కవితలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

లెక్కలన్నీ దెలుసు

కదలికలు కలయికలు

యెద యెదలో అలజడులు

ప్రతి మదిలో రగులుతున్న

ధిక్కారపు సవ్వడులు

 

సామ్యవాద భావానికి

స్వామిభక్తి వాదానికి

నిత్యం కయ్యం దప్ప

పొత్తు యేడ కుదురునప్ప

 

అంగట్లో సరుకైనది

అన్నీ కొన యెరుకైనది!

ఉచ్ఛ నీచముల జూడ

నిజమును భువి కనమేడ?

 

విద్య వైద్యముల పీడ!

వదిలించు జాడ్యమీడ!!

కరోన కబలించునపుడు

ప్రజకు కంటి కునుకేడ?

 

ఆరోగ్యశ్రీ లకు ఇట

కోట్లకు కోట్లది వాట

కార్పోరేట్లకు బాట

ఒక్కడైన కదలడేంది?

కరోనానుకతంజేయ!

 

ఆరోగ్యము మించు ధనము

విద్యను కామించు విధము

తెలియని పామరుల చేత

పడియున్నది పాలనము!

 

దాహమేస్తే బావిదోడు

అలవాటుకు చేదోడు

పాలకులకు మేలు జరుగు

పనుల కెటాయింపు పెరుగు

 

ఒళ్ళు వంచి చెమట కక్కి

పుట్ల కొద్ది పండించిన

రైతుది కద రాజ్యము ?

మరి యేల ఆత్మ త్యాగము !

 

కూలినాలి జేత్తమన్న

పనిదొరుకుట లేదురన్న

శ్రామికజన మందహాస

భూమి,భుక్తి కోసమన్న

 

జన బాధలు గనకుంటివి

కూలి అడ్డలన్ని మూసేస్తివి

ఐనా!

మనోల్ల సూపు సామాజిక లాక్ డౌను

 

షాపుగుమాస్తా దుస్తితి

పని మనుషుల దేమి స్థితి?

రైతు కూలి,తాపి మేస్త్రి

కుల కసిపిల కేమి శాస్థి !

 

శ్రేయో జన రాజ్యం లో

అన్నీ ప్రై"వేటు"కిచ్చి

బొచ్చెలు జన చేతికిచ్చి

బిచ్చగాళ్లుగా చేస్తిరి !

 

కరోనా భూతమచ్చి

అన్నీ మరిపింప జేసి

బడుగు బతుకు వెతకు తోడు

పస్తుల క్వారైంటైన్లు !

 

ముట్టుడద్దు,అంటుడద్దు

ఐసోలేషను ముద్దు

చీదవద్దు,తుమ్మవద్దు

దస్తీలను అడ్డు పెట్టు

 

అన్నీ మన పాలకులకు

నిమ్మలంగ జెపుతాము

లెక్కగట్టి చూపుతాము

కాలం కై వేచుదాము

 


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు