్రావణ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అగుహకు ఒక వైపున బండల మీద ప్రాకిన రాళ చెట్టు ఒకటి ఉంది. గుహకు ఎదురుగా కొద్ది దూరంలో నీటి బుంగ ఒకటి ఉంది. వలయాకారంలో ఏటు జానెడువెడల్పు జానెడు లోతు ఉండే బండరాలయి మీద తొలి చినట్టుగా ఉండే బుంగలో ఎప్పుడు నీరు ఉంటుంది.  ఆ బుంగలో అనీటిని తోడితే మళ్ళి అంతే నీరు ఊరుతుంది తప్ప అంతకంటే ఎక్కువ నీరు ఊరదు. దాని మీద స్థానికుల్లో ఒక కథనం ఉంది. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజలు అక్కడ గుహలో ఉన్నాడని  అ సందర్భంగా ఒక సారి సీతకు దాహం వేస్తే రాముడే స్వయంగా నీటికోసం ఆ బుంగను తొలిచాడని చెప్పుతారు. ఇటువంటి నమ్మకాలకు ప్రజల్లో కొదవలేదు. కాని అట్లా నీరు ఊరడం అంతా రాముని మహిమ అని నమ్ముతారు. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. చుట్టు ప్రక్క గ్రామాల నుండి జనం వస్తారు. అ సమయంలో గుళ్ళో అయ్యగారు రోజు ఉంటాడు. మిగితా సమయంలో ఉండేది తక్కువ.

            రాముని గుండాలగుట్ట చాల విశాలంగా పరుచుకొని ఉంటది. గుట్టకు దక్షణం వైపున మొదటి సారీ క్వారీమొదలైనప్పుడు దేవుని గుట్టకు క్వారీ ఎట్లా నడిపిస్తరు అంటూ జనం నుండి వ్యతిరేకత వచ్చింది. కాని దివాకర్‍రావు తన పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యమంలో ముందు పీటన నిలచిన వారిని నయనా భయానా లొంగదీసుకొని క్వారీ మొదలు పెట్టిండు.

            ఇటువంటి సంఘటనలు కరింనర్‍ జిల్లాలో చాల జరిగినయి. ము్యంగా గ్రానైట్‍ పరిశ్రమ పుట్టుకొచ్చిన తరువాత చాల గుట్టలు మాయమైనవి. ఎంతో చారిత్రక ప్రాదన్యం కల్గిన గుట్టలు దేవుని గుట్టలు కూడా వదలకుండా క్వారీలు చేసిండ్లు. పెద్ద పెద్ద బండరాలను సైజుల వారిగా కట్‍చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసి గ్రానైట్‍ పరిశ్రమాధిపతులు వందల కొట్లు సంపాధించిండ్లు. ఇట్లా సంపాధించిన డబ్బులతో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా గ్రానైట్‍ పరిశ్రమాధినేతలు రాజకీయ నాయకులై, ఎమ్మెల్యెలుగా ఎంపిలుగా గేలిచి మంత్రులు అయ్యిండ్లు.  గుట్టల విద్వంసం వలన ఎర్పడుతున్న పర్యావరణన విద్వంసం గురించి పర్యావరణ ప్రేమికులు ప్రజాస్వామిక వాదులు అనేక మార్లు అందోళన చేసిండ్లు. కాని గ్రానైట్‍ పరిశ్రామధిపతులు ప్రభుత్వా అండతో వాటిని అణిచి వేసిండ్లు. వారి నిరసనలు అరణ్యరోదనే అయ్యింది.

            వీళ్ళు అక్కడికి పోయే సరికి అప్పటికే కూలీలు పనులు మొదలు పెట్టిండ్లు. పెద్ద  పెద్ద బండలను క్రషర్‍లోనే వేయాటానికి వీలుగా చిన్నచిన్న ముక్కలుగా కొడుతున్నారు కొందరు. వాటిని తీసుక పోయి క్రషర్‍ బంకరులో వవేయాటానికి దాదాపు అరువై డెబ్బయి మంది పిల్లలు పనులు చేస్తున్నారు. గుట్టకు కాస్త దిగువన అకాశం కంటూ పొడుచుకున్న క్రషరు పెద్దగా చప్పుడు చేస్తూన్నది. బండాలు చుర అయ్యే క్రమంలో ఎగిసిన దట్టమైన దూళి ఎగజిమ్ముతు అక్కడి వాతవరణం అంతా పేరుకపోయింది. అక్కడ పనిచేస్తున్న వారంత తలకు ,ముక్కుకు మూతికి గుడ్డలు కట్టుకొని ఉన్నారు. అక్కడ పని చేస్తున్న వారంత తెల్లటి బూడిద దుమ్ముతో నిండిపోయింండ్లు.

            మరో దిక్కున క్రషర్‍ బెల్టునుండి చిన్న చిన్న ముక్కలుగా బయిటికి వస్తున్న బండ రాళ్లను కాస్త పెద్ద సైజుబండలను ఏరుతు మరికొంత మంది పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత వేగంగా పని చేస్తున్నరంటే బెల్టు ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా చెతులు అడిస్తూ సైజుల వారిగా బండలు ఏరే పనిలో ఉన్నారు.

            అట్లా పని చేసే పిల్లలకు ఇచ్చే కూలి చాల తక్కువ. వాస్తవానికి పిల్లలతో పనులు చేయించటం చట్టరీత్య నేరం. అటు వంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వ లేబర్‍ డిపార్టు మెంటు ఉంది కాని అది నామ మాత్రమే. లంచాలకు ఎగబడిన అధికారులు అవేవి పట్టించుకోరు. ఎదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడలేని హడావిడి మొదలైతది. అటు తరువాత వాటికి దాతు పిర్యాదు ఉండదు.

            లోడర్‍ వెంకటెశం చెయ్యెత్తి ట్రాక్టర్‍పోను కాస్త ముందుకు తీసుక రమ్మన్నట్టుగా సైగలు చేసిండు.

            శ్రీను ట్రాక్టరును కాస్త ముందుకు తీసుకపోయి కుప్పగా పోసిన కంకర కుప్ప ముందు నిలిపిండు. గతంలో అయితే లోడింగ్‍, అన్‍లోడింగ్‍ అంతా కూలీలే చేసేవాళ్ళు. ఇప్పుడు యంత్రాలు వచ్చిన తరవాత అపని తెలికైంది. కాని అమేరకు కూలి దొరకని పరిస్థితి ఎర్పడింది.

            నిముషాల్లో లోడర్‍ ట్రాక్టర్‍లో కంకరలోడు చేసింది. ఎక్కువ అలస్యం చేయకుండా శ్రీను ట్రాక్టర్‍ను ఎల్కపల్లి గేటు కేసి పరుగులు పెట్టించిండు.

            మద్యాహ్నం వరకు నాలుగు ట్రిప్‍లు కొట్టిండు ఎండ ముదిరింది. కడుపులో అకలి సురసుర లాడసాగింది. పొద్దున వెంట తెచ్చుకున్న సద్దితిని మళ్ళి పనిలో పడ్డడు.

            గతుకుల రోడ్డు మీద ట్రాక్టరు ఎగిరి ఎగిరి పడుతు ముందుకు పోతున్నది.

            కాస్త దూరం పోయే సరికి దిలీప్‍ కన్పించిండు. దీలీప్‍ని చూసి శ్రీను మనసులో జాలి అన్పించింది. అంత పది పన్నెండు సం।।రాలు మించి ఉండదు. దీలిప్‍ తల్లి మూడెండ్ల క్రింద దేవ్‍ చనిపోయింది. దీలిప్‍ తండ్రి వాళ్ళు వీళ్లు’’ ఎమంత వయస్సు పోయిందని, మళ్ళీ పెండ్లి చేసుకొమ్మన్నరు. కాని భార్య చినపోయిన తరువాత దేవ్‍ కు జీవితం మీద అసక్తి పోయింది. పిల్లవాన్ని చూసుకుంటు బ్రతుకు తున్నాడు.

            దీలిప్‍ ప్రక్కగా ట్రాక్టరు అపి శీను. ‘‘ఎక్కడికి క్వారికేనా’’ అని అడిగిండు.

            ‘‘అవును’’ చిన్నగా నవ్వుతు తాలాడించిండు. దిలీప్‍...

            ‘‘అయితే ఎక్కు’’

            దిలిప్‍ బండి ఎక్కిండు. చేతిలో సంచి ఉంది. అది చూసి..

            ‘‘ఏంటది’’ అన్నాడు శ్రీను.

            ‘‘నాన్నకు సద్దీ’’

            ‘‘ఎవరు వండిండ్లు’’

            ‘‘నేనే’’ అన్నాడు మెరిసే కండ్లతో...

            ‘‘నీకు వంట కూడా వచ్చా’’ అన్నాడు అక్చర్యంగా...

            ‘‘దీలిప్‍ తలాడించి’’ రోజు పొద్దున్నె నాన్నె వండి పోతడు కాని ఇవ్వాల వీలు కాలేదు. అందుకే నేను వండిన’’ అన్నాడు.

            శ్రీనుకు నిజమే అన్పించింది. పిల్లవాడు అంత దూరం పోయ్యి రావటం కష్టమే అనుకున్నాడు. ఎన్టిపిసిలో పెరెన్నిక పొందిన రెండు స్కూల్లు ఉన్నాయి కాని అందులో కూలి పిల్లలకు సీటు దొరకయి. దాంతో చాల మంది కూలీల పిల్లలు చదువు కునెందుకు అవకాశాలు లేకుండా పోయింది. చెల్డు వెల్ఫేర్‍ వారి స్కూలు మూత పడ్డతరువాత అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయింది. ఒక లిద్దరు కాని గిరి బడి పెట్టిండ్లు. కాని అది సరిగ్గా నడవక మూసెసిండ్లు. దాంతో కూలిల పిల్లలకు చదువు లేకుండా పోయింది.

            ఇంట్లో అడవాళ్ళు ఉంటే అదోతీరు కాని అడదిక్కులేని కాడ, అందులో క్రషర్‍నగర్‍ వంటి చోట నీళ్ళు కావాలన్నా పోయిలోకి బొగ్గులు కావాలన్నా ప్రతిది సమస్యే. దేవ్‍ పనికి పోతే దిలీప్‍ అ చిన్న వయస్సులోనే ఇంటికాడ పనులన్ని చేసేవాడు.

            సైట్‍మీదికి చేరుకున్నారు. ట్రాక్టర్‍ను మళ్ళి లోడ్‍కోసం నిలిపి దీలిప్‍ను ఉద్దేశించి ‘‘మళ్ళీ పోయేతప్పుడు  వస్తవా’’  అన్నాడు బొమ్మలు ఎగరెసి...

            ‘‘కాసేపు అడుకున్నంక వస్తా’’

            ‘‘అయితే  రెండో ట్రిప్‍లో తీసుకపోతాలే’’ అన్నాడు శ్రీను...

            అన్నాలు తినే వేళ కావటంతో షెడ్డులో చాల మంది కూలీలు ఎక్కడికి అక్కడ కూచొని బోజనాలు చేస్తున్నారు. ఇంతలోనే బుర్‍ బుర్‍ లాడుతు భగవాన్‍ మెస్త్రీ మోటారు సైకిల్‍ చప్పుడు విన్పించింది.

            భగవాన్‍ మెస్త్రీ బండిని క్రషర్‍ అపీసు ముందు నిలిపి అపీసులోకి వస్తూ శ్రీనును చూసి

            ‘‘అరేయ్‍ శ్రీను ఎంత వరకు వచ్చింది పని’’ అని అడిగిండు. ఎల్కలపల్లి గేటుకు కంకర కొట్టుడు అయిపోయింది’’ అంటూ బదలిచ్చిండు.

            ‘‘కంట్రాక్టరు పోన్ల మీద పోన్లు చేస్తాండ్లు. తిలక్‍నగర్‍కు (బెందడి) బెస్‍మెంట్‍ రాయి తీస్కపోవాలి. తొందరతినిపో...’’ అని పురమాయించి మళ్ళి వెనక్కి తిర్గి అపీసుకు పోబోతుంటే అత్మరాం ‘‘మెస్త్రీ ఇవ్వాళ పైసలు ఇస్తరా’’ అని అడిగిండు.

            ‘‘అరే ఇస్తం బిడ్డా.... నీపైసలు ఎక్కడికి పోవు... కూలి ఇచ్చినంకనే ఇక్కడి నుంచిపోత సరేనా’’ అన్నాడు నవ్వుతూ...

 

(తరువాతి భాగం వచ్చే సంచికలో )

 

కూలి బతుకులు – ఆరవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                             6

          ‘‘ఎం నాగయ్య బాగున్నవా’’ అన్న పిలుపువిని ముందు మంచంలో కూచున్న నాగయ్య అటు వైపు చూసిండు.

            ఎంకటయ్య సారు చిర్నవ్వులు చిందిస్తూ ఇటే వస్తున్నాడు.

            ‘‘ఎన్నిరోజులాయే సారు మిముల్ని చూడక’’ అన్నాడు నాగయ్య అక్చర్యంగా...

            ‘‘గోదావరిఖనిల పనిబడి వచ్చిన... ఎట్లాగు ఇంత దూరం వచ్చిన కదా అని ఒక్క సారి మనోళ్లను చూసి పోదామని వచ్చిన’’ అంటూ వచ్చి మంచంలో నాగయ్య ప్రక్కన కూచున్నడు.

            ఎనుబై దశకంలో వెంకటయ్య కాట్రక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు. ఒక వెలుగు వెలిగిండు. ఆయన ఒక్క మాటంటే చాలు వెలాది మంది కూలీలు కదిలేది.

            ప్రాణం ఎట్టున్నది’’ అని అడిగిండు వెంకటయ్య...

            ‘‘ఏం ప్రాణమో ఎమో పోకుంటా రాకుంటా ఉంది’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా’’

            అదే ఏమైంది.. ఎవని బ్రతుకు వాడు బ్రతకటమే కష్టమైతాంది’’

            ‘‘సత్తయ్య మంచిగనే పని చేస్తాండుకదా.. వాడు ఇంట్లకేమి ఇస్తలేడా’’

            ‘‘ఎక్కడిది వాడు వాని పిల్లలు బ్రతుకుడే కష్టమైతాంది’’ ఇక మా మొఖం చూసేటట్టుఉందా’’

            ‘‘మరి చిన్నోడు’’

            ‘‘ట్రాక్టరు మీద పని చేస్తాండు’’

            ‘‘మరి నువ్వెమి పనిచేస్తలేవా’’

            ‘‘వయసు వయస్సు వాల్లకే పనులు దొరుకతలేవు నన్నెవ్వడు పనులకు పిలుస్తడు’’ అన్నాడు.

            వీళ్ళ మాటలు విని శాంతమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది’’ వెంకటయ్య సారును చూసి ఎప్పుడొచ్చిండ్లు’’ అంది.

            ‘‘ఇప్పుడే’’

            ‘‘ఎక్కడుంటాండ్లు సారు కన్పిస్తలేరు’’ అంది మళ్ళి..

            ‘‘కరింనగర్‍ల’’

            ‘‘అక్కడికి ఎందుకు పోయిండ్లుసారు.. మీ అటువంటి వాళ్ళులేక పోయే సరికి ఇక్కడ ఎవ్వరు అడిగే టోళ్ళు లేకపోయిరి’’ అంది శాంత...

            ‘‘సారును ఏముండమంటవు... ఇక్కడ ఏమున్నది. అప్పుడంటే ఎక్కడ చూసిన జనం ఉండేది. అందరికి పనులు ఉండేది. సమస్యలు ఉండేవి. వాటిని పరిష్కరించాటానికి యూనియన్‍ అవసరమైంది. ఇప్పుడ జనంలేరు. యూనియన్లు  అ జోరు లేదు’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా...

            వెంకటయ్య ‘‘నిజమే’’ అన్నట్టుగా మౌనంగా తలాడించి ‘‘యూనియన్లు ఏడబోయినవి. మాగున్నయి. కాని నిజాయితీగా పని చేసేటోడులేడు’’ అన్నాడు బారంగా...

            ‘‘నిజమే సారు పర్మినెంటు లోకేషన్ల పని దొరకాలంటే ముప్పయి వెలు నడుస్తాంది’’

            ‘‘అ రోజుల్లో మనం ఎంత ంమందిని క్యాజువల్‍ వర్క్ర్కర్‍గా పెట్టించిలేదు... ఒకరి దగ్గర నయాపైస తీసుకున్నమా’’ అన్నాడు వెంకటయ్య పాత రోజులు తలుచుకొని...

            ‘‘నిజమే సారు ఆరోజులు వేరు...ఇప్పుడెమో నాయకులు పీతలపైస ఏరుకుంటాండ్లు’’ అన్నాడు నాగయ్య...

            అ రోజుల్లో నాగయ్య వెంకటయ్యతోని పనిచేసిండు వెంకటయ్య ఎంత చెప్పితే అంత బంద్‍ అంటే బందుండేది. ఒక విదమైన ఉండేది. నాగయ్య యూనియన్‍లో రాత్రింబవళ్ళు తిరిగేది.

            ఇద్దరు కాసేపు పాతరోజులు జ్ఞాపకం చేసుకున్నారు.

            1976లో ఐఫ్‍.సి.ఐ ఉత్తపత్తి ప్రారంభమైన తరువాత నాల్గెండ్లకు రామగుండం కంట్రాక్టు అండ్‍ క్యాజువల్‍ వర్కర్స్ యూనియన్‍ ప్రారంభమైంది. దాదాపు వెయ్యి మంది పని చేసేవాళ్ళు. ప్లాంట్‍ మెయిన్‍ టెనెన్స్ బాయిలర్స్, సివిల్‍, బిల్డింగ్‍ వర్క్న ఒక్కటేమిటి అరోజు పని కంట్రక్టు కూలీలు చేసే వాళ్ళు, వాళ్ళు మీద సూపర్‍వైజ్‍ చెసెందుకు మాత్రంకంపిని మనష్యులు ఉండేది.

            యూనియన్‍ ఎర్పడక ముందు కంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడిచేది. కనీస వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. అదిరించి బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు. కొంత మంది కంట్రాక్టర్లు కూలీలకు డబ్బులు ఎగ్గోటిన సందర్భలున్నాయి. ఎవరైనా ఎదురు మాట్లాడితే పనులనుండి తొలగించేవాళ్ళు... పంజాబ్‍కు చెందిన ‘‘సంగ’’ అనే ఎలక్ట్రిక్‍ కంట్రాక్టర్‍ మరి దుర్మార్గంగా ఉండేవాడు. అనేక సందర్భలలో కూలీల మీద చెయ్యి చేసుకున్నాడు.

            అటువంటి సమయంలో వెంకటయ్య నాయకత్వంలో యూనియన్‍ పుట్టింది. కంట్రాక్టు కూలీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చెపట్టింది. దాంతో కంట్రాక్టర్లకు కన్నెర అయింది.

            కంట్రాక్టు కార్మికులను గవర్నమెంటు జి.వో ప్రకారం కనీస వెతనాలు చెల్లించాలనే డిమాండ్‍ మీద సమ్మె చేసినప్పుడు పెద్ద పోరాటమే జరిగింది.

            ‘‘చెప్పుకింద రాయిలాగా అణిగి మణిగి ఉండే కూలి నాలి కొడుకులు మాకు ఎదురు తిరుగుతారా’’ అని కంట్ట్రార్ల కోపానికి వచ్చి సంఘంలో ముందు నిలచిన వెంకటయ్య మీద తమ గుండాలను పంపి హత్యప్రయత్నం చెసిండ్లు.

            దాడికి వచ్చిన గుండాల మీదికి కూలీలు ఎదురు తిరిగిండ్లు. రోజంతా మొద్దు కష్టం చేసి దాటు దేలిన కూలీల ముందు గుండాలు నిలువలేక పోయిండ్లు. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిండ్లు.

            వెంకటయ్య మీద హత్యయత్నం చేసిన కంట్రాక్టర్లు తమ పలుకుబడి ఉపయోగించి ‘‘తమ అనుచరుల మీద దాడి చేసిండ్లని దొంగ కేసు పెట్టిండ్లు... పోలీసులు వచ్చి వెంకటయ్యతో సహా కొద్దిమందిని పట్టుక పోయి ఠానా లో వేసి కొట్టి కేసులు పెట్టిండ్లు.

            ఈ సంఘటన కూలీలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే దాక, తమ న్యాయమైన డిమాండ్లను ఓప్పుకునేదాక సమ్మె విరమించేది లేదని కూలీలు తెగెసి చెప్పిండ్లు.

            సమ్మె వారం రోజులు సాగింది. ఎఫ్‍.సి.ఐ ప్రోడక్షన్‍ అగిపోయింది. కూలీలు పని చెయకుండా ఒక్క రోజు కూడా నడువని పరిస్థితి... దాంతో మెనేజుమెంటు దిగివచ్చి కంట్రాక్టర్ల మీద ఓత్తిడి తెచ్చింది.

            ‘‘కూలీలా గొంతమ్మ కొర్కెలు తీరుస్తూ ఇక మాకేమి మిగులు బాటు అయితది’’ అంటూ మొదట కంట్రాక్టర్లు మొండికేసినా మెనేజుమెంటు వారిని కన్విన్స్ చేసి ఒక ఓప్పందానికి వచ్చింది.

            అవిదంగా సమ్మె విజయవంత మైంది. కూలీల జీతాలు పెరిగినవి. యాడాదికి రెండు డ్రెస్‍లు, సేఫ్టీషూస్‍, క్యాంటిన్‍, ప్రావిడెంట్‍ ఫండు కట్టింగ్‍, యాడాది పన్నెండు లీవులు ఇచ్చెలా ఓప్పందం జరిగింది.

            అన్నిటి కంటె ముఖ్యమైంది. గతంలో కంట్రాక్టకూలీలకు నిర్దిష్టమైన పనిగంటలు అనేవి ఉండేవి కావు. కొన్ని సార్లు పన్నెండు గంటలు పని చేయించుకొనేది. ఓప్పందం తరువాత కూలీలను ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయించవద్దని ఒక వేళ అనివార్యమై పనులు చెయించాల్సి వస్తే అదనంగా పని చేసిన గంటలకు ఓవర్‍టైమ్‍ పెమెంట్‍ చేయించాలని ఓప్పందం జరిగింది. అలాగే అరస్టు చేసిన నాయకులను విడుదలచేసారు. కూలీల డిమాండ్స్ ఏవి కొత్తవి కావు. గవర్నమెంట్‍ జివోతో ఉన్న అంశాలే కాని అమలు జరిగేవికావు. ఎప్పుడైతే కూలిసంఘం సమ్మె తరువాతనే అమలు లోకివచ్చినవి.

            సమ్మె విజయవంతం కావటంతో కూలిసంఘం బలపడింది. దీని ప్రబావం ప్రక్కనే ఉన్న ఎన్టిపిసి కార్మికుల మీదప్రబావం చూపింది క్రమంగా అక్కడ కూలి సంఘం బలపడింది. ఎన్టిపిసి లో కార్మికులు తమ సమస్యల మీద మూడు సార్లు సమ్మె చేసి విజయం సాధించారు.

            కూలీలు ఎక్కువగా నివసించే పికే రామయ్య కాలనీలో అంత వరదాక కరెంటు లేదు, యూనియన్‍ అందోళన పలితంగా కరెంటు వచ్చింది. మంచినీళ్ళ కోసం రెండు పంపులు వచ్చినవి. అయినా చాల సమస్యలు పెండింగ్‍లో ఉన్నాయి.

            పోయిన వర్షకాలం మురికి గుంలా ఉండే పికే రామయ్య కాలనీలో కలరా వచ్చి షహి దుర్గ తండ్రి భగవతి నాగమణి భర్త రామయ్య చనిపోయిండ్లు. అ సందర్భంగా యూనియన్‍ అందోళచేస్తె ‘‘ఎంమ్మార్వో’’ వచ్చిండ్లు.

            ఎంమ్మార్వో ముందు కాలనీ వాసులు చాల సమస్యలు ఎకరవు పెట్టిండ్లు. మాకు రెషన్‍ కార్డులు లేవు. ఉచిత బియ్యం వస్తలేవు. మేము ఈ దేశవాసులంకామా? మాకెందుకు ఇవ్వరు.. అని నిలదీసిండ్లు. కాని అన్ని చేస్తామని హమీ ఇచ్చిన ఎంమ్మార్వో అటు తరువాత తన మాట నిలుపుకోలేదు.

            ఉండి ఉండి వెంకటయ్య ‘‘చంద్రయ్య కన్పిస్తాండా’’ అని అడిగిండు.

            ‘‘ఏ చంద్రయ్య’’

            ‘‘అదే బొందయ్య కొడుకు’’

            ‘‘మొన్న బొందయ్య కన్పించిండు కాని కొడుకు సంగతి ఏం తెల్వలేదన్నాడు. అయినా కొడుకు ఎప్పటికైనా రాకపోతడా అని ఎంత కష్టం వచ్చినాభూమి అమ్మలేదట’’ అన్నాడు నాగయ్య...

            ‘‘బొందయ్య ఇక్కడ ఉంటాండా’’

            ‘‘చాల రోజులాయే ఎల్లిపోయి ఆయన భార్యకూడా చనిపోయిందట... ఊరిమీద తిర్గి అడుక్కొని బతుకుతాండు’’ అన్నాడు నాగయ్య...

            అమాటలకు ఎంకటయ్య మన సులో బాదేసింది. ఎక్కడి దక్కడ చిల్లం కల్లం అయ్యింది. గాలిలో దీపం లాంటి కూలీల బ్రతుకుల్ని కాపాడటానికి ఒక ప్రయత్నమైతే చెసిండు. కాని, తుపానులా వీచిన గాలికి ఆ దీపం అరిపోయింది. కూలీ బ్రతుకుల్లో మళ్ళి చీకట్లు కమ్ముకున్నాయి. కూలీల చమట చుక్కలను లాబాలుగా పిండుకోవటానికి అందరుకు అందరుతోడు దొంగలే. కూలీల బ్రతుకుల్ని బాగు చేస్తామని చట్టాలు చేసిన పాలకులు, అచట్టాలు ప్రభుత్వరంగ సంస్థలోనే అమలు జరుగకుంటే పట్టించుకొని లేబర్‍ అపీసర్లు...

            మొదటి సారి కూలి సంఘం మహాసభలు ఎంతో ఉత్సాహంగాజరిగినవి. ఎన్టిపిసి కమ్యూనిటి హాల్లో మీటింగ్‍ జరిగింది. సహజంగా అయితే మెనేజుమెంటు కూలీలను ఆ చాయలకు కూడా రానివ్వదు. అటువంటిది అందులో మీటింగ్‍ పెట్టుకోవటానికి పర్మిషన్‍ ఇచ్చిందంటే, ఆ రోజుల్లో కూలిసంఘం ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

            వెంకటయ్యకు చంద్రయ్య నల్లటి బక్క మొఖం గుర్తుకు వచ్చింది. దాంతో ఆయన అప్రయత్నంగానే ‘‘వాడు మొదటినుండి అంతే రాజీపడేవాడు కాదు. చెవసచ్చి ఒపిక నశించి మా అటువంటి వాళ్ళు వెనక్కి తగ్గినా... చంద్రయ్య ముందుకే పోయిండు’’ అన్నాడు బారంగా...

            ‘‘మరింక ఏం చేస్తడు. మనిషి ముందు అకలికి చచ్చుడో ఎదురుతిరిగి బ్రతుకుడో తెల్చుకోవాలన్నప్పుడు చంద్రయ్య లాంటి వాళ్ళు ఎదో తిరగటానికే సిద్దమైండ్లు’’ అన్నాడు నాగయ్య...

            కూలి సంఘం బలహినపడటానికి అనేక కారణాలున్నాయి. పనులు లేక చాల మంది బ్రతక పోవం ఒక కారణమైతే కూలి సంఘంలో అంతర్‍ కలహలు ఎర్పడటం మరో కారణమైంది.

            నిత్యం కూలీల మధ్య తిరుగుతు పని చేసేవాల్ళు కొందరైతే రాష్ట్ర నాయకులుగా కెంద్రనాయకులుగా చెలామణి అవుతు వారి మీద పెత్తనం చేసేవాళ్ళు మరికొందరు. సమాజంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలు సంఘంలోకి చొచ్చుకొచ్చింది.

            ఏ రోజుకు ఆరోజు పని చేసకుంటూ తిండికి తికానలేని కూలీల మధ్య పనిచేయటం అంటే మాములు విషయం కాదు. అందుకు ఏంతో ఓపిక పట్టుదల, సేవబావం కావాలి. కాని చాల మందినాయకులకు అలక్షణాలు లేవు. సభలు సమావేశాలప్పుడు తెల్ల బట్టలు వేసుకొని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, క్రింది స్థాయిలో పని చేసే వారి మీదమాత్రం పెత్తనం చేసేవాళ్ళు. అంత వరదాక అందర్గతంగా జరిగే ఘర్షణ క్యాజువల్‍ వర్కర్స్ సమ్మె సందర్భంగా బయటపడింది.

            ఎన్టిపిసిలోని మెకానికల్‍ ఎలక్ట్రికల్‍ సెక్షన్‍లో లోడింగ్‍ అన్‍లోడింగ్‍ చేసే వంటి నిత్యం పనులు ఉండే చోట పనిచేసే కూలీలను క్యాజువల్‍ లెబర్‍గా పర్మినెంటు చేయ్యలనే డిమాండ్‍తో సమ్మె మొదలైంది.

            అయా పనులు స్వబావ రీత్య రోజు ఉండేవి. అయితే ఆ పనులు చేసే కంట్రాక్టర్లు మారి నప్పుడు మారిన కంట్రాక్టరు కొంతమందిని తీసివేసి, తనకు ఇష్టమైన వారిని మరి కొంత మందిని పెట్టుకునే వాళ్ళు. దీన్ని కూలీలలు వ్యతిరేకించిండ్లు. ఎంట్రాక్టర్లు మారిన పర్మినెంటు పనుల చేసే వారిని తీసివేయవద్దు అన్నది డిమాండ్‍. అట్లా చేయటం వలన సంస్థకు వచ్చే నష్టం ఏమి లేదు. కాకుంటే పర్మినెంటు పనులు చేసే కూలీలకు రోజు పని ఉంటుంది. అది కూడా కంట్రాక్టు కూలియే...

            ఎప్పుడైతే సమ్మె మొదలైందో పనులు సాగక మెనేజుమెంటు ఇరకాటంలో పడింది. కంట్రాక్టర్లెమో అందుకు ఓప్పుకోవటంలేదు. ఎందుకంటే కంట్రాక్టర్లు పర్మినెంటు పనులు కూలీలకు కేటాయించాలంటే కూలీల దగ్గర లంచాలు తీసుకొని పనుల్లో నియమించుకునేవాళ్ళు. చివరికి ఇది ఎట్లా పరిణామం చెందిందంటే కంట్రాక్టర్లు మారినప్పుడల్లా తమ పనిని కాపాడుకోవాటానికి సమ్మె ఉధృతి పెరిగే సరికి మెనేజుమెంటు కుట్రపూరితంగా వ్యవహరించింది. అగ్రనాయకులతో మంతనాలు జరిపి వారిని లోబర్చుకుంది.

            నలుబైశాతం మందికి క్యాజవల్‍ వర్కర్లగా పర్మినెంటు పేసుల్లో పనిచేయాటానికి మెనేజుమెంటు ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే గణవిజయంగా నాయకులు చెప్పుకొచ్చిండ్లు.

            ‘‘పదకొండు వందల మంది పర్మినెంటు పనిస్థలాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంటు చేయాలని మనం సమ్మె చేస్తే కనీసం మనతోని విచారించకుండా నాయకులు విద్రోహ పురితమైన ఒప్పంద చేసుకున్నారు’’. అంటూ కూలీలు అవేశపడ్డారు.

            ‘‘ఇంకా నాలుగు రోజులు సమ్మె కొనసాగితే మెనేజుమెంటు అందరికి పర్మినెంటు ఫేసులు ఇచ్చేది. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని కూలీల మధ్యకు పోవాలి. నిత్యం కూలీల మధ్య తిరిగే వారి బాధలు వారికేట్లా అర్థమైతది. అంటూ వెంకటయ్య అవేదన చెందాడు.

            ‘‘లేదన్నా అందర్ని పర్మినెంటు చేసేదాక సమ్మె విరమించవద్దు’’అంటూ చంద్రయ్య అవేశ పడ్డాడు. కూలి సంఘంలో చీలిక వచ్చింది. వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగించాలని పిలుపు ఇచ్చింది.

            ఒప్పందం చేసుకున్న నాయకులు తాము చేసుకున్న ఒప్పందాన్ని సమర్థించుకోవటానికి మీటింగ్‍ పెట్టిండ్లు.

            ‘‘పోరాటం అన్న కాడ సళ్ళుబిగు ఉండాలి. మొండికేస్తే మొదటికే మోసం. అందుకే ఈ సారి 40% మందిని పర్మినెంటు ఫేసులు ఇస్తారు. మిగితావారిని దశలవారిగా పర్మినెంటు చేస్తారు’’ అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసింది.

            ‘‘అట్లా ఏమన్నా ఒప్పందం ఉందా’’ అంటూ చంద్రయ్య సభలోనే నాయకులకు ఎదురు తిరిగిండు.

            కూలీల కోపంతగ్గించటానికి నాయకులు అట్లా చెప్పుకొచ్చిండ్లు కాని వాస్తవానికి అటువంటి ఒప్పందం ఏదీలేదు.

            ‘‘ఇటువంటి దుందుకుడు చర్యలే యూనియన్‍కు నష్టం చేస్తాయి’’ అంటూ నాయకులు అవేశపడ్డారు.

            సమావేశం కాస్త రసాబసాగా మారింది. ‘‘అందరిని పర్మినెంటు చేసేదాక ఎవరు పనులు చేయవద్దు’’ అంటూ వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగిచింది.

            యూనియన్‍ విబేదాలు తారా స్థాయికి చేరింది.

            ‘‘యూనియన్‍ క్రమశిక్షణకు కట్టుబడ కుండా వ్యక్తిగత పని విదానంతో పనిచేస్తున్న వెంకటయ్య మరికొంత మందిని యూనియన్‍ బహిష్కరిస్తున్నట్టుగా అగ్రనాయకత్వం ప్రకటించింది.

            ‘‘పోరాడే వానికి వేదికలే కరువా, వాడు కాకుంటే మనమే ఒక పోటి యూనియన్‍ ఎర్పాటు చేసుకుందాం’’ అన్నాడు సమ్మెకారులు...

            అట్లా వెంకటయ్య నాయకత్వంలో మరో కూలిసంఘం అవిర్భవించింది.

            సమ్మెకొనసాగటం మెనేజుమెంటుకు ఇబ్బంది కల్గించి పోటి సంఘం ఎర్పడటం దాని నాయకత్వంలో సమ్మె కొనసాగటం అగ్రనాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాళ్ళు ఏమి చెయ్యలేక వెంకటయ్యకు రాడికల్స్ సంబందం ఉంది’’ అంటూ పోలీసులకు లోపాయికారిగ ఎగదోసిండ్లు. ఒక రోజు పోలీసులు వచ్చి యూనియన్‍ అపీసుమీద దాడి చేసి వెంకటయ్య, చంద్రయ్య మరి కొంతమందిని అరెస్టు చేసి తీసుక పోయిండ్లు. అవిదంగా సమ్మెకు నాయకత్వం లేకుండా చేసిండ్లు.  మరోవైపు పర్మినెంటు అయిన వారికి కాని వారికి మధ్యన విబేదాలు సృష్టించిండ్లు. పలితంగా సమ్మె విపలమైంది.

            ఈలోపున కుక్కమూతి పిందెల్లా చాల కార్మిక సంఘలు పుట్టుకొచ్చినవి. బిజెపి నాయకుడు, కంట్రాక్టరు అయిన రంగయ్య తన అనచరుడు లక్ష్మన్‍ను  నాయకుడుగా చేసి భారతీయ మజ్దూర్‍ సంఘ్‍ అనుబందంగా కూలి సంఘం ఏర్పాటు చేసిండు. కంది చంద్రయ్య నాయకత్వంలో కాగ్రెసు వాళ్ళు ఒక సంఘం స్థాపించిండ్లు. ఏఐటియుసి వాళ్ళు ఏఫ్‍.సి.ఐలో అపరేటర్‍గా పనిచేసే రామయ్య అనే వాని నాయకత్వంలో కూలి సంఘం పెట్టిండ్లు. ఎవని దుకాణం వానిదైంది. ఇట్లా కూలీలు చీలికలు పేలికలైండ్లు.

            ఒకప్పుడు బలంగా పని చేసిన కూలి సంఘంబలహినమైంది. వెంకటయ్య తదితరులు బయిటికి పంపిన నాయకులు ఎన్టిపిసి ఎంప్లాయి ఈలోపున ఐఫ్‍సిఐ మూత పడింది. వాస్తవానికి ఎర్పాటు చేయాటమే లోపభుయిష్టంగా జరిగింది దానికి తోడు అడుగు అడుగున అవనీతి చోటు చేసుకున్నది. టెక్నాలజీ సప్లయి చేసిన  బహుళ జాతి సంస్థలు ఇచ్చె లంచాలకు ••క్కుర్తి పడిన అధికారంలో ఉన్న పెద్దలు పనికి మాలిన, అవుట్‍డేట్‍ అయిన సెకండరీగ్రెడ్‍ టెక్నాలజీని అంగట్టారు. ఎఫ్‍సిఐ చుట్టు సింగరేణి బొగ్గు గనులున్నా, ఏఫ్‍సిక్ష్మ గోడను అనుకొని 2100మెగావాట్ల విధ్యుత్‍ ఉత్పత్తి చేసే ఎన్టిపిసి ఉన్నా, బొగ్గు కొరత వలన కరెంటు కొరత వలన సంస్థకు వందల కొట్లు నష్టాలు సంభవించింది. పలితంగా ఎఫ్‍సిఐని మూసివేసిండ్లు.

            ప్యాక్టరీ మూత పడటంతో వందలాది మంది కూలీలకు పనులు లేకుండా పోయింది. దాంతో తట్టాబుట్టా పట్టుకొని చాల మంది కూలీలు మళ్ళీ వలస పోయిండ్లు.

            ఈ అటుపొట్ల మధ్య ఒంటరి పోరాటం చెయ్యలేక వెంకటయ్య సంఘం వదులుకొని కరింనగర్‍కు బ్రతక పోయిండు.

            ఎక్కడికి పోయినా కూలిల బ్రతుకు ఇంతేనని బావించిన చంద్రయ్య లాంటి అవేశపరుడు కూలి బ్రతుకులు మారలంటే కూలిరాజ్యం రావాలని అందుకు పోరాటమే మార్గమని అడవి బాట పట్టిండు.

            వెంకటయ్యకు గతమంత గుర్తుకు వచ్చి మనసు కకావికలమైంది. ఆయన మెల్లగా పోవటానికి లేచిండు. అది చూసి నాగయ్య ‘‘సారు పోతాండ్లా’’ అన్నాడు.

            ‘‘రాజయ్యను కలిసి పోతా’’

            ‘‘ఉన్నడో లేడో’’

            ‘‘అదే’’

            ‘‘ఎంలేదు. మనిషి పుర్తిగా చాతకాకుండా అయ్యిండు’’

            ఎప్పుడన్నా గట్లనే కన్పిస్తడు కాని రెండు మూడు రోజులాయే కన్పిస్తలేడు’’

            ‘‘సరే మనొళ్ళు ఎవరన్నా కలుస్తరో చూస్తా’’ అంటూ వెంకటయ్య లేచిండు.

            ‘‘అయ్యా చిన్న పని’’ అన్నాడు నాగయ్య...

            ‘‘ఎంటీ’’ అంటూ క్షణమాగి పరిక్షగా చూసిండు వెంకటయ్య...

            ‘‘పనులు లేక కష్టమైతాంది. మీరే ఎవరికైన చెప్పి పని ఇప్పించాలి’’ అంటూ నాగయ్య నసిగిండు.

            ‘‘ఎనకట అంటే నడిచింది. ఇప్పుడు మనమాట ఎవరు వింటరు. సరే ఒపని చేస్తాం’’

            నాగయ్య అసక్తిగా చూసిండు.

            ‘‘లక్ష్మన్‍ ఇప్పుడు స్వంతంగా బిల్డింగ్‍ కట్టి పనులు చేస్తాండు కదా వానితో చెప్పుతా... ఎదో ఒకపని వాడే చూయిస్తడు. నువ్వు పొయి ఆ యాన్ని కలువు’’ అన్నాడు.

            సరే అంటూ నాగయ్య రెండు చేతులు జోడించిండు.

            వెంకటయ్య బారంగా ముందుకు కదిలిండు.

       (తరువాయి భాగం వచ్చే సంచికలో)

కూలి బతుకులు – ఏడవ భాగం 

కూలి బతుకులు ఏడవ   భాగం

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                                   7                                                                        

            ఒక రోజు పొద్దున్నె నాగయ్య కంట్రాక్టర్‍ లక్ష్మన్‍ కలువటానికి పోయిండు. ఆయన ఉండేది గోదావరిఖనిలోని మార్కెండేయకాలనీ.

            గోదావరిఖని బొగ్గు గని కార్మికులు ఉండే పారిశ్రామిక ప్రాంతం. కార్మికులు పని చేసే బొగ్గు గనులు చాల వరకు దూర ప్రాంతంలో విసిరి వేసినట్టుగా ఉండటం వలన అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే గోదావరిఖని పట్టణంలోనే ఎక్కువ మంది కార్మికులు నివాసం ఉండి డ్యూటీలకు పోయి వస్తుంటారు. కంపని క్వార్టర్‍ ఉన్నా కొద్ది మంది తప్ప మేజార్టీ కార్మికులకు దొరవు. దాంతో ఎక్కడిక కాస్తంతా ఖాళీ స్థలం దొరికితే అక్కడల్లా కార్మికులు గుడిసెలు వేసుకున్నారు. అట్లా ఇందిరానగర్‍ తిలక్‍నగర్‍, బాపుజీనగర్‍ అంటూ దేశంలోని ప్రముఖలపేరుమీద దాదాపు పాతిక ముప్పయి వాడలున్నాయి. ఇటివల ఫైవ్‍ ఇంక్లయిన్‍ మోరికి అవల వైపున కేసిఆర్‍ పేరు మీద కూడాఒక వాడ వెలిసింది.

            పట్టణంలోని చౌరస్తా మీదుగా పైకిపోతే బస్టాండు వస్తుంది. బస్టాండుకు పోయ్యేతోవలో ఎడమ వైపున రాజెష్‍ టాకీసు ఉంది. దాని ప్రక్కనుండి పోయ్యే రోడ్డు మార్కెండెయ కాలనీ మీదగా ఇంకా పైకి పోయేదుంటే మూత పడిన ఎఫ్‍సిఐకి పోతుంది. చౌరస్తాకు ఎడమవైపు రోడ్డు గోదావరిఖనిలో అతిపెద్ద బిజినెస్‍ సెంటర్‍ అయిన లక్ష్మినగర్‍కు పోతుంది. మార్కెండేయ కాలనీ మిగితా కాలనీలకంటే కాస్త బిన్నమైంది.

            ఇతర కాలనీలన్ని గుదిగుచ్చినట్టుగా ఇరుకు ఇరుకుగా మురికి మురికిగా ఉంటే మార్కెండయ కాలని మాత్రం తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. అక్కడ ఎక్కువగా కాలేజి విధ్యాసంస్థలు ఉన్నాయి. దానికి తోడు ఇటివల కాలంలో సంపన్న వర్గాలుగా ఎదిగిన వాళ్ళు రాజకియంగా ఎదిగినవాళ్ళు ఎక్కువ మంది అప్రాంతంలో ఇండ్లు కట్టుకోవటంతో దాని స్వరుపం మారిపోయింది.

            నాగయ్యకు లక్ష్మన్‍ మార్కెండెయా కాలనీలో ఉంటాడని తెలుసుకాని ఎక్కడ ఉంటడో తెలియదు. అక్కడికి పోయిన తరువాత ఎవరినైనా అడుగుతే చెప్పక పోతారా అన్న ధైర్యంతో బయలు దేరిండు. దానికి తోడు వెంకటయ్య ‘‘పొద్దున్నే ఎడుగంటటలోపు పోయ్యికలువు లేకుంటే దొరకడు పన్లపడుతడు’’ అని చెప్పిండు. అందుకే చీకటి తోని బయలు దేరి వచ్చిండు.

            కాలనీలోని ఇండ్లన్ని చాల వరకు ఇటివల కాలంలో కట్టుకున్నవి. ఏ ఇల్లుకు ఆ ఇల్లు ప్రత్యెకంగా తీర్చి దిద్దినట్టుగా ఉన్నవి. అక్కడికి కూత వెటు దూరంలోనే పికేరామయ్య కాలనీ ఉంది.కాని చాల రోజులుగా నాగయ్య అటు వూపు రాలేదు. అంత అవసరం కల్గలేదు. ఇప్పుడు చూస్తే ఇంతలో ఎంత మారి పోయింది. అనుకున్నడు.

            రోడ్డువారి న ఒక చిన్న డాబా హోటల్‍ ముందాగి ఆ హోటల్‍ అతన్ని లక్ష్మన్‍ గురించి అడిగిండు. హోటల్‍ అతను మరుగుతున్న చాయ్‍ కలుపుతూ...

            ఇక్కడ చాల మంద లక్ష్మన్‍లున్నారు ఏ లక్ష్మణ్‍’’ అన్నాడు.

            నాగయ్యకు ఒక్కక్షణం ఏం చెప్పాలో అర్థంకాక’’ అందే బిల్డింగ్‍లు కట్టి కంట్రాక్టు పనులు చేస్తడు అ లక్ష్మణ్‍’’ అన్నాడు.

            ‘‘ఎర్రగుంటడు’’ ఆయనా అన్నాడు హోటల్‍వాడు.

            వెంకటయ్య కూలి సంఘం వదిలి పోయిన తరువాత నాగయ్య లక్ష్మణ్‍ను చూడలేదు. బక్కగా పొడుగ్గా ఎర్రగా ఉండే లక్ష్మణ్‍ గుర్తుకు వచ్చి’’ అవును అయనే’’ అన్నాడు.

            ‘‘అదిగో అక్కడ కరెంటు స్థంబం ఉంది చూడు, అక్కడ కుడివైపు సంది ఉంటది. అ సందిలో రెండో ఇల్లే’’ అంటూ హోటల్‍ అతను చెయ్యెత్తి అటు వైపు చూయించిండు.

            నాగయ్య అటువైపు కదిలి సందు తిరిగి రెండు ఇల్లుకున్న గేటు ముందు నిలిచిండు. గేటు మూసేసి ఉంది. ఇదే ఇల్లు అవునో కాదో ఎట్లా తెలియాలిఅని గుంబాటన పడుతూనే అ సందిలో ఎదురైన ఓ వ్యక్తిని లక్ష్మణ్‍ ఇల్లు ఇదేనా’’ అని అడిగిండు.

            అతను అవునన్నట్టుగా తలాడించి ముందుకు పోయిండు.

            నాగయ్య చిన్నగా గేటుతోసుకొని లోపలికి పోయిండు. బయటనుండి చూస్తే పెద్దగా స్థలంలేనట్టు అన్పించినా లోపల విశాలంగా ఉంది. రెండు అంతస్థుల డాబా ఇల్లు కొత్తగా వేసిన రంగులతో మెరిసిపోతుంది.

            నాగయ్య లోపట అడుగు పెట్టెసరికి అప్పటికే తయారైన లక్ష్మణ్‍ ముందు వసార బూట్లు తొడుక్కుంటు కన్పించిండు. తెల్లటి సలువ బట్టల్లో మెరిసి పోతున్నాడు. అప్పుడెప్పుడో చూసిన లక్ష్మణ్‍ ఇప్పటి లక్ష్మణ్‍కు పోలికే లేదు. అప్పుడు చురుకైన చూపులతో బక్కగా ఉండే లక్ష్మణ్‍ ఇప••డు కాస్త వొళ్ళు చేసి నిగనిగలాడుతున్నాడు.

            నాగయ్య లోనికి వస్తున్నది కనిపెట్టి, రారా నాగయ్య చాల రోజులాయే నిన్ను చూసి అంటూ నిండుగా నవ్విండు.

            లక్ష్మణ్‍ అప్యాయంగా పలకరిచే సరికి నాగయ్యకు అంత వరకు ఉన్న బెరికి పోయింది.

            ‘‘రాట్లా కూచో’’ అంటూ లక్ష్మణ్‍ కుర్చి చూయించిండు.

            నాగయ్య వచ్చి కూచోగానే ‘‘మన్నొల్లంతా బాగున్నరా’’ అన్నాడు నవ్వుతూ...

            నాగయ్యకు ఏం చెప్పాలో అర్థంకాక అన్నాడు ముక్తాసరిగా....

            అక్ష్మయ్య ఎనకటి రోజులు తలుచుకొని ‘‘ఒక విదంగా అ రోజులే బాగుండేవి. పైసలకు కటకట లాడినా! ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండేది. డీ అంటే డీ అనేది. ఏ ఒక్కరికి అపద వచ్చినా అందరం కదిలేది. కాని ఇప్పుడేముది. ఎవనిలోకం వానిది. ప్రక్కన ఉన్నొడు సచ్చిన పట్టించుకొవటం లేదు. ఎవడో ఎట్లా సచ్చిన మనం బ్రతికితే చాలు అనుకుంటాండ్లు’’ అన్నాడు బాధగా...

            ‘‘మన సంఘంల తరిగే ఓదెలు మెన్న చనిపోయిండు తెలుసా’’ అన్నాడు మళ్ళి..

            ‘‘ఏ ఓదేలు’’

            ‘‘అదే కూలీల మీద పాటలు వ్రాసేవాడు’’

            నాగయ్యకు గుర్తుకు వచ్చింది. ఓదెలు పెద్దగా చదువుకోలేదు. కాని, ఆయన వ్రాసిన పాటలు ఎంత అద్భుతంగా ఉండేవి. కూలీల పీవితాలను వాళ్ళ అశలను అకాంక్షలను కళ్ళ ముందు నిలిపి మనసును కదిలించేవాడు. ఓదెలు సన్నని జీరగొంతులో అ పాటలుఒక్క సారి మనసులో సుళ్ళు తిరిగింది.

            ‘‘ఎట్లా సచ్చిపోయిండట’’

            ‘‘ఎట్లా సచ్చిండు అంటే ఏం చెప్పుతం పేదరికం కంటే పెద్ద రోగం ఏముది. పనులు వేవాయే... చేయ్యకుంటేనో బ్రతుకు ఎల్లదాయే ఎదో పని చేసుకుందువు రారా అన్న... నాల్గు రోజులు వచ్చిండు. మళ్ళీ ఎమైందో ఎమో పత్తలేడు’’ నేను పన్లోపడి వాన్ని పట్టించుకోలే. అన్నాడు విచారంగా...

            మళ్ళితానే ‘‘మొన్న చనిపోయిండని తెలుసి వాడు ఉండే కాకతీయ నగర్‍కు పోయిన. పోయ్యే సరికి ఏముంది. ఇంటి ముందు శవాన్ని వేసిండ్లు. వాని భార్య ముగ్గురు పిల్లలు ఒక దిక్కు ఎడుస్తాండ్లు.. దహనం చేస్తామంటే ఇంట్లో చిల్లిగవ్వలేదు. బాదేసింది. మనోల్లను విచారించి కార్యక్రమం నిర్వహించమని చెప్పి పదివేలు ఇచ్చి వచ్చిన’’ అన్నాడు కండ్లు చమర్చుగా...

            ఆ రోజుల్లో చంద్రయ్య, లక్ష్మణ్‍, ఓదేలు ఒక జట్టుగా తిరిగేది. యువకులు దేన్ని లెక్క చెయ్యని మొండితనంతో ఏ చిన్న అన్యాయం అనిపించినా ముందునిలిచే వాళ్లు. అదరి తలలో నాలుకలా ఉండే వాళ్ళు. ఏ పని పడ్డా ముందు పడే వాళ్లు.

            విచారం నుండి తెరుకొన్న లక్ష్మణ్‍ ఏం చెద్దాం కాలం అట్లా గడిచి పోయింది. చంద్రన్న లాగా అన్ని తెగించలేక పోయిన, ఓదెన్న బ్రతకలేక పోయిన కూలిపనులు చేస్తూ మెల్లగా ఇండ్లు గుత్తకు తీసుకొని పనులు చేసిన, అట్లనే ఇప్పుడు బిల్డింగ్‍లు కడుతున్న నాలుగు పైసలైతే సంసాదించిన కాని మునపటి తృప్తిలేదు’’ అన్నాడు.

            ఇంతసంపాదించిన మనిషితను చంపుకోలేని లక్ష్మణ్‍ చూసి నాగయ్యకు అశ్చర్యం అన్పించింది.

            ఉండి ఉండి లక్ష్మణ్‍ అన్నాడు కదా’’ మొన్న వెంకటన్న కన్పించనప్పుడు నీ విషయం చెప్పిండు. సరే అన్న నువ్వు వస్తవేమోనని నిన్న మొన్న చూసిన... ఇవ్వాళ వచ్చినవు’’ సరే ఏం పని చేస్తవు’’ అని అడిగిండు.

            ‘‘ఇండ్లకు ఎల్తలేదు...ఏ పనైనా చేస్తా’’

            లక్ష్మణ్‍ సాలోచనగా దృష్టిసారించి’’ పెద్ద మనిషివైనవు ఇప్పుడేం పని చెస్తవు కాని ఒకపని చెయ్యి.. ప్రగతి నగర్‍లో అపార్టుమెంటు పని నడుస్తాంది... అక్కడ వాచ్‍మన్‍ పనిచేస్తవా’’

            ‘‘చేస్తా’’

            ‘‘నెలకు అరువెలు ఇస్తా.. అరేడు నెల్లపని ఉంటది. కాకుంటే ఈ మధ్య దొంగలు ఎక్కువైండ్లు... మనం ఇట్లా కన్ను ముస్తే చాలు అట్లా వస్తువులు మాయం అవుతున్నాయి. సామన్లు పోకుంటా జాగ్రత్తగాచూసుకోవాలి. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం నీళ్ళు కొట్టాలి’’ పొద్దున్నె మెస్త్రీ యాదగిరి వస్తడు. ఆయనే అన్ని పనులు చూసుకుంటడు అ సమయంలో నువు ఇంటికి పోయి తిని మళ్ళి సాయంత్రానికి టిపిన్‍ పట్టుకొని రావాలి’’ అంటూ ఇరువై నాలుగు  గంటలు అక్కడే ఉండాలి. అందుకు నీకు ఇష్‍టమైతే రేపు పొద్దున సైట్‍ మీదికి రా. పదిగంటలకు నేను వస్తా’’ అన్నాడు.

            నాగయ్యకు అదేమహబాగ్యం అన్పించింది. ‘‘సరే’’ అన్నాడు.

            ‘‘నాకు వేరే పని ఉంది. రేపు సైట్‍ కాడకలుస్తా’’ అంటూ లక్ష్మణ్‍ తన మోటారు సైకిల్‍ స్టార్టు చేసిండు.

            ఒకప్పుడు రామగుండం మేజర్‍ గ్రామపంచాయితీగా ఉండేది తరువాత మున్సిపాట్టిగా మారింది. దానికి తోడు గోదావరిఖని, ఎన్టిపిసి టౌన్‍షిప్‍ అంత కలగలిసి పోయింది. పారిశ్రామిక ప్రాంతం విస్తరించి, జన సాంద్రత పెరిగిపోయి రామగుండంమున్సిపాల్టీ కాస్త గ్రెటర్‍ మున్సిపాల్టీగా మారిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూములకు విలువ పెరిగింది. మధ్య తరగతిజనం భూములుకొని, ఇల్లు కట్టుకోవటం అనేది గగనకుసుమం అయ్యింది. అపార్టు మెంటు కల్చర్‍ వచ్చింది.

            ఎన్టిపిసి మీదుగా గోదావరిఖనికి పోయే నేషనల్‍ హైవేకు ఎడమ వైపున మెయిన్‍రోడ్డుకు అనుకొని ప్రగతి నగర్‍ కాలని వెలిసింది. ఒకప్పుడు అక్కడంతా ఖాళీస్థలం ఉండేది కాని ఇప్పుడు అక్కడ భూముల ధరలు అగ్గయి మండుతనయి. మధ్య తరగతికి అందు బాటులో లేకుండా పోయింది. ఇప్పుడా రోడ్డులో కిలో మీటర్‍ పోతే లక్ష్మణ్‍ నిర్మిస్తున్న ప్రగతి నగర్‍ అపార్టుమెంటు వస్తుంది. అపైన ఇంకాస్త ముందుకు పోతే గొధావరినది వస్తుంది. నదికి అపార్టుమెంటుకు మధ్య దాదాపు  రెండు కిలోమీటర్ల దూరం ఉంది. భవిష్యత్‍ను పట్టణం అటువైపు కూడా విస్తరించే అవకాశం ఉంది.

            వాచ్‍మన్‍ డ్యూటిలో నాగయ్యకు పెద్దగా పని ఉండదు. కాకుంటే బిల్డింగ్‍ నిర్మాణం కోసం ఉపయోగించే సిమెంటు, ఇనుప సామాన్లు, కర్రలు వంటివి ఎవరు ఎత్తుక పోకుండా నిగరాణఉండాలి. దొంగలేమో కన్నుమతి పరిస్తే చాలు ఇనుపసామన్లు మాయం చేస్తాండ్లు. దాంతో రాత్రుల్లు దొంగల బయానికి నిదుర కాయాల్సిన వచ్చేది.

            లక్ష్మణ్‍ వాచ్‍మన్‍ ఉండటానికి ఒక గుడిసే వేసిండు. అందులో కరెంటు పెట్టిండు. మొదట్లా అగుడిసెలో ఒక వైపు సిమెంటు బస్తాలు స్టోర్‍ చేసేవాళ్ళు, కాని అటు తరువాత గ్రౌండ్‍ప్లోర్‍ స్లాబ్‍ పడిన తరువాత సిమెంట్‍ బస్తాలను అక్కడ నిలువ చేయటం మొదలైంది. దాంతో అంత వరదాక సామన్లతో ఇరుగ్గా ఉన్న గుడిసే కాస్త విశాలమైంది.

            పొద్దున పనొల్లు వచ్చే వరకు అక్కడ ఉండి, పనిస్టార్టు అయిన తరువాత మెస్త్రీ యాదగిరికి చెప్పి ఇంటికి బయలు దేరివస్తడు. వచ్చి స్నానం గిట్లా చేసి ఇంత అన్నం తిని టిఫిన్‍ పట్టుకొనిపోతే మళ్ళి మరునాడే ఇంటికి వచ్చేది.

            మొదట్లో శాంతమ్మ ‘‘ఏపనోఎమో పోయిన గుత్తా మళ్ళి రేపటి దాక కన్పించేది లేదాయే’’ అంటూ సణిగింది. ఎందుకంటే నాగయ్య పనిలకు పోయిన తరువాత రోజంతా అమె ఒక్కతే ఉండాలి. పోనియ్‍ ఆమె కూడా పోయి అక్కడే ఉందామంటే పిల్లగాడు (శ్రీను) ఉండే వానికి వండి పెట్టాల్నా.. ఈయన వచ్చెసరికి తిండికి ఎర్పాట్లు చేయాల్నాయే దాంతో ఆమె సతమతమైంది.

            ‘‘పనిపాట లేక ఇంటికాడ ఉండి ఏంచేస్తా... ఆ ఉండేది ఎదో అక్కడే ఉంటే రోజుకు రెండు వందలు ఇవ్వబట్టె’’ అన్న నాగయ్య మాటలు శాంతమ్మకు నిజమే అన్పించింది. పైసలు లేకుంటేనెమో ఎల్లుతలేదాయో.. శ్రీనుకు వచ్చె ఎనిమిది వేలు ఎటు సరిపోతలేవు. దాంతో ఆమె సర్దుకపోయింది.

            కాలం గడిచే కొద్ది నిర్మాణపు పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు వందలాది మంది కూలీలు వచ్చి పనిచేస్తాండ్లు. యాదగిరి మెస్త్రీ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు. కంట్రాక్టరు లక్ష్మణ్‍ రోజు పొద్దుమాపు వచ్చి పనులు చూసుకొని పోతాడు. అట్లా వచ్చినప్పుడు ఒక్క సారన్న కనిపించకపోతే ఎట్లా అనుకొని నాగయ్య ఇప్పుడు ఎక్కువ సమయం సైట్‍కాడే ఉంటున్నాడు. లక్ష్మణ్‍ వచ్చినప్పుడు మొఖం చాటేసుకోకుండా లక్ష్మణ్‍ మంచిగ పలుకరిస్తరు. అట్లాపలరించే సరికి నాగయ్యకు ఎంతో ఉత్సాహం అన్పించేది. దాంతో ఆయన పని బాగా ఉంటే ఒక్కొక్కసారి ఇంటికి కూడా పోకపోయేది. అటువంప్పుడు అ తిండి వ్యవహరాలేవో కంట్రాక్టరే చూసేవాడు. ఎప్పుడైనా ఇంటికి పోయినా అక్కడ ఎమైతాందోనని తొందరగా తిర్గి వచ్చేవాడు.

            పని జోరందుకొని స్లాబ్‍ మీద స్లాబ్‍ పడేసరికి వాటికి నీళ్ళు కొట్టెపని కూడా ఎక్కువై క్షణం రికామిలేకుండా పోతుంది. దానికి తోడు దొంగలు కూడా తెలివి మిరిపోయి ఎదన్న ఎమరు పాటు ఉంటే చాలు.. ఎదో ఒకటే మాయంచేస్తాండ్లు. అటువంటి ఒకటి రెండు సంఘాటనలు జరిగిన తరువాత ఒసారి లక్ష్మణ్‍ మందలించిండు కూడా...

            దాంతో నాగయ్య ఎక్కువ సమయం సైట్‍ మీదే ఉండి పోవల్సి వస్తుంది.

            నాగయ్య ఒక రోజు ఉదయం ఇంటికి వచ్చే సరికి వాళ్ళ ఇంటికి నాల్గిండ్ల అవల జనం గుమికూడి ఉన్నారు.

            ‘‘ఎమైంది’’ అని భార్యను అడిగిండు.

            ‘‘ఆదినారయణ రాత్రి చనిపోయిండు’’ అంది...

            ‘‘అయ్యో ఎట్లా’’

            ‘‘ఎట్లా అంటే ఏం చెప్పుతం.. వాడికి తాగుడు తప్ప వేరే లోకం లేకపాయే... ఎం తిన్నడోలేదో... ఏ రాత్రి సచ్చిండో ఎమో పొద్దున్నే ఎవరో చూసే సరికి మనిషికట్టె సరుసుక పోయిండు.’’

            ఇంట్లోకి అడుగు పెట్టకుండానే నాగయ్య అటువైపు నడిచిండు.

            మనసులో ఎన్నో అలోచనాలు...సికే రామయ్య కాలనీలో చావులు కొత్తకాదు. తిండి లేక మలమల మాడి సచ్చే వాళ్ళు పనులు లేక సచ్చేవాళ్ళు ఒకరా ఇద్దరా! బొగ్గు బంకర్‍ కాడ పనిచేసే చిన్నులాల్‍ అంత ఇరువై ఎండ్ల యువకుడు బొగ్గు వాని ఊపిరితిత్తులను తినేసింది. టి.బి. లాంటి రోగమెదో వచ్చి నవిసి నవిసి చనిపోయిండు. బ్రతుకు దామని ఎక్కడి నుంచో వచ్చిండు. కాని చచ్చిన తరువాత వాని శవం అయిన వాళ్ళకు చేరలేదు. ఇక్కడే అందరు కలిసి బొందపెట్టిండ్లు. అంత్మరాం మిల్లు మూత పడ్డ తరువాత బ్రతుకు తెరువు లేక చాల మంది అకలి చావులు సచ్చిండ్లు. యువకుడైన అనంద్‍ ఉరేసుకున్నాడు. శివరావు, పోలారపు రాజు ఇలా ఎంతో మంది తమ కండ్ల ముందే అర్థంతరంగా చనిపోయింది గుర్తుకు వచ్చి మనసుకు బాదేసింది.

             ఆదినారాయణ శవం ఇంటి ముందున్న యాపచెట్టు క్రింద చాప పరిచి అందులో పండుకోబెట్టి పాత దుప్పటి ఒకటి కప్పిండ్లు. ఎప్పుడు చనిపోయిండో ఎమో కాని కండ్లు బూసులు తెలి మనిషి పచ్చబారి పోయిండు. దూరం దూరంగా నిలుచున్న అడోళ్ళు కొంగు మూతికి అడ్డం పెట్టుకొని దు:ఖంచిండ్లు...

            రెండు రోజులాయే మనిషి ఎప్పుడోస్తాండో ఎప్పుడు పోతండో కన్పించలేదు’’ పొద్దున చూస్తేఇంకేముంది కట్టె సరుసక పోయిండు. అంటూ పక్కంటి అవిడ కండ్లలల్లో నీరు తీసుకున్నది.

            రాంలాల్‍ను సమీపించిన నాగయ్య ‘‘ఎట్లా జరిగిందే’’ అని అడిగిండు.

            రాంలాల్‍ విషాదంగా చూసిండు.

            ‘‘పొద్దున చూసినోళ్ళు మనిషి ఉలుకు లేదు పలుకు లేదు అంటే ఓ పొల్లగాన్ని ప్రసాద్‍ డాక్టరు దగ్గరికి పంపించిన అయిన వచ్చి చూసి ఏప్పుడో అయిపోయింది ప్రాణం అన్నాడు’’

            కాలనీలో ఎవరిక ఏ ఆపద వచ్చిన రోగం వచ్చినా పెద్దదిక్కు ప్రసాద్‍ డాక్టర్‍. ఆయన ఆర్‍.యం.పి చెసిండు. కాలనీలోని జెండా గద్దె కాడ చిన్న రేకుల షెడ్డుతోనే ఆయన దావఖాన. పొద్దు మాపు అక్కడ రోగులతో కిటకిటలాడుతుంది. ఆయన ఎవరిని ఇంత ఇవ్వమని అడుగడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటడు. ఇయ్యకున్న ఎమనడు. తనకు వచ్చిన విద్యతో ఆయన ఇంకెక్కడైనా ప్రాక్టీస్‍ పెట్టుకుంటే నాల్గు పైసలు సంపాదించుకునే వాడు కాని ఆయన అట్లా చెయ్యలేదు. ఏదిక్కు లేని వాళ్ళకు సేవ చేయటమే లక్ష్యంగా పికే రామయ్య కాలనిలో ప్రాక్టీసు పెట్టిండు. ఆయన అక్కడి వారికి వైద్యము చేయటమే కాదు. వాళ్లకు ఏ అపదవచ్చిన మీదేసుకొనే వాడు.

            ప్రసాద్‍ డాక్టర్‍ ప్రక్క ఇంటి ముందు ఒక కుర్చిలో కూచొని ఉన్నాడు. ఆయన చుట్టు జనం గుమికూడి ఉన్నారు.

            ‘‘తాగుతే సచ్చిపోతవురా అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. మన ముందే సరే అంటడు. కాన ఎప్పటి అటె అడుతడు’’ అంటూ ఎవరికో చెప్పుతున్నాడు.

            ‘‘ఎదైనా పెద్ద హాస్పటల్‍కు తీస్కపోతే బ్రతికే వాడేమో’’ అన్నారు ఒకరు...

            ‘‘అది చెప్పిన నీకు వీలుకాకుంటే నేనే తీస్కపోతనన్నా రేపు మాపు అంటడు కాని కదలడు’’ అన్నాడు డాక్టర్‍. అయన గుండ్రటి మొఖంలో విషాదం అలుముకొన్నిది.

            ‘‘ఇంతకు వానికేమైంది సార్‍’’ అని అడిగిండో యువకుడు...

            ‘‘బాగా తాగే సరికి లివర్‍ ఖరాబు అయింది. తాగుడు బందు పెట్టి మందులు వాడితే నయం అయ్యేది’’ కాని వాడు వినలేదు. తాగుడు బందు చెయ్యలేదు’’

            తలో మాట మాట్లాడుతున్నారు.

            విషయం తెలిసి సత్తయ్య వచ్చిండు. శవాన్ని చూసి దు:ఖం అపుకోలేక పోయిండు.

            ‘‘తాగుడింట్ల మన్నుబొయ్య... కల్లు సీసా అగుపించందంటె పిచ్చి లేసేది కుక్కల మందు ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తదో’’ అంటూ ఒక నడీడు ఆడామే తిట్టి పోసింది.

            ‘‘చూస్తాంటే పొద్దు పొతలేదా అయ్యే పనేదో చూడాలి’’అన్నాడు రాంలాల్‍ రెండు చెతులు వెనక్కి కట్టుకొని...

            ‘‘వాని పెండ్లాంకు కబురు చేసిండ్లా’’

            ‘‘పొద్దున వెంకటేశం తాళ్ళపల్లికి పంపించినం. వాడింకా రాకపాయే... వాడు వచ్చెదాక చూద్దాం’’ అన్నాడు మరో పెద్ద మనిషి...

            అది నిజమే అన్పించింది. ఈలోపు శవాన్ని చూసి పోయేవాళ్ళు చూసి పోతాండ్లు. పనులకు పొద్దుపొతందని మరి కొంత మంది వెళ్ళి పోయిండ్లు. కొద్ది మంది మాత్రం మిగిలి పోయిండ్లు.

            చావు ఎట్లా చేసుడు అన్న సమస్యవచ్చింది. ఇంట్లా ఏమన్నా ఉన్నాయోనని వెతికిండ్లు. కాని ఇల్లంతా వెతికిన ఎర్రపగాణి దొరకలేదు. కొన్ని బోళ్లు పాత పడి పోయిన బట్టలు చిరికి మంచం తప్ప ఏం కనిపించలేదు.

            ‘‘ఏం చెద్దాం’’ అన్నారోకరు...

            ‘‘మున్సిపాల్టీ వాళ్లకు చెప్పితే’’ అంటూ ఉచిత సలహ ఇచ్చిండు ఒకరు...

            సత్తయ్య అందుకు ఓప్పుకోలేదు. ‘‘మంచో చేడో ఇంత వరదాక మనతోని బ్రతికిండు... అనాద శవంలా వాన్ని అట్లా వదిలేస్తామా మనమే ఎదో ఒకటి చెద్దాం’’ అన్నాడు.

            ప్రసాద్‍ డాక్టర్‍ ‘‘అదే మంచిది’’ అన్నాడు.

            అందరు ఒక నిర్ణయానికి వచ్చి ఆదిలక్ష్మి వస్తుందోనని ఎదురు చూస్తుండి పోయిండ్లు.

            చావు కబురు చేర వేయాటానకి పోయిన వెంకటేశం మధ్యాహ్నం వెలకు ఒక్కడే తిరిగి వచ్చిండు.

            ‘‘ఎమైంది’’ అని అడిగారు జనం అత్రంగా...

            వెంకటేశం మొఖంలో విషాదం అలుముకున్నది. ఆయన మెల్లగా చెప్పసాగిండు.

            ‘‘నేను పోయి చెప్పెసరికి ఆదిలక్ష్మి దు:ఖం అపుకోలేక మీద పడి ఏడ్చింది. ఆమె రావటానికి తయారు అవుతుంటే ఆమె అన్న దమ్ములు ఏముందని పోతవు... వాడు నిన్ను ఏం సుఖం పెట్టిండని పోయి ముండమోస్తవు.. వాడు మాదృష్టిలో ఎప్పుడో సచ్చిండు. సచ్చినోడు సచ్చినట్టే పోనియ్‍’’ అంటూ ఎదురు తిరిగిండ్లు’’

            ‘‘పాపం ఆదిలక్ష్మికి రావాలనే ఉండేకాని వాళ్ళు దాన్ని రానియ్యలే... ఇక లాబం లేదని చూసిచూసి వచ్చెసరికి ఈయాల్ల అయ్యింది’’ అంటూ చెప్పుకొచ్చిండు.

            భర్త చనిపోయిండని తెలిసి రాలేదంటే అదేమి మనిషి అని కొందరు దాన్ని ఏసుఖ పెట్టిండని వస్తది అని మరికొందరు తలో తీరుగా అనుకున్నారు.

            ఆదినారాయణ తల్లి దండ్రుల వైపునుండి ఒకరిద్దరు చుట్టాలు వచ్చిండ్లు. ఆయన తల్లి దండ్రులు లేరు. తమ్ముడు ఉన్నాడు కాని వాడు ఎక్కడికో బ్రతక పోయిండు. వాని అడ్రసు తెలియలేదు.

            జనమే తలింత వేసుకొని రైల్వెకట్టకు ఉన్న స్మశాన వాటికకు తీసుక పోయ్యిండు.

            శవయాత్ర ఊరు దాటే దాక వెంట పోయిన నాగయ్య... మళ్ళీ పనికి పోవాలనే తొందరలో వెనక్కి వచ్చిడు. అన్నం ముందు కూచున్న నాగయ్యకు ముద్ద మింగుడు పడటంలేదు. తాపతాపకు ఆదినారాయణ మొఖం గుర్తుకు రాసాగింది. ఎప్పుడు పెద్దయ్య పెద్దయ్య అంటూ అప్యాయంగా పలకరించేవాడు. మంచి పనోడు ఉండే అంతా పాతికేండ్లకే వని కథ ముగిసింది. అనుకున్నడు బాదగా...

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

 

కూలి బతుకులు – ఎనమిదవ భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                       8

            ఒక రోజు దిలీప్‍ క్వారికి పోయి నాన్నకు టిఫిన్‍ ఇచ్చి తిరిగి వస్తుంటే తోవలో మూసేసిన బాల కార్మికపాఠశాల వద్ద తన ఈడు వారైన పిల్లలు ఆటలు అడుతు కన్పించిండ్లు. అ ప్రయత్నంగానే దీలిప్‍ అటువైపు కదిలిండు.

            సునీల్‍ పొద్దంతా తిరిగి చిత్తుకాగితాలు ఎరుకొని వచ్చివాటిని అమ్మి అంతో ఇంతో సంపాదించి కుటుంబానికి సహయంగా ఉంటాడు.

            కూలీల పిల్లలు చాల మందికి చదువు సంద్యలులేవు. స్వతంత్య్రం వచ్చి ఇన్నెండ్లు గడిచిన పిల్లలకు చదువు అందని కుసుమమే అయింది.

            ఊరు రామగుండంలో ప్రభుత్వ స్కూలు ఒకటి కాని, పిల్లలు అంత దూరం పొయ్యిరావటం కష్టం. దానికి తోడు తల్లి దండ్రులు ఇద్దరు పనులు చేస్తేకాని పొట్టగడవని పరిస్థితిలో కాస్త పెద్ద పిల్లలు ఇంటికాడ ఉండి, తనకంటే చిన్న పిల్లలను చూసుకోవటమో, వంటకు అవసరమైన కర్రలో, బొగ్గులో ఎరుకరావటమో నీళ్ళుతేవటం వంటి పనులు చేస్తరు. కాస్త రెక్క ముదిరిన పిల్లలు ఎదో పనిలోకి పోతారు. క్యారీలల్లో హోటల్లలో ఇటుక బట్టీలల్లో చిన్న చిన్న వర్క్షాపుల్లో పనులకు కుదురు కుంటారు. లేకుంటే బుజానికి సంచులు వేలాడ వేసుకొని చిత్తుకాగితాలు ఇనుపసామన్లు ఏరుకుంటానే పొట్ట గడుపుతారు... ఎవ్వని శరీరంలో చటాకు మాంసం ఉండదు... అకలితో బరించక పోయిన మొఖలతో కంతలు తేలి బక్కచిక్కి ఉంటారు.

            సునీల్‍ తన చిత్తుకాగితాల సంచిని ప్రక్కన పడేసి కిరణ్‍తో గోలీలాటకు దిగిండు. సునీల్‍ ముందు కిరణ్‍ నిలువలేక పోతున్నాడు. తెచ్చుకున్న గోలీలన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అ సమయంలో దీలిప్‍ కన్పించే సరికి కిరణ్‍కు ప్రాణంలేచి వచ్చింది.

            ‘‘అరేయ్‍ దిలీప్‍ నావంతు నువ్వు అడరా’’ అంటూ దీలిప్‍ను బ్రతిమిలాడిండు.

            దిలీప్‍ బెట్టుగా ‘‘నేను ఆడను’’ అన్నాడు.

            ‘‘అదే ఎందుకు’’

            ‘‘అది అంతే’’ అంటూ దిలీప్‍ మూతి బిగించిండు. కాని కిరణ్‍ చేతిలో మిలమిల లాడుతున్న నీలం రంగులో మెరిపోతున్న గోలీలను చూసి మనుసు ఉబలాట పడుతున్నా బింకానికి పోయిండు. అందుకు కారణం పోయి ఆదివారం సంతలో కిరణ్‍తో జరిగిన లొల్లి దిలీప్‍కు గుర్తుకు వచ్చింది.

            ప్రతి ఆదివారం ఎన్టిపిసి రోడ్డుకు ఇరువైపులా సంత జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఊర్లనుండి కూరగాయలు అమ్మెటోళ్ళు వస్తరు. చీకటి పడేవేల వరకు అమ్ముకొని, పాడుబడి పోయి, పనికి రాని కూరగాయలు ఎమన్న ఉంటే తిరిగి తీసుక పోలేక పారబోసి పోతారు.

            అట్లా పారబోసిన కూరగాయల కోసం కూలి జనం ఎగబడుతారు. అందులో కాస్త మంచివి ఏరుకొని వచ్చి శుభ్రం చేసుకొని వండుకుంటారు.

            పోయిన ఆదివారం సంతలో పారబోసిన కూరగాయల చెత్తలో దిలీప్‍ వేలు పెట్టి వెతుకుతుంటే, పొపాటున వదిలేసిన క్యాబేజీ ముక్క ఒకటి కంట పడింది. దాన్ని ఇట్లా తీసుకోబోతుంటే ప్రక్కనే ఉన్నా కిరణ్‍లటుటకున దానిన అందుకొన్నాడు.

            ‘‘అదినాది నేను వెతుక్కుంటుంటే నువ్వోచ్చి తీస్కున్నవు’’ అంటూ దిలీప్‍ జగడానికి దిగిండు.

            ‘‘లేదు నేనే ముందు చూసిన అదినాదే’’ అంటూ కిరణ్‍ నిర్లక్ష్యంగా బదులిచ్చిండు.

            అట్లా ఇద్దరి మధ్య కొట్లాట మొదలైంది. అది చూసిన మాలిక్‍ బిహరీ వచ్చి వారిద్దరిని విడదీసి ‘‘మళ్ళి తన్నుకుంటే మీ ఇద్దరి వీపులు సాపు చేస్తా’’ అంటూ బెదిరించి ఎటోళ్ళను అటు వెళ్ల గొట్టిండు.

            దిలీప్‍కు అనాటి సంఘటన గుర్తుకొచ్చి బింకానికి పోయిండు.

            ‘‘వాడు ఆడుతే భయపడటానికి ఇక్కడెవ్వరు అడోళ్ళులేఉద’’ అంటూ సునీల్‍ సవాల్‍ వసిరిండు. దాంతో దిలీప్‍ రోషం పొడుచుకొచ్చింది.

            ‘సరే ఆడుచుద్దాం’’ ంటూ కిరణ్‍ చేతిలోని గోలీలు తీసుకొని ఆటు దిగిండు.

            దిలీప్‍ ఆట ముందు సునీల్‍ నిలువలేక పోయిండు. అంత వరదాక గెలుచుకున్న గోలీలన్ని పొగొట్టుకకునే సరికి కోపం వచ్చి తొండికి దిగిండు.

            ‘‘నేను నీలం చెప్పలే పలపిట్ట గోలీ చెపినా’’ అన్నాడు సునీల్‍...

            ‘‘లేదు నీలం గోలి చెప్పినవు ఇవన్ని నావే’’ అంటూ దిలీప్‍ మొండిగా బదులిచ్చిండు.

            అవసరమైతే తన్నులాటకైనా సిద్దమే అన్నట్టుగా ఉంది. సునీల్‍ దోరణి. వానితో కొట్లాడి గెలువటం కష్టం అని బావించిన కిరణ్‍...

            ‘‘నువ్వు తోండి ఆడుతనవు’’ అన్నాడు...

            ‘‘కాదునువ్వె తొండి’’ అన్నాడు సునీల్‍ మొండిగా...

            ‘అయితే మళ్ళీ ఆడుదాం’’ అంటూ దిలీప్‍ రాజీ మార్గం చూయించిండు.

            ‘సరే ఆడుఅంటూ సునీల్‍ మళ్ళీ ఆటకు దిగిండు ఇంతలో చక్రదర్‍, దెవరాజు వచ్చిండ్లు. చక్రదర్‍ చేతిలోని ప్లాస్టిక్‍ సంచికేసి కిరణ్‍ ఆశగా చూసి అందులో ఏముందిరాఅని అడిగిండు.

            చక్రదర్‍కు పదమూడేండ్లు. తండ్రి చనిపోయిండు. తల్లి కూలి పనిచేస్తది. చక్రదర్‍ రామగుండం ప్రాంతంలోనే అత్యంత అధునిక మైన అమూల్యబార్‍ అండ్‍ రెస్టారెంటులో రాత్రులు పనిచేస్తడు. నిరంతరం నీళ్లలో నానటం వలన వాని రెండు చెతివెళ్ళు చెడిపోయి పుండ్లయినవి.

            ‘‘ఏముందో చెప్పుకో’’ అంటూ చక్రదర్‍ రెండు చేతులు వెనక్కి పోనిచ్చి సంచిని దాచి ఊరించిండు.

            ‘నాకు తెలుసులేఅన్నట్టుగా దిలీప్‍ కండ్లు చికిలించి ‘‘తినేది ఎంటో తెచ్చినవు’’ అన్నాడు.

            చక్రదర్‍ నిజమే అన్నట్టుగా కిలకిల నవ్వి సంచితెరిచిండు. అవి రాత్రి పనిలో నుండి వస్తూ తెచ్చిన మిగిలిపోయిన అహారపదార్థాలు. అందులో ఉండలా ఉన్న ఒక్కదాన్ని తీసి దిలీప్‍ చేతిలో పెట్టి ‘‘తిని ఏమిటో చెప్పు’’ అన్నాడు.

            మిగితా వాళ్ళు అశగా చూసిండ్లు.

            దిలీప్‍ లటుక్కున నోట్లో వేసుకొని నములుతూనే ఎమో బాగుందీఅంటూ మళ్ళీ ఇంకోదాని కోసం చెయ్యి సాచిండు.

            చక్రదర్‍ అటువంటిదే తలోకటి ఇచ్చిండు.

            దేవరాజు బొమ్మలు ఎగరేసి బాగుందే’’ అన్నాడు.

            ‘‘అవి చికెన్‍రోల్స్’’ అంటూ చక్రదర్‍ బొమ్మలెరేసిండు.

            ‘మరి అదేమిటిఅంటూ సునీల్‍ సంచిలోకి తొంగి చూసిండు.

            చక్రదర్‍ సంచిలో చెయ్యిపెట్టి ప్రైయ్‍ చేసిన చికెన్‍లెగ్స్ బయిటికి తీసిండు. అది సగంతిని వదిలేసినవి. ప్లెట్లు కడిగెటప్పుడు వాటిని దాచిపెట్టి తెచ్చిండు. తలా ఒకటి ఇచ్చి తానోకటి తీసుకున్నడు.

            ‘‘వాళ్ళకు తినటం కూడా చేతకాదు’’ అన్నాడు చక్రదర్‍..

            ‘‘ఎంతో రుచిగా ఉన్నయ్‍ ఎందుకుతినరు’’అంటూ దిలీప్‍ అశ్చర్యపోయి అడిగిండు.

            ‘‘అసలు వాళ్ళకు ఆకాలి ఉంటే కదా.. ఇంక తాగి నోల్ల సంగతి చెప్పకు..పైసలంటే వొళ్ళకులెక్క ఉండదు.

            ‘‘ఒక ప్లెట్‍ చికన్‍ ధర ఎంతో తెలుసా?’’ అంటూ బొమ్మలు ఎగరెసిండు చక్రదర్‍...

            ఎవరు చెప్పలేక పోయిండ్లు.

            ‘‘నూటఅరువై’’ అంటూ చక్రదర్‍ తానే సమాదానం చెప్పిండు.

            ‘అబ్బో నూట అరువైయా’’ అంటు కిరణ్‍ నోరెల్ల బెట్టిండు.

            ‘‘ఒక్కరి కూలి’’ అన్నాడు దేవరాజ్‍..

            ‘‘గట్ల పైసల మొఖం చూసేటోళ్ళు ఎవరు అక్కడికి రారు... పెద్దపెద్ద కార్లు వేసుకొని బాయి దొరలు, కంట్రాక్టర్లు, రాజకీయనాయకులు, అలుకంగా పైసలు సంపాదించేటోళ్ళె వస్తరు’’ అన్నాడు చక్రదర్‍...

            చక్రదర్‍ తెచ్చిన సంచి మొత్తం కాళీ చేసిండ్లు.

            ఎర్రటి ఎండ దంచికొడ్తాంది. ఒళ్లంతా చీదర చీదరగా ఉంది.

            ఉండిఉండి చక్రదర్‍ ‘‘నాతో చెఱువుకు ఈత కొట్టెందుకు వచ్చేది ఎవరు’’ అంటూ అందరి మొఖంలోకి చూసిండు.

            చెఱువులో ఈత అనే సరికి అందరికి ఊషారు ఎత్తింది. నేను వస్తాను అని అందరు బూడిద చెఱువు కేసి బయలు దేరిండ్లు.

            క్రషర్‍ నగర్‍కు ఎగువన బూడిద చెఱువు ఉంది. ఎన్టిపిసిలో ప్రతి సం।।రము దాదాపు పది మిలియన్‍ టన్నులబొగ్గు కాలుస్తరు. పెద్దపెద్ద చిమ్నిలు నిరంతరం బొగ్గుపులుసు వాయువులను అకాశంలోకి చిమ్ముతు ఎటు పది ఊళ్ళపెట్టు వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. నిరంతరం వెలువడి పొగ, దుమ్ముల వలన వర్షకాలంలో యూసిడ్‍ వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి.

            ఎన్టిపసిలో కాలిన బొగ్గు బూడిదను నీళ్ళతో కలిపి బూడిద చెఱువులోకి మళ్ళిస్తరు. ఈ పక్రియ ఎండ్లకు ఎండ్లుగా సాగటం వలన ఒక్కడి వాతావరణం అంతా సన్నటి బూడిద పేరుక పోయింద. ఎండ కాలంలో ఎండకు ఎండి, గాలి దుమారం వచ్చినప్పుడు లేచిన బూడిద దుమ్ము చుట్టు ప్రక్క ప్రాంతాలను అక్రమిస్తుంది. బూడిద చెఱువు చూట్టూర ఎటు చూసిన కనుచూపు మేర చెట్టు చేమ, ఇండ్ల అంత బూడిద వర్ణంలోకి మారిపోయినవి.

            పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపినందుకు కాను రామగుండం ఎన్టిపిసి అనేక సార్లు జాతీయస్థాయిలో బహుమతులు గులుచుకున్నది. కాని ఎన్టిపిసి నిర్మాణానికి భూములు ఇచ్చి బ్రతుకు కోల్లోపయిన చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల మొఖం మీద మాత్రం బూడిద పోసింది. అ కలుషిత బ్రతికే జనం ఊహించని రోగాలతో చనిపోవటం సర్వసాదారణమైంది.

            యాస్‍ ప్లాంటు దిగువన గుడిసెలు వేసుకొని నివసించే క్వారీ కూలీలకు, బయట నీళ్ళు దొరకక అ బూడిద చెఱువులోనే స్నానపానాదులు బట్టలు ఉతుక్కోవటం చేస్తుంటారు.

            నాథురాం వృద్దుడు. ఎనుబై ఎండ్లకు పైబడి ఉంటాడు. క్రషర్‍ నగర్‍లో అంత వయసువరకు బ్రతికిన వారు అరుదు. ఆయన కొడుకు ఇతూరాం కొడలు భగవతి వొడ్డరి  పని చేస్తరు. మనుమళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. నాథురాంది దుర్గుజిల్లా ఆయన అక్కడ చాల కాలం వ్యవసాయ చేసిండు. భార్య చనిపోయిన తరువాత ఒంటరివాడై కొడుకు పంచన చేరిండు.

            పొద్దంతా ఎండ చిటపటలాడించింది. ఉక్కపోతలో ఊపిరి సలుపనిస్తలేదు. చమటతో ఒళ్ళంత చిదర చీదరగా ఉంది. స్థానం చెద్దామంటే ఇంట్లో నీళ్లులేవు. అక్కడ కసికడు తోడుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకుంటాండ్లు జనం.

            స్నానం చేసి వద్దామని మాసిన బట్టలు పట్టుకొని చెతకర్ర పుణుక్కుంటూ బూడిద చెఱువుకు వచ్చిండు.

            బూడిద చెఱువు ఒక ప్రక్క ఎండిపోయి బూడిద వర్ణపు మైదానంలా విశాల పరుచుకుంది. వెడుగాలలకు బూడిద సుడులు సుడులుగా లేస్తూ అకాశంలోకి ఎగ చిమ్ముతుంద.ఇ ఒక వైపున చెఱువు కట్టకు దిగువన నీళ్ళు పేరుకపోయి ఉన్నాయి. అక్కడున్న ఒక బండరాయి మీద నాథురాం బట్టలు ఉతుక్కుంటుంటే పిల్లలు స్నానికి వచ్చిండ్లు.

            బట్టలు విడిచేసి బిలబిల మంటూ వచ్చి పిల్లలు నీళ్ళలోకి దునికే సరికి నీళ్ళన్ని బురద బురదైనవి. నాథురాం కోపం వచ్చి ‘‘అరేయ్‍ నీల్లను బురద చెయ్యకుండ్లిరా’’ అంటూ అరిచిండు.

            కాని అమాట లేమి పిల్లలు విన్పించుకోవటం లేదు.

            బయట ఎండ వేడికి మురికి నీరే అయినా ఎంతో చల్లగా ఉన్నాయి. దేవరాజ్‍ నీళ్ళలో చాపలాగా ఈదుకుంటూ పోయిండు. అది చూసి చక్రదర్‍ బడబడ మంటూ కాళ్ళు తాడించుకుంటూ ఈతకు దిగిండు. కిరణ్‍కు ఈతరాదు. సునీల్‍కు ఎదో కొద్దిగా వచ్చు ‘‘ఈ పొరగాండ్లు చెప్పితే వినేట్టులేదు’’ అంటూ నాథురాం కోపంతో విసుక్కుంటూ ఉతికిన బట్టలను అరేసుకోవటానికి గట్టు మీదికి పోయిండు.

            చక్రదర్‍ తపతప కాల్లాడించుకుంటూ కాస్త ముందుకు పోయి అక్కడ అడుగున ఉన్న  బండ మీద నిలుచున్నడు.

            ‘‘ఇటు రండిరా ఇక్కడ ఎక్కువలోతులేదు’’ అంటూ కేకేసిండు.

            దేవరాజ్‍ ఈదుకుంటూ అటూ వైపు సాగిండు.

            ‘‘నేను వస్తున్నా’’ అంటూ సునీల్‍ కదిలిండు. అతన్ని అనుసరిస్తూ కిరణ్‍ కూడా బయలు దేరిండు.

            ఒడ్డున ఉన్న నాథురాం అది చూసి ‘‘అరేయ్‍ పిల్లలు అటు పోకుండ్లిరా అక్కడంత బురద ఉన్నది’’ అంటూ కేకేసిండు.

            కాని పిల్లలు ఆయన మాటలేమి పట్టించుకోలే...

            ‘‘అరేయ్‍ మీకేరా చెప్పేది.. అటు పోకుండ్లీ అక్కడంతా బురద ఉంది. బురదలో కూరుక పోతారు’’ అంటూ గట్టిగా అరిచిండు.

            అ మాటలేమి పట్టించుకోకుండానే సునీల్‍ నీళ్ళలో ముందు అడుగు వేసిండు. కిరణ్‍ అతన్ని అనుసరించిండు. నాలుగు అడుగులు వేసిండో లేదో సునీల్‍ బురుదలో కూరక పోతు ప్రక్కనే ఉన్నా కిరణ్‍ చెయ్యిని అసరగా అందుకున్నాడు. మరునిముషంలో ఇద్దురు మునిగిపోయిండ్లు.

            చక్రధర్‍ దిలీప్‍ ఒక్కసారే అది చూసిండ్లు.

            ‘‘మునిగి పోతాండ్లు... మునిగిపోతాండ్లు’’ అంటూ ఎడ్పు గొంతుతో చక్రధర్‍ పెద్దగా అరిచిండు.

            దిలీప్‍ ఒక్క క్షణం కూడా అలస్యం చెయ్యకుండా వాళ్లు మనిగిన దిక్కు ఈదుకుంటూ పోయి కిరణ్‍ జుట్టు అందుకొని బయిటికి లాగిండు. వెంటనే దేవరాజ్‍ చక్రధర్‍ అందుకొని ఒడ్డుకు చెర్చిండ్లు.

            అది చూసి నాథురాం పెద్దగా అరుచుకుంటూ చెఱువు కట్టమీదకి వచ్చి ‘‘అయ్యో పోరగాండ్లు మునిగి పోతాండ్లు’’ మునిగిపోతాండ్లు అంటూ సహయం కోసం చుట్టు చూసిండు.

            సరిగ్గా అసమయంలోనే చెఱువు కట్టమీద ట్రాక్టర్‍ ఒకటి పరుగున రావటం గమనించి దానికి అడ్డంపోయిన నాథురాం అపమన్నట్టు చెతులు రెండు బారచాపి ‘‘పొరగాండ్లు చెఱువుల మునిగి పోయిండ్లు’’ అంటూ దాదాపు ఎడుపు గొంతుతో అరవసాగిండు.

            లోడు కోసం క్వారికి పోతున్న శ్రీను నాథ్‍రాం అరుపులకు ట్రాక్టర్‍ అపి ‘‘ఎమైంది’’ అన్నాడు అథుర్దగా...

            ‘‘అదిగో అక్కడ చెఱువుల పిల్లలు మునిగిపోయిండ్లు’’అన్నాడు.

            చక్రధర్‍, దన్‍రాజ్‍ భయంతో ఎడుస్తూ పరుగునవచ్చి ‘‘అన్నా అక్కడ’’ అంటూ చెఱువు వైపు చూయించిండ్లు.

            శ్రీను క్షణం అలస్యం చేయకుండా ట్రాక్టర్‍ దిగి చెఱువు వైపు పరుగుత్తెండు. ఆయన వెంట అందరు పరుగు పెట్టిండ్లు.

            చక్రధర్‍, వెలెత్తి చూయిస్తూ అన్నా అక్కడ’’ అన్నాడు.

            శ్రీను బట్టలైన విప్పకుండా నీల్లలో దుమికిండు. ఆయన్ని అనుసరిస్తూ చక్రధర్‍,రన్‍రాజు కూడా నీళ్ళలోకి దిగిండ్లు...

            నీళ్ళలో మునిగి పోతున్న సునీల్‍, కిరణ్‍లను కాపాడటానికి ప్రయత్నించిన దిలీప్‍ కిరణ్‍ను బయిటికి లాగి, సునీల్‍ను అందుకోవటానికి చెయ్యి చాచిండు. కాని అప్పటికే నీళ్ళు మింగిన సునీల్‍ దీలిప్‍ చెయ్యి అందుకొని గట్టిగా వాటేసుకున్నాడు. దాంతో దిలీప్‍ కాళ్ళు చేతులు అడకుంటా అయిపోయి ఇద్దరు నీటమునిగిండ్లు.

            శ్రీను కాసేపు  నీళ్ళలో పిల్లలకోసం అటు ఇటు వెతుకు లాడిండు. చివరికి ఒక చోట పిల్లలు దొరికిండ్లు. చక్రధర్‍, దేవరాజ్‍ సహయంతో శ్రీను వాళ్ళను బయటకి తీసుక వచ్చిండ్లు. కాని అప్పటికే పిల్లలు నీళ్ళు మింగి ఊపిరాడక చనిపోయిండ్లు.

            దీలిప్‍ సునీల్‍ శవాలను చూసి చక్రధర్‍, దనరాజ్‍, కిరణ్‍ బెదిరిపోయి పెద్దగా ఎడ్వసాగిండ్లు.

            ముక్కు పచ్చలారని పిల్లల శవాలను చూసి శ్రీనుకు దు:ఖం అగలేదు.

            ‘‘కాస్త ముందైతే పొరగాండ్లు బ్రతికేటోళ్లు’’ అన్నాడు అవేదనతో...

            ‘‘ఆడికి నేను చెప్పుతూనే ఉన్నా, అటు పోకుండ్లిరా అని’’ కాని నామాట వినలేదు. నేను చూస్తుండగానే పిల్లలు పిడాత ప్రాణం పోయింది’’ అన్నాడు నాథురాం దు:ఖ పడుతూ...

            విషయం తెలిసి జనం పరుగున వచ్చిండ్లు దీలిప్‍ తండ్రి దేవ్‍కు కబురు పంపిండ్లు. సునీల్‍ వాళ్ళ తల్లి ండ్రులు వచ్చిండ్లు ఎడ్పులు అరుపులతో అక్కడ వాతావరణం గంభీరమైంది.

            దేవ్‍కు విషయం తెలిసి నెత్తి నోరు కొట్టుకుంటూ పరుగున వచ్చిండు. పిల్లవాని శవం మీద పడి హృదయ విదారకంగా రోదించిండు. అతన్ని అపటం ఎవరి తరం కాలేదు.

            ‘‘భార్య చనిపోయిన తరువాత పొల్లగాన్ని చూసుకుంటూ బ్రతుకుతాండు. ఉన్కొక్క పిల్లగాడు పాయే... పాపం ఎట్లా బ్రతుకుతడు’’ అంటూ చూడవచ్చిన జనం కన్నీరు కల్చిండ్లు.

            పోలీసులు వచ్చి శవాలను పోస్టు మార్టంకు పంపిండ్లు.

            ‘నిశద్ద ప్రాంతంలోకి పోయిన పిల్లలు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిండ్లు. కావున అందుకు తమతప్పు ఏమి లేదంటూ ఎన్టిపిసి మెనేజుమెంటు తేల్చి చెప్పింది.

            ఎప్పటిటా కేసు ఎటు తేలలేదు. బూడిద చెఱువు లోకి, బూడిద కలిసిన నీళ్ళు ఎప్పటిలా వచ్చి చేరుతూనే ఉంది. దిగువన నివసించే క్రషర్‍ నగర్‍ వాసులు ఎప్పటిలాగే బూడిద చెఱువులో స్నానపానాదు నిర్వహించుకుంటూనే ఉన్నారు. అంతయదవిధిగా ఎమి జరుగనట్టుగానే జరిగిపోతున్నది.

            అ సంఘటన ను కాళ్లరచూసిన శ్రీను కొన్ని రోజుల దాక మనిషి కాలేక పోయిండు.

            కొడుకు చనిపోయిన తరువాత దేవ్‍కు జీవితం మీద ఆశపోయింది. కొన్ని రోజులకే అతను క్రషర్‍నగర్‍ వదిలేసి ఎటో పోయిండు.

 

(తరువాయి భాగం వచ్చే సంచికలో )

కూలి బతుకులు – తొమ్మిదవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                         9

            రాఘవపూర్‍ రోడ్డును అనుకొని చాల ఇటుకబట్టీలున్నాయి. అందులో అందరికంటే పెద్ద షేర్‍ అన్వర్‍ఎంత లేదన్నా మూడు నాలుగు వందల మంది కూలీలు ఆయన క్రింద పని చేస్తారు.

            ఇటుక బట్టీలలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలకు కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చి తెచ్చుకుంటారు. అవిధంగా ఆయన దగ్గర అటు రాజనందగల్‍ నుంచి ఇటు చత్తీస్‍ఘడ్‍ నుండి వచ్చిన కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కుటుంబాలతో సహా ఇంటిల్లి పాది పనిచేస్తరు. మట్టి పిసికి, వెయ్యి ఇటుకలు చేస్తే ఇంత కూలి అని వాటిని బట్టీలో కాలుస్తే ఇంత అని లెక్క ఉంటుంది. దాంతో ఎంత పని చేసుకుంటే అంత కూలి గిట్టుబడి దాంతో అడమగ పిల్లలు అనకుండా పనిచేస్తరు. మగవాళ్ళు మట్టి పిసికి సాచేం ద్వారా ఇటుకలు పోస్తె ఆడవాళ్ళు పిల్లలు వాటిని ఒక పద్దతి ప్రకారం అరపెడ్తరు. బట్టి నాలుగైదు రోజులు మండి ఇటుకలు తయారైతవి.

            ఇటు బట్టీల వ్యాపారం మొదలు పెట్టిన తరువాత అన్వర్‍ అర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. ఇండ్లు కట్టుకునే వాళ్ళె కాకుండా గవర్నమెంటుకు సంబందించిన నిర్మాణపు పనులకు కూడా అన్వర్‍ ఇటుక సప్లయి చేస్తడు. అవిదంగా ఆయన ఆ వ్యాపారంలో అందరి కంటే ముందున్నడు. మనిషి చూడటానికి బారి అకారం కాని మెత్తటి మనిషి కూలీల మంచి చెడ్డలు చూడటంలో ఇతర కంట్రాక్టర్ల కంటే మెరుగు.

            ప్రతిరోజు పొద్దున్నే వచ్చి వ్యవహరం చూసుకుంట కనకాచారి ఆయన వద్ద గుమస్తా... చాల వరకు వ్యవహర మంతా కనకాచారే చూసుకుంటడు. అరువై ఎండ్ల పైబడిన పెద్ద మనిషి... దొతి, పొడుగు చెతుల అంగి చేతులు సగాని మడుచుకొని, జెబులో మడిచిన కాగితాల కట్ట పెట్టుకొని ఎప్పుడు ఎవరు ఏదీ అడిగిన టక్కున జెబులోని మడిచిన కాగితల్లో విప్పి లెక్కలు చెప్పుతాడు. మనిషి బక్కగా ఉన్న ఉషారుగా ఉంటడు.

            కొత్తగా పెర్చిన ఇటుక బట్టిని కాల్చటానికి బొగ్గు లేదు అనే విషయం కనకాచారి షేఠ్‍ దృష్టికి తెచ్చిండు.

            అన్వర్‍ ఇటుక బట్టీలు కాల్చటానికి అవసరమైన బొగ్గుకు సింగరేణి నుండి పర్మిట్‍ తీసుకున్నాడు. కాని అది ఏమూలకు సరిపోదు. దాంతో చాటు మాటుగా దొంగ తనంగా బొగ్గును సప్లయి చేసేవారిని అశ్రయించక తప్పెదికాదు. వాళ్ళెమో బొగ్గు ట్రాన్స్పోర్టు చేసే కంట్రాక్టర్లను సియస్టి కాడ పనిచేసే కంపిని అధికారులను పోలీసుల పట్టుకొని లారీలకు లారీలు బొగ్గు మాయం చేసి అక్రమ వ్యాపారం చేస్తే వాళ్ళు కాని ఇటివల కంపినోడు కొంత స్ట్రిక్ట్ చేసేసరికి వ్యాపారం మునుపటిలా జరుగటంలేదు. బ్రతుకు తెరువు లేక దొంగ తనంగా బొగ్గు తెచ్చి అమ్మే చిల్లర దొంగల వద్ద నుండి కూడా బొగ్గు సేకరించి అమ్ముతరు. కాని అది ఏములకు సరిపోతలేదు.

            ‘‘పాషాకు ఇవ్వాళ రాత్రికి పంపిస్తమన్నరు’’ అన్నాడు కనకాచారి వినయంగా... ఇటుకలుకాల్చటానికి బొగ్గుతో పాటు ఉనుక కూడా వాడుతారు. అందుకోసం చుట్ట ప్రక్కల రైస్‍ మిల్లులో దొరికే ఉనుకతో పాటు జమ్మికుంట వంటి దూర ప్రాంతాల నుండి కూడా లారీలల్లో ఉనుక తెప్పిస్తరు. బట్టీలలో కెవలం ఉనుకే వాడితే చప్పున మంటలేసి తొందరగా చల్లారుతిది. ఉనుకతో పాటు బొగ్గు చుర వాడితే బట్టి బట్టి అగి అగి కాలటమే కాకుండా ఇటుకలు బలంగా తయారైతవి.

            ‘‘ఎమైనా ఇయ్యలా బట్టి పెట్టాలి’’ నేనోసారి పాషాతోఓ మాట్లాడుతా..నువ్వు మాత్రం అలస్యం చెయ్యకు అనుకున్న సమయానికి ఇటుక సప్లయి చెయ్యకుంటే మాట పోతది’’ అన్నాడు అన్వర్‍ సాలోచనగా దృష్టి సారించి.

            మంచిగా సీజన్‍ సడుస్తుందని అనుకొని ఒక సంఘటన జరిగి ఇటుక బట్టీలు పదిహెను రోజులు బందైనవి.

            పూర్ణచందర్‍ అనే ఇటుక బట్టీ కంట్రాక్టర్‍ తన క్రింద పనిచేసే పదిహెనెండ్ల అమ్మయి మీద బలత్కారం చేసిండు. దానిపై ఎద్ద లొల్లి జరిగింది. కూలీలు పనులు బందు పెట్టిండ్లు. కేసు పోలీసుల దాక పోయింది. ఇటుక బట్టి యజమానులందరికి పెద్ద దిక్కయిన అన్వర్‍ కల్పించుకొని ఎవరికి ముట్ట చెప్పాల్సింది వారికి ముట్టచెప్పి చివరికి ఆ అమ్మయి కుటుంబానికి కొంత నష్టపరిహరం ఇప్పించి చివరికి కేసును ఎక్కడిది అక్కడ సర్దుబాటు చేసిండు.

            అ లొల్లి అట్లా సద్దుమనిగిందో లేదో ఇటుక బట్టీలలో బుగ్గి అయిపోతున్న బాల్యం అంటూ ఒ పత్రిక విలేఖరి వ్రాసిన కథనం మరో దుమారం లేపింది. హక్కుల సంఘం వాళ్ళు వచ్చి విచారణ చేసిండ్లు. లొల్లి పెద్దది అయ్యే సరికి పోలీసులు లేబర్‍ డిపార్టుమెంటు వాళ్ళు వచ్చి ఇంక్వరీ చేసిండ్లు. బాలలో పని చేయిస్తున్నారని కొంత మంది మీద కేసులు పెట్టిండ్లు మరి కొంత మంది బాల కార్మికులను విముక్తం చేసి వారివారి ఎరియాలకు పంపించినంఅంటూ అధికారులు హడావిడి చేసిండ్లు.

            ‘‘మేము ఎవరిని బలవంతం చేయ్యటంలేదు. ఏ పిల్లగాండ్లను తీసుక వచ్చి పనులు చెయించటం లేదు. ఇటుక బట్టీలల్లో పని చెయ్యటానికి కుటుంబలకు కుటుంబాలు వస్తయి. కుటుంబంలో ఆడమగ పిల్ల జెల్లా అనకుంటా అందరు పన్జేస్తరు. పనులు చేసినందుకు లెక్క ప్రకారం పైసలు చెల్లిస్తంఅంతే తప్ప ఎవరికి ఏ అన్యాయం చేయటం లేదు’’ అన్నాడు యజమానులు.

            ‘‘ఇయ్యం అధికారలు వచ్చి బాల కార్మికులను విముక్తం చేసి వాళ్ళలోని పనులు బందు పెట్టిచి వాళ్ళును వాళ్ళ వాళ్ల ఊళ్ళకు పంపిండ్లు. వాళ్ళతో పాటు కొన్ని కుటుంబబాలు వెల్లిపోయినవి. కొద్ది మంది మిగిలిండ్లు ఇక వాళ్ళతోని ఏం పనులు సాగుతయి’’ దీనికంటే ఈ వ్యాపారం మూసేసుకుంటేనే బాగుంది’’ అన్నాడు మరోకరు.

            ‘‘కూలీలు ఉండటానికి వసతి ఉండాలి. వారికి తిండి ఉండాలి, నీళ్ళు ఉండాలి. రోగమొస్తే మందులుండాలి. అంటూ అధికారులు చాల చెప్పుతాండ్లు. అదంతా సాధ్యమా  సీజన్లో జరిగే వ్యాపారం... వర్షకాలం వస్తేబందేనాయే..అటువంటి కాడ రూల్స్ ప్రకారం అది ఉండాలి ఇది ఉండాలంటే అయ్యే పనేనా... వాళ్ళు చెప్పినట్టు చేస్తే నెత్తిన గుడ్డవేసుకొని పోవాలి’’అన్నాడు మరోకరు..

            ‘‘వీళ్ళు ఇంతగనం చెప్పుతాండ్లు కదా! మనప్రక్కనే సింగరేణి కంపిని ఉంది. ఎన్టిపిసి ఉంది. అందులో పర్మినెంటు కార్మికుల కంటే కంట్రాక్ట కూలీలే ఎక్కువ మంది పని చేస్తాండ్లు. వాళ్ళకు ఏమన్నా రూల్స్ వర్తిస్తాయా? ఒక గవర్నమెంటు కంపినిలోనే దిక్కు దివాణం లేకుంటే అధికారులు ఏం చేస్తాండ్లు’’ వారితో పోల్చితే మనమొంత’’ అంటూ మరోకరు రుసరుసలాడిండు. అందరిని సమాదాన పరిచిన అన్వర్‍ స్థానిక ఎమ్మెల్యేను పట్టుకొని అంత సర్దుబాటు చేసేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

            ఇప్పుడిప్పుడే ఇటుక బట్టీలపని జోరందుకున్నది. కాని బొగ్గుకొరత ఎర్పడి మళ్ళి అవాంతరం వచ్చి పడింది.      

            తులసి ఇటుక బట్టీలో పని కుదిరింది కాని కూలి వాళ్ళు బ్రతుకు ఎక్కడికి పోయినా ఏడే మానికలు అన్నట్టుగా ఉంది. తులసి ట్రాక్టర్‍ మీద కూలి ఇటుక బట్టీల కాడి నుండి ఇటుకలను లోడు చేసి కొనిపోయి అవసరమైనా కాడ అన్‍లోడు చేసి రావాలి. రోజు మూడు వందల కూలి పొద్దున్నె టిఫిన్‍ పట్టుకొని వస్తే మళ్ళి ఏ సాయంత్రమో ఇంటికి వెళ్ళెది.

            తులసి క్వారీలో పనిచేసినప్పుడు ఆమె తో పాటు పిల్లలు కూడా పనిచేసేవాళ్ళు. చిన్న చేతులతో బండల సైజులను ఎరేవారు క్రసర్‍ బెల్టు జామ్‍ కాకంఉడా చూసేవాళ్ళు. క్రషర్‍ నుంచి నిరంతరం వెలువడే బూడిద వర్ణపు దుమ్ములోనే గంటల కొద్దిసమయం పనిచెయాల్సి వచ్చేది. పిల్లలు నెత్నిన కట్టుకున్న గుడ్డలు, మొఖం వేసుకున్న బట్టలు మొత్తం కూడా తెల్లటి దుమ్ముతో నిండి పోయేది. చివరికి వాళ్ళకను రెప్పలు కూడా బండల దుమ్ముతో తెల్లబడేవి.

            ఇక్కడ ఇటుక బట్టీలల్లో బాల కార్మికుల పరిస్థితి  మరోరకంగా ఉంది. పెద్దవాళ్లు మట్టి పిసికి సాంచెల ద్వారా ఇటుకలు తయారు చేస్తే పిల్లలు అట్లా తయారైన వాటిని తీసుకపోయి ఒకచోట ఎండకు అరబెట్టడం బట్టీలల్లో ఇటులు పెర్చినప్పుడు వాటిని అందించటం వంటి పనులు చేసేవాళ్ళు..

            ఎక్కడెక్కడో విసిరి వేసినట్టుండే ఇటుకబట్టీల కాడ పిల్లలకు చదువు కోవటానికి ఏ వసతులు ఉండవు. మరి చిన్న పిల్లలైతే అక్కడే అ మట్టిలోనే ఎక్కడైతే ఇటుక బట్టీలు నడుస్తాయో అక్కడ తత్కాలికంగా చిన్న చినన్న గుడిసెలు వెలిసేవి. అక్కడే తిండి తిప్పలు అన్నీను. నీళ్లకు నిప్పులకు గోస అయ్యేది.

            వాటికి తోడు ఇటుకలు కాల్చిటం కోసం బట్టీల నుంచి నిరంతరం ఒక విదమైన వాసనతో ఊపిరి సలుపనిచ్చెది కాదు.

            క్రషర్‍ నగర్‍లో కూలిల పరిస్థితి మరింత అద్వన్నంగా ఉందంటే, ఇటుక బట్టీ కార్మికులు ఉండే ప్రాంతల పరిస్థితి మరింత అద్వనంగా ఉండేది.

            పొద్దం పనిచేసిన కూలీలు సాయంత్రమైతే చాలు దగ్గరలో ఉండే ఏ కల్లు బట్టీలకో చెరుకునేవాళ్ళు. దానికి తోడు చాటుమాటుగా గుడంబా అమ్మేవాళ్ళు కూడా తయారైండ్లు.

            ఎండకాలంలో నిర్మాణపు పనులు జోరుగా సాగుతాయి. దాంతో రోజు ఐదారు ట్రిప్‍లు తిరుగాల్సి వచ్చేది. రోజంతా ఎండలోపని, దూర ప్రాంతంలో ఎక్కడో అవసరమైన చోట చేరవేయటం మళ్ళీ వచ్చి ఇటుకలు లోడు చేయటం ఇదే పని. మధ్యలో ఓ గంట మాత్రం తిండి కోసం అగేది.

            తులసి కాకుండా ఇంకో ముగ్గురు కూలీలు ట్రాక్టరు మీద పనిచేస్తున్నారు. ఒక రోజు అన్నాలు తినే వేళ తోటి కూలి అయిన పుష్ప ‘‘ఏ పిల్ల వయస్సు మీద పడ్తాంది పెండ్లి ఎప్పుడు చేసుకుంటానవు’’ అంది సరదాగా...

            తులసి ఏం బదులు ఇవ్వకండా నవ్వి ఊరుకున్నది.

            ‘‘పెండ్లి అంటే మాలా పిల్లగాడు దొరకవద్దా’’ అంది మరోకూలి కొమురక్క....

            ‘‘పిల్లగాండ్ల కేంకొదవ...నువ్వు ఊ అను నేనే మంచి పిల్లగాన్ని తీసుకవాస్త’’అంది పుష్ప నవ్వుతూ...

            ఆ ప్రక్కనే సద్ది తింటున్న ట్రాక్టర్‍ డ్రైవర్‍ వెంకటశం ‘‘ఆ పిల్ల చేసుకుంటానంటే నేను లేనా’’ అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ... వెంకటేశం సరదా మనిషి.. ఇప్పుడిప్పుడే చెవుల పొంటి సన్నగా జుట్టు నేరుస్తుంది.

            ‘‘‘ఆ నువ్వా’’ అంటూ పుష్ప దీర్ఘం తీసింది.

            ‘‘నాకేమి తక్కువ’’ అన్నాడు వెంకటేశం బింకంగా...

            ‘‘కూసుంటే లేవవత్తలేదుఉన్న దాన్ని ఎలుకోనటానికే నీకు చతనైతలేదు కాని నీకు ఇంకోతి కావాలా’’ అంది.

            శంకరునిలా ఇద్దరిని ఏలుకుంటా’’ అంటూ బడబడ నవ్విండు వెంకటేశం...

            ‘‘నీకు ఆ అదొక్కటే తక్కువైంది’’ అది కొమురక్క...

            ‘‘ఎమైంది ముచ్చట్లు చాలించి బయలు దేరేది ఉందా... బసంత్‍నగర్‍ కాడికి ఇటుక తీస్కపోవాలి.... పోన్ల మీద పోన్లు వస్తానయి’’ అంటూ మెస్త్రీ కనకాచారి కేకేసిండు.

            గగబ మూతులు తుడుచుకొని పనిల పడ్డరు.

            తులసి ఇటుకలు మోస్తుందన్న మాటే కాని అలోచనలు ఎక్కడో తిరుగుతున్నాఇ.

            ఇంట్లా తల్లి దండ్రులు తులసి పెండ్లికి తొదర పడుతున్నరు.

            ‘‘అయింత నా ప్రాణం పోయ్యేలోపు బిడ్డ పెండ్లి చెయ్యాలి’’ అన్న పట్టుదల మీదున్నడు తులసి తండ్రి పరదేశిరాం...

            ఒక రోజు ఆదివారం నాడు గజానంద్‍ పరదేశిరాం ఇంటికి వచ్చి కూచొని చాల సేపు మంచి చెడ్డలు విచారించి చివరగా ‘‘మా గోపాల్‍కు పెండ్లి చెయ్యలనుకుంటాన’’ అంటూ ప్రస్థావన తెచ్చిండు.

            రెండు కుటుంబాల వాళ్ళు ఒరిస్సా నుండి బ్రతక వచ్చిండ్లు. ఇద్దరిది రాజనందగాం జిల్లాయే కాకుంటే ప్రక్కపక్క ఊరు అందరు ఒకే సారి రావటం చాలకాలం కాలిసి పని చెయటం వలన దగ్గరి పరిచాయాలున్నావి.

            ‘‘మంచిదే కదా... పిల్లలు ఎదిగిన తరువాత వాళ్ళకంటూ ఒక కుటుంబం ఎర్పడితే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతరు’’ అన్నాడు పరదేశి... మనసులో ఏమూలో మాత్రం గోపాల్‍కు తులసిని అడగక పాయే అన్న అలోచనైతే ఉంది కాని బయట పడలేదు.

            గజనంద్‍ మాట పొడగించిండు’’ ఎక్కడో దూరం పోయి సంబందాలు చేసుకోవటం కంటే తెలిసిన సంబందం చేసుకుంటే మంచిది కదా’’ అన్నాడు.

            గజనంద్‍ ఏం చెప్పుతున్నడో అర్థం కాక నిజమె అన్నాఅంది ఈశ్వరిబాయి.

            ‘‘చల్ల కొచ్చి ముంద దాచటమెందుకు చెల్లే మనం మనం ఒక్కటి మా గోపాలఖు తులసిని అడుగుదామని వచ్చిన’’ అన్నాడు నిండుగా నవ్వుతూ...

            అ మాట వినే సరికి భార్య భర్తలకు ఇద్దరికి సంతోషమైంది. ఇంటి ముందుకు వచ్చిన సంబందం ఎట్లా కదంటారు. అందులో తెలిసిన వాళ్ళు.. అది కాదని వేరే ఎక్కడో సంబందాలు చూసే ఓపికా కాని, అవకాశం కాని లేదు. దాంతో ఈశ్శరిబాయి’’ అంత కంటే మహబాగ్యం ఏముంటది’’ అంది సంతోషంగా...

            పరదేశిరాం కూడా సంతోషమైంది.ఎదిగిన పిల్లను ఇంటి మీద ఎన్ని రోఓజులని పెట్టుకుంటం.. ఏ అయ్య చెతిలోనైనా పెట్టి బారం దించుకోవాలని చాల రోజులుగా అలోచిస్తున్నాడు. కాని కట్న కానుకల విషయంలో ఏం అడుగుతారో అన్న సందేహం మాత్రం వెంటాడింది. దాంతో ఆయన నాకెమో కాళ్ళు చేతులు అడకుంటా అయింది. ఎదో ఇట్లా బ్రతుకుతానం... పెండ్లంటే మాటలా’’ అన్నాడు.

            పరదేశం మాటల్లోని అంతరార్థం గ్రహించిన గజానంద్‍ ‘‘అ విషయంలో నువ్వేమి బాధ పెట్టుకోకు మిముల్ని బాధ పెడ్తె మాకేం సంతోషం. ఏం పట్టుకొని వచ్చినం.. ఏం పట్టుకొని పోతాం.. ఉన్నంతలో ఎవరికి ఇబ్బంది కలుగకుండా పెండ్లీచేస్తం... చేరో కష్టం చేసుకొని వాళ్ళే బతుకుతరు’’ అని బరోస ఇచ్చి వెళ్ళి పోయిండు.

            తులసి తల్లి దండ్రులకు అసంబందం నచ్చింది. కాని తులసికి గోపాల్‍ను చేసుకోవటం ఇష్టం కల్గటం లేదు. గోపాల్‍కు ఏ మాత్రం చదువు సంద్యలేదు. చదువులేక పోతే పోయింది. చేసే బండ పనైనా సరిగా చెయ్యాడు. మూడు రోజులు చేస్తే నాల్గురోజులు పని బందు పెడ్తడు.  జులాయిగా తిరుగుతడు... వాని దోస్తులు కూడా అటు వంటి వాళ్ళె సినామాలు షికార్లు తప్ప వేరే జాస ఉండదు. దానికి తోడు తాగుడు అ మధ్యన ఒక్క రోజు తప్పతాగి రోడ్డు ప్రక్కన పడిపోతే చూసినవాళ్ళు ఎవరో చెప్పితే గజానంద్‍ పోయి ఇంటికి తీసుకొని వచ్చిండు. మనిషి చూడటానికి కూడా ఎమంత బాగుండడు. బక్కగా పొడుగ్గా పీక్క పోయిన మొఖం,దానికి తోడు పిట్ట గూడు లాంటి జుట్టు. ఏ విదంగా చూసిన తులసికి గోపాల్‍ పట్ల ఇష్టం కలుగటం లేదు.

            గజానంద్‍కు మాత్రం పెండ్లి చేస్తే బరువు బాధ్యతలు తెలిసి వచ్చి దారిలోకి వస్తాడనే ఆశ. అందులో తులసి వంటి చదువుకున్న పిల్ల బుద్దిమంతురాలును కోడలుగా చేసుకుంటే బాగు పడ్తడనే అలోచన ఉంది. అందులో తెలిసిన సంబందం...

            ఎదో విదంగా పిల్ల పెండ్లీ చెయ్యలనే తల్లి దండ్రుల అరాటం చూసిన తరువాత తులసి అవునని కాని కాదని కాని చెప్పలేక పోయింది. ఇటు మాత్రం పెండ్లి ప్రయత్నలు మొదలు పెట్టిండు.

            తులసి ఆలోచనలో నుండి తురుకోక మందే ట్రాక్టర్‍ బసంత్‍ నగర్‍కు వచ్చేసింది. రెండు మూడు సందులు తిరిగి కొత్తగా కడుతున్న ఒక బంగ్ల ముందు ట్రాక్టర్‍ అపని వెంకటేశం... ఆ వెంటనే ‘‘తొందరగా దిగుండ్లీ పని అయిపోవాలి. మళ్ళీ ఓ ట్రిప్‍కు రావాలి’’ లేకుంటే మెస్త్రీ ఊకోడు’’ అంటూ కేకే సిండు.

            ట్రాక్టర్‍ దిగిన కూలీలు ఇటుకలు అన్‍లోడు చేస్తుండగానే ట్రాక్టర్‍లో పని చేస్తున్న తులసిని చూసి ఒకింత అశ్చర్యపోయిండు. చాలా రోజుల తరువాత ఆమెను చూడటంతో మనసు ఉద్విగ్నత చెందింది.

            పని తొందరలో పడిపోయిన కూలీలు ఒకరు తట్టలో ఇటుకలు పేర్చి ఇస్తుంటే మరికొందరు వాటిని తీసుకపోయి ఒక వరసలో పేరుస్తున్నారు.

            తులసి శ్రీనును చూసి చిన్నగా పరిచయపుర్వకంగా నవ్వింది.

            ‘‘బాగున్నావా’’ అని అడిగిండు శీను మొఖం విప్పారంగా...

            ఆమె చిన్నగా నవ్వుతూనే ఆ అంటూ తెచ్చిన ఇటుకలును ఒక వరుసలో పెర్చసాగింది.

            ‘‘నాన్నకు ఎట్లాఉంది’’ అన్నాడు మళ్ళీ..

            ‘‘పర్వాలేదు ఆయన పని ఆయన చేసుకుంటాండు’’

            అంటూనే తట్ట పట్టుకొని ట్రాక్టర్‍ కాడికి నడిచింది.

            రికామిలేని పనితో తులసితో మాట్లాడ టానికి వీలు చిక్కటం లేదు. ఆమెతో మాట్లాడాలని శీను మనసు ఉబలాట పడసాగింది.

            రామిన అన్‍లోడు చేసి కూడా శ్రీను తులసితో మాట్లాడాలనే ఆశతో ఇంకా అక్కడే నిలబడి పోయిండు.

            చూస్తుండగానే ఇటులు అన్‍లోడు అయింది’’ వెంకటేశం మళ్ళీ బయటు దేరటానికి ట్రాక్టర్‍ స్టార్ట్ చేసిండు.

            శీను గబగబ తులసి వద్దకు పోయిండు.

            ‘‘రేపు ఆదివారం సెలవుకదా’’

            తులసి తలాడించింది.

            ‘‘రామగుండాల కాడ జాతర జరుగుతాంది వస్తవా’’ అన్నాడు...

            ‘‘ఎందుకు’’ అంది తులసి కండ్లు పెద్దవి చేసి...

            ‘‘ఊరికే చూసి వస్తామని’’ శ్రీను గొంతు తడబడింది.

            తులసి జవాబు ఏం చెప్పక ముందే వెంకటేశం ఎక్కుండ్లీ ఎక్కుండ్లీ’’ అని అరవసాగిండు. మారు మాట్లాడ కుండా ట్రాక్టర్‍ ఎక్కిన తులసి ‘‘రేపు ఎన్నింటికి’’ అంది.

            ‘‘ఉదయం’’ పదిగంటలకు’’ అంటూ సంతోషంగా అరిచిండు.

            ఎవరి అలోచనల్లో వాళ్ళు ఉండిపోయిండ్లు.

            శ్రీను ట్రాక్టర్‍ తోలు తున్నాడన్న మాటేకాని మనసు గాలిలో తెలిపోతుంది. తులసి అందమైన మొఖం పదేపదే గుర్తుకు రాసాగింది. చిన్నప్పుడు కలిసి చదువుకున్న రోజుల్లో శ్రీను కొద్దిగా బెరికి ఉండే వాడు. తులసి చలాకిగా బడబడ మాట్లాడేది. దానిక తోడు క్లాసులో మంచిగా చదివేది కాబట్టి తోటి విద్యార్థులే కాదు టీచర్లు కూడా అదరణ చేసే వాళ్ళు మంచి తెలివైంది. చదివు సాగేదుంటేఅందరిని మించి పోయ్యేది. కాని ఏం లాబం ఆమె అద్భుతమైన తెలివితేటలకు బీదరికం వల్ల అగిపోయింది. తరవాత ఎవరి దారి వారిది అయిపోయిన తరువాత ఎప్పుడైన ఒక్క సారి అలా మార్కెటలోనో, బజారులోనో ఎదురుపడి పలుకరించేది. మంచిచెడు మాట్లాడేది. ఆమోతో మాట్లాడుతుంటే శ్రీనుకు సమయం తెలిసేదికాదు. ఇంకా మాట్లాడలని అనిపించేది. చిన్ననాటి అ మధురమైన బావనలు అలాగే మనసులో పదిలమైనవి. యవ్వనంలోకి వచ్చిన తరువాత అ అలోచనలకు రెక్కలు తొడిగి కొత్త లోకాల్లో విహరిస్తుంది. ఇటివల తులసికి పెండ్లి సంబందం చూస్తున్నారని తెలిసిన తరువాత అతని మనసు మరింత అరాటపడింది. ఎదో ఒకట తెల్చుకో లేకుంటే తులసి దక్కదనే బావన ఏర్పడింది.

            తులసి అలోచనలు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయి. అంతకు ముందు పెండ్లీ గురించి ఆమెకు అలోచనలు లేకుండే కాని ఎప4డైతే ‘‘గోపాల్‍’’తో పెండ్లి సంబందం దాదాపు కాయంకావటం ఆమె మనసు ఎటు తెల్చుకోలేక డోలాయిమౌన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ‘‘ఎందుకు పిలిచిండు.’’ అనే అలోచనలతో సతమతమైంది.అ ప్రయత్నంగానే అమె మనసులో ఎవో మధుర బావనలు చోటు చేసుకోసాగినవి.

            ఆదివారం రోజురానే వచ్చింది. పొద్దున్నె తలంటూ స్నానం చేసి ఉన్న వాటిలో మెరుగైన బట్టలు కట్టుకున్నది. మనసులో ఎదో అలజడి మాటి మాటికి రోడ్డు వైపున చూస్తున్నది. ఆమె అరాటం కనిపెట్టిన తల్లి ఈశ్వరిబాయ ‘‘పొద్దున్నె ఎక్కడికే తయారైనవు’’ అంది.

            ‘‘ఏం లేదమ్మ ఇవ్వాళ సెలవుకదా అని తలారస్నానం చేసిన’’ అంటూ ఎదో సర్ధి చెప్పింది. ఈశ్వరిబాయి పెద్దగా పట్టించుకోలేదు.

            పొద్దు ఎంతకు గడుస్తున్నట్టుగా లేదు. మాటిమాటికి వీదిలోకి చూస్తుండి పోయింది. వీదిలో దూరంగా శ్రీను మస్తున్నది కనిపెట్టి ‘‘అమ్మనేను ఇప్పుడే వస్తా’’ అంది.

            ‘‘ఎక్కడికే’’ అంటూ అమ్మఅడిగిన మాట విన్పించుకోకుండా ‘‘మళ్ళి ఇప్పుడే వస్తా’’ అంది.

            రాముని గుండా కాడికి సెలవు రోజున జనం వస్తూంటారు. ఆ రోజున పుజారి వస్తడు. ఆ రోజున తప్ప మిగిత రోజుల్లో పెద్దగా జనం ఎవరు రారు కూడా వీలున్న చోట అక్కడక్కకడ కూచొని కుటుంబాలతో సహ ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలను అప్పటికే అరగిస్తూ మరికొంత మంది ఉన్నారు. కొంత మంద యువకులు దేవుని గుడికి కాస్త దూరంలో ఒ పెద్ద బండరాయి నీడలో కూచోని మందు పార్టీ ఎర్పాట్లు చేసుకుంటున్నారు.

            వాళ్ళందరికి దూరంగా కాస్త ఒంటరిగా ఉన్న స్థలం చూసి ‘‘అక్కడ కూచుందామా’’ అంటూ శ్రీను అటువైపు చూయించిండు.

            అక్కడ సీతపలాల చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. ఇద్దరు అటు వైపు నడిచిండ్లు. అక్కడ బండల మీద కూచున్నరు కాని ఎవరి మనసులోని మాట బయిటికి రాక గుండే గొంతుకలోనే తరాడుతుంది.

            ఉండి ఉండి తులసి ‘‘ఎందుకు పిలిచినవు’’ అంది...

            ‘‘నీతో మాట్లాడుదామని’’ అంటూ గుట్టక్రిందవిశాలంగా పరుచుకున్న మైదనం కేసి చూసిండు. ఊరిలోని భవనాలు బొమ్మరిల్లులా కనిపిస్తున్నాయి. అపైన విశాలమైన మైదానం దాని చివర పాయగాపారే గోదావరి చిన్నగా ఏం మాట్లాడుదామని’’ అంటూ తులసి శ్రీను మొఖంలోకి సూటిగా చూసింది.

            శ్రీను ధైర్యం తెచ్చుకొని ‘‘నీకు పెండ్లి సంబందాలు చూస్తున్నరటకదా’’ అన్నాడు.

            ‘‘అవును’’

            ‘‘మరి నీకు ఇష్టమేనా’’ మళ్ళి అడిగిండు.

            తులసి ఏమి మాట్లాడలేక పోయింది. ఆమె కండ్లలో నీళ్ళు తిరిగినయి.

            ‘‘నీకు ఇష్టం లేకుంటే వద్దని చెప్పక పోయినవా’’

            ‘‘అమ్మనాన్నలు ఇష్టపడుతున్నారు’’ అంది బారంగా...

            ‘‘వాళ్ళ ఇష్టం తో ఏం పని నీకు ఇష్టమైతేనే చేసుకో’’ అన్నాడు కాస్త కటవుగా...

            తులసి జవాబు చెప్పకుండా కన్నిరు కార్చింది.

            శ్రీను కాసేపు ఏం మాట్లాడ క మౌనం వహించిండు.

            ఆ వెంటనే ‘‘మనం పెండ్లి చేసుకుందామా’’ అంటూ అత్రంగా ఎదురు చూసిండు.

            అనందం పట్టలేక తులసి మారు మాట్లాడా కుండా అతని వొడిలో ఓదిగిపోయింది.

( తరువాయి భాగం వచ్చే సంచికలో )

కూలి బతుకులు – పదవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                         10

బిజెపి పార్టీ రామజన్మభూమి వివాదం రెకెత్తించింది. అద్వాని నాయకత్వలో జరిగిన రథయాత్ర మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎదో విదంగా అధికారంలోకి రావటానికి పన్నిన కుట్రలో బాగంగానే రామజన్మభూమి వివాదం ముందుకు తెచ్చారు. దానికి తోడు మోడిముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన గుజరాత్‍ అల్లర్లు ముస్లీంలూచకోత హిందు మతోన్మాదాన్ని తీవ్ర స్తాయికి తీసుకపోయింది. కాంగ్రెసు పదెండ్ల పాలన ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. సరికదా అనేక కుంభకోణాతో భ్రష్టు పట్టపోయింది. ఈ నేపథ్యంలోనే జరిగిన ఎన్నికల్లో నరెంద్రమోడి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.

  పదిహెడవ లోకసభ ఎన్నికలను ప్రకటించింది. ఏప్రిల్‍ రెండవ వారం నుండి నాల్గవ వరకు ఏడు పేజుల్లో జరుగనున్నాయి.

  రామయ్య కాలనీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అసలే ఎండలు మండి పోతున్నాయి. అంత కంటే ఎక్కువగా ఎన్నికల వేడి మొదలైంది. రామగుండం పెద్దపల్లి పార్లమెంటు యస్సి నియోజక వర్గంలోకి వస్తుంది. కాని ఎన్నికల్లో పోటీ పడుతున్నాది మాత్రం ఇద్దరు హేమాహేమీలు. పేరుకు వాళ్ళు యస్సిలేకాని అర్థికంగా బాగా బలం కలిగినోళ్ళు.

  తెలంగాణలో అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి తరుపున వెంకటేశ్‍నేతను పోటికి నిలిపారు. రాజకాయాల్లో ఏదీ శాశ్వతం కాదు గత డిసెంబర్‍ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిదిలోని చెన్నూరు నియోజక వర్గం నుండి వెంకటేశ్‍ కాగ్రెసు తరుపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిండు. అంతా అర్నెల్ల కాలేదు. అంతలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినవి. పార్లమెంటు ఎన్నికల ప్రకటన వెలువడిన తరవుఆత ఆయన టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి మారి సీటు దక్కించుకున్నాడు.

  రాజకీయ పార్టీలు ఏవి ఏవిలువలు పాటించటం లేదు. ఎన్నికల్లో గెలువగలిగే సత్త ఉండి, డబ్బు దస్కం బాగా ఖర్చుపేట్టె వారిని ఏరి కోరి, పిలిచి మరి టికట్‍ ఇస్తానయి. అంటే గెలుపు గుర్రాల మీద పార్టీలు పందెం కాస్తున్నాయి. అ విదంగా చూసినప్పుడు వెంకటేశ్‍ నేతఅందుకు సమర్థుడని పార్టీ బావించింది. పెద్దపెద్ద కంట్రాక్టులు చేసి ఆయన వందల కొట్లు సంపాధించిండు.

  ఎన్నికలంటే మాటలు కాదు కొట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పుట్టపిత్తులా పైసలు ఎగజల్లి ఓట్లు రాబట్టుకోవాలి. ఎన్నికల్లో నెగ్గిన తరువాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చు. రాజకీయాలు పక్తు వ్యాపారం అయిన చోట అంతకంటే ఎక్కువ ఏమి అశించలేము.

  ఇటువంటి రాజకీయాల్లో అరితేరిన వాడు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చంద్రశేఖర్‍ రావు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా పేరుంది అవిదంగా ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకిజరిగిన ఎన్నికల్లో నెగ్గి మొదటి ముఖ్యమంత్రి అయిండు.

 

  అధికారంలోకి వచ్చిన తరువాత అయన అసలు రంగు బయట పడసాగింది.

  ఏ ఆశల కోసమైతే తెలంగాణ ప్రజలు పోరాడిండ్లో ఆ ఆశలను నీరుగరుస్తు పోయిండు. తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి, తనకు ఎవరు రాజకీయాల్లో పోటీ రాకుండా ఉండటం కోసం ఉధ్యమంలో తనతో కలిసి పనిచేసిన వారిని ఒక పద్దతి ప్రకారం పక్కకు పెట్టి అవకాశ వాదులు, జంపు జాలానిలను, తన చెప్పు చేతుల్లో మెదిలే వాళ్ళను పార్టీలో చేర్చుకొని వారికే సీట్లు ఇచ్చి రెండో సారి కూడా అధికారంలోకి వచ్చిండు. తన అధికారాన్ని పటిష్ట పరుచుకొని తన తదనంతరం తన వారసుడే అధికారంలో వచ్చే లక్ష్యంతో మొత్తం యాంత్రంగం సిద్దం చేసిండు.

  ఇప్పుడిక రాష్ట్రంలో ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అని తలలు ఊపపటం తప్ప ప్రనజాప్రతినిధులు ఎవరు ఎదురు చెప్పె పరిస్థితి లేదు.

  వాస్తవానికి టి.ఆర్‍.యస్‍. పార్టీ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ సీటు వివేక్‍ కు ఇవ్వాల్సి ఉండే. వివేక్‍ రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రమిక వెత్తె కాకుండా అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రంలోను పలుమార్లు మంత్రి పదివి చేసిన సుదీర్ఘ రాజకాయ చరిత్ర కల్గిన వెంకటస్వామి కొడుకు.

  తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్‍.యస్‍ పార్టీకి మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర వహించిండు. సోనియా గాంధీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు సాసు చేయించటంలో వెంకటస్వామి పాత్ర ఉంది. ఎమైతే నేమి తెలంగాణ వచ్చింది. అయితే అవసరానికి  బొంత పురుగు నైనా ముద్దుపెట్టుకొనే టి.ఆర్‍.యస్‍ నాయకునికి అవసరం లేదనుకుంటే నిర్దక్షక్ష్మీ్యంగా కాలతో తన్నె స్వబావం కూడా ఉంద. అవిదంగా చంద్రశెఖర్‍రావుకు వివేక్‍ మధ్య విబేదాలు పొడుసూపినవి. అందుకు మరో కారణం కూడా ఉంది. కేసిఆర్‍ మొదటి సారి ఎన్నికలకు పోయినప్పుడు తల ఎన్నికల ప్రణాళికలో  తెలంగాణ రాష్ట్రానికి మొదటి  ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిండు. తాను తెలంగాణ రాష్ట్రనికి కావాలి కుక్కలా ఉంటాగాని ఏ పదవులు అశించనని పలు సందర్భాల్లో ప్రకటించిండు. అవిదంగా తెలంగాణలో టి.ఆర్‍.యస్‍ అధికారంలోకి వస్తె మొదటి ముఖ్యమంత్రివి నువ్వె నంటూ వివేక్‍కు ఆశ చూపి డబ్బు దస్కం కాజెసిండు. చివరికి ఎన్నికల ముందు సీట్లు పంచేకాడ వివిక్‍ను ముఖ్యమంత్రి పోటీదారుడుగా రాకుండా చేయ్యటానికి వివేక్‍కు పార్లమెంటు సీటు ఇచ్చిండు. అంతే తనను ముఖ్యమంత్రి కాకుండా చేయటానికి కపట నాటకం అడుతున్నాడని గ్రహించిన వివేక్‍ టి.ఆర్‍.యస్‍ పార్టీని వీడి మళ్ళి కాంగ్రెసు పార్టీలో చెరి అ పార్టీ తరుపున పెద్దపల్లి పార్లమెంటుకు పోటి చేసిండు. కాని అప్పటికి టి.ఆర్‍.యస్‍ గాలి ఉండటం వలన అపార్టీ అభ్యర్థి చెతలో ఓడిపోయిండు.

  సామన్యులకైతే ఎవడు అధికారంలో ఉన్నా ఓరిగేది ఏముండదు కాని వ్యాపార వెత్తలకు పారిశ్రామిక వెత్తలకు అధికారం అండలేకుండా మనుగడ సాధించటం కష్టం అప్పటికి కెంద్రంలో రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెసు పార్టీ, ఒడిపోయి కెంద్రంలో జిజెపి ప్రభుత్వం రావటంతో రెంటికి చెడ్డ రేవడిలా అయింది వివేక్‍ రాజకీయ పరిస్థితి. దాంతో ఆయన చివరికి రాజీపడి పోయి అనివార్యంగా మళ్ళీ టి.ఆర్‍.యస్‍ పార్టీలోకి వచ్చిండు. అట్లా వచ్చిన వారికి ఎదో నామినేటడ్‍ పదవి అయితే కెసిఆర్‍ ఇచ్చిండు కాని వీడు ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని బావించిన కెసిఆర్‍అదను చూసి వివేక్‍ను చావు దెబ్బతీసిండు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే గడువు చివరినిముషం ముగిసే వరకు నాన్చి చివరినిమిషంలో వెంకటేశ్‍కు సీటు ఇచ్చిండు. వివేక్‍ ఇంకో పార్టీ తరుపున ముఖ్యంగా కాంగ్రెసు తరుపున పోటీ చెయటానికి వీలు లేకుండా చేసిండు. దాంతో వివేక్‍కు అటు టి.ఆర్‍.యస్‍ తరుపున కాని కాంగ్రెసు తరుపున కాని పోటికి నిలబడే పరిస్థితిలేకుండా పోయింది.

  కాంగ్రెసు పార్టీ చివరి నిముషం వరకు వివేక్‍ను సీటు ఇవ్వటానికే ఎదురు చూసింది. కాని చంద్రశెఖర్‍రావు వారికి అటు వంటి అవకాశం ఇవ్వలేదు.

  కాని చాల విచిత్రం ఏమిటంటే కాంగ్రెసు తరుపున ప్రస్థుతం పోటీ చేస్తున్న చంద్రశెఖర్‍రావు కూడా ఒకప్పుడు టి.ఆర్‍.యస్‍ పార్టీకి చెందినవాడు. అ పార్టీ తరుపున ఎమ్మెల్యెగా నెగ్గి రాజశెఖర్‍ రెడ్డి ప్రభుత్వంలో టి.ఆర్‍.యస్‍ పార్టీ తరుపున మంత్రిగా చేసినవాడు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి తన భవితవ్యాన్ని తెల్చుకోవటానికి బరిలోకి దిగిండు.

  జిజెపి పార్టీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంనుండి నిన్న మొన్నటి నక్సలైట్‍ మూమెంటు వరకు అనేక పోరాటలు జరుగటం వలన ప్రజల్లో కమూనిస్టు బావజాలం ఎక్కువ. పలితంగా జిజెపి మతోన్మోద రాజకీయాలు తెలంగాణలో అంతగా ప్రబావం చూపలేక పోయింది. హైద్రాబాద్‍ పట్టణంలో మాత్రం ఎం.ఐ.ఎం. ప్రాబల్యం ఎక్కువ ముస్లీంమతో న్మోదాన్ని రెచ్చగోట్టి అక్కడ అ పార్టీకి ఒక పార్లమెంటు సీటు, అరేడు అసెంబ్లీ సీట్లు ఎప్పుడు గెలుస్తుంటాయి. దానికి ప్రతిగా అ ప్రాంతంలో బిజెపి హిందు సమాజాన్ని రెచ్చ గొట్టె కొంత బలంసంపాదించి అక్కడి నుండే ఒక రెండు అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది తప్ప తెలంగాణ వ్యాపితంగా దాని ప్రాబల్యం తక్కువ కాని ఈ సారి కెంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వలన దాని అండ దండలతో బిజెపిపార్టీ తెలంగాణలో పాగా వేయాటానికి సిద్దమై చాలచోట్ల తను అభ్యుర్థులను నిలిపింది. అవిదంగా బిజెపి కూడా పెద్దపల్లి అసెంబ్లికితన అభ్యర్థిని నిలిపింది.

  ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఇది వరలో అయితే రెపు ఎన్నికలనగా అంతో ఇంతో తాగబోయించి, పదో పర్కొ చేతుల్లో పెట్టి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టి ఖర్చుబాగా పెరిగిపోయింది. చివరికి మీటింగ్‍లు పెట్టాలన్నా ర్యాలీలు తీయలన్నా జనాలకు బిర్యాని పొట్లాలు ఇచ్చి మందు పోసి మీదికేలి రోజు మూడు నాలుగు వందల చేతిలో పెడ్తెకాని జనం రావటంలేదు. ఇవ్వాళ ఈ మీటింగ్‍లకు పోయిన వాళ్ళె మరో రోజు మరో పార్టీ పిలిచే మీటింగ్‍ లకు పోతాండ్లు. ఇకతాగు బోతులకైతే ఎన్నికలు వచ్చిన వంటే పండుగే మరి.

  కాంగ్రెసు నాయకుడు ఒక పర్యయం వచ్చి కాలనీలో ఇల్లిల్లు తిరిగి పోయిండు. టి.ఆర్‍.యస్‍ నాయకుడు వెంకటేశం మాత్రం కాలనీకైతే రాలేదు. కాని ఆయన అనుచరుడు సత్యనారయణను పంపించి గోదవరిఖనిలో తమనాయకులతో జరిగే బారి బహిరంగ సభకు మనిషికి ఐదువందలు ఇచ్చి మరి తీసుకపోయిండ్లు.

  రామయ్య కాలనీలో కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు. ఒకటితెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ల దైతే రెండోది కాంగ్రెసు వాళ్ళది. ఈ రెండు పార్టీలు కాకుండా బిజెపికి చెదిన అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నడుకాని  అతనికి అంతగా అర్థిక స్థోమత లేదు. ఎదో ఒకటి రెండు సార్లు జీపుల్లో వచ్చి ఒక రౌండు కాలనీలో తిరిగి పోయిండ్లు. అది కూడా కంట్రాక్టరు రంగయ్య బలవంతం మీద.

  కాలనీలో కాంగ్రెసు పార్టీకి చిన్న చితుక కంట్రాక్టులు చేసే జానకిరాం నాయకత్వం వహిస్తే టి.ఆర్‍.యస్‍ పార్టీకి సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు.

  గంగమ్మకల్లు బట్టీ కాడ సాయంత్రమే కాదు. పొద్దంత కూలీలు ముగుతున్నారు.

  ‘‘మీరేమి రంది పడకుండ్లే కడుపు నిండా తాగుండ్లే బిల్లు సంగతి నేను చూసుకుంటా’’ అంటూ జానికిరాం బరోసా ఇచ్చిపోయిండు.

  సాయంత్రం అయితే కనుకమల్లు ఇంటికాడ చీప్‍ లిక్కర్‍ పంచుతాండ్లు. అవిషయం తెలిసి రాంలాల్‍ వచ్చి నాగయ్యను కనకమల్లు ఇంటికి తీసుక పోయిండ్లు. అక్కడ రాజీరు కనిపించి ‘‘కొడుకు టి.ఆర్‍.యస్‍ తండ్రి కాంగ్రెసు’’ అన్నాడు వ్యంగంగా....

  అమాటకు నాగయ్యకు మనసుకు బాదేసింది సత్తెన్న గులాబి జెండా పట్టుకొని తిరుగుతాండు. నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సత్యనారాయణ సత్తెయ్యను వెంటేసుకొని తిరుగుతండు. రామయ్య కాలనీ బాధ్యతంత నువ్వె చూడాలిఅంటూ సత్యనారాయణ సత్తెయ్య మీద బారం పెట్టిండు.

  అప్పటి నుండి సత్తెయ్య క్షణం రికామి లేకుండా తిరుగుతాండు. అవసరం కొద్ది ఎమ్మెల్యే రాసుక పుసుక తిర్గెసరికి సత్తయ్య ఉబ్బితబ్బిబ్బు అయి ఎన్నికలు తప్ప వేరే లోకం లేకుండా పోయింది.

  రాజీరు మాటలకు చిన్నబోయిన నాగయ్యను చూసి రాంలాల్‍ ‘‘వాడుత్తతాగుబోతు... వాని ఇంట్లకేలి ఎమన్నా ఇస్తాడా.. మంచి మంచోళ్లె ఇయ్యల ఈ పార్టీలో ఉంటే రేపు మరో పార్టీలో ఉంటాండ్లు. రాజీరు మాటలేమి పట్టించుకోకు అన్నాడు.

  అయిన నాగయ్య మనసు ఓప్పక కనకమల్లు ఇంట్ల అడుగుపెట్టక అటునుంచి అటే తిరిగి వచ్చిండు. అది చూసి కనకమల్లు ఎన్నికల సమయంలో ఇటువంటివ ఏం పట్టించుకోవద్దు అంటూ రాజీరు మీద కోపం చేసిండు.

  తెంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ కాలంలో మొదటి నుండి పని చేసిన కవారిని కాదని నిన్నగాక మొన్న పార్టీ మారిన వాన్ని పిలిచి టికట్‍ ఇచ్చుడేందీ అంటూ మొదటి నుండి జెండా మోసిన వాళ్ళు కొందరు అలిగి పార్టీ విడిచిపోయిండ్లు. మరికొందరిని బురదగించి నామినేట్‍డ్‍ పదువులు వస్తయని ఆశ చూపి కొందరిని డబ్బులిచ్చి కొందరిని అధికార పార్టీ కాపాడుకొన్నాది.

  ఓట్ల కోసం నాయకులు కులాల పేరు మీద ప్రాంతాల పేరుమీద జనాలను చీల్చిండ్లు. జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి ‘‘ఇదిగోమనమంత ఒక్కటిగా ఉండాలి. లోకలోల్ల మాటలు విని మనం బొర్లా పడవద్దు. కాంగ్రెసుపార్టీ అంటే ఎనకటి నుంచి ఉన్న పార్టీ మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ స్థాపించిన పార్టీ కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చె ప్రాంతీయ పార్టీలు ఇవ్వాల ఉంటాయి రేపు మట్టికలుస్తయి వాటిని నమ్ముకుంటే లాభం లేదు. నేను చంద్రశేఖర్‍ సారుతోని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఆయన చేసే మొదటి పని ఏటంటే మన అందరికి రేషన్‍ కార్డులు ఇప్పిసతనన్నడు. మన ఓరియా వాళ్ళకు తాగేందుకు మంచి నీళ్ల పంపులు వేయిస్తనన్నడు.

  ‘‘అంటూ చెప్పుకొచ్చిండు.

  జనాలకు ఆ మాటలు సమజ్‍ కాలే ఇయ్యాల ఎన్నికలు వచ్చినయిని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవటానికి ఇటు ఓరియా వాళ్ళమని అటు ఆంద్రోళ్లని ఎదో ఎదో చెప్పుతున్నరు కాని వాళ్ల జీవితంలోవాళ్ళె ప్పుడు అ తెడాలు పాటించనే లేదు. కూలి చేసేకాడ అందరు సమానమే. ప్రాంతలు వేరైనా వారందరి బాధలు ఒక్క తీరుగానే ఉన్నాయి. ఒకరి కష్ట సుఖల్లో మరోకురు పాలుపంచుకున్నారు. అక్క తమ్ముడు అంటూ వరసలు పెట్టి పిలుచుకున్నారు. అంతెందుకు నెల రోజుల క్రింద లారీమీది క్లినర్‍ పనలు చేసే చన్నులాల్‍ చనిపోతే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు కలిసి మనిషింత చందాలు వేసుకొని చావు చెసిండ్లు.

  చన్నులాల్‍కు ఎనక ముందు ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో ఓరిస్సాలోని మారు మూల గ్రామం ఒక్కడే పని వెతుక్కుంటు వచ్చిండు. అందరితో కలవిడిగా ఉండేవాడు. ఒక్కడే ఉండేవాడు. ఎమైందో ఎమో వానికి టి.బి. వచ్చింది. చీకేసిన బొక్కలా బొక్కలు తేరి, తిండికి లేక ఎండి పోయి ఎండిపోయి సచ్చిండు.

  జానకిరాం కూడా ఒకప్పుడు అందరిలాగే పొట్ట చేతపట్టుకొని బ్రతక వచ్చిండు. కాని కాస్త హుషారు తనం ఎక్కువ. అట్ల ఇట్ల చేసి కంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీ పనిచేస్తూ క్రమంగా సబ్‍ కంట్రాక్టులు పట్టి నాల్గు పైసలు సంపాదించిండు. ఎవరిని లెక్క చేసేటోడుకాదు. అటువంటి వాడు ఎన్నికల వచ్చే సరికి మెత్తమెత్తగా మాట్లాడుతాండు. లేని ప్రేమ వొలక పోస్తాండు.

  ‘‘ముందుగాల పంపులు వేయించుండ్లీ, నీళ్ళు దొరకక హరిగోస పడ్తానం’’ అంటూ బసంత్‍ నాగ్‍ భార్య సుభనా అడ్డుతగిలింది.

  జానకిరాం సుభన కేసి చూసి ‘‘ఎన్నికల్లోగెలిచినంక చేయించే మొదటి పని అదే’’ అన్నాడు మరోసారి.

  ‘‘ఆఎన్నికలైనంకమా మొఖం ఎవలు చూస్తరు’’ అంటూ హరిరాం అడ్డుపడ్డడు.

  ‘‘ఎన్ని ఏన్నికలు చూడలేదు ఎన్నికలప్పుడు గిట్లనే చెప్తరు పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్లు. రెషన్‍ కార్డులు ఇప్పిస్తమన్నారు. పంపులు వేయిస్తమన్నారు. ఓట్లు వేయించుకొని గెలిచి ఇటు మొఖంరాలే’’ అంటూ మరోకరుగుణిగిండు.

  జానకిరాంకు మనసులోకోపం కల్గింది కాని బయట పడలేదు. మొఖం మీద శాంతాన్ని తెచ్చుకొని’’ టి.ఆర్‍.యస్‍ వాళ్ళ పనే అంత. ఎన్నికలప్పుడు మాట చెప్తరు. గెలిచినంక ఇటుదిక్కు అయినా రారు. కాని మన సారు అట్లా కాదు. మాటిస్తె చేసేదాక నిదురపోడు’’ అన్నాడు బరోసాగా...

  ‘‘ఆ అందరుగంతే’’ అన్నాడు మరోకరు.

  పరిస్థితి చెయ్యిదాటెట్టుందని జానకి రాంకు అర్థమైంది. ఇంకా ఎక్కువసేపు మీటింగ్‍ పొడిగిస్తె ప్రమాదమని బావించిండు.

  ‘‘ఇదిగో నామాట నమ్ముండ్లీ. మనమంతా ఒక్కకటే ఈ సారి మాట తప్పెదుంటే మళ్ళీ మీకు నా మొఖం చూయించ’’ అన్నాడు.

  మీటింగ్‍ ముగించి జానకిరాం సోన్‍లాల్‍, ప్రసాత్‍, రాంజీని, గోపాల్‍, బాసంతనాగ్‍ను వెంట బెట్టుకొని వెళ్ళిపోతుంటే సుభాన పెద్ద గా గొంతు చేసుకొని ‘‘ఇంట్ల తిండికేం లేదు. తాగితందానలాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదన్నా ఉంటే మాకే ఇచ్చిపోండ్లి’’అంది.

  జానకిరాం చిన్నగానవి ‘‘ఇప్పుడదేంలేదు’’ అంటూ వాళ్ళను తోలుకొని పోయిండు.

  రామయ్య కాలనీలో జానకిరాం ఓరియా కార్మికులను కుప్పెసి మాట్లాడిన సంగతి తెలిసి సుబ్బారావు అగమెఘాల మీద తెలుగోళ్ళ గుడిసెలను చుట్టెసి బెంగాలివాళ్ళ గుడిసెల కేసి నడిచిండు.

  ‘‘బెంగాలి వాళ్ళయి ఎన్ని ఓట్లుంయి’’ అని సత్తయ్యను అడిగిండు.

  ‘‘ఎంతలేదన్నా యాబై అరువై ఉంటయి’’ అన్నాడు సత్తయ్య వినయంగా...

  ఒక్క ఓటు కూడా జారిపోవద్దు.. అందర్ని కలువాలి ఎట్లయితే వింటరో అట్లా విన్పించాలి. డబ్బుల గురించి అలోచించవద్దు... ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓట్లు మనకు పడాలి’’అన్నాడు సుబ్బరావు.

  సమస్యేలేదు సార్‍... ఒక్క ఓటు కూడా అపోజిషన్‍కు పోదు... అందరు మనోళ్ళె’’అన్నాడు సత్తయ్య...

  ‘‘అట్లాఅనుకోవద్దు...వోవర్‍ కాన్పిడేన్స్కు పోతే అసలుకే మోసం వస్తది’’ అన్నాడు సుబ్బారావు బొమ్మలు ఎగరేసి.

  సుబ్బారావు తన అనుచరులతో కలిసి బెంగాలి వాళ్ళ గుడిసెలకేసి నడిచిండు.

  తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్‍గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వచ్చిన వారికి ఉపాధి కల్పించటంకోసం దేశంలోని వివిద ప్రాంతలకు పంపించిండ్లు. అట్లా కొంత మంది రామగుండుం వచ్చిండ్లు. ఎన్టిపిసి పనులు సాగినప్పుడు అందులో చాల మంది పని చేసిండ్లు. కాని నిర్మాణపు పనులు పూర్తయిన తరువాత పనులు లేక చాలమంది వేరే ప్రాంతాలకు వలసపోయిండ్లు. చాల కొద్ది మంది మాత్రం మిగిలిండ్లు.

  బెంగాలికార్మికులు ఉండే గుడిసెలు మిగితా కార్మికులు ఉండే గుడిసెల కంటే కాస్త బిన్నంగా ఉంటాయి. ఉన్నంతలో గుడిసేలను బందోబస్తుగా కట్టుకుంటరు. శుచి శుభ్రత పాటిస్తరు.

  సుబ్బారావు తన అనుచరులతో అక్కడికి చేరుకునే సరికి టి.కే సర్కార్‍ ఇంటి మీద కాంగ్రెసు జెండా ఎగురుతు కన్పించింది. సత్తయ్య కేసి ఇదెంటన్నట్టుగా చూసిండు.

  ‘‘వాడుత్త తలతిక్కవాడు. ఊరంత ఒక దారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్నట్టుగా ఉంటాడు. వానితో అయ్యదిమి లేదు. మిగిత వాళ్ళంత మనతోనే’’ అన్నాడు సత్తయ్య...

  సుబ్బయ్య ప్రచారానికి వసున్న సంగతి సత్తయ్య ముందే బెంగాలి కుటుంబాలను కలిసి చెప్పి పెట్టి ఉంచిండు. కొంత మంద పనులు కూడా మానుకొని ఉండిపోయిండ్లు. వీళ్ళు అక్కడికి పోయే సరికి బినయ్‍ మండల్‍, డూకిరాం, విమల్‍పాండే ఎదురోచ్చి రెండు చేతులు జోడించిండు. సుబ్బారావు ప్రతిగా చిర్నవ్వులు చిందిస్తూ’’ ఏంటీ సంగతి ఎట్లా ఉంది’’ అని అడిగిండు.

  ‘‘అంత ఓకే సార్‍’’ అంటూ బినయ్‍ మండల్‍ బదులిచ్చిండు. సుబ్బారావు సర్కార్‍ ఇంటికేసి చూస్తూ’’ కాంగ్రెసు వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది’’ అంటూ తనుమానంగా చూసిండు.

  ‘‘అది కాదు సార్‍ టికే సర్కార్‍ జానకిరాం మనిషి ఆయన్ని పట్టుకొనే క్యాజువల్‍ వర్కర్‍ అయ్యిండు’’ మిగితా వాళ్ళంతా మనం ఎంత చెప్పితే అంతా’’ అన్నాడు మిమల్‍పాండే...

  ‘‘ఎమో’’ అంటూ సుబ్బారావు దీర్ఘం తీసిండు.

  ‘‘అదేం లేదు సారు మా మాటలు నమ్మండి’’ అన్నాడు బినయ్‍మండల్‍...

  గుడిసెల మధ్య కాస్త కాళీస్థలంఉన్న చోట పెరిగిన వేపచెట్టు నీడన మూడు కుర్చిలు వేసి ఉన్నాయి. అందరు అటుకేసి నడిచిండ్లు. సబ్బారావు, సత్తయ్య మరోకరు కుర్చిలో కూచోగా మిగిత వాళ్ళంత వాళ్ళ చుట్టు నిలబడ్డారు.

  మీటింగ్‍ అనే సరికి అడోళ్ళు మొగోళ్ళు పిల్లలు వచ్చిండ్లు. అరువై ఎండ్ల పైబడిన సరస్వతి మండల్‍ కూడా వచ్చింది. ఆమెకు కండ్లు సరిగా కనిపిస్తలేవు. ఎవరో పెద్ద లీడర్లు వస్తరంటే అగం అగం వచ్చింది. ఆమె కొడుకు కోశన్‍ మండల్‍ను కంట్రాక్టరు పనిలో నుండి తీసేసిన తరువాత ఇంట్లో వెళ్లటం కష్టమైతంది. పెద్ద లీడర్లు వస్తాండ్లు అంటే వాళ్ళను బ్రతిమిలాడి ఎట్లనో అట్లనో కొడుకును తిర్గి పనిలో పెట్టించాలనే యావతో వచ్చింది.

  సుబ్బారావు కాసేపు అది ఇది మాట్లాడన తరువాత మెల్లగా అసలు విషయం ఎత్తిండు ‘‘మీకు అందరికి ఎన్నికలు జర్గుతున్న సంగతి తెలుసు. మన టి.ఆర్‍.యస్‍పార్టీ తరుపున వెంకటేశ్‍ అన్ననను పార్టీ నిలబెట్టింది. మనమంత కలిసి ఆయన్ని గెలిపించాలి మీకేమన్నా సమస్యలుంటే అవి పరిష్కరిస్తాం. ప్రభుత్వం మనది మనం ఎదీ అనుకుంటే ఆ పని చేసుకోవచ్చు’’ అంటూ క్షణమాగి అందరికేసి చూసి మళ్ళీ మాట్లాడ సాగిండు.

  ‘‘మీ సమస్య ఎందో నాకు తెలియందాకాదు. డ్యాంకట్టినప్పటి నుండి మీరు చేపలు పట్టుకొని బ్రతుకుతాండ్లు. మధ్యలో సొసైటీలు పుట్టుకొచ్చి మిముల్ని బయటికి నెట్టెసిండ్లు. దాంతో చాల మందికి బ్రతుకు తురువు పోయింది’’ అన్నాడు.

  ‘‘నిజమే’’ అన్నట్టు చాల మంది తలలు అడించిండ్లు.

  ‘‘అందుకేనేనేమంటానంటే సొసైటీ వాళ్ళు బ్రతకాలి, మీరు బ్రతకాలి అందరు బ్రతికే ఉపాయం అలోచించాలి. అందుకే ఎన్నికలు అయిన తరువాత వెంకటేశన్నా మీరు కూడా డ్యాంలో చేపలు పట్టుకునే ఎర్పాటుల చేయిస్తనన్నడు. వెంకటేశన్న గురించి మీకు తెలియదు అల్తు పాల్తు ముచ్చట్లు చెప్పెటోడు కాదు. ఎదాన్నా చేస్తనంటే అరునూరైనా చేస్తడు అటువంటి మనిషి’’ అంటూ చెప్పుకొచ్చిండు.

  ‘‘మీరా పనిచేస్తే మేమంత రుణపడి ఉంటాం’’ అంటూ బినయ్‍ మండల్‍ రెండు చెతులు జోడించిండు.

  ‘‘ఆ విషయం మాకు వదిలేసి మీరు నిర్రందిగా ఉండండ్లీ’’ అంటూ సుబ్బారావు వెంట వచ్చిన మరో లీడర్‍ కేశవులు బరోసా ఇచ్చిండు’’

  జనం సంతృప్తిగా చూసిండ్లు.

  సరస్వతి మండల్‍కు ఈ మాటలేమి తలకు ఎక్కటంలేదు. తన కొడుకు సంగతెందో తెలుసుకోవాలని వచ్చింది. మనసులో తొలుస్తున్న అవెదన మాటల రూపం సంతరించుకోగా....

  అయ్యా మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంటలేడు’’ మీరు చెప్పివాన్ని పనిలో పెట్టియ్యాలి అంది.

  ‘‘దానికి వీళ్ళెమి చేస్తరే’’ విమల్‍ పాండే ముసల్దాని మాటకు అడ్డుపోయిండు.

  ‘‘మరెందుకు వచ్చిండ్లు’’

  ‘‘ఓట్లు వెయ్యాలి ఓట్లు’’ఎవరో అన్నరు.

  ‘‘ఓట్టు వేస్తే ఏమొస్తది. ఎన్నిసార్లు వెయ్యాలట’’ అంటూ మసక బారిన కండ్లతోని పరిక్షగా చూసింది.

  గా ముసల్దాని మాటలు పట్టించకోకండ్లీ సారు ఎడ్డ ముసల్ది భర్త చనిపోయిండు. కొడుకుకు పనిలేక తిరుగుతాండు’’ అన్నాడు గోపాల్‍.

  సుబ్బారావు తెలిగ్గా నవ్వి ‘‘ఎర్కె ఎర్కె’’అంటూ ముసల్దానిమాటలు పట్టించుకోకుండా బినయ్‍మండల్‍తో మాటల్లోకి దిగిండు.

  ‘‘అయ్యా ఏం చెప్పకపోతిరి’’ ముసల్ది మళ్ళి అడిగింది.

  ‘‘అరేయ్‍ ముసల్దాన్ని ఇక్కడి నుంచి తీస్కపొండ్లిరా’’ ఎవరో కసిరిండు.

  ఓ ఇద్దరు ముందుకు వచ్చి అవ్వ సార్‍ నీ కొడుకును పనిలో పెట్టిస్తరు... పదపద అంటూ రెండు రెక్కలు పట్టుకొని దాదాపు బలవంతంగా ప్రక్కకు తీస్క పోయిండ్లు.

  అ ముసల్ది గింజుకుంటూ ‘‘పనులు లేకుంటే మనష్యులు ఎట్లా బతుకతరు. తిండిలేక కడుపులు మాడ్చుకొని చస్తానం’’ అంటూ గింజుకుంటుంది.

  కాసేపు మాట్లాడిన తరువాత ‘‘మీకే మన్నా అవసరం ఉంటే సత్తన్న చూస్తడు... ఎవరు మోహమాట పడవద్దు...కాని ఒక్క ఓటు కూడా చీలి పోవద్దు’’ అన్నాడు సుబ్బారావు.

  సుబ్బారావు పోవటానికి లేచిండు. బినయ్‍ మండల్‍ చాయ్‍తాగి పోవాలని బలవంతంచేసిండు. కాని ఇంకా క్రషర్‍ నగర్‍ కాకాతియ నగర్‍ తిరుగాల్సి ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ ఇంటి కాడ తీరుబడిగా చాయ్‍ తాగుతా’’ అంటూ సుబ్బారావు లేచిండు.

  రోడ్డుకు ఒక వైపు ఎన్టిపిసి దేదీప్యమానంగా ఉంటే రోడ్డుకు అవలవైపున దుకాణాలు, వర్క్షాపులున్నాయి. వాటిని అనుకొని గుట్ట బోరుమీద చిన్న చిన్న గుడిసెలున్నాయి. మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే పులి పాకల్లోనే ఎంత లేదన్నా రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.

  ఎన్నికలప్పుడు తప్ప నాయకులు వాళ్ళ గుడిసెలకు రావటం జరుగదు. ఎండ్లు గడుస్తున్న వాళ్ల బ్రతుకుల్లో మార్పెమి రాలేదు.

  వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి ఒక  విదమైన కపం వాసన గప్పుమంది. అయినా అదేమి పట్టించుకోకుండా ముందుకు సాగిండ్లు. భగవాన్‍ మెస్త్రీకి వాళ్ళ కంట్రాక్టరు దివాకర్‍రావు అరోజు అక్కడ మీటింగ్‍ ఉండే సంగతి ముందే చెప్పి పెట్టడం వలన, ఆయన జనాలను కుప్పెసి నాయకులకోసం ఎదురుచూస్తుండి పోయిండు.

  సుబ్బారావు రావటం చూసి భగవాన్‍ మెస్త్రీ ఎదురొచ్చి ఆయన్ని తొడ్కొని పోయి ఒక్క రాల చెట్టు కాడికి తీసుక పోయిండు. అప్పటికే అక్కడ పోగేసిన జనం పులుకుపుకున చూస్తున్నారు.ఒంటిమీద సరిగా బట్టలు లేని పిల్లలు రంగురంగుల జెండాలను జనాలను చూసి హడావిడి చేస్తున్నారు.

  భగవన్‍ మేస్త్రీ సుబ్బారువు కేసి అబ్బురంగ చూసి ‘‘వీళ్ళంత మనోళ్ళె సారు...’’ అన్నాడు.

  సుబ్బారువు చిన్నగా చిర్నవు నవ్వ తలాడించిండు. ‘‘తీళ్ళంతా దివాకర్‍రావుదగ్గర పని చేసేవాళ్ళే కదా’’ అన్నాడు.

  ‘‘చాల మంది వాళ్ళే సార్‍ కొద్ది మంచి మాత్రం అక్కడిక్కడ కూలిపనులు చేసేవాళ్ళు ఉన్నారు. కానిమెజార్టీ మనవాళ్ళే’’అన్నాడు భగవాన్‍మేస్త్రీ...

  అప్పటికి మధ్యహ్నం దాటి పోయింది. కడుపులో అకలిగా ఉన్నా, మళ్ళి ఇక్కడి దాక రావటం ఎందుకని సుబ్బారావు ఒక్కడి దాక వచ్చిండు. దాంతో ఆయన వీలయినంత తొందరలో మీటింగ్‍ ముగించాలనే అలోచనలో ఉండిపోయి, ఎక్కువ అలస్యం చేకుండా, అక్కడ గుమి కూడిన జనాలను ఉద్దెశించి మాట్లాడటం మొదలు పెట్టిండు. తాము ఎన్నికల్లో గెలిస్తె ఇది చేస్తాం అది చేస్తాం అంటూ తియ్యతియ్యని మాటలు చెప్పసాగిండు.

  దస్త్రు భార్య శ్రావణబాయ్‍ అతని మాటలకు అడ్డుపోయి ‘‘పోయిన సారి ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు బోరింగ్‍లు వెయించిండ్లు. కాని అందులో చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చె తోవల ఎన్టిపిసి మురికి నీళ్ళ కాలువ ప్రక్కన మేము తవ్వుకున్న బాయి నీళ్ళె తాగుతనం. ఎండ కాలం వస్తై అయిత నీళ్ళు కూడా దొరకతలేవు. గదాని సంగతెందో చూడాలి’’ అంది పెద్ద గొంతుక చేసుకొనని...

  టీకురాం భార్య పుష్ప కల్పించుకొని ‘‘వర్షకాలంలో కూడా నీళ్లకు కరువువొస్తాంది. బాయిలకు మురికినీరు చేరి తాగవశం అయితలేదు’’ అంది. ‘‘రేషన్‍బియ్యం వస్తలేవు’’ అన్నారు మరోకరు.

  సుబ్బారావు ఒపిగ్గా విన్నడు. ‘‘మీకు ఏఏ సమస్యలు ఉన్యాయో అవన్ని మన భగవాలన్‍ మేస్త్రీకి చెప్పండి. ఈ సారి మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం’’ అన్నాడు. భాగవన్‍ మేస్త్రీ కేసి తిరిగి ‘‘వీళ్ళ సమస్యలన్ని రాసుకొని వచ్చి అఫీసుకాడికి రా, ఎన్నికలు అయిన తరువాత చేసే మొదటి పని అదే’’ అన్నాడు.

  భగవాన్‍ చెమట కంపుతో నిండిన అపరిసారల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలేకు పోయిండ్లు. బలవంతుపు పేరంటం ఎదో ముగించుకున్నట్టుగా, ఎంత హడావిడిగా నైతే వచ్చిండ్లో అంతే హడావిడిగా ఎల్లిపోయిండ్లు.

  పోతు పోతు భగవాన్‍ మేస్త్రీని ప్రక్కకు పిలిచిన సుబ్బారావు ‘‘సాయంత్రం వీళ్ళ ఎర్పాట్లు ఎవో నువ్వె చూడాలి. ఒక్క ఓటు కూడా చీలి పోవద్దుఅన్నాడు గుమ్మనంగా...

  రాజీరు మాటలు అవమానం అన్పించి కోపంతో నాగయ్య ఇంటికైతే వచ్చిండు కాని మనసు లో మాత్రం తాగాలనే కొరిక అలాగే ఉండిపోయింది.

  కాలనీలో చినన్న ప్దె అనకుండా తాగి ఊగుతాండ్లు. కాలనీలో రెండు గ్రూపులుగా చీలి పోయిండ్లు. ఒకటి టి.ఆర్‍.యస్‍ పార్టీ అయితే మరోకటి కాంగ్రెసు వాళ్ళది. ఎవరు ఖర్చుకు వెనుకాడటంలేదు. గంగమ్మ కల్లు దుకాణం కాడ జాతర సాగుతుంది. ఇక మీటింగ్‍లప్పుడు, ఎదైనా జూల్సు తీసినప్పుడైతే పండుగైతాంది. బిర్యాని పొట్లాలు, చీప్‍ లిక్కర్‍ పవ్వలకు ఎక్కలేదు. అకలికి మొఖం వాచిపోయి ఉన్న వాళ్ళు తినేకాడికి తిని బిర్యాని పొట్లాలను చాటు మాటుగా ఇంటికి తీస్కపోతాండ్లు. ఇదంతా సుబ్బారావు కనిపెట్టక పోలేదు... లేకి ముండా కొడుకులు... ఎన్ని రోజులు తింటరో తననియ్‍.. అనుకొన్నాడు. పై నాయకులెమో పైసల గురించి లెక్క చేయకుండ్లి. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఓట్లు మాత్రం మనకు పడాలి’’అంటున్నారు.

  టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళ దాటికి కాంగ్రెసు వాళ్ళు తట్టుకోవటం కష్టమైతంది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి శెఖర్‍రావుకు టిక్కట్‍ అయితే ఇచ్చిందికాని పార్టీ పంపించిన డబ్బులు ఏమూలకు సరిపోతలేవు. తన చేతి చమురు కొంత ఖర్చు పెట్టిండు కాని అపోజిషన్‍ వారితో సరితూగటం లేదు.

టి.ఆర్‍.యస్‍ పార్టీ అధికారంలో ఉంది. దాని అధినాయకునికి ఎన్నికల్లో ఎట్ల గెలువాలో, •నాన్ని ఎట్లా బురిడి కొట్టించాలో తెలిసినంత విధ్య మరోకరకి తెలియదు. దానికి తోడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిండు. ఎట్లాగైనా చేసి ఎన్నికల్లో గెలువాలనే పట్టుదలతో ఉండిడబ్బుకు ఎనక ముందు చూడటం లేదు.

  నాగయ్య ఇంట్లా నుండి బయిటికి వచ్చె సరికి గులాబి రంగు జెండాలు పట్టుకొని చిన్న పిల్లలు జైతెలంగాణ అంటూ బిగ్గరగా అరుచుకుంటూ ఊరేగుతాండ్లు. తన ముందు నుండే పోతున్న పిల్లల్లో ఎనిమిదెండ్ల దస్త్రు కొడుకు వినయ్‍ను ఆపిన నాగయ్య ఉత్సుకత కొద్ది ‘‘జెండాలు ఎక్కడియిరా’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న ఇచ్చిండు’’ పైసలు కూడా ఇచ్చిండు అన్నాడు పిల్లవాడు ఉత్సాహంగా...

  కొడుకు పేరు చెప్పె సరికి నాగయ్య మనసులో బాదేసింది. ఎన్నికల్లో వాడు కాలనీలో అన్ని తనై వ్యవహరిస్తున్నాడు. దాంతో ఆయన ‘‘ఊరంత పైసలు పంచుతాండు. పవ్వలుపంచుతాండు కాని అయ్య అని ఒక పవ్వ అయినా ఇయ్యక పాయే’’ అంటూ తనలో తనే గుణుక్కున్నడు.

  పిల్లలు అరుచుకుంటూ అతన్ని దాటేసి పోయిండ్లు. విసురుగా ఇంట్లోకి వచ్చిన నాగయ్యకు భార్య ఎదురు పడింది. దాంతో కొడుకు మీద కోపం భర్య మీద తీల్చిండు.

  ‘‘ఊరంత పవ్వలు పంచుతాండు... ఇంట్లా అయ్య ఉన్నడన్న జాషే లేకపాయే’’ అన్నాడు విసురుగా...

  శాంతమ్మ ఒకసారి భర్తకేసి తేరపారచూసి ‘‘ ఆ పాపపు సోమ్ము తాగకుంటెంది ఇయ్యల తాగిపిస్తరు తినిపిస్తరు.. తరువాత మొఖం చాయించరు, జనం ఇంట్ల పాడుగాను ఎర్రి లేసిన కుక్కల తీర్గ పుణ్యానికి వచ్చిదంటే పీకలదాక తాగుతండ్లు. అంటూ గయ్యిమంది.

  భార్య కోపం చూసి నాగయ్య వెనక్కి తగ్గి ‘‘అదికాదే... అంటూ ఎదో చెప్పబోయిండు.

  ‘‘వాడెమో పని బందు పెట్టి పిచ్చోని తీర్గ ఎన్నికలంటూ తిరగబట్టె, ఇంటికాడ కోడులు ఒక్కతే కూలిపనులు చేసుకుంటూ కుటుంబం ఎల్ల దీయబట్టె. ఎన్నికల్లో తిరుగతే ఎమోస్తదట.... ఇయ్యల అవసరం కొద్ది సత్తెన్నా అని బుదగరించే సరికి వీడు ఎక్కడ అగుతలేడు. నాకు వాడు ఎరుకే వీడు ఎరుకే అంటూ విర్ర వీగుతాండు. నాకు రేపు ఎన్నిలు అయిపోని ఎవ్వడన్నా లీడర్‍ వీని మొఖం చూస్తడా? అసంగతి వానికి అర్థం అయితలేదు... చేసుకుంటే బ్రతికటోళ్ళం.... ఎవని బుద్ది వాని కుండాలే’’ అంటూ కొడుకు మీద కోపం చేసిండు.

  నాగయ్య మారు మాట్లాడకుండా ఇంట్లోకి పోతుంటే రాంలాల్‍ కేకేసి నాగన్న ఎం చేస్తానవు. ఇందక పోదం రావే’’ అని పిలిచిండు.

  నిన్న జరిగిన అవమానం గుర్తుకు విచ్చి నాగయ్య ‘‘మళ్ళి ఎక్కడికి’’ అని అడిగిండు.

  ‘‘సత్తెన్న గోపాల్‍ ఇంటికాడ పవ్వలు పంచుతండట... పోదాం రావే’’ అన్నాడు నోరు తెరిచి....

  సత్తెన్న పేరు చెప్పెసరికి నాగయ్య కోపం కాస్త నీరుగారి పోయింది. చడి సప్పుడు చేయకుంటా రాంలాల్‍ వెంటనడిచిండు.

  ‘‘పోండ్లీ పోండడ్లీ మంది ఉచ్చ తాగటానికి... వీళ్ళకు ఎట్లా బుద్దివస్తదో’’ అంటూ వెనుక నుండి శాంతమ్మ అరుస్తున్న లెక్క చెయ్యకుండా నాగయ్య ముందుకు పోయిండు.

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రచారవేడి మరింత పెరిగింది. సత్తయ్య ఒక వైపు జానికిరాం మరో వైపు పోటిపడి రామయ్య కాలనీలో ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం చెయ్యల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాండ్లు.

  గంగమ్మ కల్లు మొద్దు కాడ రెండు పార్టీలకు చెందిన వారి మధ్య మాటామాట పెరిగింది.

  ‘‘అరెయ్‍ తెలంగాణలో బ్రతికుతు తెలంగాణకే ద్రోహం చేస్తారారా’’ అటూ పుటగాతాగిన రాజం ఓరియా కార్మికుడు మాలిక్‍ బిహరీతో గర్షణ పడ్డడు.

  మాలిక్‍ బీహరీ ఏ మాత్రం తగ్గలేదు. లప్పటికే రెండు పవ్వలు లాగించిండు. మళ్ళీ మందిని తోలుకొని కల్లు బట్టకాడికి వచ్చిండు. అది ఇది పడే సరికి మనిషకి భూమీద కాలు అగుతలేదు.

  ‘‘తెంలంగాణ మీ అయ్య సొత్తారా.. మా సొనియమ్మ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా’’ అంటూ ఎదురు తిరిగిండు.

  మాటమాట పెరిగి చివరికి తన్నులాటకు దారి తీసింది. విషయం తెలిసి సత్తెయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు.

  ‘‘ఎక్కడి నుంచి బ్రతక వచ్చిన వాల్లకే ఇంతుంటే మనకు ఎంతుండాలి’’ అంటూ ఇంతేత్తు లేచిండు.

  ‘‘ఇదే అదును అనుకున్న సుబ్బారావు’’ వాళ్ళ కింత డిమండి రావాటానికి కారణం ఆ జానకి రాంగాడు. వాని అసర చూసుకొనే వీళ్ళు ఎగురుతాండ్లు... ముందు వాని సంగతి చూడాలి’’ అంటూ సన్నగా ఎగదోసిండు.

  ‘‘నిజమే ముందు వాని సంగతి చూడాలి’’ అన్నాడు సుబ్బారావు అనుచరు శివరాం...

  జానికిరాం మొదటి నుండి కాలనీలో ఉన్న వ్యక్తి. దాంతో పరిచయాలు ఎక్కువ. ఒక్క పికే రామయ్య కాలనీలోనే కాదు. క్రషర్‍ నగర్‍లోని ఓరియా కార్మికులను కూడా సెంటిమెంటు రేకేత్తించి ఒకటి చేసిండు. దానిక తోడు తనకున్న పాత పరిచయాలతో చాపక్రింద నీరులాగా ప్రచారం సాగించిండు. టి.ఆర్‍.యస్‍ పార్టీ వాళ్ళకు కాలనీలో అంత బలమైన నాయకత్వం లేదు. అ పార్టీ తరుపున సత్తయ్య ఉన్నడు కాని, అతను యువుకుడు జానకిరాం లాగా కూలీలతో మొదటి నుండి సంబందం ఉన్న వ్యక్తి కాదు.

  నిన్న మొన్నటి వరకు సత్తయ్య తన పనెందో తాను అన్నట్టుగా బ్రతుకుతు వచ్చిండు. అటు వంటి సత్యయ్యను సుబ్బారావు దగ్గరికి తీసి జుజాల మీద చేతులేసి నీ అంతటోడు లేడు అనే సరికి ఉబ్బి పోయిండు. పనికి ఎగనామం పెట్టి రాత్రింబావాళ్లు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయిండు. అపోజిషన్‍ పార్టీని దెబ్బతీయాలంటే జానకిరాంను అడ్డు తొలగించాలని బావించిండు సుబ్బారావు. మనసులో ఆ అలోచన పెట్టుకొని మెల్లగా సత్తయ్యను ఎగదోసిండు.

  సత్తయ్య ఉబ్బిపోయి ‘‘వాని సంగతి నాకు వదిలెయ్యండి’’ అంటూ అవేశ పడ్డడు.

  ‘‘వాడెక్కడి నుంచో వచ్చి మనదగ్గర పెత్తనం చేస్తానంటే ఎట్లా కుదురుద్దీ... మనం ఎంత చెప్పితే అంత....వాని గంతి చూడాల్సిందే’’ అంటూ సుబ్బారావు మరింత రెచ్చగొట్టిండు.

  సత్తయ్య రెచ్చిపోయి, రాజయ్య, దశరథం చిట్టపల్లి చంద్రయ్య, మరికొంత మందిని వేంటేసుకొని జానికిరాం మీద దాడికి పోయిండు. అందరికందరు పుటగా తాగి ఉన్నారు. ఎవరు చక్కగా నిలబడే పరిస్థితి లేకుండా ఉంది.

  వీళ్ళు పోయే సరికి జానకిరాం ఓరియా వాళ్ళ గుడిసెల కాడ ఎదురైండు. ఆయన వెంట ఓరియా కార్మికులు కిషన్‍, చ్రకధర్‍ మరి కొంత మంది ఉన్నారు.

  జానకిరాం ను చూసే సరికి సత్తయ్యకు ఎక్కడ లేని కోపం కల్గింది. వెతక పోయిన తీగ కాలుకే తగిలిందని సంబర పడ్డడు. ‘‘నాకొడుకు ఈ సారి తప్పించుకోవద్దు’’ అంటూ అందరి కంటే ముందు ఉరికిండు.

  దూరం నుండే వీళ్ళ వాలకం చూసి జానకిరాం ప్రమాదం శంకించిండు. ఎందుకైనా మంచిది అని అతను కాస్త వెనక్కి తిరిగి ఓరియా వాళ్ళ గుడిసెల మధ్యకు వచ్చిండు. అక్క మరికొంత మంది ఓరియా కార్మికులు పోగయ్యిండ్లు.

  సత్తయ్య జట్టు వాళ్ళు బాగా తాగి ఉన్నారు. చేతిలో కర్రలు పట్టుకొని సర్రున వచ్చి రావటం తోనే జానకిరాం మీద

  దాడికి దిగిండ్లు.

  వాస్తవానికి జానకిరాం తనపై దాడి చేస్తారని ఊహించలేదు. కాని వచ్చెవాళ్ళ వాలకం చూసి కొంత అనుమానం కల్గి వెనక్కి వచ్చిండు. ఊహించని దాడికి అతను మొదట కొంత కంగారు పడ్డా అవెంటనే తేరుకొని ‘‘చూస్తారెందిరా నా కొడుకుల్ని తన్నండి’’ అంటూ తన అనుచురులను పురమాయించిండు.

అరుపులు కేకలు...

  ఓడ్డెరోళ్ళు బండలు కొట్టి కాయ కష్టం చేసి చేసి మొద్దు బారిన చేతులు. జానకిరాం ఒక్కడే ఎదురైతే పరిస్థితులు ఎలా ఉండేదో ఎమోకాని ఓడ్డరి కార్మికుల నుండి ప్రతిఘటన ఎదరయ్యే సరికి వాళ్ళ శక్తి ముందు వీళ్ళ శక్తి చాలకుంటైంది. అందులో తాగి ఉన్నారు. దాంతో ఎక్కువ సేపు నిలబడ కుండానే తోక ముడవాల్సి వచ్చింది.

  అప్పటికి జరుగ వలిసిన నష్టం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలినవి. జానికి రాం ఎంత తప్పుకున్న లాబం లేకుండా పోయిందిఉ.

  అటు సత్తయ్యకు ఇటు జానకిరాంకు తలలు పగిలినవి. కారిన నెత్తురుతో తడిసి పోయిండ్లు.

  పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు.

  శాంతి బద్రతలకు ఎటువంటి బంగం కల్గకుండా ఎన్నికలు శాంతియుతంగా చట్టబద్దంగా సజావుగా జరిగినవి. ఎన్నికల సంఘం ప్రకటించింది.

  ఎన్నికల్లో టి.ఆర్‍.యస్‍కు చెందిన అభ్యర్థి లక్ష్మణ్‍ మెజార్టీతో అపూర్వ విజయం సాధించాడు.

  ‘‘తెలంగాణ ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసానికి ప్రబల నిదర్శనం ఈ విజయం’’ అంటూ ఆ పార్టీ నాయకుడు ఉత్సాహంగా ప్రకటించిండు.

  తన ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూల దండతో వచ్చి వెంకటేశ్‍ను సత్కరించిండు.

  ‘‘ఎన్నికల్లో గెలుపు ఓటమిలు చాల సహజం కాని స్నెహం మాత్రం చిరస్థాయిగానిలుస్తుంది’’ అంటూ ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి గెలిచిన అభ్యర్థిని కౌగిలించుకొని తన సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిర్నవ్వులు చిందించారు.

  అది చూసి జనం అనందంగా చప్పట్లు చరిచారు.

 

  గవర్నమెంటు హస్పటల్లో ఉన్న కొడుకును చూడటానికి నాగయ్య, శాంతమ్మ పోయిండ్లు...

  కొట్లాటలో దెబ్బలు తాకి హస్పటల్లో పడ్డ సత్తయ్యను చూడటానికి ఏ నాయకుడు రాలేదు. వాళ్ళంత ఎన్నికల్లో గెలిచిన సంబరాల్లో మునిగి పోయిండ్లు...

  హాస్పటల్‍ బెడ్స్ లేక నేల మీద పడుకొన్న సత్తయ్య, మరో ప్రక్కన జానకిరాం కన్పించిండు.

  తలకు పెద్ద కట్టుతో ఉన్న కొడుకును చూసి శాంతమ్మకు దు:ఖం అగలేదు. ‘‘వానింట్ల పీనుగులెల్ల... ఎన్నికలో ఎన్నికలని కొడుకు ప్రాణాలు తీసిరి... ఎందుకు వచ్చిన ఎన్నికలు, ఎవ్వని బాగు చెయ్యటానికి వచ్చిన ఎన్నికలు... పెద్ద పెద్దోలంత మంచి గున్నారు. వాళ్ళ మాయలో పడి తన్నక చస్తిరి’’ అంటూ శోకం తీసింది.

  నాగయ్య కండ్లలో నీళ్ళూరినయి....

  సత్తయ్య, జానకిరాం ఒకరి మొఖాలు ఒకరు చుసుకున్నారు.

 

(అయిపొయింది)

కథలు

రేగు పండ్లు

మధ్యాహ్నం ఎండ చిటపటలాడిస్తుంది. భరింపరాని ఉక్కపోతగా ఉంది. కరెంటు కోత వల్ల ఫ్యాన్లు లేక ఊపిరి ఆడకుండా ఉంది. రాత్రి బదిలీ వచ్చినా ఉక్కపోతకు నిద్రాభంగమైంది. పగలు సరిగా నిదురపోకుంటే రాత్రి బదిలీలో పడే అవస్థ పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. అగో అటువంటి వేళప్పుడు బజార్లో రేగు పండ్లోరేగుపండ్లో" అంటు వేస్తున్న కేక వినిపించింది.

రేగుపండ్లు పేరు వినేసరికి ఎందుకో చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినవి. దాదాపు పదేండ్ల  వయసప్పుడు కావచ్చు. పక్కింటోల్ల రేగు చెట్టు మీద రేగు పండ్ల కోసం గుట్టు చప్పుడు కాకుండ ఇంటోల్ల కంట్ల పడకుంట గోడ దున్కిపోయి రాళ్ళతో రేగుపండ్లు కొట్టుకొని తినటము ఎంతో ఆనందముగా ఉండేది. పక్కింట్లో ఉండే ముసలాయన కంట్ల బడితే బండ బూతులే కాదు, ఒక్కొక్కసారి బడితె పూజ కూడా జరిగేది. అయినా అదేం పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ మేం రేగుపండ్ల కోసము దొంగతనము చేస్తుండే వాళ్ళము. ఒకటి రెండు రేగుపండ్ల కోసము నా జట్టు వాళ్ళతో తన్నులకు దిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.

చిన్ననాటి కొన్ని సంఘటనలు, అనుభూతులు మనసులో ఎక్కడో నిక్షిప్తమైపోయి, అవకాశము వచ్చినప్పుడు పురివిప్పుతాయి. ఇప్పుడు నా పరిస్థితి సరిగా అలాగే ఉంది. ఇంట్లో పిల్లలు లేరు. ఎండకాలము సెలవులు తప్పితే పిల్లలకు రెస్టు ఉండదని వారం పది రోజులు అమ్మమ్మ గారింటికి వెళ్తాము అంటు పిల్లలు పోరు చేసారు. ఈ సాకుతోనైనా తల్లిగారింటికి పోవచ్చునని మా ఆవిడ సై అంది. ఫలితంగా వారం రోజుల నుండి డ్యూటి వంటా వార్పులతో సతమతమైతాంది. అందులోను మూడు షిప్టులుగా తిర్గె బాయి పనితోని తిండి, నిద్ర, విశ్రాంతికి నిర్ణీత సమయమంటూ ఉండదు. దాంతో ప్రాణం ఉతికి అరేసినట్టుగా తల్లడం మల్లడం అయిపోతాంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడం పేర కంపినోడు చేపట్టిన చర్యల వల్ల అటు పనిలోనే కాదు బయట కూడా ప్రాణానికి సుఖం లేకుండా పోయింది.
    
 
ఇంత వరదాక దూరంగా వని ఇంచిన కేక , ఇప్పుడు కాస్త మా ఇంటి ముందే విన్పించే సరికి, అంత వరదాక అణిచి పెట్టుకున్న కోరిక చెలరేగి అప్రయత్నంగానే ఓ రేగు పండ్లమ్మా " అంటు పిలిచాను. నా పిలుపు విని ముందుకుపోతున్నదల్లా ఆగి వెనక్కి చూసింది. అప్పుడే ఆమెను పరీక్షగా చూసాను. అరువైడెబ్బయి ఏండ్ల మనిషిలా ఉంది. ఎప్పుడు ఊళ్లు తిరిగి అమ్మెటామే లెక్క కన్పించలేదు.
  

 “ఏమమ్మా రేగు పండ్లు అమ్మేది నువ్వేనాఅన్నాను అనుమానంగా.
 

"అవు బిడ్డాఅంటు దగ్గరికి వచ్చింది. బాగా అలిసిపోయినట్లుగా నీరసంగా కనిపించింది . ఎందుకో ఆమెను చూస్తే జాలివేస్తుంది. బాగా బ్రతికిన దానిలా కన్పిస్తున్నది. ఈ పనికి అలవాటు లేని దానిలా కన్పించింది.
    
ఇంత ఎండలో బయల్దేరినవు అమ్మా" అన్నాను.
ఏం చేయాలి బిడ్డ తప్పుద్దా " అంటూ మా ఇంటి ముందున్న వేప చెట్టు నీడ కాడికి నడిచింది. ఎంతో ఆయాసంగా నెత్తిమీదున్న గంపను దించుకున్నది .
      
ఆ గంపలో సగం వరకు రేగు పండ్లున్నాయి . . . అవేమంతా నజరుగా కన్పించటము లేదుగాని, సగమన్ని పచ్చిగాను , మట్టి కొట్టుక పోయినట్టుగా చిన్నగా వున్నాయి. మరి సగం కాస్త వో తీరుగా ఉన్నాయి. పండ్లేమి బాగా లేవు కదా అన్నా వాటికేసి చూస్తూ.

" ఏం చేయాలి బిడ్డా మనుష్యులకే బ్రతకలేని రోజులు వచ్చినాయి. ఇంక చెట్టు పుట్ట సంగతేమి చెప్పాలి " అంది.  ఆమె మాటలు నాలో ఆసక్తిని రేపాయి.
“ఆ,  అదేందమ్మా అలా అంటావు "
   
ఏం చెప్పాలి బిడ్డా . . ఊళ్ళె బాయిలు ఎండిపోయి తాగేందుకు నీళ్ళు దొరకక నానా బాధలు పడ్తున్నాం ఇంకా చెట్లు ఎట్లా బ్రతుకుతాయ్ " అంది.
  
 
నేనేమి బదులు పలుక లేదు.
   
 
ఆమె  మళ్ళీ  అంది " ఒకప్పుడు ఇంతింత కాయలు కాసేది అంది చెయ్యెత్తి చూయిస్తూ ఊరి మీద పిల్లలంతా మా చెట్టు క్రిందే మూగేటోళ్ళు. గీ రేగు పండ్లు అమ్ముకొని బ్రతికే రోజులు వాస్తయను కోలే ఆమె ఎర్రటి ముడతలు పడ్డ మొఖంలో ఏదో విచారం బాధ తొణికిసలాడింది.
    
నిజమే వయస్సు మళ్ళీ  పోయి సరిగా నడువలేని స్థితిలో ఎర్రటి ఎండలో రేగుపండ్లు అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి ఎవరికైనా బాధకరమే .
    
ఏం కొమురయ్య బావా రేగుపండ్లు కొనుక్కుతింటున్నావా " అంటు లింగయ్య పండ్లికిలించుకుంటు వచ్చిండు.

ఆ ఆ " అన్నా బదులుగా నవ్వుతూ . .

పొరగానివి అయిపోయినావు అంటు దగ్గరకి వచ్చి, పండ్లు అమ్మె ఆమెను చూసి ఆ ప్రయత్నంగానే ఆయన మొఖంలో విచారం కమ్ముకొన్నది.

సుశీలక్కా నువ్వు రేగుపండ్లు అమ్ముతున్నావా " అంటూ ఆశ్చర్యపోతూ  నోరెల్ల బెట్టిండు . . .

" ఎవరు లింగయ్యా" అంటు ఆమె లింగయ్యను పరీక్షగా చూసింది. అవునక్కా నేనే మీ దగ్గర పాలేరుగా పనిచేసిన లింగయ్యను" అంటూ కాళ్ళ మీద గెంతుక కూచున్నాడు "బావా ఎట్లున్నడక్కా" కోడలు భర్త చనిపోయిండట కదా! దానికి పొల్లగాండ్లు అని విన్నా ఎక్కడుంటాండ్లు" అంటు ఆత్రంగా అడిగిండు.

" బావకు చాతనయితలేదు.. మంచాల పడ్డాడు సరస్వతి, పిల్లలు నా దగ్గరే ఉంటాండ్లు" అంది ఆమె నిర్లిప్తంగా.

"ఎటువంటి దానవు ఎట్లయి పోయినావు అక్క" లింగయ్య గొంతులో విచారం కమ్ముకొంది.. కండ్లు తడారినాయి.

ఏం చేస్తాము తమ్మి కాని రోజులు వచ్చినయి ఆమె మొఖంలో అదే నిర్లిప్తత"...

అక్కన్నే ఉంటున్నాము. ఇంటి దాక రా రాధక్కా పిల్లల్ని చూస్తువు" అన్నాడు.

మళ్లోసారి వచ్చినప్పుడు కలుస్తా తమ్మి ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటికాడ సరస్వతి పిల్లలు ఎదురు చూస్తుండ్లు కావచ్చు" అంది.

వాళ్ళ మాటలు ఆసక్తిగా వింటూనే గంపలో నుండి కొన్ని పండ్లు ఏరుకొని, డబ్బులిచ్చాను. ఆమె గంప మళ్లీ నెత్తిన ఎత్తుకుంది.

"అక్క ఇంటి దాక రారాదే " అంటూ లింగయ్య మరోసారి ప్రాధేయపడ్డాడు.

ఆమె అదే సమాధానం ఇచ్చి ముందుకు కదిలింది.

లింగయ్య కండ్లలో నీళ్ళూరటము చూసి ఆమె నీకు ఇదివరకే తెలుసా" అన్నాను.

లింగయ్య గొంతు విచారంతో వణికింది. సుశీలక్కది మవూరే వాళ్ళింట్ల బాయి పనికి రాక ముందు పదేండ్లు పాలేరుగా పనిచేసిన, ఉరుకుల పోటీలల్ల బాయి పని దొరికినంక పాలేరు పని బందు పెట్టిన పాలేరు అన్నట్టె కాని సుశీలక్క నన్ను ఎప్పుడు పాలేరు లెక్కన చూడలే వాళ్ళ ఇంట్ల మనిషిని చూసినట్టు చూసింది. భూమి జాగషాన ఉండేజ . . పది ఎకరాల మాగాణి ఆరు ఎకరాల కుష్కి. వకీలు పెల్లి వాగు క్రింది రెండు పంటలు అలకగా వచ్చేది. ఒక్కతే బిడ్డను బాయి పని చేసే పొల్లగాన్ని చూసి పెండ్లి చేసిండ్లు వోడలు బండ్లు అయితాయి. బండ్లు వోడలు అయితాయి అంటారు చూడు గట్లయింది. ఒక్కగానొక్క బిడ్డ బాయిల ప్రమాదం జరిగి చనిపోయిండు. " విచారంతో లింగయ్య గొంతు పెకలలేదు మళ్ళీ తేరుకొని.
     
ఊళ్ళెకు బొగ్గు బాయిలు వచ్చినంక భూములు పోయినయి. భూముల్ల నీళ్ళింకిపోయినయి. వకీలు పల్లె వాగు పోయింది. ఊరు ఊరంతా వల్లకాడై పోయింది. చాలా  మంది ఎటో ఎటో బతక పోయిండ్లు. భూములు పోయి పంటలు పోయి, బ్రతుకు తెరువుపోయి కాళ్ళు చేతులు సక్కంగ ఉన్నోళ్ళే అడుక్కతినే రోజులు వచ్చినయి. ఇంక సుశీలక్క గురించేమి చెప్పాలిబాధతో అతని గొంతు వణికింది.
    

ఎందుకిట్లా అయితాందో ఏ మహామ్మారి పిట్ట పీడిస్తున్నదో అర్థం కాదు. ఊళ్ళెకు పోతే క్షణం ఉండ బుద్ధి కావటం లేదు.  ఊరు చుట్టూ ఉండే చింత తోపులు పోయినయి. వాటి మీద కిలకిలలాడే రామ చిలుకలు లేవు పచ్చ పచ్చని పంట పొలాలు లేవు. వాటి మధ్య పకపకలాడే పొల్లగాండ్లు లేరు. ఎక్కడ ఆకలితో నకనకలాడే మొఖాలు ఎండిపోయిన డొంకలు... కంతలు తేలిన పోరగాండ్లు... మట్టి దిబ్బలు.. బొగ్గు దుమ్ము'..
    

జీవితంలో అతి ముఖ్యమైంది ఏదో పొగొట్టుకున్నవాడి లెక్కన బాధతో అతని గొంతుపూడుక పోయింది. అతని కండ్లు వర్షిస్తున్నాయి..

నేను లింగమూర్తి మొఖంలోకి చూడలేక తలదించుకున్నాను.

డప్పోడు

‘‘చంద్రక్కా తయారైనవా? యాల్లయితాంది’ అంటూ కోటేశం కేకేసిండు.

చంద్రమ్మ గబగబ అన్నము సద్దికట్టుకుంటుంటే కోటేశం కేక వినపడ్డది.  ‘‘అయిపోయింది తమ్మి వస్తున్నా’’ అంటూ బదులు పలికి కొడుకును ఉద్దేశించి ‘‘బిడ్డా అన్నము వండి పెట్టిన,  కూర కూడా అక్కడే ఉంది,  మంచిగ తిని బడికి పో’’ అంటూ మరోసారి హెచ్చరించింది.

చంద్రమ్మ కొడుకు సుధీర్ కు ఎనిమిదేండ్లు.  పండ్లు తోముకుంటూ ‘అ అ’ అంటూ బదులిచ్చిండు.

కొడుకును చూసి చంద్రమ్మ మనసు తరుక్కుపోయింది.  సరిగా తిండి తినక బక్క చిక్కినట్టు అన్పించి మనసు చివుక్కుమన్నది.  ఇంటి పట్టున ఉండి వాడి ఆలనాపాలన చూసుకునే అవకాశము లేకుండా పోయింది కదా?  అనే దిగులు కమ్మింది.  ఆ ఆలోచన రాగానే ఆమే భర్త రాయలింగు గుర్తుకు వచ్చి మనసంతా భారమై పోయింది,  అప్రయత్నంగానే ఆమె దఋష్టి గోడకున్న మేకుకు తగిలించిన డప్పు మీదికి మళ్లింది.  కళ్ళలో నీళ్ళూరినాయి. 

ఆలోచనలను బలవంతంగా మళ్ళించుకొని గబగబ రోడ్డు మీదికి వచ్చింది.  అప్పటికే చాలా మంది కూలీలు కాడికి పోడటానికి బయలుదేరుతున్నారు.

విచారం కమ్మిన చంద్రమ్మ ముఖం చూసి కోటేశం ‘‘ ఏం అక్కా, ప్రాణము బాగా లేదా? అంత ఎట్టనో ఉన్నవు?’’ అంటూ అడిగిండు.

‘‘అదేం లేదు తమ్మి బాగానే ఉన్నా’’ అంటే దాట వేసింది.

కోటేశంకు ఆ సమాధానం సంతృప్తి  ఇచ్చినట్టు లేదు. ‘‘రాయలింగు బావే ఉంటే నీకు ఈ బాదుండేది కాదు కదా’’ అన్నాడు యధాలాపంగా.

ఆ మాట చంద్రమ్మను మరింత గాయ పరిచింది.  ఆమె ఆలోచనలు భర్త రాయలింగును చుట్టుముట్టినవి. తన బ్రతుకెందుకు ఇంత అర్దాంతరంగా ఆగమై పోయింది.  తను ఏ పాపం చేసానని ఇన్ని కష్టాలు.  ‘‘తనను ఎంతగా ప్రేమించేవాడు....తనకేదన్నా అయితే ఎంతగా విలవిలలాడేవాడు.  సుధీర్‍ కడుపులో పడ్డ కానుంచి యాడాది పిల్లవాడు అయ్యేదాక ఇంట్లో కూడా తనతో ఏ పని చేయనిచ్చేవాడు కాదు.  ఇంట్లో అన్ని పనుల్లో వేలు పెట్టి ఎంత హంగామా చేసేవాడు.’’

ఎంత మెత్తటి హృదయమతనిది.  వాడ కట్టున ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరి కంటే ముందుండే వాడు. దాంతో అతను అందరి నోట్లో నాలుక అయిపోయిండు.  దానికి తోడు అతను డప్పు వాయిస్తుంటే ఎంతటి వాళ్ళయినా తలలు ఊపవలసిందే.

మొదటిసారి ఎప్పుడు అతన్ని చూసింది తమ ఊరైన కొత్తపేటలో బద్ది పోషమ్మ జాతరప్పుడు భజన గీతాలు పాడుకుంటూ ఊరేగింపు బయలుదేరినప్పుడు అతని డప్పు చప్పుడు అందర్ని ఆకర్షించినట్టే ఆమెను ఆకర్షించింది.

డప్పు వాయిస్తూ అతను సమస్త లోకాన్ని మరిచిపోయేవాడు.  అతని సర్వశక్తులు ఎడమ చేతిలో ఒదిపి పట్టుకున్నా డప్పులో ఇమిడిపోయినట్టుగా, కుడి చేతి వేళ్ళు  లయబద్దంగా నిలువు గుడ్లు వేసుకొని తన్మయత్వంతో అందరు మునిగిపోయేవాళ్ళు.

ఎలా అచ్చింది ఆ అద్భుత నైపుణ్యం.

పెండ్లి చూపుల్లో మొదటిసారిగా అతన్ని చూసినప్పుడు అద్భుత కళాకారుడు తన వాడు కాబోతున్నందుకు ఎంత తన్మయత్వము చెందింది.

ఊళ్ళో బ్రతుకు ఎల్లక పట్నం రావడం బ్రతుకు తెరువు కోసము ఇద్దరు ఉప్పరి కూలీలుగా మారడం జరిగిపోయింది,  సుధీర్‍ కడుపులో పడ్డ తరువాత బలవంతంగా రాయలింగు, చంద్రమ్మకు కూలి మాన్పించిండు.  నేను ఉన్నాను కదా ? ఇప్పుడు నీ పనల్లా పుట్టబోయే బిడ్డను చూసుకోవడమే అంటూ ఎంతో మురిపంగా నవ్వేవాడు.

అలా కూలీ పని మానుకున్న చంద్రమ్మ భర్త అర్ధంతరంగా జరిగిపోయే సరికి బ్రతుకు దెరువు కోసం మళ్ళి కూలీ పని తప్పలేదు.

ఆ రోజు అతను చనిపోవటానికి ముందు రోజు రైల్వే స్టేషన్‍కు వెళ్ళే రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో స్పృహలేని స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు వేలాది జనం మధ్య దూరిపోయి అతన్ని ఆ స్థితిలో చూసి స్పృహ  తప్పి పడిపోయింది.

ఊరేగింపుగా కదిలిన జనం...కొన ఊపిరితో ఉన్న అతన్ని హాస్పిటల్లో జాయిన్‍ చేసారు.  కాని ఫలితం దక్కలేదు.  మరునాడు అతను శాశ్వతంగా ఈ లోకం విడిచిపోయిండు.

ఎందుకు జరిగింది.  ఎలా జరిగింది ఇప్పటికీ అర్థం కాకుండా పోయింది.  హంతకులు ఎవరు ఇంతవరకు పట్టుపడలేదు.  ప్రజా కళాకారుని హత్యపై న్యాయవిచారణ జరుపాలని ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించగా నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా పోలీసులు విచారణ ఆరంభించినా....మూడేండ్లుగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది.

‘‘అసలు హంతకులే వాళ్ళు అయినప్పుడు ఇక విచారణ ఏముంటుంది?’’ అన్నారు కొందరు.

రాయలింగు పట్నం వచ్చి కూలీ పనికి వచ్చిన కోత్తలోనే బిల్డింగు పనులు చేసే కూలీలు జీతాల పెంపుదలకై జరిగిన సమ్మె సందర్భంలో జరిగిన మీటింగులో సంఘపొల్లు  పాడిన పాటలకు డప్పు వాయించటంతో అతను మరోసారి అందరి దఋష్టిలో పడ్డాడు.

అలా మొదలయిన అతని ప్రస్థానం  మళ్ళీ  వెనక్కి తిరిగి చూడలేదు.

సంఘపోల్ల మీటింగు ఎక్కడ జరిగిన రాయలింగు తప్పకుండా అక్కడ హాజరు కావాల్సిందే.  మీటింగు ఆరంభమైనప్పుడు మొదలు మీటింగు చివరి వరకు మనిషిలో ఏ విధమైన విసుగు కాని అలిష్ట కాని కనిపించేది కాదు.  ఏదో అభూత శక్తి ఆవరించినట్టుగా పాటకు అనుగుణంగా అతని చేతులు ఆడేవి.

సంఘం మీటింగు అంటే పీడిత తాడిత జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు.  వాళ్ళ  పాటలు ఈటల్లా చొచ్చుకపోయేవి.  సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని దోపిడీని చీల్చి చెండాడి. దోపిడీ అంతము చేయటానికి నడుము బిగించాలనే సందేశముతోనే ప్రతిపాట ముగిసేది.

సహజంగానే వాళ్ళ  పాటలు, దోపిడీదారులకు కంటగింపు కల్గించేవి.  హోరెత్తే జనం పోరుకు ఆ పాటలు వంతపాడేవి.  వారిని కార్యోన్ముఖులను చేసేవి.  ఈ పరిణామం సహజంగానే పాలక వర్గాలకు మింగుడు పడలేదు.  తమ దోపిడీని, అన్యాయాన్ని ప్రశ్నించేవారిని, వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిని అణిచివేయాలని చూసినట్టుగానే, ఆ పోరాటానికి ఊతాన్నిచ్చే, నైతిక మద్దతును ప్రకటించే కళాకారులన్నా పాలకవర్గాలకు కంటగింపుగానే మారింది.

కళాకారులపై అక్రమ అరెస్టు చిత్ర హింసలు, భౌతిక దాడులు నిత్యకఋత్యమైన చోట  సహజంగానే రాయలింగుకు కష్టాల పరంపర మొదలయింది.

మొదటిసారిగా ఇంటిమీద దాడి జరిగినప్పుడు, ఎంతగా హైరాన పడ్డది అటు తరువాత అటువంటి సంఘటనలు జీవితంలో భాగమై పోయింది.  అయినా అతనిలో మార్పేమి రాలేదు.  సరికదా మరింత పట్టుదలతో ఇదంగా మామూలే అన్న ధోరణిలో అతనుండేవాడు.

‘‘ఎందుకు భయపడటము.  భయపడటానికి మనకు మిగిలిందేమిటీ చస్తామనే కదా.... అసలు మనల్ని బ్రతకనిస్తున్నది ఎక్కడ’’ అనేవాడు  ఏదౌతుందోనని భయపడిందో అదే జరిగింది.

‘‘అక్కా జాగ్రత్తగా నడువు పడిపోతావు’’ అంటూ కోటేశం జబ్బ పట్టి ప్రక్కకు లాగిండు.  లేకుంటే మురికి కాల్వలోకి పడిపోయేది.

మెయిన్‍ బజార్లో కాస్త ఖాళీగున్న చోట వేలాది మంది కూలీలు జమైండ్లు.  అందులో కొద్దిమందికే కూలీ దొరుకుతుంది.  మిగితతా వాళ్ళు ఉస్సురోమంటూ  తిరిగి పోవాల్సి వస్తుంది.  మనుషుల స్థానములో మిషన్లు వచ్చిన తరువాత పనులు కరువై పోయినవి.  దాంతో పనుల కోసము కూలీల మధ్య పోటీ పెరిగింది.  ముసలి ముతక కూలీలకు కూలీ దొరకటం కష్టమై పోయింది.  కంట్రాక్టర్లు నజరుగా కనిపించే వారిని యువకులను ఏరుకొని మాత్రమే పనులకు పిలుస్తున్నారు.  ఈ పోటీవల్ల, పనుల లేమి వల్ల వారితోని గతంలో కంటే ఎక్కువ గొడ్డు చాకిరి చేయించుకుంటాండ్లు.  అయినా మారుమాట మాట్లడని పరిస్థితి  వచ్చింది.

చంద్రమ్మ ముందుకొస్తుంటే ‘‘గా ఆడామే ఎందుకు?’’అంటూ కంట్రాక్టరు అడ్డుచెప్పిండు.

‘‘లేదు సారు మంచిగ పన్జెస్తది’’ మేస్త్రీ రాజీరు కంట్రాక్టరుకు సర్దిచెప్పిండు.

కంట్రాక్టరు అయిష్టంగా తలూపిండు,

రాయలింగు, రాజీరు చాలా ఏండ్లు కలిసి పనిచేసిండ్లు.  రాయలింగు పట్ట తోటి కార్మికులకు ప్రేమ ఆరాధన భావముండేది.  ఆ అభిమానమే చంద్రమ్మకు ఇంకా పని దొరికేలా చేస్తుంది.

రోజు కూలీ దొరకక తిండికి కటకటలాడుతూ పిల్లలకు కూడా కడుపు నిండా పెట్టలేని కూలీలు నిస్సహాయంగా విలవిలలాడుతున్నారు.

‘‘అక్కా సామాన్లు పట్టుకొని మనోళ్ళతోని పో’’ రాజీరు అనునయంగా అన్నాడు.  కాస్త ఆలస్యం అయితే కంట్రాక్టరు మనసు ఎక్కడ మారుతుందో ఏమోనని ఆయన భయం ఆయనది.

తట్టా చుట్ట బట్ట పట్టుకొని కూలీల గుంపులో కలిసింది.  కంట్రాక్టరు వాళ్ళందర్ని తోలుకొని మార్కెటు రోడ్డులో నిర్మిస్తున్న కొత్త అపార్టుమెంటుకు స్లాబింగు జరుగుతుంది.  కూలీలందర్ని అక్కడికి తరలించిండ్లు.

స్లాబింగు పనంటే నిముషం రికాము లేకుండా కూలీలు యంత్రల్లా పని చేయాలి.  క్షణం అలస్యం అయితే కంట్రాక్టరు కాదు తోటి కూలే చిర్రుబుర్రులాడే స్థితి.

పని ముసిగే సమయానికి ప్రాణం ఉతికి ఆరేసినట్టు అయిపోతది.  ప్రాణమంతా సొడసొడలు అయిపోతది.

పనైపోగానే చంద్రమ్మకు ఇంటిమీద జ్యాస పోయింది,  ‘‘పొల్లగాడు ఎట్లున్నడో ఏమో, తిన్నడో తినలేదో...’’ తల్లిప్రాణం తల్లడిల్లగా ఏగిరంగా ఇంటి దారి పట్టింది.

ఇంటిరి సమీపిస్తున్న కొద్దీ లీలగా డప్పుమోత.  తానేం కలకనటం లేదు కదా!  అచ్చంగా ఆయన వ్రేళ్ళు  డప్పు మీద కదలాడినప్పుడు వచ్చే హృద్యమైన చప్పుడు? అంతా భ్రాంతా? ఒకటి రెండు సార్లు చెవులు రిక్కించింది.  నిజమే అబద్ద కాదు అది తానుండే గుడిసే నుండి వస్తున్నట్టుగా వినిపించింది.  అయినా నమ్మకం కల్గటం లేదు.  తాను నిజంగా కల కంటున్నదేమో? కాళ్ళు అప్రయత్నంగానే ఇంటి వైపు పరుగు పెడుతున్నాయి,  గుండే గొంతుకలోనతరట్లాడే ఆవేదనలు.

గుడిసె ముందు అరుగు కొసన అచ్చంగా ఆయన కూచున్నట్టుగానే కూచున్న కొడుకు సుధీర్‍ చేతిలో చిలకొయ్యలు ఆయన గుర్తుగా వ్రేలాడే డప్పు దాని మీద సుతిమెత్తగా కదలాడే చిన్న చేతులు.

అది చూసే సరికి ఒక్కసారిగా ఆమె మనసులో భయం, ఆనందం కలగలిసి పోయింది.  అప్రయత్నంగానే కళ్ళలో నీళ్ళు ఉబికాయి.

వారసత్వంగా కొడుక్కి  అచ్చిన కళ గురించిన ఆనందమో లేక కళ ప్రజల కోసమే అని నమ్మిన ఆయన వారసత్వము కొడుక్కి అబ్బకుండా పోతుందా అన్న ఆందోళనో కాని ఆమె కండ్ల వెంట ధారాపాతంగా కన్నీళ్ళు  ఉబికసాగాయి.

అమ్మను చూసిన సుధీర్   కొడ్తున్న డప్పు ఆపి అచ్చంగా ఆయన  చూసినట్టుగా నిర్మలంగా కండ్లు చికిలించి చిర్నవ్వు చిందిస్తున్న కొడుకును ఆబగా రెండు చేతులతో ఎత్తుకొని గుండెలకు అదుముకొన్నది.

ఆమె కండ్లు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.

అది దు:ఖమో ఆనందమో ఆమెకు కూడా అర్థం  కాని స్థితిలో....

ఇంటర్వ్యూలు

ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం వ్రాయాలన్నదే నా అకాంక్ష – పి. చంద్‍

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు పి. చంద్‍ ఇచ్చిన ఇంటర్వ్యూ

1              మీ వక్తిగత జీవితం గురించి చెప్పండి?

                నేను 11-09-1954లో వరంగల్‍లోని ఉర్సు ప్రాంతంలో పుట్టాను. నా అసలు పేరు వూరుగొండ యాదగిరి. మా నాన్న మల్లయ్య అజాంజాహి మిల్లు కార్మికుడిగా పనిచేసారు. అమ్మ వీరమ్మ బీడి కార్మికురాలుగా పనిచేసేది. 1975లో డిగ్రీ తరువాత 1977లో సింగరేణిలో ఉద్యోగంలో చేరాను. దాదాపు మూడున్నర దశాబ్దాలు పనిచేసాను. ఆ విధంగా కార్మిక కుటుంబంలో పుట్టి కార్మికుల మధ్య పనిచేయటం వలన సహజంగానే అది నా అలోచనల మీద ప్రభావం చూపింది. కార్మికుల మీద ఎక్కువగా సాహిత్యం వ్రాయాటానికి కారణమైంది.

2              మీరు సింగరేణిలో ఉద్యోగం చేరునాటికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

                ఆ రోజుల్లో కార్మికుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. మురికి కూపాల్లాంటి కార్మిక వాడల్లో ఏ కనీస అవసరాలు ఉండేవి కావు. పిల్లలు చదువుకోవటానికి స్కూళ్లు కాని, రోగమొస్తే మందులు కాని ఉండేవి కావు. మేనేజుమెంటు, కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టించుకునేది కాదు. రక్షణసూత్రాలు కూడా సరిగా అమలు జరపకపోవటం వలన నిత్యం బొగ్గు బావుల్లో ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగి కార్మికుల రక్తం చిందని రోజు ఉండేది కాదు. బాయి  దొరల (అధికారులు) దొరతనం ఎనకటి నిజాంకాలం నాటి ఫ్యూడల్‍ దొరల దొరతనం గుర్తుచేసేది. కార్మికులచే దొర అని పిలిపించుకుంటూ వారి మీద జులుం చెలాయించేవాళ్లు. కట్టు బానిసల్లా, ఇండ్లలో పని మనుషులుగా వాడుకునేవారు. కార్మికుల సంక్షేమం చూడాల్సిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకునే వాళ్ళుకాదు. మేనేజుమెంటుకు అమ్ముడుపోయి ఫక్తు పైరవీకారులుగా మారిపోయి, ప్రతి చిన్న పనికి కూడా కార్మికుల నుండి లంచాలు గుంజేవాళ్ళు. ఇందుకు కమ్యూనిస్టు యూనియన్స్ కూడా మినాహాయింపు కాదు. దాంతో మేనేజుమెంటు కార్మిక వ్యతిరేక చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దానికి తోడు బయట సామాజిక పరిస్థితులు కూడా అధ్వాన్నంగా ఉండేవి. వాడవాడన వెలిసిన సారా దుకాణాలు, బ్రాండిషాపులు, కల్లు దుకాణాలు కార్మికుల మూల్గుల్ని పీల్చాయి. కార్మికుల ఇల్లు, వొళ్ళు గుల్ల అయ్యేది. ఆ రోజుల్లో కాలరీ ప్రాంతంలో గూండాయిజం పెద్ద ఎత్తున కొనసాగింది. స్త్రీలపై అత్యాచారాలు, బెదిరించి డబ్బులు గుంజుకోవటం, కొట్టడం వంటివి యదేచ్చగా సాగినవి. గూండాల మధ్య తరుచు గ్యాంగ్‍ వార్‍లు జరిగి హత్యలు చేసుకొనేవాళ్ళు. గూండాలకు రాజకీయ నాయకుల, యూనియన్‍ నాయకుల అండదండలుండేవి. శాంతి భద్రతల రక్షణకు పోలీసులు ఉన్నమాటే కాని రాజకీయ జోక్యం వలన గూండాల జోలికి పోయేవాళ్ళు కాదు. దాంతో గూండాయిజం పెట్రేగి పోయింది. ఈ అస్తవ్యస్త సామాజిక పరిస్థితులే తదనంతరకాలంలో విప్లవ కార్మికోద్యమం ఆవిర్భవించటానికి కారణమైంది.

3              మీ సాహిత్యం ఎక్కువగా సింగరేణి కార్మికుల మీద వ్రాసారు. అందుకు కారణం ఏమిటి?

                నా జీవితంలో ముఖ్యమైన భాగం సింగరేణి కార్మికుల మధ్య గడిచింది. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఆరాట పోరాటాలు, విప్లవోద్యమం ఆవిర్బవం, ఎదుగుదల, చివరికి అణిచివేతకు గురి కావటం వరకు జరిగిన పరిణామాలకు నేను సజీవ సాక్షిని.

                ప్రజలు బ్రతుకలేని దుర్భర పరిస్థితుల నుండి పోరాటాలు పుడుతాయి. ఆ విధంగా విప్లవోద్యమం పుట్టుకొచ్చింది.1975 ఎమర్జెన్సీ కాలంలో కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. హక్కుల హరింపు, క్యాజువల్‍ వర్కర్స్, టెంపరరీ వర్కర్స్ పేర కార్మికులతో వెట్టిచారికి చేయించుకోవటం ఎక్కువైంది. అంతకు ముందు సాధించుకొన్న ‘బొనసు’ వంటి హక్కులు కోతకు గురైనవి. ఇట్లా అనేక రుపాల్లో కార్మికుల మీద తీవ్రమైన దాడి కొనసాగింది. అప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా చెలామణి అయిన ఏఐటియుసి, ఐయన్‍టియుసి రెండు కూడా ఎమర్జెన్సీని సమర్థించటంతో అడిగేవారు లేక కార్మికుల పరిస్థితి అధ్వానమైంది. బాయి దొరల జులుం పెరిగి పోయింది. చార్జీషీట్లు, డిస్మిస్‍లతో అనేక మందిని వేధించారు.  మరోవైపు బయిట గూండాయిజంతో కార్మికులను ఊపిరి సలుపనియ్యలేదు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కేంద్రంగా రాడికల్స్ కార్మికుల సమస్యలు తీసుకొని పోరాడటం మొదలైంది.1981 ఏప్రిల్‍లో జరిగిన మస్టర్ల కొత చట్టం వ్యతిరేకంగా యాబై అరురోజులు సుదీర్ఘ సమ్మె పోరాటం చేసి విజయం సాధించారు. ఆ పోరాట క్రమంలోనే విప్లవ కార్మిక సంఘమైన ‘‘సింగరేణి కార్మిక సమాఖ్య’’ అవిర్భవించింది. అటు తరువాత కాలంలో ‘‘సికాస’’ దాదాపు పాతిక ఏండ్లు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించింది. జాతీయ సమస్యలైన ‘వేజుబోర్డులు’ వంటి వాటిని పరిష్కరించి సింగరేణిలో బలమైన విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించింది. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించింది. సికాస కేవలం  కార్మికుల సమస్యలపైనే పోరాటాలు చేయలేదు. సారా వ్యతిరేక పోరాటం, ఇండ్ల స్థలాల కోసం, విద్య, వైద్య సౌకర్యాల మెరుగు కోసం, గూండాయిజంకు వ్యతిరేకం వంటి అనేక సామాజిక సమస్యలపై పోరాడింది. నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలను ఎజండా మీదికి తెచ్చి వారిని చైతన్య పరిచింది. అందులో పాల్గోనెలా చేసింది.

                అయితే ఈ పోరాటాలు ఏవీ యాదృచ్చికంగా వచ్చినవి కావు. అమరుల త్యాగాల ఫలితంగా ఇదంతా సాధ్యమైంది. సింగరేణిలో మొగ్గతొడుగుతున్న విప్లవ కార్మికోద్యమాన్ని మొగ్గలోనే త్రుంచి వేయాలని పాలకులు కౄర నిర్భంధం అమలు జరిపారు. దేశంలోని సకల సాయుధ బలగాలను కోల్‍ బెల్ట్లో మోహరించి కవాతు చేయించారు. దాదాపు వందమంది విప్లవకారులను బూటకపు ఎన్‍కౌంటర్‍ పేర కాల్చి చంపి ‘నల్లనేల’ ను రక్తసిక్తం చేసి అణిచివేసారు.

                నా కండ్ల ముందు జరిగిన ఈ పరిణామాలు నన్ను బాగా కదిలించినవి. ఎప్పటికప్పుడు వాటిని రికార్డు చేసాను. అది కేవలం కథలు, నవలల రూపంలోనే కాదు వ్యాసాలుగా, పత్రిక రచనలుగా, కార్మిక ఉద్యమ చరిత్రగా అనేక రూపాల్లో ఆ చరిత్రను నమోదు చేసాను.

4              ఇంత వరదాక మీరు కథ నవలా రచయితగానే తెలుసు, మీరు వచన రచనలు కూడా చేసారని ఇప్పుడే తెలుస్తున్నది. మీ వచన రచనలు ఏమిటి?

                వచన రచనలు చాలానే చేసాను. అప్పుడున్న పరిస్థితుల వల్ల అవేవి నా పేరు మీద వచ్చినవి కావు. వివిధ మిత్రుల పేరు మీద, సంస్థల పేరు మీద వచ్చినవి. అందులో కొన్ని...

1. సికాస రెండవ మహసభ సందర్భంగా విడుదల చేసిన ‘‘సింగరేణి బొగు్గ గనుల్లో రగిలిన పోరాటాలు వర్దిల్లాలి’’

2. పరస్పెక్టివ్‍ వారు ప్రచురించిన ‘‘సింగరేణి వాస్తవ పరిస్థితి ఒక నివేదిక’’

3. వనరుల తరలింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సింగరేణి నేపథ్యంలో వచ్చిన ‘‘చర్చ తెలంగాణ వ్యాసాలు’’

4. చర్చ సింగరేణి వ్యాసాలు

                5. సంస్కరణలు వచ్చిన తరువాత ఒక ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో సంస్కరణలు ఎట్లా అమలు జరిపింది ఒక కేసు స్టడీలా తెలియచెప్పే ‘‘సింగరేణి సంస్కరణలు - ఒక పరిశీలన’’

                6. మయూరి పబ్లికేషన్‍ ప్రచురించిన ‘‘తరతరాలపోరు’’

                7. కోల్‍ పిల్లర్స్ అసోసియేషన్‍ మహసభల సందర్భంగా విడుదల చేసిన ‘‘నూతన స్టాడింగ్‍ అర్డర్‍ - ఒక పరిశీలన’’

                8. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రచురించిన ‘‘బొగ్గుగని కార్మికుల వేతనాలు - ఒక పరిశీలన’’

                9. ‘‘టిబియుకెయస్‍ పదేండ్ల ఉద్యమ ప్రస్థానం’’

                10. సింగరేణి నేపథ్యంలో ‘‘శీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టు’’

                11. హెచ్‍యంయస్‍ వాళ్లు ప్రచురించిన ‘‘వేజు బోర్డు ఒప్పందాలు ఒక పరిశీలన

పైన పేర్కొన్నవన్నీ పుస్తకాలుగా వచ్చినవి. ఇవి కాకుండా లోకల్‍ పత్రికలైన ‘న్యూస ఫోకస్‍’, ‘చర్చ’ ‘మావూరు’ వంటి పత్రికల్లో ‘లేబరోని గోడు’, ‘తుపాకి రామన్న కథలు’, ‘తట్టా - చమ్మాస్‍’ వంటి శీర్షికలు నిర్వహించాను. అనేక మంది పత్రికా విలేఖర్లకు ‘బినామి’ రైటర్‍గా వందలాది వ్యాసాలు వ్రాసి ఇచ్చాను.

5              మీ మొదటి కథ ఏ సందర్భంలో వచ్చింది?

                మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా కార్మికులు యాబై అరు రోజులు సమ్మె చేసి విజయం సాధించారని చెప్పాను కదా. ఆ సమ్మె సందర్భంలో అసలు సమ్మె ఎలా అరంభమైందో తెలియ చేస్తూ వ్రాసిన ‘‘సమ్మె’’ కథ నా మొదటి కథ. అది ‘కార్మిక’ పేరు మీద సృజనలో అచ్చయింది.

6              ‘‘కార్మిక’’ అన్నకలం పేరుతో అనేక మంది వ్రాయాటానికి గల కారణం?

‘‘కార్మిక’’ అన్న కలంపేరు నిర్ధిష్టంగా అనుకొని ప్రారంభించింది కాదు. నేను నా మొదటి కథ ‘‘సమ్మె’’ వ్రాసినప్పుడు తీవ్ర నిర్భంధం కొనసాగుతుండే. దాంతో స్వంత పేరుతో పంపటం ఇష్టంలేక కార్మికుల మీద వ్రాసిన కాబట్టి ‘‘కార్మిక’’ అనే కలం పేరుతో సృజనకు పంపాను. అది అట్లా అచ్చయింది. అటు తరువాత ఆ సమ్మెకు నాయకత్వం వహించిన నల్లా అదిరెడ్డి, మహ్మద్‍ హుస్సేన్‍ కూడా అదే సమ్మె మీద వరుసగా ‘‘నిర్భంధం’’, ‘‘విస్తరణ’’ అనే కథలు వ్రాసారు. వాటిని కూడా ‘‘కార్మిక’’ పేరు మీద పంపించటం అదే పేరు మీద అచ్చుకావటం జరిగింది. నాలుగు భాగాలుగా సాగే ‘‘సమ్మె’’ కథలోని చివరిబాగమైన ‘‘విజయం మనదే’’ అనే కథను మళ్ళీ నేను వ్రాసాను. ఆ విధంగా ‘‘సమ్మె’’ కథ, కార్మిక కలం పేరు రూపుదిద్దుకున్నది. తదనంతర కాలంలో ‘కార్మిక’ పేరు మీద వచ్చిన కథల్లో  సగానికిపైగా నేను వ్రాసినవే  ఉన్నాయి. ఒకే కలం పేరుతో అనేక మంది రచయితలు వ్రాయటం వలన సాహిత్య చరిత్ర వ్రాసేటప్పుడు ఎవరు ఏ కథ వ్రాసారో తెలియక తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంది. ‘‘సమ్మె’’ కథ విషయంలోనూ అదే జరిగింది.

7              మీరు అనేక మారు పేర్లతో రచనలు చేయాటానికి కారణం ఏమిటి?

                వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. దోపిడీ పీడనలతో కూడుకున్న సమాజంలో ప్రజలు జరిపే ఏ న్యాయపోరాటమైన పాలక వర్గాలకు మింగుడు పడవు. అటువంటి పోరాటాలను, వాటికి నాయకత్వం వహించిన నాయకులను ప్రభుత్వం సహించదు. భౌతికంగా నిర్మూలించటానికైనా వెనుకాడదు. అలాగే ప్రజా పోరాటాలను ఎత్తి పట్టిన రచనలను, రచయితలను కూడా సహించదు. అందుకే దాదాపు ఇరవై మారు పేర్లతో వ్రాయాల్సి వచ్చింది.

8              ఇంతవరకు మీరు సింగరేణి కార్మికుల మీద వ్రాసని నవలలు ఏమిటి?

                సింగరేణి కార్మికుల మీద ఇంత వరకు పదమూడు నవలలు వ్రాసాను. అందులో ఎనిమిది నవలలు ప్రచురించబడినవి. మిగితావి ప్రచురించాల్సి ఉంది.

                ప్రచురించిన నవలలు

1. సింగరేణిలో తొలినాటి కార్మికోద్యమాన్ని తెలిపే ‘‘శేషగిరి’’ నవల

2. విప్లవ కార్మికోద్యమంలో తొలి అమరురాలు జిలాని బెగంపై ‘‘నెత్తుటి ధార’’

3. సింగరేణి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన నాయకుడు నల్లా అదిరెడ్డి మీద ‘‘విప్లవాగ్ని’’

4. ఎన్‍కౌంటర్‍లో అమరుడైన ఏఐఎఫ్‍టియు నాయకుడు శ్రీదరి రాయమల్లు మీద ‘‘శ్రామిక యోధుడు’’

5. సింగరేణిలో రాజ్యహింసమ తెలియచెప్పే ‘‘హక్కుల యోధుడు బాలగోపాల్‍’’

6. గోదావరిఖని 8ఎ బొగ్గు గని ప్రమాదంలో ఒక సారి పదిమంది కార్మకులు చనిపోయిన విషాద సంఘటనను  ‘‘ఒక కన్నీరు’’

7. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణి కార్మికులు జరిపిన ‘‘సకల జనుల సమ్మె’’

8. సింగరేణి ప్రాంతకవి మల్లావఝుల సదాశివుని జీవితంపై వ్రాసిన ‘‘తలాపున పారే పాట’’ ప్రచురించబడినవి.

సింగరేణి నేపథ్యంలో వ్రాసిన నవలలు ఇంకా ప్రచురించాల్సినవి.

1. విప్లవ కార్మికోద్యమ అవిర్భవాన్ని తెలిపే ‘‘బొగ్గులు’’ నవల

2. ఓపెన్‍కాస్టు నిర్వాసితుల ప్రజల కన్నీటి కథ ‘‘భూ దేవి’’ నవల

3. తీవ్ర నిర్భంధాల మధ్య వేజుబోర్డు సాధనకోసం కార్మికులు జరిపిన మూడు రోజుల సమ్మెపై ‘‘స్ట్రయిక్‍’’ నవల

4. అరాచకవాది

5. మావూరి కథ - నవలలు ప్రచురించాల్సి ఉంది.

9              సింగరేణి నేపథ్యం కాకుండా మీ ఇతర నవలలు ఏమిటి?

1. ప్రముఖ ట్రేడ్‍ యూనియన్‍ నాయకుడు కె.ఎల్‍. మహింద్ర జీవిత అధారంగా ‘‘అంతర్జాతీయ శ్రామిమ యోధుడు’’

2. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ‘‘బండ్రు నర్సింహులు’’ జీవిత కథ

3. కేంద్ర మాజీమంత్రి జి. వెంకటస్వామి జీవిత చరిత్ర ‘‘మేరా సఫర్‍’’

4. ప్రముఖ బిసి నాయకుడు తెలంగాణవాది ముచర్ల సత్యనారణ మీద ‘‘ధిక్కార కెరటం’’

5. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వ్రాసిన నవలిక ‘‘తెలంగాణ తల్లి’’

6. నల్లమల విప్లవోద్యమాన్ని చిత్రించిన ‘‘నల్లమల’’ నవలలు ప్రచురిచంబడ్డాయి.

ఇంకా  గ్రానైట్‍ క్వారీలకు వ్యతిరేకంగా వ్రాసిన ‘‘దేవుని గుట్ట’’ వంటి నవలలు ప్రచురించాల్సి ఉంది.

10           మీ రచనల్లో ఎక్కువ భాగం జీవిత చరిత్రలున్నాయి. వాటిని ఎట్లా అర్థంచేసుకోవాలి?

                నిజమే నేను వ్రాసిన వాటిలో ముప్పాతిక భాగం జీవిత చరిత్రలే ఉన్నాయి. అయితే ఆ జీవిత చరిత్రలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావు. వివిధ సందర్భాల్లో ప్రజలు జరిపిన పోరాటాలు, ఆ పోరాటాల్లో పాల్గొని వాటికి నాయకత్వం వహించిన వ్యక్తుల జీవితం అధారంగా ఆ పోరాటాల చరిత్రను ముందు తరాలకు అందించాలనే తాపత్రయంలో వ్రాసాను.

11           ‘‘శేషగిరి’’ నవల ఎందుకు వ్రాసారు? అక్రమంలో ఎదురైన సాధకబాదకాలు ఏమిటి?

                ప్రజా పోరాటాలు ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు తమ గత పోరాటాల మంచి చెడ్డలను మననం చేసుకుంటారు. చరిత్ర మరుగున పడిపోయిన ప్రజా పోరాట యోధులను గుర్తు చేసుకుంటారు. మరోమాటలో చెప్పాలంటే ప్రజలు తమ చరిత్రను తామే తవ్వి తీసుకుంటారు. తద్వారా తమ పోరాటాలను మరింత పదును పెట్టుకుంటారు. అట్లా సింగరేణిలో   విప్లవ కార్మికోద్యమ నేపథ్యంలోనే ‘‘శేషగిరి’’ నవల వచ్చింది.

                1886లో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభం జరిగినప్పటికీ 1940 వరకు ఎటువంటి యూనియన్‍ కార్యకలాపాలు లేవు. నాటి బ్రిటిష్‍ వలస వాద దోపిడి, నిజాం ప్యూడల్‍ దోపిడి కలగలిసి పోయి కార్మికుల్లో ఎటువంటి యూనియన్‍ కార్యకలాపాలు జరుగకుండా అణిచివేసారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో కా।। దేవూరి శేషగిరి రావు నాయకత్వంలో కమ్యూనిస్టులు తీవ్ర నిర్భంధాల మధ్య సింగరేణిలో యూనియన్‍ కార్యకలాపాలు ప్రారంభించి కార్మికులను సంఘటిత పరిచి తమ హక్కుల కోసం పోరాడే యోధులుగా తీర్చిదిద్దారు. 1948 మే 15న కా।। శేషగిరిరావు అతని ఇద్దరు అనుచరులను నిజాం పోలీసులు కాల్చిచంపారు. మహోజ్వలమైన ఆ పోరాటం గురించి చరిత్రలో పెద్దగా నమోదు కాలేదు. కాని కార్మికుల్లో శేషగిరిరావుకున్న పలుకుబడి అరాధన భావం నన్ను అశ్చర్యచకితున్ని చేసింది. ఆయన గురించి వ్రాయాలన్న పట్టుదలను పెంచింది. 1990 ప్రాంతంలో నేను నా ప్రయత్నం మొదలు పెట్టాను. ఆయనతో పనిచేసివారు అప్పటికింకా బ్రతికి ఉన్న వారిని అనేక మందిని కలిసాను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారిచ్చిన సమాచారాన్ని దాదాపు ఐదారు వందల పేజీల సమాచారాన్ని సేకరించాను. అనాటి పని పరిస్థితులు, మేనేజుమెంటు విధానం, సామాజిక పరిస్థితులు, యూనియన్‍ జరిపిన పోరాటాలు గురించి సమగ్రమైన సమాచారం సేకరించాను. దాంతో పాటు ఆనాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాట క్రమాన్ని మొత్తంగా అధ్యయనం చేసి ఒక అవగాహనకు వచ్చిన తరువాత దాన్ని నవల రూపం ఇవ్వటానికి మొత్తంగా ఐదు సంవత్సరాలు పట్టింది. ఆ నవల మొదట స్థానికంగా వెలువడే ‘చర్చ’ అనే దిన పత్రికలో సీరియల్‍గా వచ్చినప్పుడు కార్మికులు బావుల మీద, ఇండ్లల్లో గుంపులు గుంపులుగా చదువుకున్నారు. పత్రిక సర్క్య్లేషన్‍ అమాంతం రెండింతలైంది. కార్మికుల నుండి వచ్చిన అదరణ నా శ్రమను మరిపించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో అనేక నవలలు వచ్చాయి కాని కార్మిక నేపథ్యంలో వచ్చిన నవలగా ‘‘శేషగిరి’’ నవల ప్రత్యేక స్థానం పొందింది.

12           మీ నల్లమల నవలను ఏ సందర్భములో నుండి చూడాలి?

                విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుంది. వారి శక్తి యుక్తులను బయిటికి తీసి చారిత్రక పురుషులుగా చేస్తుంది. అందుకు సజీవ ఉదాహరణ ‘‘బుర్ర చిన్నన్న’’ జీవితం. పెద్దపల్లి తాలుకా మంగపేట కునారం గ్రామంలో ఒక సామాన్య గౌడ కులంలో పుట్టిన చిన్నన్న ఎడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 1980 ప్రాంతంలో  ‘పీపుల్స్వార్‍’  ఉద్యమంలోకి వచ్చి 2006లో ఎన్‍కౌంటర్‍లో చనిపోయే నాటికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ‘మాధవ్‍’ గా పనిచేసాడు ఆధ్యంతం త్యాగపూరితమైన ఆయన జీవితం నన్ను ప్రభావితం చేసింది. నల్లమల నవల వ్రాయటానికి కారణమ