కవితలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

విశ్వవిజేతలం మనమే

ఎందుకు మిత్రమా చింతతోఉన్నావు

కరోన నిన్ను కూడా కల్లోల పరిచిందా

ఆ దిగాలెమిటి ఆగుబులేమిటి

మనుగడ కోసం సాగించే యుద్ధం

మనకు కొత్థేమి కాదు కదా

విప్పారిన కళ్ళతో చూడు

వాస్తవాలు విస్మయపరుస్తాయి

విర్రవీగినదంతా వెర్రిగా ఓడుతుంది

ఏది కొత్త నీకు

అంటచ్ బులిటీ నా క్వారంటై నా

శుచినా శుభ్రమా 

వ్యాధులతో పోరాటమా

మనుగడ కోసం సాగించే యుద్ధం

మనకు కొత్త ఏమి కాదు కదా

కొంత కోల్పోయామెమో గాని

మొత్థంగా కాదు కదా

స్త్రీలుగా నెలసరి లో క్వారంటన్

దళితులుగా సోషల్ డిస్ట్ న్స్ ఎదుర్కోలేదా

ఎంగిలి వద్దంటే వెంగళాయిగా చుస్థిరి

 పారిశ్రామిక విప్లవం నిన్ను యంత్రంగా

సామ్రాజ్యవాదం నిన్ను ఆయుదంగా

మార్చికుందా

అగ్ర రాజ్యాల ఉగ్రరూపం 

ఎంతోకాలం సాగదులే

నాగరికత సంస్కృతులు

పునరుధ్హానం అవుతాయని

అనేక  వృత్తంతాలు న్నాయి కదా

ధైర్యంగా ఉండు మిత్రమా

రేపటి రోజు మనదే

మన నమస్కారం ప్రపంచ సంస్కారమైనట్టు

మన సంస్కృతి విశ్వ సంస్కృతి

కాబోతుంది

కొంత కాలం ఒంటరితనం జయించు

ఆకాంక్షను ఆరాటాన్ని అదుపులో పెట్టు

రేపటి ప్రపంచపు ఆశా జ్యోతులం మనమే

కృత్రిమ అభివృద్ధి చెందిన దేశాలన్నీ

మానవ వనరుల్ని కోల్పోతున్న వైనం 

బ్రిటనొక్కటే కాదు 

ప్రపంచానికి ఆషాకిరణం 

మన యువతే.

కరోనాను జయిస్తే

విశ్వ విజేతలం మనమే

           

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు