కవితలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

మెతుకు తలపులు

సాయం సంధ్య

 పాలు పోసుకున్న నిగారింపు

ఆకు పచ్చని మెరుపుల కాంతులు

నింగీ నేలా  

ఒకటికి మరొకటి

ప్రతిబింబాల ప్రపంచం

ఇదొక అందం ఇదొక సౌభాగ్యం

 

మట్టి పూసిన

కొన్ని మెలకువలు

చిగురించే

కొన్ని మేల్కొలుపులు

రేపటి అన్నం ముద్దల సందడి

కొనసాగింపుల జీవితం

ఇదొక కల ఇదొక బతుకు తీపి

 

కొన్ని చెట్టు కొమ్మలు

కొన్ని సేద తీరాల్సిన పిట్టలు

కొన్ని ఆకలి తీరని జ్ఞాపకాలు

చెట్లేవీ నీళ్ళేవీ పంటేదీ

 

నేను మాత్రం

కళ్ళింత చేసుకుని

ఎప్పటిలాగే ఆకాశం కేసి చూస్తూ

కడుపు నిమురుకుంటున్నాను.


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు