కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఆకాశంలో సగం!! 

లేతకుసుమమా!!!

అందంలో చంద్రుని ప్రతిబింబానివి

నీ అందంతో సూర్యున్ని ప్రకాశింపచేస్తివి

ఏమీ ఓర్పు,ప్రేమ, సహనం

భూమ్యాకాశాలు సైతం నీకు వననం

సముద్రాన్ని ఛేదించావు,

ఆకాశాన్ని చేజిక్కించుకున్నావు!!

పరదాలు వేసుకున్న మహిళ

పదుగురిలోకి వచ్చిన వెలుగుకళ

నీ ఇంటిగోడలను చీల్చుకుని

సమాజంలోకి వేరులా పెకిలించుకుని,

నీ దృఢత్వాన్ని చూపితివి

 

నీ మాటలోని తియ్యదనం

ప్రపంచానికి అనురాగం

నీ అమ్మతనం

ప్రపంచానికి త్యాగభావం.

 

అందమైన వనిత

అందుకో నీ కలఖడ్గం

నీ అమ్మతనాన్ని వర్ణించుకో

అడ్డంగా వాడుకున్న నీ దేవతత్వాన్ని

దేవతవై రాక్షసున్ని అంతమొందించు

ఇంకెన్నాళ్లు తల్లీ నీ కోపతాపం

 

అమ్మవయ్యి ప్రేమిస్తావు,

నాన్నవయ్యి ఆదరిస్తావు,

అక్కవయ్యి అనుబంధం పంచి

చెల్లివయ్యి అనురాగం అందించి

భార్యవయ్యి అన్నీ నీవవుతావు

రాక్షాసపు లోకానికేమో

అదే చనువై, మృగమై

నీ అమ్మతనానికి ముద్ర వేస్తోంది.

 

సుగుణాజాలి!!

నీవు లేని ప్రయాణం

ఆత్మానుబంధాలను కోల్పోతూ

సృష్టి అంతమొందుతూ

శూన్యానికి చేరుకుంటుంది

ఏమీ త్యాగం ధీరవనిత

లోకశ్రేష్ఠి, లేతతీగ, లేమా!!!

 

      


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు