కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

వలస కూలీలమండీ మేము.....!!!

వలస కూలీలమండీ మేము.....!!! అలల ప్రయాణం అయినది మా జీవితం....

అలసట తీరని మా పయనం తీరానికి చేరేదెన్నడు?? వెళ్ళొస్తాము అన్న పదంతో మొదలయిన ఈ ప్రయాణం... వచ్చేసాము అనే పదంతో ముగిసేనా??

కూలి పనితో కడుపు నిండే మాకు...

నేడు కూలేడ దొరుకును??

కూడేడ దొరుకును??

గొడ్డు కైనా గూడు దొరుకును.... మనిషిగా పుట్టినా గూడేడ వెతుకును??

వెతికినా...!! అద్దెలా ఇచ్చును నేను??

కన్నీరు కార్చా?? రక్తము చిందించా??

బస్తాను మోసిన భుజము బరువెక్కలేదే...

బాధను మోయగా మనసే బరువైనది??

ఆశతో చూసే అమ్మ అయ్యకు తిరిగి వచ్చినాను అన్న ఆనందాన్ని ఇచ్చేదెన్నడు??

ఆ సంతోషాన్ని చూసేదెన్నడు??