కథలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

అంతరాత్మ

విశాలమైన హాలు .. పెద్ద డైనింగ్ టేబుల్, టేబుల్ నిండా రకరకాల వంటకాలు, టేబుల్ పై ప్లేట్లో అన్ని వడ్డించి నిశ్శబ్దంగా పక్కకు జరిగి వినయంగా నిలుచున్న పని మనిషి.

పైన మేడం మీధ నుంచి దిగి వచ్చాడు శంకర్ నారాయణ.

రావడం తోటి పనిమనిషి నమస్కారం చేసింది.

తల పంకిచి మెల్లగా  కుర్చీలో తినడానికి కూర్చున్నాడు శంకర్ నారాయణ.

“అయ్యా .. ఈరోజు పని అయిపోయింది, ఇంటికి వెల్లమంటారా..” అడిగింది.

వెళ్ళమన్నట్లు తలూపాడు.

పనిమనిషి మంగమ్మ నాలుగడుగులు వేసిందో లేదో, తింటున్న అన్నం పొలమారి, గట్టిగా దగ్గు వినిపించడంతో   వెనక్కి చూసింది.

అప్పటికే గుండె పట్టుకుని కింద పడిపోయాడు శంకర్ నారాయణ.

అని పిలుస్తూ శంకర్ నారాయణ నేను వచ్చి పడిపోయాడు అర్థమైంది శంకర్నారాయణ కూడిన నొప్పి వచ్చిందని మీకు

హడావిడిగా అంబులెన్స్ కి ఫోన్ చేసింది మంగమ్మ అంబులెన్స్ వచ్చి శంకర్ నారాయణ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది గతంలోని ధనవంతుడైన శంకర్ నారాయణకి కార్పొరేట్ హాస్పిటల్ లో మంచి ట్రీట్మెంట్ త్వరగానే ఆరంభమైంది. శంకర్ నారాయణను ఐసీయూలో పెట్టారు. శంకర్ నాయన శరీరమంతా దాదాపు కదల్లేని స్థితిలో ఉంది. ఆలోచనలు విపరీతంగా ఉంది తెలియకుండానే శంకర్ నారాయణ తన గతం లోకి వెళ్ళిపోయాడు.

 

                                                                              ***

శంకర్ వయస్సు పన్నెండు సంవత్సరాలు ...

అన్నం తింటున్నాడు.  మొత్తం కోడి గుడ్డు నాకే పెట్టమ్మా” కోపంగా అరిచాడు శంకర్

“అదేంటి రా అక్క కూడా ఉంది కదా.. మీరు ఇద్దరు చెరిసగం తినాలి బాబు..” వాళ్ళ అమ్మ సర్ది చెప్పింది.

“అక్క, ఆడపిల్ల కదా అక్క తినకున్నా, ఏమి కాదు నేను మగపిల్లవాణ్ణి బాగా తినాలి అని నాన్న చెప్పారు కదా. నాకు మొత్తం కోడి గుడ్డు పెడతావా లేక నాన్నకు చెప్పమంటావా?” మొండిగా వాదించాడు శంకర్.

“పోనీలే అమ్మ, మిగిలిన సగం కూడా తమ్ముడికి ఇచ్చేస్తాను నాన్న వస్తే మళ్లీ నిన్ను కొడతారు” బాధగా అంటూ తన  ప్లేట్లో ఉన్న సగం కోడిగుడ్డుని తమ్ముడు ప్లేట్లో వేసేసింది సరిత.

వీడు కూడా వీడి నాన్న లాగానే తయారవుతాడా..అని బాధ గా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది శాంతమ్మ.

 

                                                                                            ***

 

శంకర్ నారాయణ వయసు 17 సంవత్సరాలు..

డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజ్ నుండి ఇంటికి రాగానే తన కంటే రెండేళ్లు పెద్దది అయినా  తన అక్క సరితను, చెంపపై గట్టిగా కొట్టాడు.

“ఎందుకురా నన్ను కొడుతున్నావ్” షాక్ తో ఏడుస్తూ అడిగింది సరిత.

వంట ఇంట్లో నుండి వాళ్ళ అమ్మ వచ్చి “ఆడ పిల్లని, నీ కంటే పెద్ద దాన్ని పట్టుకొని చెంప పై కొడతావా ..” గట్టిగా కోప్పడింది శాంతమ్మ.

“అవునమ్మా..  ఆడపిల్ల అయ్యుండి ఈ రోజు  వాళ్ల క్లాస్మెట్ అబ్బాయితో కాలేజ్ లో  మాట్లాడింది” అన్నాడు శంకర్.

 

“మాట్లాడితే తప్పా..?

“నువ్వు మాట్లాడట్లేదా  అందరు అమ్మాయిలతో” టి ఏడుస్తూ అంది సరిత.

“నేను నువ్వు ఒకటేనా, నేను మగపిల్లవాణ్ణి నాతో నీకు పోలికేంటి?” అహంకారంగా హుంకరించాడు శంకర్.

 

                                                                                 ***

శంకర్ నారాయణ వయసు 24 సంవత్సరాలు ....

“సర్, ప్రేమించా అన్నారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు, ఇప్పుడు నా సర్వస్వం మీకు అర్పించాక  ఇలా మాట్లాడుతున్నారు,   ప్లీజ్ సర్ నన్ను పెళ్లి చేసుకోండి సార్ లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది సార్” కన్నీళ్ళతో కాళ్ళు పెట్టుకుంది 17 ఏళ్ళ సౌజన్య.

అయినా శంకర్ మనసు కరగలేదు.  పైగా “చూడు నువ్వు నేను ఇద్దరం ఎంజాయ్ చేసాము, పెళ్లి లాంటి ఆశలు ఏం పెట్టుకోకు. అయినా నువ్వు ఎంతమందితో తిరిగావో ఎవరికీ తెలుసు” పెడసరంగా అన్నాడు శంకర్.

“ట్యూషన్ కనీ మీ దగ్గరికి వస్తే మీరు ఇలా చేశారు పైగా నన్ను నిందిస్తున్నారు నేను పది మందిలో మిమ్మల్ని అల్లరి చేస్తాను” కోపంగా  అంది సౌజన్య.

“చేసుకో నేను మగవాన్ని నాకేం కాదు, నీ పరువే పోతుంది”  అని వెళ్ళిపోయాడు.

కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది సౌజన్య.

 

                                                                                        ***

 

శంకర్ వయసు 30 సంవత్సరాలు...

10 లక్షల కట్నం ఇచ్చి బీకాం గోల్డ్మెడలిస్ట్ అయిన సుజాతని శంకర్ నారాయణ చేతిలో పెట్టాడు సుజాత వాళ్ళ నాన్న.

భార్య అంటే కేవలము అవసరాలు తీర్చే ఒక యంత్రం మాత్రమే అన్న గొప్ప సిద్దాంతాన్ని  వాళ్ల నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడు శంకర్.

అదే అహంకారంతో సుజాతని  కూడా కేవలం ఒక యంత్రంలా లేదా ఒక బానిసలా చూసి అదే విధంగా ప్రవర్తించ సాగాడు.

మొదటి ఆరు నెలలు పెళ్లయిన కొత్త కాబట్టి, భర్తని మార్చుకోగలను అనే నమ్మకం తోటి శంకర్ ని భరించింది సుజాత.

తర్వాత తొమ్మిది నెలలు పుట్టే బిడ్డ కోసం అని అతని అహంకారాన్ని భరించింది.

 

సుజాతకి పండంటి ఆడపిల్ల పుట్టింది.

పుట్టి మూడు నెలలు అయినా కూడా బిడ్డని చూడడానికి శంకర్ రాలేదు.

వాళ్ళ మామ గారు ఫోన్ చేస్తే “పుట్టింది ఆడపిల్లే కదా. మూడు నెలలు గడిచాక మీరే తీసుకురండి. ఆ మాత్రం దానికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు”  అన్నట్టు మాట్లాడాడు.

మనుమరాలు ని చూడటానికి రాలేదు. అల్లుడికి కోపం వచ్చిందేమో అనుకొని రెండు లక్షల రూపాయలు తీసుకుని, కూతురును, మనుమరాలుని  వెంటపెట్టుకుని శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు సుజాత వాళ్ళ నాన్న.

“నీ భార్యతొలిచూలుతో ఇంటికి వస్తుంది బాబు, కనీసం పని అమ్మాయితో అయినా హారతి ఇప్పించవలసింది” అన్నాడు సుజాత వాళ్ళ నాన్న.

ఆ మాటకి శంకర్ “ఆడపిల్లను కన్నది పైగా సిగ్గులేకుండా హారతి ఇచ్చి స్వాగతం పలకాలా” అంటూ ఈసడింపుగా  అన్నాడు శంకర్.

ఆ మాటకి సుజాత మనసు విరిగిపోయింది. రెండు సంవత్సరాలు పడిన బాధ ఆవేదన అంతా కూడా గుర్తుకు  వచ్చింది. కూతురు భవిష్యత్ అంతా ఆ ఒక్క మాటకే అర్థమై పోయింది.

తన చదువు తన గోల్డ్ మెడల్ అందరూ తనను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది.  బిడ్డ మీద శంకర్  చూపించిన అసహనాన్ని సుజాత యొక్క తల్లి మనసు భరించలేకపోయింది.

“నాన్న మనం ఇంటికి వెళ్ళిపోదాం నేను కూడా మీతో వస్తాను” అన్నది.

ఆశ్చర్యపోయాడు సుజాత వాళ్ళ నాన్న.

“అవును నాన్న ...ఈ మనిషికి కావాల్సింది బానిస. ఇప్పుడు నా బిడ్డను కూడా మరో బానిసను తయారు చేస్తాడు, దానికి నేను ఒప్పుకొను, నా బిడ్డ ఇతని అహంకారపు నీడ లో పెరగడాన్ని నేను ఇష్టపడను” స్థిరంగా చెప్పింది సుజాత.

“అదేంటమ్మా ఇంత చిన్న వయసులో భర్తను వదిలేసి వస్తే నువ్వు పాప ఎలా ఉంటారు?” బాధగా అడిగాడు.

“ఇక్కడ ఇతని అహంకారంతో చస్తూ బతకడం కంటే బయటికి వచ్చి నా బిడ్డ తో స్వతంత్రంగా బ్రతకటంని నేను కోరుకుంటున్నాను నాన్న” అన్నది సుజాత.

“ఏంటి ఆడపిల్లను కన్నది కాక నన్ను బెదిరిస్తున్నావా, వదిలేసి వెళ్లిపోతే పో నేను మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాన., ఎంత మంది అంటే అంత మంది దొరుకుతారు నాకు..” కోపంగా అన్నాడు శంకర్.

ఆ మాటకు చివ్వున వెనక్కి తిరిగింది సుజాత .

“మరోఅమ్మాయి జీవితాన్ని మీరు  నాశనం చేయకండి.. అయినా మీరు మగవారు కదా..ఏ ఆడదాని తోడు లేకుండా  బ్రతకలేరా?” అతన్ని రెచ్చగొడుతున్నట్టుగా అంది సుజాత.

“నిజంగా  మీరు మగవారు అన్న నమ్మకము అహంకారం అంటే మీరు ఒంటరిగా బ్రతకండి. లేదు ఆడవారు కూడా మనుషులే అని వాళ్ళని బానిసలుగా కాకుండా మనుషులుగా ప్రేమించాలి అనుకున్నరోజు నా దగ్గరికి మన బిడ్డ ని చూడడానికి రండి అప్పటిదాకా సెలవు” అని కోపంగా అనేసి  వెళ్ళిపోయింది   సుజాత.

ఒక నిమిషము శిలలా నిలబడిపోయాడు శంకర్.

సుజాత అన్న మాట అతని అహంకారాన్ని రెచ్చగొట్టింది.

నిజమే  ఇంకో స్త్రీ ని   మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక లంపఠాన్ని ఎందుకు తగిలించుకోవడం.. నేనొక్కడినే బ్రతకలేనా..నాకేం తక్కువ, డబ్బుంది అందముంది ఆరోగ్యం ఉంది కోరుకున్నవన్నీ నా చెంతకే వస్తాయి అనుకోని తనకు నచ్చినట్టుగా విశృంఖల స్వేచ్ఛతో జీవించసాగాడు శంకర్.

నచ్చిన అమ్మాయిని తెచ్చుకోవడం, పైసలతో అన్ని కొనుక్కోవడం, పని మనుషులను పెట్టుకోవడం అహంకారము అధికారము చేలాయించడం దాదాపు 25 సంవత్సరాలు  ఇలా గడిపేసాడు శంకర్ నారాయణ.

                                                                                   ***

శంకర్ నారాయణ వయసు 55 సంవత్సరాలు...

ఒంటరి తనం జీవితం నిండా పేరుకుపోయింది.

డబ్బుతో చేలాయించున అధికారం గాని, కొనుక్కుంటే వచ్చే సుఖాలు కానీ ఇప్పుడు అతని మనసుకి  ఆనందం ఇవ్వట్లేదు.

ఒకలాంటి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు.

తన అనే ఒక తోడుని, ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని బలంగా కోరుకుంటుంది అతని మనసు.

ఇంట్లో ఉండలేకపోతున్నాడు

ఎక్కడికి వెళ్ళినా  ఎవరిని చూసినా   తనకంటూ ఒక మనిషి లేడు అన్న భావన అతన్ని క్రమక్రమంగా  క్షీణింప చేయసాగింది.

ఆలోచనలు భరించలేని శంకర్నారాయణ ప్రస్తుతము ఐసీయూలో గుండెజబ్బుతో కోమాలో ఉన్నాడు.

                                                              ***

25 సంవత్సరాల డ్యూటీ డాక్టర్ స్నేహిత,  శంకర్ నారాయణ ఆపరేషన్ కావల్సిన ఏర్పాట్లన్నీ చూస్తుంది.

బెంగళూరు నుంచి  రావాల్సిన ప్రముఖ కార్డియాలజిస్ట్ కోసం ఎదురు చూస్తుంది.

శంకర్నారాయణ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు.  ఆపరేషన్ కి దాదాపు 30 లక్షలు ఖర్చవుతుంది.  అతని దగ్గర  చాలా  డబ్బుంది.  కానీ అదెక్కడుందో ఎవరికి తెలియదు. ఈయన చెప్పే స్థితి లో లేడు.

అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని స్థితిలో ఉన్న శంకర్ నారాయణను చూస్తే స్నేహితకు జాలి వేసింది.

ఆ టైం లో ఈ విషయం తెలిసిన శంకర్నారాయణ వాళ్ళ అక్క సరిత, డబ్బులు తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి పైసలు కట్టి, నా తమ్ముడిని బతికించమని వేడుకుంది.

బెంగళూరు నుంచి  కార్డియాలజిస్ట్ రావడంతో శంకర్నారాయణ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. అతన్ని ఐసీయూలో నుంచి స్పెషల్ రూమ్ కి షిఫ్ట్ చేశారు.

“మీ వాళ్ళు ఎవరు లేరా.. మీ తోడుగా ఉండటానికి?” అని అడిగింది డా.స్నేహిత.

శంకర్ నారాయణ “లేరమ్మ” అంటూ తలొంచుకున్నాడు.

ఇంతలో ఒక ఆవిడ వచ్చింది.

“మూడు రోజుల నుంచి ఈవిడే మీ సేవ చేస్తున్నారండి తను మీకు తెలుసా?” అని ఆడిగేసరికి తలెత్తి చూశాడు శంకర్ నారాయణ.

ఎదురుగా  సుజాత.

సుజాతా.. నువ్వు ఇక్కడ...” అన్నాడు సంభ్రమంగా.

 

“అవునండి మీరు హాస్పిటల్ వచ్చిన రోజె  మీరు ఇక్కడ ఉన్నారు అని నాకు తెలిసింది.  వెంటనే వచ్చేసాను. ఈ డ్యూటీ డాక్టర్ అమ్మాయి ఎవరో కాదు మన కూతురే అనగానే  కన్నీళ్లతో శంకర్నారాయణ మొహం తడిచిపోయింది.

“నేను ఎంత అహంకారంతో ప్రవర్తించినా  మీరు నా ప్రాణాన్ని రక్షించారు” అని చేతుల్లో మొహం పెట్టుకుని ఏడవసాగాడు శంకర్ నారాయణ.

వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆపరేషన్ చేసినా కార్డియాలజిస్ట్ “ఎలా ఉంది?” అంటూ రూమ్లో చెకప్ కి వచ్చింది.

ఆమెను చూసి శంకర్నారాయణ కంగుతిన్నాడు.

“నాన్న ఈమె డాక్టర్ సౌజన్య. మీకోసమే బెంగళూరు నుంచి వచ్చే ఆపరేషన్ చేసింది తను రాకపోతే మీ ప్రాణాలే ఉండేవి కావు”.

అతని కళ్ళల్లో పశ్చాత్తాపం గుండెల్లో అంతులేని ఆవేదన.

“బావున్నారా సార్” అడిగింది సౌజన్య.

“సౌజన్య నువ్వు ఇక్కడ ఇలా..” ఆ పై ఏమి మాట్లాడలేకపోయాడు.

“అవును సర్  ఆ రోజు మీ దగ్గరే ట్యూషన్ అయిపోయిన తర్వాత నాకు జీవితం విలువ తెలిసింది. చాలా శ్రమపడి డాక్టర్ అయ్యాను. నా హస్బెండ్ కూడా డాక్టర్.  దేశంలోని కార్డియాలజిస్ట్ లలో మాకు మంచి పేరు ఉంది. మిమ్మల్ని నేను అంత దూరం నుంచి బతికించడం కోసమే వచ్చాను.  ఇప్పటినుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి సార్” సవినయంగా చెప్పింది సౌజన్య.

“నువ్వు చిన్నదాని కాకపోతే నీ కాళ్లు మొక్కేవాడిని” కళ్ళనుండి కన్నీళ్లు కారగా అన్నాడు శంకర్.

“అవన్నీ మర్చి పొండి సర్. ఇకపై ఉన్న జీవితాన్ని అయినా సంతోషంగా జీవించండి” అని, స్నేహిత “నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను.  ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పు” అని చెప్పేసి వెళ్ళిపోయింది సౌజన్య.

“నాన్న మీకు సౌజన్య మేడం తెలుసా?” అడిగింది స్నేహిత.

“అవునమ్మా చిన్నప్పుడు నా దగ్గరికి ట్యూషన్ కి వచ్చింది” చెప్పాడు శంకర్

“ఖచ్చితంగా తను కూడా ఎంతో కొంత మీ అహంకారంతో బాధ పడి ఉంటుంది కదా నాన్న..”

“అవునమ్మా నా అహంకారంతో దెబ్బతిన్న వాళ్ళల్లో తనే మొదట ఉంటుంది” బాధ గా చెప్పాడు.

“మీకు ఇంకో విషయం తెలుసా నాన్న. మీ ఆపరేషన్ కి 30 లక్షలు అయ్యాయి”.

“అవునా..మరి ఆ డబ్బు..ఎలా?”

“ఎవరు చదువైతే మీ వల్ల ఆగిపోయిందో, ఎవరి జీవితం అయితే మీ వల్ల కొంతవరకు దెబ్బతిన్నదో, ఆమె వచ్చి డబ్బు కట్టి, మా తమ్మునన్ని  బతికించమని ఏడ్చింది” నాన్న అంది స్నేహిత.

“అక్క వచ్చిందా..?” అని అడి శంకర్నారాయణ.

“అవును నాన్నా. అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. మీ ముందుకు రావడానికి భయపడుతుంది.  మీ మాటలతో  నువ్వు  అంతగా అత్తయ్య మనసులో భయాన్ని కలిగించావు”.

“ఒక్కసారి రమ్మని చెప్పురా..” దీనంగా అడిగాడు శంకర్.

సరితా లోపలికి వచ్చింది.

“అక్కా” అని జీవితంలో మొదటి సారి నిజమైన ప్రేమతో పిలిచాడు శంకర్ .

“ఎలా ఉన్నావురా?” అడిగింది సరిత.

“నన్ను క్షమించు అక్క..నేను  నీ జీవితానికి చాలా నష్టం చేశానం”టూ చిన్నపిల్లోడిలా ఏడ్వాసాగాడు శంకర్.

“పోనీలేరా అన్నీ వదిలేససేయ్..”

“నువ్  బ్రతికావు అదే చాలు” చెప్పింది సరిత.

మనసులో ఉన్న అహంకారం అంత పోయేదాకా ఏడవసాగాడు శంకర్.

“ఇప్పటికైనా మారండి నాన్న. స్త్రీలలో   ఆడతనాన్ని, బానిసత్వాన్ని చూడ్డం మానేసి అమ్మతనాన్ని, ప్రేమను చూడండి మీకు నిజమైన జీవితం తెలుస్తుంది” అన్నది స్నేహిత.

“నిజమే తల్లీ..చిన్నప్పుడు అమ్మ చెపితే  వినలేదు, నా జీవితాన్ని కోల్పోయాను, ఇప్పుడు నా తల్లికి రూపమైన నువ్వు చెప్పే మాట తప్పనిసరిగా వింటాను, నా వలన ఇక పై ఏ స్త్రీ బాధ పడదు నీకు మాటిస్తున్నాను” అన్నాడు శంకర్..

తండ్రి బిడ్డలను తృప్తిగా చూస్తుండిపోయారు సరిత, సుజాత.


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు