కవితలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

గాంధీ ఆసుపత్రి
 

ఇవ్వాళ
నీ పేరు వింటేనే..
మంత్రముగ్దులమ్..తల్లీ!
కరోనా దేహాలని కాపాడే ధన్వంతరివి..!
కనబడని
వైరస్ తో యుద్ధం చేస్తున్న సైనికుడివి..
ప్రపంచమే..
లాక్ డౌన్..అంతా..క్వారంటైన్
ప్రతి ఇల్లూ తలుపులు
బిగించుకున్న వేల
ఎవరికి వారమే అనుమానితులం
అమ్మా ..తల్లీ.!
గాంధీ ఆసుపత్రీ..నువ్ సర్కార్ దవాఖానవే..
మూసుకున్న ప్రపంచం లో
నువ్వుమాత్రమే చేతులు చాచి ఆహ్వానిస్తున్నావ్..
కొర జీవునం తో కొట్టుకుంటున్న
మా ప్రాణాలని కాపాడాలని..
అర్రులు చాస్తున్నావ్..
తెల్ల దుస్తుల దేవుళ్ళని
అస్త్ర శస్త్రాలతో సమాయాత్తపరిచినవ్!
ఆరిపోతున్న
దీపాలకు స్వస్థత నింపే మదర్ థెరీసావి..నువ్వే

అది పేలే వైరస్ విస్ఫోటనం
తెలిసీ ఎదురెల్లుతున్నావ్
ఎంత తెగింపు తల్లీ నీది
మరణించిన బిడ్డల పై
కొంగుకప్పి మార్చురీ లో విలపిస్తావు.

ఒకప్పుడు
నిన్ను తలచుకుంటేనే..
వెన్నులో వణుకు పుట్టేది.
వొద్దుబిడ్డో సర్కార్ దవాఖానకూ అంటూ
వ్యంగ్య గానాలాలపించేటోళ్లం
క్షమించు తల్లీ!
ఇప్పుడు నువ్వే కాపాడే శరణాలయానివి
ఏ మాట కామాటే..
దీని పునాది
ఆ నిజాముదే నట ఎంత ముందుచూపో..!
గతంలోఎన్ని
గత్తరలకు ఎదురు నిలవలేదు!?
ఈ గాంధీ దావాఖాన..
ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాం
నిన్ను చూసుకునే..కదా
తమసోమా జ్యోతిర్గమయా అంటూ
మరణం నుండి అమరత్వానికి..
తీసుకెల్లే నీకు శతకోటి వందనాలు తల్లీ!

 


ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు