కవితలు

(March,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నేటి భారతం
 

నేటి భారతం సత్యా హింసల గాంధీ పథం  

కనుమరుగయ్యే దశ’దిశ’లా

 

మేకవన్నె పులలెన్నో సంచరించె   

‘నిర్భయ’ము గా రఘురాముడు ఏలిన రాజ్యన  

 

అష్టాంగమార్గం అభాసుపాలయ్యె  

‘సమత’ లేని బుద్ధ భూమిలోన

 

మతిలేని చేతల ‘ప్రవీణు’డి  పశువాంఛకు

రాలిన తొమ్మిది  నెలల పసి మొగ్గ పరిహసించె  

పండిత నెహ్రూ పుట్టినరోజున

  

కలడు కలడనెడు  వాడు కలడో లేడో అన్న

అసహాయ గజేంద్రుని ఆర్తి విన్న  భాగవత

పురాణ పుణ్య దేశాన  

ఉన్నాడో లేడో అన్న సందేహమే మిగిలే

‘ఉన్నావో’ అన్న ఘటన వలన

 

మానవత్వపు పరిమళాలను వెదజల్లే

మనిషితనం మాయమయ్యే నరనరాన

ఆడవారికి బ్రతుకే భారమయ్యే నేటి భారతాన  
 


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు