కవితలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

పరిమళించిన పూర్ణత్వం

అవునోయ్

ఇప్పుడు ఎంత నిశ్చింతో 

నీ చెలిమితో 

 

సుతి మెత్తని ఆ చూపుతో 

తళుక్కుమనే ఆ నవ్వుతో 

చీకటి తెరలను  తీసి

ఉదయ కాంతివై 

నాలోని ఖాళీలను పూరిస్తుంటావుగా 

చెక్కిళ్లపై కెంపు వర్ణాలద్దుతూ 

 

గల్లంతయిన  

జ్ఞాపకాలనెన్నిటినో 

చేర వేస్తుంటావు గా 

ఊహల ఊసులు గా 

 

వేకువ దొరగా నీరాకతో 

ఎన్నో ఎన్నెన్నో 

కాంతి పూలు విచ్చుకుంటుంటాయి

అదిగో అది చూసి పరవశిస్తుంటాను 

ప్రకృతిలా  స్వర్ణవర్ణాలతో

 

మరి

ఇక 

నీ ముందు 

ఏ రహస్యాన్ని 

దాచగలను చెప్పు 

 

ఎన్నో  శోభలతో 

నన్నే నీ లో మమేకం చేసుకుంటుంటే

పూర్ణత్వాన్ని నింపుకున్న 

పుష్పంలా స్వచ్ఛతతో పరిమళించడం తప్ప 

ఇక ఏమీ తెలియదోయ్.. నాకు...

 

 


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు