అడవులు అడవులు నిండిన ఆకురంగుపాటలపర్వతాలలోయలు తోటలు తోటలుపై కూతలయ్యే ఈకమెరుపుల పిట్టల సమూహాలు ఇంద్రధనుస్సులోకాన్ని కనుపాపల్లో బొమ్మ గీసిన ఆమెరంగేది?
నదులు నదులవెంబడి మైదానాలై నేలంతా పరుచుకున్న ప్రాణస్పర్శ వీధుల్లో రాళ్ళురప్పలు రాళ్లపై పురాతన పాదముద్రల భాషలో కాలాన్ని పురిటిబిడ్డగా లాలిస్తూ, ప్రపంచానికి 'పాలిస్తూ'-
పుట్టుక్కే మూలమైన చోట పుట్టుకే ప్రశ్నార్థమైన తావా పంటిబిగువులో అగ్నిపర్వతాలను అదిమిపట్టి కుమిలిపోతున్న ఆ పేగుల్లో బాధదేరంగు?
అన్నీ తానే అయినా అన్నీ తనవే అయినా ఏ కొన్నింట్నీ కొంగునముడేసుకోలేనీ మాతృమూర్తి త్యాగానిది ఏ రంగు??