కథలు

(March,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

రేపటి మహిళ 

ఏమే లేవే, స్వరూప లేచి, సందులోవున్న మూడూ ఇండ్ల పని చేసిరావే, భాగ్యమ్మకూతురు స్వరూపతో అంది. ", పో ఎప్పుడు నస పెడతావు".పొద్దునే లేపి సరిగ్గా నిద్ర పోనివ్వవు, అంటు స్వరూప కాళ్ళ కిందికి పోయిన దుప్పటి తీసి నిండా కప్పుకుంది., ఏం చేయాలి? "ఇది వినేటట్టు లేదు". నేనే పోతా! " పొయ్యి వెలిగించి నీళ్ళు ఎసరు పెట్టింది"."పోయి కాడ అన్న చూడు ఎసరు పెట్టిన నీళ్ళు అన్నం వండి, చారు పెట్టవే అంది. దుప్పటి  పట్టి ఊపుతు చెప్పింది. నీ యమ్మ ఎప్పుడు నీ గోలనే అంటు దుప్పటి తన్ని లేచి కూర్చుంది".ఎందే?

 

 

"అమ్మా నేను  వచ్చి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు"."కనీసం ఊపిరి అన్న తీసుకోనివు" . ఎప్పుడో? "చిన్నపుడు నన్ను ఊరు కాని ఊరు పంపినారు". "అంతా కష్టపడి వస్తె?"రాగానే పని చేయమని గొడవ ఒక నాలుగు రోజులు ఆగరాదు". నేను ఏదో ఒకటి చూసుకుంటాను నీకు చేస్తాను అంది. . "మేము ఎందుకు పంపినమే" "నువ్వు ఇటం తో పొయినవు" అంది ."కాదే నువ్వు అలిసిపోయవు.నాకు ఎరుక" కాని ఇడ అన్ని పనులు చేసి, ఆలస్యం గా, నేను ఇండ్ల లకి పోయక  అమ్మలు చానా  కొప్పడతారు. అమ్మ, నేను లేనప్పుడు ఏం చేశావే? ఇప్పుడు, నేను రాగానే ఏదో రాద్దాంతం చేస్తావు?.కాదే నీవు లేనప్పుడు, నేను ఆడనే కూర . ఆళ్ళు ఇచ్చిందే తెంచుకొని తినేదానిని . మళ్ల మపాటికి అన్నం అండుకునేదాన్ని. ఇప్పుడు ఇంత మందికి అంది సాలదే, నీకుఅయ్య , అన్న ఊరు నుండి వత్త అన్నారు అంది. నువ్వు, పో నేను చూసుకుంటా, స్వరూప అంది.ఆలస్యం అయిపోయనాది ఏమంటారో?. ఏమో?. అనుకుంటు, భాగ్యమ్మ హడావిడిగా వెళ్లి పోయింది. స్వరూపాకి ఇంక పడుకోవాలని అనిపింలేదు. ,లేచి  కడుక్కుని," పొయ్యి మీద మసులుతున్న  నీటిని చూసింది".పక్కనే చాట్లో ఒక కిలో వరకు  బియ్యం వున్నాయి. " అవి తీసి వేరే గిన్నెలో పోసి కడిగి ఎసరు లో పోసింది" "స్వరూప కి 15 సంవత్సరాలు చూడడానికి,అందంగా వుంటుంది"."ఎంత తేడా? పది రోజుల క్రితం బొంబాయిలో  గ్యాస్స్ స్టవు. " చెమట అనేది తెలియకుండా," అన్నం రెండు కూరలు పప్పు పెరుగు సుకుమారమైన జీవితము. ఇప్పుడు, ఇక్కడ ,కనీసం  స్టవు కూడా లేదు.ఒక కూర కష్టమే," ఇంకా రెండో కూర ఎక్కడి నుండి వస్తుంది". స్వరూప బొంబాయి లో" నాలుగు ఏండ్లు గడిపింది".     భాగ్యమ్మ పని చేసే ఇంట్లో లోనే, ఒకసారి ఏదో శుభకార్యం అయితే వాళ్ళబంధువుల వచ్చారు. "అప్పుడు వాళ్ళు స్వరూపా  చలాకిగా పని చేయడం చూసి వచ్చిన బంధూవులలో ఒక ఆమె మీ అమ్మాయిని పంపిస్తారా? అని  భాగ్యమ్మని అడిగింది."ఆడ పిల్లని,పైగా అంతా దూరం భయం వేసింది", స్వరూప అక్కడకి వచ్చింది. అమ్మ.నేను ఇంటికి పోతున్నావు అని చెప్పాడానికి, ఆగే నేను వస్తాను. అంది   భాగ్యమ్మ . బంధువు ఆవిడస్వరూప తో అమ్మాయి నాతో నువ్వు బొంబాయి వస్తావా?" నిన్ను బంగారంలా చూసుకుంటాను"అంది. ఓకే సారి స్వరూప కి సంతోషం మైంది. మళ్ళి అంతలోనే  తల్లి మొఖం చూసి ఏమో?   ఆంటి,  "అమ్మ ఇష్టం" అంది. నేను ఇంకా రెండు రోజులు వుంటాను. ఈలోపు ఆలోచించుకొని చెప్పండి అందిఅంటానే, అంటూభాగ్యమ్మ పావే ఇంటికి పోదాం  అంటు స్వరూప తో అంది.ఇంకా తల్లి కూతుళ్లు ఏం మాట్లాడుకోకుండ ఇల్లు చేరారు.అది  సాయంత్రం సమయం కావున అక్కడే పొద్దుపోయి అన్నం తిన్నారు. ఇంటి  అమ్మ కొన్ని  అప్పాలు ,స్వీట్స్ కవర్లో వేసి ఇచ్చింది. అవి తీసుకుని సాయంత్రం ఇద్దరు ఇంటికి వచ్చారు. భాగ్యమ్మ అలసి పోయింది .మూలకు వున్న చాప తీసి వేసుకొని నడుము వాల్చింది. స్వరూప తల్లి  కాళ్ల దగ్గర కూర్చుని అమ్మ పని ఎక్కువైంది కదా! అలసిపోయావు." మునుపటిలా గా ఇప్పుడు పని చేయలేకపోతున్నావుకదా అంది".అవునే అందుకే బాగా ఆలోచించవే , అమ్మతో నేను బొంబాయి పోతే," నీకు కొంచెం కష్టమైన తగుతుంది" అంది .వుండావే,రేపు మీ నాయన, మీ అన్న వూరి నుండి వస్తారు‌. వాళ్ళను  మాట అడిగి, ఇగ నీవు పడుకో,అని నిద్ర లోకి జారిపోయింది. ఇంకా స్వరూప కూడా సరే అంటు  తల్లి పక్కనే పడుకుంది.

 

 తెల్లారింది. అయ్యే  పొద్దు  పోయింది. ఇయాల అందరు చుట్టాలు ఎల్లీపోతారు. అమ్మ తొందరగా రమ్మంది అంటు తొందరగా మొఖం కడుకోనిస్వరూప నువ్వు జరసేపు అయ్యాక చాయ్ తాగి రావే, ఇంతలో ఊరి నుండి అన్న  నాయనా కూడా వస్తారు. అంటు చెప్పుకుంటు పోతున్నా, భాగ్యమతో, ఆగవే అమ్మ ఎప్పుడు తొందరేఒకరోజు పొద్దు పోతే ఏం కాదు? " నాయనా , అన్న తో నా సంగతి తెలుసు కొని ఇద్దరం కలిసి వెళ్దాం అంది" . అమ్మో!" అమ్మ వాళ్ళు కొప్పడతారు.నువ్వు మాట్లాడు అని పోతున్నా , భాగ్యమ్మకి కొడుకు గోవింద్, మొగుడు రాజమౌళి ఎదురైయారు. ."ఎందుకే ఇయాల తొందరగా పోతానావు",ఏమిటే?అన్నాడు.   భర్త రాజమౌలి   ఊరి నుండి తెచ్చిన సంచి కింద పెడుతు," పని చానా వుంది." ఎగిలామే పోదాం అనుకున్నా, సంచిని తీసి పక్కన పెడుతూ, చెప్పింది భాగ్యమ్మ."అమ్మ తొందరగా ఛాయా పెట్టావే, తాగి కాలేజ్ కి పోవాలి." అంటు అక్కడ వున్న ఒక పాత  కుర్చీలో గోవిందు కూర్చున్నాడుచెల్లెలు పెడుతుంది అంటు పోతున్నా, తల్లిని కూర్చో పెట్టి స్వరూప ఛాయా నేనే పెడతాను. " నువ్వు నిన్నటి విషయం  చెప్పు అంది" ."ఇదొకటి ఒకటే ఎగిలాం దీనికి అంటు కింద కూలబడి పోయింది" .ఏందే? ఇషయం మీది అంటు  మంచం వేసు కోని కూర్చునాడు రాజమౌళి."మన స్వరూపాని,"నేను పని చే సే అమ్మ  చుట్టాలలో ఒక అమ్మ తనతో,బొంబాయి  పనికి పంపించమని అడిగింది" . "అంతా దూరమే  కట్టమే అన్నాడు". మరి నీవు ఏమి అనాలే? మా వోళ్ళను అడిగి చెపుతాను అన్నానుస్వరూప మూడూ గ్లాసుల్లో ఛాయా చేసి పట్టుకొని తెచ్చి ముగ్గురికి ఇచ్చింది".నాకు అయితే ఇష్టమే నాయనా", ఏం దూరం కాదు!నేను పోతాను.అంది."చూడు రా దాని తొందర ఏట్ట ఎగురుతుంది   భాగ్యమ్మ అంది ."అన్న నువ్వు చెప్పు"   ఆంటి నాకు నచ్చింది" ."ఇంకా చాల డబ్బులు వస్తాయి." "అమ్మాకి ఒక ఇల్లు పని అన్న తగ్గుతుంది"." కరెక్టనే  నువ్వు చెప్పెది, అక్కడ పని ఏంది?వాళ్ళు నమ్మకమైన వాళ్ళెనా? చూడాలి. గోవిందు అన్నాడు. రోజు నువ్వు నాతో, రా అన్న  ఇద్దరం కలిసి పోదాం," జీతం అన్ని నువ్వే మాట్లాడితే మంచిది అంది" ".ఏమోరా? "నాకు అయితే చానా దూరం ఆడపిల్లను పంపించడం ఇటం లేదు  తండ్రి . అన్నాడు".చూద్దాం నాయన ,నేను  సాయంత్రంపోయి అన్ని తెలుసుకొని వస్త అన్నాడు.   భాగ్యమ్మ చాయ తాగి లేస్తూ .ఇగ నేను పోతా, నువ్వు అన్న రండి, అంటు  పనికి పోయింది.అన్న నువ్వు ఇప్పుడు కాలేజికి వెళ్తావు కదా! "వెళ్ళే ముందే యమ్మని కలిసి వెళ్లితేనే మంచిది." ఎందుకంటే,ఆంటీ సాయంత్రం ఎక్కడి కన్న పోతారేమోఅంటు  చెప్పింది. "సరే పద అక్కడి నుండి కాలేజికి వెళ్ళుతా అని గోవిందు అన్నాడు .నాయనా, నేను తొందరగానే వస్తాను. ‌అన్నం తిని నీవు పడుకో ,అంటూ చెప్పి స్వరూప గోవిందుతో వెళ్లింది. స్వరూప అమ్మ దగ్గరికి తీసికెళ్ళి ,మా అన్న  అంటు పరిచయం చేసింది. "ఇంతకి ఏం ఆలోచించుకున్నారు?."చెల్లెలిని నాతో పంపిస్తున్నావా? లేదా? అంది ."అదే మాట్లాడుదాం, అని వచ్చినాడు. అన్న స్వరూప అంది.నా దగ్గర అంత పని ఎక్కువ వుండదు. నేను మా ఆయన జాబ్ కాబట్టి ,ఇంటిలో, పెద్ద ఆవిడ మా అత్త గారు వుంటుంది.కాబట్టి ఆమెను చూసుకొవాలి  పని మనిషి వేరే వుంది. మీ చెల్లెలికి,బరువు పని ఏమి వుండదు.వెజీటెబుల్ కటింగ్ ఇల్లు  క్లీనింగ్ నెలకి 8000 ఇస్తానుసంవత్సరనికి రెండు సార్లు ఇంటికి పంపిస్తాను. నాకు బిడ్డలు ఇద్దరు అమెరికా లో వున్నారు.నా బిడ్డలాగ చూసుకుంటాను అంది. నా అడ్రసు పోన నెంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడు అయిన పోను చేయవచ్చు.సరే మీకు నచ్చితే రేపు సాయంత్రం 5గంటలకు అంతా రెడి చేసుకొని రండిఒకవేళ అక్కడ తనకు నచ్చకున్నా, నేను ఇబ్బంది పెట్టాను వెంటనే పంపిస్తాను అంది.అలాగే అమ్మ రేపు ఐదు గంటలకు ఇక్కడ దింపుతాను. అంటు గోవిందు వెళ్లుతు వుంటే, నేను అమ్మ తో ఇంటికి పోతాను. నువ్వు పో అన్న స్వరూప గోవిందుతో అంది.గోవిందు కాలేజీ కి వెళ్ళి పోయాడు.

" నీకు ఇష్టమేనా నాతో రావడం అంది". చాలా ఇష్టం ఆంటీ. "అమ్మ భయపడుతుంటే అన్నను తీసుకొచ్చాను" అంది. నీవు ఏమి డ్రెస్ లు కొనుక్కుకు,నేను కొంటాను.నీకు నచ్చి నీవి, రెండు మూడు డ్రెస్ లు చిన్న బాగ్ పెట్టుకొని రా ",నీకు కావలసినవి అన్నీ నేను కొనిస్తాను బొంబాయి ఆంటీ అంది". అలాగే ఆంటి అంది .   భాగ్యమ్మ స్వరూప ఇంటి ఆవిడ ఇచ్చిన కూరలు తీసుకొని ఇంటికి వెళ్లారు. ముగ్గురు అన్నం తిని మాట్లాడుతూ కూర్చునారు. తల్లితండ్రులు భయపడుతుంటే గోవిందు నచ్చచెప్పాడు. "స్వరూప హుషారు గా తన బట్టలు సర్దుకొవడంలో  నిమగ్నమైంది".

మరునాడు వాళ్ళతో కలిసి స్వరూప వెళ్లుటే,  "భాగ్యమ్మ  రాజమౌళి  కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటే" వద్దని  బొంబాయి ఆవిడ వాళ్ళకి  నచ్చజెప్పింది." మీ బిడ్డ ను నా బిడ్డ లాగా చూసుకుంటా అంది ."

అంతా పెద్ద ఇంటిలో తన పని అంతా ఎక్కువగా లేదు". ఆడుతూ పాడుతూ వాళ్ళ ఇంట్లో ఒక పాపలాగ కలిసి పోయింది. తనకు కావలసిన అన్ని వస్తువులు ఆంటి కొని ఇచ్చింది.తన జీతంలో 3000ఇంటికి పంపిస్తూ, తనకు 5 వెల రూపాయలు వుండేటట్టు గా చేసుకుంది. స్వరూపకి హింది మాట్లాడడం వచ్చింది. అన్ని పనులు చాలా బాగా చేయడం నేర్చుకుంది. ఇంటి పెద్దఆవిడ కాలం చేసింది. ఆలుమగలు ఇద్దరు రీటైల్ అయ్యరు . "ఇంకా వాళ్ళ పిల్లలు ఒకేటే గోల మీరు అమెరికా వచ్చె యండి", అని రోజు ఫోను  చేస్తూనే వున్నారు. బొంబాయి ఆవిడకు మొదట కొడుకు, ఇంకా కూతురు, వాళ్ళ పిల్లలకి ఒక్కొక్కరికి ఇద్దరు  పిల్లలు అందరూ హైస్కూల్ కి వచారు. "అందుకే మేము రావడం కుదరదు మీరే రండి నానమ్మఅని పిల్లల గోల, "నా స్వరూపని ఏం చేయాలి ?అంది. అమ్మాయిని కూడా తీసుకు రా అన్నారు. స్వరూపని. నాతో వస్తావా? అమెరికా  అని అడిగింది . అమ్మ వాళ్ళు

ఒప్పుకోరు అంది .ఇంకా వాళ్ళు వెళ్ళే రోజులు దగ్గరీవచ్చాయి. స్వరూపకి 5000రూపాయలు అదనంగా ఇచ్చి, వాళ్ళ అమ్మ నాన్న అన్నకి బట్టలు తనకి  బట్టల కొనించి అందరు ఒకేసారి బయలు దేరారు. స్వరూపని బస్ ఎక్కించారు , స్వరూప, ఆంటిని పట్టుకొని ఏడిచింది,.ఏడవకు, ఫోన్ చేస్తూ  వుంటాను. కావాలన్నా అడుగు ,అలాగే, ఆంటీ, అంకుల్ వెళాతాను.మీరు జాగ్రత్త అంది. అలాగే నమ్మా నీవు సంతోషం గా వుండు. సరేనా అన్నాడు. సరే వాళ్ళు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి పోయారు

 

. స్వరూప అమ్మ నాయనాల దగ్గరికి చేరింది.

 

బొంబాయి లో నాలుగు సంవత్సరాలు పని చేసిఇల్లు చేరి పదిరోజులైంది." రాగానే అమ్మ గొడవ అర్థం చేసుకోదు. "పనిలో చేరాలి పని చూసుకోవాలి".  ఆకలిగా వుందే అన్నం అండినవె అంటు భాగ్యమ్మ   వచ్చింది. " పిలుపుతో లోకం లోకి వచ్చి, వండనే అంది. "భాగ్యమ్మ   కాళ్లు చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంది. తను తెచ్చుకున్న కూరలు కంచంలో వేసుకుంది. స్వరూప కూడ తల్లితో తినడానికి కూర్చుంది. కూర వేసుకోవే అంది. వద్దె నిన్నటివి, మొన్న టివో, అంది.లేదే అమ్మ ఎపుడైన వేడిగా  పెట్టిస్తుంది. నాకు రాగానే చేసుకునే ఓపిక వుండదు, అని అమ్మ ఆరాటం. గిన్నె లో బెండకాయ కూర బిడ్డ కంచంలో వేసింది ". అమ్మ చేపింది. ఎవరో వంటకు కావాలి.అని అపార్టుమెంట్లులో అడిగారట, నువ్వు చేతవా? అంది."వంట అయితేనే మంచిగుంటాది" రెండు మూడు ఇల్లులు చేసుకొని రావచ్చు స్వరూప అంది

  మరునాడు తల్లితో వెళ్లి వాళ్ళతో మాట్లాడుకోని,మూడు  ఇండ్లలో వంటకు కుదిరింది .ఇంటికి రెండు వేలు ఇస్తారు. మొత్తం ఆరు వేలు వస్తాయి. ఇంటిలో మూడు వేలు ఇచ్చి, తను మూడు వేలు దాచుకుంటుంది బ్యాంకులో తనపేరున బొంబాయి లో వున్నపుడే  ఖాతా తెరిచింది.

 "రోజులు గడుస్తున్నాయి" . "స్వరూపకి 20ఏండ్లు వచ్చాయి".  " పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇద్దరు అక్కలు,,  స్వరూపతో ఎప్పుడు అంటు వుండేవారు." నాయనా  చేత కాకుండ అయిపోయిండు". ,"నువ్వు పెళ్లికి ఒప్పుకో" అని ఓపించారు.వాళ్ళ రెండో బావ తరుపున చుట్టాలు . "అబ్బాయికి ఒక కిరాణా షాపు వుంది. ఒకడే కొడుకు. స్వరూపను చూసి మెచ్చాడు. స్వరూప మాత్రం     మెచ్చలేదు. . ఇంకా అక్కలు గొడవ, ఎందుకు వద్దు  అంటున్నావు ,అయిన తాను అబ్బాయి బాగలేడని  ఒప్పుకోలేదు .అలాగే తాను ఇండ్ల లో వంట చేసి డబ్బులు కూడా  పెట్టుకుంది.నాయానకి  బాగా పడైందే ఆరోగ్యం నువ్వు పెళ్లి చేసుకోవే అని  అక్కలు చెప్పతునే వున్నారుఅన్న కూడా ఒక సంబంధం తెచ్చాడు. పిల్లవాడు బాగున్నాడు. అని స్వరూపతో చెప్పాడు. సరే అన్న అంది. పెళ్లి చూపులు  అయ్యాయి".హీరోలాగ పిల్లగాడు బాగున్నాడు" .ఒకడే కొడుకు, ఇంటర్ చదివి  కాబ్ డైవర్గ పని చేస్తున్నాడు . ఒకరినొకరు నచ్చారు..బొంబాయి ఆంటీకి ఫోను చేసి చెప్పింది ఆమె చాలా సంతోషపడింది. 10000 డబ్బులు పంపించింది.అయినంత వరకు పెళ్లి బాగానే చేశారు.

 

 అత్త గారి ఇంటిలో అడుగు పెట్టిందిభర్త బండి మీద ఆనందంగా సినిమాలకి , యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చింది. స్వరూప, సంపత్ ఇద్దరు ఆడుతూ పాడుతూ బాగానే వుంటున్నారు".సంపత్ తల్లి కూడా మంచిదే" స్వరూప, ఇండ్లలో  వంట పని మానేసి  బ్యూటీ పార్లర్  కోర్స్ నేర్చుకుంటుంది. అలా ఆరు నెలలు కోర్స్ కాగానే బ్యూటీ పార్లర్ కి షాపు రోడ్ సైడ్ కిరాయి తీసుకుంటున్నాని అని సంపత్ తో స్వరూప చెప్పిందిరెంట్ ఎక్కువ వుంటుంది కాదాఅన్నాడు.అవును కాని, రోడ్ సైడ్ మెయిన్ సెంటర్ లో పెడితే బాగుంటుంది. బాగా నడుస్తోంది అంది. అడ్వాన్స్ లక్ష   రూపాయలు  కట్టి, నెల రెంట్ పదివేలకు ఓకే చేసుకొని,. ఒక బండి కొనుక్కుంది.బొంబాయిలో వున్నపుడే నడపడం నేర్చుకుంది. తన దగ్గర డబ్బుతో ఇవన్నీ  పనులు  స్వరూప చేసుకుంది. రోజు 10గంటలకు లంచ్ తీసుకొని వెళుతుంది రష్నీ బట్టి ఇంటికి వస్తుంది. పార్లర్ బాగానే నడుస్తుంది. "స్వరూప ఆందరితో కలుపుగోలుగామాట్లాడుతుంది". అందరిని ఆంటీ , అమ్మ , అక్క అంటు  ఆప్యాయంగా పలకరిస్తుంది. చుట్టూ పక్కల వాళ్ళు దాదాపు తన పార్లర్ కే వస్తారుపెళ్లిళ్ల  సీజన్ అయితే మరి బిజీ గా వుంటుందిఒకొక్క సారి రాత్రి అక్కడే వుండవలసి వస్తుంది. "రాత్రి, పగలు లేకుండా కష్ట పడుతుంది" .  స్వరూప పార్లర్ లో బిజీగా వున్న టైంలో ఫోను మోగింది. హల్లో అంది. నేనే రూప అన్నాడు ."తన భర్త  సంపత్

 రూప అంటాడు".నేను  వస్తున్న అయిపోయిందా?నీ పని అన్నాడునా బండి వుంది కదా, నువ్వు ఎందుకు రావడం నేనే వస్తాను స్వరూప అంది.అయిన ఇంకా నాకు గంటకు పైన పడుతుంది అంది. ఏం లేదు, నా కెందుకో, " రోజు నిన్ను నా బండి మీద తీసుకుపోవాలి అనిపించింది సంపత్ అన్నాడు".అబ్బాఎందుకోనీకు తెలియదా? ."రానా మల్లె పూలు పట్టుకొని అన్నాడు" . ఇక్కడికి, ఏం వద్దు, సిదా ఇంటికి వెళ్లు. నేను వస్తాను స్వరూప అంది. సరే తొందరగా వచ్చేయి. "ఇంటిలో అమ్మ కూడా లేదు".ఇంకా మనదే రాజ్యం అన్నాడు. సరేలే! "మరి మొఖం వాచి వున్నట్టుమరి కదా! మధ్య అలిసిపోయి ఆలస్యంగా ఇంటికివచ్చి పడుకుంటున్నావుకష్టపడితేనే  సుఖం దొరికేది స్వరూప అంది. "మరి ముసలివాళు ఆయినక సరసాలు చేయాలా అన్నాడు".చాలు బాబు, వెళ్లు  ఫోను పెట్టేయ్ అంది. స్వరూపకి కూడా మనసులో తొందరగా వెళ్లలనే వుంది .కాని కస్టమర్లు వున్నారు.అంతా పని పూర్తి చేసుకొని ఇల్లు చేరేసరికి, రాత్రి 11గంటలు అయింది .తన దగ్గరి కీ తోనే తాళం తీసుకొని లోపలికి వెళ్ళింది . ఇంట్లో అంతా చీకటి, లైట్ కూడా వేసుకో లేదు. సంపత్ పడుకున్నాడు. తాను లైట్ వేసి తిన్నగా బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చి టైబిల్ దగ్గర చూసింది. తిన్నట్టు లేదు.    మధ్య రాత్రి వచ్చె సరికి  లేట్ అవుతుంది అని పొద్దునే అన్నం కూర   ఎక్కువ చేసి వెళ్ళుతుంది.సంపత్ని లేపింది. అన్నం తిందాం రా అంది. "నాకు ఆకలి లేదు అన్నాడు"."ఏదో వాసన గుప్పున తగిలింది".ఏం తాగవా? అంది మరి, ఏం చేయాలి?"నువ్వు రోజు ఇలాగే రాత్రి అయాక వస్తుంటే" అన్నాడు. తనకు తినలనిపించలేదు. కొన్ని వాటర్ తాగి వచ్చి సంపత్  పక్కన పడుకుంది." పక్కనే మల్లె పూలు   పొట్లంలో అలాగే వున్నాయి", తీసి పెట్టుకుంది. "సంపత్ పైన చేయి వేసింది".మూడు అంతా పోయాక,ఏం వద్దు, అంటు చేయి తీసివేశాడు. "సారీ లేట్ అయ్యింది"."మూడూ అదే వస్తుంది. అని సంపత్తిని తన వైపు లాక్కొని ముద్దు పెట్టుకుంది. మల్లె పూలు గుమ గుమ స్వరూప వెచ్చని  ముద్దు సందిప్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి". రాత్రి ఇద్దరు ఒకటైయారూ". తెల్లవారి లేచేసరికి లేట్ అయ్యింది!"ఓలాంతా ఒకటే నొప్పులు" బద్దకం గా వుంది. సంపత్ లేచి స్నానం చేసి టీ చేసుకొని తాగి వెళ్లి పోయాడు. "ఇంకా తనకే లేవలనిపించడం లేదు". ఎలాగో లేచి టీ తాగి  ఉప్మా చేసుకొని బాక్స్ లో పెట్టుకొని వెళ్లింది.

  వారం రోజులుగా అలకలతో, ఆనందంగా ఇద్దరు బాగానే ఏకాంతంగా సుఖాన్ని అనుభవించారు. సందీప్ తల్లి  ఊరి నుండి వచ్చింది.సందిప్కి సినిమాకి వెళ్ళాలి అనే కోరికనే తీరడం లేదు. స్వరూప  అన్ని షోలు అయిపోయాకస్వరూప ఇల్లు చేరుతుంది. " పెళ్లిళ్ల  సీజన్లో పార్లర్ రష్ ఎక్కువైంది" ఆదివారం కూడా వెళుతుంది. సంపత్తికి, ఆమె కొరకు ఎదిరి చూడడం, తాగడం ఎక్కువైంది . "రాత్రి ఇంట్లో రోజు గొడవలే",   పని ఎక్కువ అవ్వడం వలన స్వరూపకి ఎందుకో  నీరసంగా వుంటుంది నీరసం తట్టుకో లేక అక్కడే పక్కన వున్న లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది . డాక్టర్ పరీక్ష చేసి, "నీవు నెల తప్పవు"."నీకు రెస్ట్ అవసరం". మంచి గా తిని పడుకోవాలి అని చెప్పింది. మందులు నెల నెల వాడు మళ్ళీ నెలకు  వచ్చి పరీక్ష చేసుకో అందిస్వరూప తన మనసులో  పార్లర్ ఎట్లా? ఇప్పుడే," కాస్త ఆదాయం వస్తుంది" ."నేను రెస్ట్ తో ఇంట్లో వుంటే". అదే  డాక్టర్ తో అంది." కొంచెం సమయం తగ్గించుకో అని చెప్పింది". స్వరూప మందులు తీసుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటికే టైం రాత్రి 10 గంటలు అయ్యింది. "తల్లికొడుకులు ఇద్దరు కాచుకొని కూర్చున్నారు".  స్వరూప వాళ్ళ ముందు నుండి లోపలికి పోతుంటే, ఆగు,  "ఇంత లేట్ అయ్యింది అన్నాడు? సంపత్ , రోజు లేట్ ఎందుకు అయింది. రోజు ఇదే టైం కదా! అంది. ఇంక సీజన్  అప్పుడు 11 కూడ అవుతుంది కదా! సందిప్ తో స్వరూప  అంది. "ఎంతో పొగరు జవాబు అంది. వాళ్ళ అత్త"."అందులో పోగరు ఏముంది అత్తయ్య" నిజమే కదా! అంది .స్నానం  చేసి వంట రూంలోకి వెళ్ళింది".ఏం చేసినట్లు లేదు. అన్ని గిన్నె లు చిందర వందరగా పడి ఉన్నాయి."ఆకలిగా వుంది". ఏమైనా తినాలి. తొందరగా ఉప్మా చేసి  వాళ్ల ఇద్దరికి కూడ ప్లేట్లు లో  పెట్టి ఇచ్చింది. "మాకు ఏం అవసరం లేదు అన్నారు.సంపత్ బెడ్ రూం లోకి వెళ్ళి పడుకున్నాడు. స్వరూప తింటూరూం లోకి వెళ్ళి   సంపత్"నీకు ఫోను చేశానుభర్తతో నీవు తీయలే అంది". సంపత్ నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. "నీవు వస్తె ఇద్దరం కలిసి వెళ్లాలి అనుకున్నాను" అందుకే ఫోన్ చేశాను అంది. తినడం అయిపోయాక, స్వరూప   వచ్చి సంపత్ పక్కనే మంచం మీద కూర్చుని,   నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పానా?" నీవు తండ్రి వి కాబోతున్నావు". అంటు సంపత్ చేతులను తీసి తన పొట్ట పైన పెట్టుకోబోయింది. ఛీ, పో, అంటు స్వరూప చేతులను తీసివేసి అంటు తిరిగీ పడుకొన్నాడు. ఊహించలేదు స్వరూప ఇలా సందిప్ చేస్తాడని, ఎంతో బాధపడుతు పక్కనే పడుకుంది."ఎవడి వలన వచ్చింది" నీకు కడుపుఅన్నాడు. "తాగిన వాసన గుప్పుమంది". "ఏమిటి ? "సంపత్ నీవు మతి వుండే మాట్లాడుతున్నావా" అంది. ' తెలిసే మాట్లాడుతున్నా' అన్నాడు.' మరి, మాటలు,ఎలా అంటున్నావు? " నీతోనే కదా! కాపురం చేసింది" ."రోజు షోకుగా తయారు అయి పోతావు" "నా వలన అని నాకు ఎలా తెలుస్తుంది" అన్నాడు. . ఏమిటి? నీవు మాట్లాడేది?" "శరం వుండే మాట్లాడుతున్నావా?   దుఃఖాన్ని దిగమింగుతూ స్వరూప అంది.పోవే నీతో మాటలు ఏమిటి అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు ." స్వరూపకి దుఃఖం   ముంచుకొచ్చింది". దిండుపైన తలపెట్టి ఎక్కి, ఎక్కి ఏడిచింది. తాగుడుకు బానిసై తను పని సరిగా  చెయ్యక  నా డబ్బులతోనే బతుకుతూ  నన్ను అనుమానిస్తున్నాడు.ఏం మనిషి, ఆయన నా భర్త అని  చెప్పుకోడానికే సిగ్గు అనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటు  ఏడుస్తూనే ఎప్పుడు  నిద్రపోయిందో తెలియదు.

 తెల్లవారింది స్వరూపకి లేవలనిపించలేదు. అలాగే పడుకుంది. స్వరూప ఏమైంది? అంటు అత్త రూం లోకి వచ్చింది . "స్వరూప ములుగుతుంది". దగ్గరకి పోయి వంటి మీద చేయి వేసి చూసింది ఒళ్ళు చాల కాలిపోతుంది. "అయ్యే ఎంత జ్వరం లే లేచి కొంచెం వేడి గా ఛాయా తాగు పెట్టిస్తాను అంది". అత్తయ్య, మీ కొడుకు అన్న మాటలు  చెపుతాను వినండి. "మీరు  కూడా ఆడవారికే కదా సాటి ఆడదాని మనసును అర్థం చేసుకోవడానికీ  ప్రయత్నం చేయండి" అంది. చెప్పవే, ఏమైంది? అంది. నిన్న ఫోన్ చేసి డాక్టర్లు  దగ్గర చూపెట్టుకోవాలి," రమ్మని ఫోను చేశాను ఆయన అసలు ఫోన్ ఎత్తలేదు". నేనే వెళ్ళాను డాక్టర్ దగ్గరకు , ఆలస్యం అయింది ఇంటికి వచ్చేసరికి తల్లి కొడుకులు నా మీద పంతం పట్టి నట్టు వున్నారు. " నేను  తల్లీ నైన విషయం చెప్పితే ఎవరి వలన కడుపు వచ్చింది అని అంటున్నాడు" "ఒక భర్త అనే మాటలేనా అవి అంటు ఏడుస్తూనే చెప్పింది". అయ్యో వాడికి ఏం వచ్చింది. "బుద్ధి లేని వెధవా రానీ  చెప్తాను అంది"స్వరూప మెల్లగా లేచి బాత్రూమ్ లో కి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చింది. అత్త జయమ్మ ఛాయా ఇచ్చింది."పార్లర్ గురించి ఒకటే ఫోనులు. పోను ఎత్తడం లేదు".   స్వరూప రెడీ అయిపోతుంటే,   అంతా   జ్వరంలో పార్లర్ కి ఎందుకు పోతున్నావు అని అడిగింది జయమ్మ.పార్లరకి పోవడం లేదు .అమ్మ దగ్గరకి పోతున్నాను. అత్తయ్య," మీ కొడుకు వచ్చి తప్పు ఒప్పుకునే దాకా నేను రాను" .అని తన బండి తీసుకోని  వెళ్లి పోయింది. జయమ్మ అట్లనే చూస్తుండిపోయింది.

 స్వరూప తల్లి  దగ్గరికి వెళ్ళే సరికి  మధ్యాహ్నం12 గంటలు అయిందిభాగ్యమ్మ  పని నుండి వచ్చి  ముగ్గురు  అన్నం తింటున్నారు.భర్త ఆరోగ్యం బాగాలేదు.ఇంటి ముందు ఏదో బండి చప్పుడు ఆయితే అటు చూసింది . "స్వరూప అమ్మ అంటు ఏడుస్తూనే లోపలికి వచ్చింది".ఏమిటే? అంటు ఎదురు  వెళ్ళింది."ఎప్పుడైనా బిడ్డ, అల్లుడు ఇద్దరు కలిసే వస్తారు". "ఆదివారం సాయంత్రం రోజు కాసేపు కూర్చోని వెళ్లి పోతారు". ఇప్పుడు ఏంది? బిడ్డ ఏమైంది? అంటు  భయం తో  అడిగింది ." చేయి వేసి దగ్గరకు తీసుకుంది". "ఒళ్ళు కాలిపోతుంది". ఏందే? ఇంత జ్వరం తో వచ్చినావు అందివచ్చితండ్రి పక్కనే కూర్చుంది.బిడ్డను  అట్లానే చూస్తూ తినేవాడు ఆపేశాడుఅన్న గోవిందు లేచి చెల్లె దగ్గరికి వచ్చి ఏమిటే? అంటు పట్టుకొని అడిగాడు. "జరిగింది అంతా చెప్పింది". "ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కండ్లను తుడుచుకో", కొంచం తిను అంది  తల్లి.నా కేమి తినాలని లేదు.మీరు తినండి స్వరూప అంది.   భాగ్యమ్మ  ఒక కంచంలో అన్నం కూర  వేసి కలిపి ముందు తినవే,"అసలే ఒంటి మనిషి కావు" నీరసం వస్తాది. నాలుగు ముద్దు కలిపి నోట్లో  పెట్టింది. స్వరూప అలాగే మంచంలో  నిద్ర పోయింది. తల్లితండ్రులు అదే మంచంలో బిడ్డ  దగ్గర కూర్చున్నారు.

 సాయంత్రం అయింది. స్వరూప లేస్తునే. అమ్మ కొంచెం టీ పెట్టవే అంది. ఛాయా తాగుతూ, అంబా, కొంచెం ఓపిక వచిందే అంది."నాయనా నీకు  ఎట్లా వుంది అని అడిగింది".  "నా సంగతి సరేనే" నీకు ఏమైందే? తండ్రి అడిగాడు.

 అమ్మ, నాయనా "నేను అక్కడికి వెళ్లను"."ఏం మనిషి వాడు".అంది. "నేను తల్లిని అవుతున్న విషయం చెప్పితే, ఎవడే నీ బిడ్డకు తండ్రి అని అంటాడా? .ఏదో అనుమానం నామీద  అస్తమానం దెప్పి పోడువడం., నేను అంతా కష్ట పడిన సంతోషమే లేదు అంది.   మీ దగ్గర వుండి మీకు సహాయం చేసిన బాగుండేది. ఏందే? "పెళ్లి అయిన పిల్ల  భర్త కడనే వుండాలి". మా దగ్గర దేనికి చూసినోళ్లు ఏమనుకుంటారు  తల్లి అంది." చూసేవాళ్ళతో నాకు అవసరం లేదు".నేను మాత్రం ఇంకా అక్కడికి వెళ్లాను  గట్టిగా స్వరూప చెప్పింది.

సంపత్ తన తల్లితో  వచ్చాడు.అత్త జ్వరం  ఎట్లా వుందే? స్వరూప అంటు  పక్కన కూర్చుని ముట్టుకొని చూసింది. అంతా  జ్వరంలో ఎంతో చెప్పిన వినకుండా ఇక్కడకు వచ్చింది జయమ్మ అంది.సంపత్ కి కుర్చీ వేసి రా బావ అంటు, గోవిందు కూర్చోబెట్టాడు.ఇది ఏంది? అల్లుడు పిల్లను ఎంత మాట అంటే అంతా మాట అంటావా? మేము ఒక్కమాట అని ఎరుగం  భాగ్యమ్మ అంది.అది పని చేసిన  దగ్గర కూడా ఒక మాట పడలే  రాజమౌలి అన్నాడు.అవును బావ, ఏడుస్తూనే  జ్వరం తోనే వచ్చింది. అనే ముందు ఆలోచించాలి కదాగోవిందు అన్నాడు. చూడు అల్లుడు అది రాత్రి, పగలు కష్టపడుతుంది.ఎవరికోసం మీరంతా మంచి గా వుండాలనే కదా!చూడండి, వదిన  నా కొడుకుది తప్పే తన తరుపున నేనూ క్షేమాపన అడుగుతున్న, ఇంకోసారి ఇలా జరగదు. నమ్మండి  సంపత్  తల్లి  అంది."అందరు అని మాట్లాడుతున్న గమ్మున కూర్చున ఆయనను చెప్పామనండి. ఏం  చేస్తాడో స్వరూప అంది". సారీనే రూప, ఏదో తాగి వాగను.ఇంకోసారి తాగాను. "నిన్ను ఏం ఇబ్బంది పెట్టాను అన్నాడు". "ఇది నువ్వు నీ మనసు నుండే చెప్పుతున్నావా", లేక పైన మాటాలా అంది.  "నిజమే నా తోడు అంటు స్వరూప దగ్గరికి వచ్చి తన చెయ్యిని తల మీద పెట్టుకున్నాడు. "నిన్ను నమ్మించాలి, ఏం చేయాలే అన్నాడు. తాగడం మానేయాలి, పనికి కరెక్ట్ గా పోవాలి,ఇంటిలో అన్నిచూసుకోవాలి."నేను  చేస్తున్న పనిని చిన్న చూపు చూడొద్దు"." నాకు సహాయం చేయాలి'". అబ్బా లిస్ట్ పెద్దదే,అన్ని చేస్తాను .సరేనా అన్నాడుభాగ్యమ్మ అందరికి ఛాయా చేసి ఇచ్చింది. సంపత్ తో వెళ్ళడానికి ఒప్పుకుంది స్వరూపా. ముగ్గురు కలిసి  బయలుదెరడానికి లేచారు. వస్తాను అమ్మ. నాయన వస్తానే అంటూతల్లిదండ్రులకు స్వరూప దండం పెట్టి సంపత్ తో కలిసి బయటకు నడిచింది. వాళ్ళతో పాటు బయటకు వచ్చి వాళ్ళను సాగనంపుతూ భాగ్యమ్మ."జాగ్రత్త తొందరపడకు నిదానంగా వుండు". దుకాణానికి  ఎక్కువసేపు వెళ్లకు అని స్వరూపకి చెప్పింది.

  .  భాగ్యమ్మ  కళ్ళనీళ్ళు తుడుచుకుంటు లోపలికి వచ్చింది. . ఇప్పుడు ప్రాణం కొంచెం చల్ల బడిందిఏమైతేనేమి? " భగవంతుడు సల్ల గా చూశాడు". పాపం బిడ్డ నెలలు నిండాక ఇడకే  తెచ్చుకోవాలా, భాగ్యమ్మ  అనుకుంది.

 స్వరూప పార్లర్ కి వెళుతుంది . సాయంత్రం తొందరగానే వస్తుంది.తనకి 6నెల వచ్చింది. ఒంట్లోఓపికలేదు.

 

స్వరూపకి  ఏమి తినాలనిపించడం లేదునెల,నెల డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు వాడుతునే వుంది.   ఎక్కువ రెస్ట్ తీసుకోని మంచి ఆహారం తీసుకోమని డాక్టర్  చెప్పింది. స్వరూప డాక్టర్ చెప్పిన అన్నింటికి తల  ఊపింది. కాని తనకు కుదురుతుందా! ఏమో చూడాలి. పార్లర్ కి వెళ్ళె సమయం తగ్గించు కుంది. చేతి కింద ఒక అమ్మాయిని  పెట్టుకుంది. తను ఆమెకు రోజు కొంచెం  నేర్పిస్తుంది . తను కూర్చోని రెస్ట్ తీసుకుంటుంది.వచ్చిన వాళ్లకి స్వరూపనే చేయాలని వుంటుంది.కాని ఆమె పరిస్థితి చూసి కామ్ గా ఫేషియల్ చేసించుకొని పోతారు.

   స్వరూప ఇంటికి వచ్చక  ఒకరోజు సంపత్ బాగుంటాడు. ఇంకో రోజు తాగి ఏదో  అంటాడుసంపత్ సరిగ్గా పని చేయకుంటే ఉద్యోగం నుండి తీసేశారు. ఇంట్లోనే వుండడం వలన స్వరూపని ఏదో ఒకటి కల్పించు కొని మాటలు ఆంటునే వుంటాడు."అంతా పొట్ట వేసుకొని పోకుంటే ఏమిటి"?"ఒక పూటే పార్లర్ కి వెళ్లితే ఏమిటి"? అని అంటాడు. సంపత్తి తన జాబ్   పోగొట్టుకున్నాడు.తను ఇన్ని రోజులు సంపాదించినది అంతా తన తాగుడుకే ఖర్చు పెట్టకున్నాడు. తన దగ్గర డబ్బులతోనే  జల్సా గా గడిపి వేసుకున్నాడు.ఇంటి ఖర్చులు తనే, దవాఖానా  ఖర్చులు  తనే భరించాలి. పైగా రోజు గొడవలే, "స్వరూప అత్త ఒకరోజు కొడుకు దిక్కు వుంటుందీ. ఒకరోజు కొడలికి సపోర్ట్ చేస్తుంది" ఒకరోజు సంపత్ తో స్వరూప సరే నేను  పార్లర్వెళ్ళాను .నీవు చూసుకుంటావా,అంది. ఇంటి  ఖర్చు,నా మందులకి అన్ని నువ్వు చూసుకుంటాను అంటే వెళ్ళడం మానేస్తాను అంది.  ఖర్చులన్నీ మీ అమ్మ వాళ్ళను అడుగు అని సంపత్  అన్నాడు.  "మధ్యలో మా అమ్మ వాళ్ళు ఎందుకు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు"."రేపు మనకి

  బిడ్డ పుడితే ఇంకా ఖర్చులు పెరుగుతాయి"స్వరూప అంది ."అందుకే నాలుగు పైసలు ఇప్పుడే సంపాదించుకోవాలి". నీవు కష్టపడవు, నన్ను పడనివ్వు ఏం చేసేది అంటు స్వరూప సంపత్ తో అందిదానికి ఏం జవాబు చెప్పకుండ అక్కడి నూటికి పక్కకు వెళ్లి పోతాడు.. "స్వరూప  పార్లర్ కి వెళ్లడం వలన వాళ్ళకి ఇంటి కిరాయి  ఖర్చులు వెళుతున్నాయి" . స్వరూపకి నెలలు నిండుతున్నాయి, డెలివరీ దగ్గరికి వచ్చింది. . పార్లర్ మొత్తం  అక్కడ వున్న అమ్మా యినే చూసుకోమందివచ్చిన లాభంలో ఇద్దరికీ సగం సగం అని మాట్లాడుకున్నారు

  స్వరూప డెలివరకి  తల్లిగారి ఇంటికి వెళ్లింది."డెలివరి  ఖర్చులు కూడా  తల్లిదండ్రుల తో పెట్టించడం ఇష్టం లేక తనే పెట్టుకోవాలి అనుకుందిస్వరూప లేక పోయేసరికి    సంపత్  హద్దు  లేకుండా అయిపోయాడని.సంపత్ కి తాగడమే ఎక్కువైందని,   అత్త  స్వరూపకి  ఫోన్ చేసి  విషయం చెప్పిందితను ఏం చేస్తుంది."బాధ పడడం తప్ప", .  తల్లి పని చేసి వచ్చి కూతురిని చూసుకుంటుంది. తండ్రి ఆరోగ్యం అంతంతా మాత్రమే, స్వరూప కి  రాత్రి నొప్పులు ఎక్కువైనాయి. గోవింద్ ఆటో తీసుకొని తల్లితో కలిసి హాస్పిటకు వెళ్లారు .పోతు పోతు సంపత్కి పోను  చేస్తే అసలు ఎత్త లేదు రాత్రే సీజరిన్ అయింది. మగబిడ్డ పుట్టాడు. కొడుకు పుట్టాడు అని మళ్లీ  ఫోను చేసి  గోవిందు చెప్పాడు. తల్లి కొడుకు వచ్చి చూశారు. కొడుకు అచ్చం నాలాగే వున్నాడు కదా! సంపత్ తో  స్వరూప అంది  ."ఏం ?కాదు. నా  పోలికలు కూడా వున్నాయి అన్నాడు" .

హాస్పెటల్ నుండి మూడూ రోజులకి ఇల్లు చేరింది .   తల్లి గారి ఇంట్లోనే  మూడోనెల పడ్డాక   కావలిసిన వాళ్ళను పిలిచి బాబుకి పేరు పెట్టారు."మీరు ఏం ఖర్చు పెట్టొద్దు అని స్వరూప అన్నా కూడ తల్లి, అన్న కలిసి ఉంగరం, బట్టలు తెచ్చారు". సంపత్, ఇంకా వాళ్ళ అత్త మాత్రం ఏం తీసికురాకుండ వచ్చారు. "స్వరూప కొడుకు పేరు నాని అని పెట్టుకుంది" ."సంపత్ మాత్రం వెంకట్ అని పేరు పెట్టాడు".

   స్వరూప బాబుకి మూడోనెల పడ్డాక    అత్త గారి ఇంటికి  వచ్చింది. స్వరూప  కొడుకును అత్త కి అప్పజెప్పి తను పార్లర్ పోవడం మొదలు పెట్టిందితను ఇన్ని రోజులు లేకపోవడం వలన గిరాకీ తగ్గిపోయింది. స్వరూప పార్లర్ని దారి లోకి  తేవడానికి అదే పనిగా కష్ట పడసాగింది . "స్వరూప ఇంటికి  వచ్చెసరికి అత్తతో రోజు గొడవనేనేను "ఎంతసేపు పిల్లడిని పట్టుకొని  కూర్చోవాలి. చేతులు నొప్పి పెడుతున్నాయి. అని గులుగుతునే వుంటుంది". సంపత్ ఎక్కువ ఇంట్లోనే వుంటున్నాడుస్వరూప సంపత్ గురించి ఆలోచిస్తూ బాధ పడుతు, "కొడుకును కొంచెం సేపు చూసుకోవచ్చు కదా!, ఏమైనా తాగి వచ్చి పడుకోవడం, " మనిషి కి ఎలా అర్థం అవుతుంది".తను కష్టపడేది మన అందరి  గురించేనని, సంపత్ ఎప్పుడు తెలుసు కుంటాడు.

 ఒక్కొక్క రోజు స్వరూప ఆకలితో  ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఏమి వుండదు.  "తల్లి కొడుకులు ఇద్దరు వండుకుంటారు తింటారు". కోడలు అలిసిపోయి వస్తుందే, కొంచేం వుంచాలి.అని అత్త  అనుకోదు.ఇరుగు పొరుగు వారు స్వరూప అత్తతో, "నీవు ఎందుకు కోడలికి అంతా పని చేయడం వాళ్ళు చెప్పాడం వలన జయమ్మ పని చేయడం తగ్గించింది". స్వరూప పార్లర్ నుండి వచ్చింది. అప్పుడే కొడుకు గుక్కపట్టి ఏడుస్తూనే వున్నాడు".  అత్త ఫోనులో ఎవరితోనో మాట్లాడుతుందిభర్త పడుకున్నాడు. అంతగా ఏడుస్తున్న కొడుకుని ఎత్తుకుంది .ఎంతసేపు అయిందో? చెమటలు పట్టాయి.ఏంది? ఇది అత్త పాలు పట్టారా? "ఎందుకు ఏడుస్తున్నాడు".అందిపట్టలేదు అంది అత్త. ఎందుకని?, పాలు లేవు అందిరోజు లీటరుపాలు తీసుకుంటున్నాం కదా రోజు సంపత్ దోస్తులు వస్తె పాలతోనే కాఫీ చేసి ఇచ్చాను అంది. పెడితే పెట్టారు.

. "మరల పాల పాకెట్ సంపత్కి తెమ్మని  చెప్పొచ్చు కదా"! అంది. చెప్పితే సరే అని పడుకున్నాడు. కనీసం నాకైన ఫోన్ చేయొచ్చు కదా, "ఏం మనుషులు మీరు తింటె అయిపొతుందా", "నాకు చేయక నా కొడుక్కి పెట్టాక ఎందుకు?నాకి కష్టం "బూడిదలో పోసిన పన్నీరు అంది". "ఇదుగో అమ్మాయి ఎప్పుడు  నేను అని విర్రవీగకు" వాడు పెడుతున్నాడు. ఇంటికి డబ్బులు అంది. "పెడితే ఏవి ?ఇంట్లో ఎక్కడ భాగ్యం అంది".కొడుకుని కొన్ని నీళ్ళు తాగించి సంపత్ వెళ్లి పాలు పాకెట్ తేపో అంది. ఇప్పుడా టైం తొమ్మిది అయింది." బాబుకి పాలు లేవు" వెళ్లి తీసుకురా అంది. "నీ పాలు ఇవ్వు" .ఇంకో నెల అయితే సంవత్సరం వస్తుంది.ఇంక నా దగ్గర పాలు ఎలా వుంటాయి. " ఏం షోకు తరిగి పోతుందా"?, ఎప్పుడు షోకు గా తయారు అయి పోవడం కాదు. "పిల్లవానికి కూడా చూసుకో" సంపత్ అన్నాడు, "స్వరూప కోపం తో ఆపు" నీ మాటలు. "పార్లర్ లో అంత పని చేసి సమయానికి తిండి లేక, నాకు పాలు ఎక్కడ పడుతాయి. ".పోకు ఇంటి లోనే వుండు". అన్నాడుసరే ,నేను  పోను నీవు  చూస్తావా?, "అంతా నా  సొమ్ముతోనే తినుకుంటు  తల్లి, కొడుకులు నాటకం  ఆడుతున్నారు అంది". ఏందే? అంటుపైకి ఊరికి సంపత్ స్వరూప జుట్టు పట్టుకుని వీపు లో ఒకటి వేశాడునన్నే కొడుతావా! అంటు ఒక ఉదుటున స్వరూప సంపత్ కలర్ పట్టుకుంది. ఇది అంత  చూస్తూన తల్లి  ఇద్దరిని ఆపింది. "చూడవే దాని పొగరు ఏమి నిలుగుతుందో, అన్నాడు". స్వరూపకి  ఆకలిగా వుంది. కొడుకు ఏడుస్తూనే వున్నాడు. ఒక నిమిషం తనకి ఏడుపు తన్నుకు వచ్చింది. "ఇప్పుడు ఏమీ చేయాలి". నేను ఇంట్లో ఒక నిమిషం వుండను. అన్న పెళ్లి చేసుకున్నాడు . అన్న పెళ్లి అయిన రెండు నెలలకే నాయనా పోయాడు . అమ్మ ఇంకా అదే బాధలో వుంది.నేను ఇప్పుడు వెళ్లి వాళ్ళను బాధపెట్టడం, అయిన తప్పదు, స్వరూప ఆలోచించుకుంటూ బండి మీద కొడుకును నడుముకి కట్టుకొని  తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది. దారిలో  కొడుకు కోసం పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లింది.అంత రాత్రి  వచ్చిన కూతురుని   చూస్తుభాగ్యమ్మ ఏందే ?ఇంత పొద్దుపోయాక వచ్చినావు. అంది .అవునే ఇంకా మా ఆయనకు నాకు కుదరదు. వదిన  జ్యోతి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. బాబుని తీసుకుంది ."వదిన కొంచెం పాలు వేడి చేసి తాగించావా" అంది. అమ్మ  నేను వచ్చె వరకు వీడికి పాలు పట్టలేదు. నాకు కనీసం తినడానికి అయిన ఏం వుంచలేదు. నా సంగతి వదిలేయ్ ఏదో చేసుకుంటాను. "అసలు ఇంత చిన్న వాడిని అలా చేయడానికి మనసు ఎలా వచ్చింది".మా అత్తకి బుద్ధి లేకున్నానా మొగుడు కైన బుద్ధి వుండాలి కదా, నా సొమ్ముతో తింటు ఉరికే ఇంట్లో కూర్చోని తాగుతూ వున్నాడు. ఏంది? ఇది అని నేను అడిగితే ,వీపులో చూడు ఎలా  కొట్టాడో అని చూపిస్తూ స్వరూప ఏడిచింది ."అయినా నాదే బుద్ధి తక్కువ హీరోలాగా వున్నాడు అని చూశాను". కాని గుణం  చూడలేదు." పైన అందాన్ని చూసి మోసపోయాను".మీరు ముందు చూసిన సంబంధం చేసుకుంటే సంతోషంగా  ఉండేదానేమో? "నా కర్మ ఇలా తగులబడింది".జ్యోతి బాబుకి పాలు తాగించగానే  నిద్ర పోయాడు. రా, వదిన  అన్నం తిందాం అని అందరికి వడ్డించింది. అన్నను అంతా కష్ట పడి చదివించినందుకు, అమ్మకి మంచి కోడలు  వచ్చింది. అన్న,వదిన ఇద్దరు పక్క ఊరులో గవర్నమెంట్ టీచర్లుఅమ్మను బాగా చూసుకుంటారు .అమ్మ కూడా వాళ్లు వచ్చెసరికి వేడిగా  అన్ని వండి పెడుతుంది. సెలవు రోజుల్లో అంతా పని వదినే చేస్తుంది. నాకు మర్యాద చేస్తుంది. బాగా చూసుకుంటుంది . అత్త కోడళ్ళు  తల్లి కూతుళ్లు లాగా వుంటారు. ఇలా కలిసి వుంటే ఇంటిలో సమస్యా వుండదు. "బయట కష్టపడి వుంచిన వాళ్ళకి ఇంట్లో ఇలా వుంటే ఎంత ఊరట వుంటుంది". "రేపు అన్న,వదనలకు పిల్లలు పుట్టిన అమ్మ చూసుకుంటుంది". రెండు రూముల  అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అమ్మని  ఇండ్లలో పని మానేయమన్నారు. కాని అమ్మ తనకు పొద్దుపోదు అని, ఒక ఇంట్లో పని చేస్తుంది‌.ఇంక అమ్మకి కష్టాలు తగినట్లే, "నావలన  మళ్లీ మొదలు కాకుండా చూసుకోవాలి" .తింటూ  ఆలోచిస్తున్న స్వరూపని, వదిన ఏమిటి? అలాగే వున్నారు. తినండి జ్యోతి అంది. . అంటూ స్వరూప లోకం లోకి వచ్చి   అన్న, రేపు ఎవరైనా లాయర్ దగ్గరికి  వెల్దామా అంది .సరే,మరల ఒకసారి ఆలోచించు, వెళ్ళె ముందు  గోవిందు అన్నాడుఅన్న  ఇంకా ఆలోచించేది లేదు. "ఆయన మారాడు". మనిషీ తో,నేను కలిసి వుండి ఎప్పుడూ ఏడిచే బదులు, నేను   విడిపోయి వేరుగా  అయిన  మనశ్శాంతి గా వుంటాను అంది. ఆగవే, అంతా తొందర వద్దు. అక్కలను, బావలను పిలిచి మాట్లాడుదాం తల్లి అంది.

ఎందుకమ్మా? నా బాధ నాకు తెలుస్తుంది స్వరూప అంది."మీ అక్కలు కూడా నీ లెక్కనే  గొడవలు పడ్డారే",  "ఇప్పుడు జార పిల్లలు పెద్దగా అయ్యాక  మంచిగా వుంటునారేభాగ్యమ్మ ఆంది.నీకు కూడా అంటానే   సర్దుకుంటాది. "జర అంతా ఓపిక పట్టు అంది". అక్కలు వుంది అప్పటి జమానా!, పైగా బావలకు భూములు  ఊరిలో ఉన్నాయి. దైర్యం అయిన  అక్కలకు వుండేది. "నాకు అలా కాదు. చిల్లిగవ్వ లేదు". నేను కష్టపడితే కాని ఇల్లు జరగదు". "ఇంకా నేను కష్టపడి వాళ్ళను మేపేది".అయిన వాళ్ళు మంచిగా వుంటే, నేను ఎంతైనా  కష్టపడే దానిని స్వరూప అంది." నా కొడుకకి బుద్ధి తెలవక ముందే విడాకులు తీసుకుంటె నయం"."వాడికి ఊహా  తెలుస్తే బాధపడతాడు అంది". అమ్మ నాకు ఇంకా ఏం చెప్పాకు,"అక్కలను పిలువ అవసరం లేదు. తరువాత నువ్వె చెప్పు  అంది . కొడుకుని  పక్కకి పెట్టుకొని పండుకుంది.

.

తెల్లారింది. లేస్తూనే తయారై వీధి చివర లాయర్ ఇంటికి వెళ్ళారు. జరిగిన విషయం లాయర్ తో స్వరూప మాట్లాడింది .లాయర్  లా  ప్రకారం కొడుకు తల్లి దగ్గరే హక్కు వుంటుంది అని చెప్పాడుఒకరోజు స్వరూప రెడీ అవుతుంటే సంపత్ వచ్చాడు. రూప ఇంకా కోపం పోలేదా? నీకు అంటు, "రూప లేదు గీపా లేదు. ఎందుకు వచ్చావు అంది" .అది ఏమిటే? నిన్ను నా కొడుకుని తీసుకు పోదాం అని  వచ్చాను.నేను రాను. నీకు విడాకులకు  ఇద్దాం అనుకుంటున్నాను."నన్నుఅడగకుండానే నువ్వు తీసుకుంటే సరీపోతుందా?.నీవు విడాకుల పేపర్స్ పైన సంతకం పెట్టకున్న  నేను మాత్రం నీతో కలిసి వుండను అంది. కొడుకు మంచంలో పడుకొని నిద్ర పోతున్నాడు. ఏంది? అత్త ఇది మీరైనా చెప్పారాఅన్నాడు." ఏమని సెప్పాలి? నీవు మారకపోతే  భాగ్యమ్మ అంది.నా బిడ్డ ఎంత బాధ పడితే ఇట్ట విడాకులు తీసుకుంటుంది.అది చిన్నప్పటి నుండి ఏదో ఒక  దగ్గర పని  చేస్తూ కష్టం   చేసుకునుడే, ఎక్కడ ఒక మాట పడలేదు. నీ వల్లనే అంది ఇంకా కష్ట పడుతుంది అని  భాగ్యమ్మ  అంది. ఏంది? అత్త మాటలు బాగానే వస్తున్నాయి  అన్నాడు.రాక  మేము ఏం తెలివి తక్కువ వాళ్ళం అనుకున్నావా? ,అంటు గోవిందు రూంలో నుండి బయటకు వచ్చాడు. ఏందిరా ?నీ చెల్లెలు చెప్పక పోగ  పొగరుగా మాట్లాడుతున్నావు. "నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. లేకపోతే    ఏం ?చేస్తావు రా, అంటు గోవిందు పైకి సంపత్  ఉరికుతు  గోవిందు  షర్ట్   కాలర్ పట్టాడు.ఇది అంతా  చూస్తున్న జ్యోతి పోలిసులకి పోను చేసి  చెప్పింది. మంచంలో వున్నా కొడుకుని తీసుకొని పరుగు పెడుతున్నసంపత్ని గట్టిగా పట్టుకొని తన కొడుకుని లాక్కుని రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది‌. స్వరూపా  అంటు తలుపు పైన కొడుతూ సంపత్, నా కొడుకుని  ఇచ్చేయ్  అన్నాడు .రేపు  కోర్టు దగ్గరికి రా ఎవరి కొడుకో తెలుస్తుంది అంది.ఇంకా పోలిసువ్యాను   హారన్ వినిపించింది.సంపత్ భయపడి బండి వేసుకొని  స్పీడ్ గా వెళ్లి పోయాడు. పోలిసులు  వచ్చారు. సంగతి అడిగారు. మా బావనే బాబుని  ఎత్తుకెళ్లె ప్రయత్నం చేశాడు. మీరు  వచ్చె అంతలో భయపడి పారిపోయాడు  అని గోవిందు  చెప్పగనే  వెళ్ళిపోయారు .లాయర్ దగ్గరికి వెళ్లి పేపర్స్ తీసుకున్నారు. స్వరూప సంపత్ ఇంటికి వెళ్ళి పోలిసు సపోర్ట్ తో అని సామానులు ఒక ట్రాలీలో తెచ్చుకుంది .సంపత్   కోర్టుకు వెళ్లి విడాకుల పేపర్స్ పైన సైన్  పెడుతున్న సమయంలో ఆగరాఅని సంపత్ తల్లి  ఏమిటి? స్వరూప నీవు ఇప్పుడు ఏం జరిగింది ఆని విడాకులు అంది. ఇంతవరకు జరిగింది మీకు చిన్న విషయం లాగా అనిపిస్తుందా స్వరూప అంది. ఎందే, అమ్మ దానిని బ్రతిమాలడం  అంటు పేపర్ పైన సంతకం  పెట్టి  సంపత్ తల్లితో  కలిసి వెళ్లి పోయాడు.

 అమ్మ ఇంటికి దగ్గరలో స్వరూప ఇల్లు తీసుకుంది. పాత పార్లర్ ఖాళీ చేసి  ఇంట్లోనేపార్లర్ పెట్టుకుంది. నా కొడుకు కొంచెం పెద్దగా అయ్యే వరకు అమ్మను నా దగ్గిర వుంచు కుంటాను  అని అన్న తో స్వరూప అంది. దానికి  నన్ను అడగాలా? నీ ఇష్టం అమ్మ ఇష్టం  అన్నాడు. థాంక్యూ అన్న స్వరూప అంది . ఇల్లు పార్లర్ ఒకటే కాబట్టి స్వరూపకు శ్రమ  లేకుండా వుంది. తల్లి ఇంట్లో కొడుకుని చూసుకుంటుంది. స్వరూప ఏం బాధ లేకుండా పని చేసుకుంటుంది. ఇంట్లో భాగ్యమ్మ అన్ని చూసుకోవడం వలన తనకు ప్రశాంతంగా వుంది.

స్వరూప పార్లర్ నుండి  వచ్చి కొడుకుని  ఎత్తుకుని గుండేకు అతుక్కొని, నా బంగారం." నిన్ను గొప్ప మనిషిని  చేస్తాను". "ఒక మంచి బాధ్యత గల మనిషి లాగా పెంచుతాను" .అందుకు నేను శాయశక్తులా  కష్టపడతాను. "నీ వలన ఆడపిల్ల బాధ పడకూడదు." నన్ను  నమ్మురా? "నాని అంటు గట్టిగా ముద్దు పెట్టుకొని తన గుండెల మీద  పెట్టుకొని  మంచంలో పడుకొని జో కొడుతు తన కొడుకుతో పాటు తను నిద్ర లోకి జారిపోయింది.

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు