కవితలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సఫాయి సైనికుడు
 

తెగిన చెప్పుకి తాడు కట్టి

సిల్లులు పడ్డ అంగికి కుట్టు పెట్టి

మాసిన జుట్టుకి టోపి పెట్టి

సుక్కపొద్దుకు నిద్ర లేచి

చీపురు గట్ట చేత పట్టి

పలుగు పార భుజానికేసి

సప్పుడు జేసుకుంటూ సందు సందు తిరిగి శుభ్రం చేసే సఫాయి

నీకు సాలమోయి..

 

నీ ఒంటి శుభ్రం దేవుడెరుగు

నీ ఇళ్లు శుభ్రం నీ ఇళ్లాలికెరుక

మా గల్లి శుభ్రం నీకేఎరుక

మురికి వాడని ముద్దాడి

అద్ధంలా దిద్దుతవు

చెత్తనేమో సంకన ఎత్తుకొని

సంటిపిల్లలా ఆడిస్తవు

వాన వస్తె నువ్వు మా వాడాకు గొడుగైతవు

ఎండ వస్తె ఎండిపోయిన చెట్లకి కొడుకైతవు

దోమల వస్తె యుద్దం చేసే

వీరుడైతవు

మురికితో నాకు

ముడి పడింది అంటవు

చెత్తతో నాకు

చెలిమి కుదిరింది అంటవు

బురదే నాకు

బంధువు అంటవు

ఓ సఫాయి కార్మిక

మా పాలిట కర్షక

నువ్వు జగమెరుగని రక్షక భటుడివి.

 

ఇన్ని చేసిన నీకు

పచ్చి మంచినీళ్ళు ఇచ్చేందుకు పలుమార్లు ఆలోచించే కుంచితస్వభావం ఉన్న మేము

ఏమని చెప్పము మీకు

మే డే శుభాకాంక్షలు అని...

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు