కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

నా చిన్నప్పుడు

చిత్తడి నేలను ముద్దాడి

మట్టి పిసికిన మట్టిచేతులివి

సాటి మనిషి చేతిని సైతం స్పర్శించలేని

కరోనా కాలంలో

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

నా మనసుకు నచ్చిన వారిని

గుండెలకు హత్తుకునే కాయమిది

ఇప్పుడు కట్టుకున్న భార్యను కూడా

ముట్టుకుంటే మట్టు పెడతానంటూ

కంటికి కనిపించని కరోనా వైరస్

మృత్యు పాశమై వెంటాడుతున్న వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

ప్రపంచమంతా శవాల శకలాల 

కమురు ధూపమై ధూళిలో కలుస్తుంటే

అహంకారి, విశృంఖల విలాసైన మనిషి

ఇప్పుడు కారు చిచ్చులో బడ్డ మిడతలా

విలవిలలాడుతున్న వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

కంప్యూటర్ మేఘాలు.                                    విష వాయువుల్ని వర్షిస్తున్న వేళ

మనుషులంతా సొంత గూటి పక్షులైనాక

దేశ దేశానా చావు లెక్కలు

గంట గంటకూ గతి తప్పుతున్న వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

విశ్వమంతా కరోనా కలవరింతలతో

గుప్పెడు ఆలోచనల్ని పంచుకుంటూ

హృదయపు ఎడారులలో

తమ కన్నీటి కాలువలతో.                          శవాల  పంటను పండిస్తున్న వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

సమస్త ప్రజా సమూహాలన్నీ

కరోనా కనురెప్పల చాటున దాగి

చావుబతుకుల్లో తచ్చాడుతున్న వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

బంధాలకు అనుబంధాలకు

ప్రేమ,ఆప్యాయత, అనురాగాలకు

సంకెళ్ళు వేస్తున్న సంధి కాలమైన

యుగాంతపు వేళ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 

ప్రతి మనిషిలో ఆశల వెలుగులు

వలస పోయినట్లు....

అడవిలోని చిరుతపులి ఆకలితో

మన ఇంటి ముంగిట వేటాడుతున్న వేళ

చావు చీకటి విరిగి పోవాలని

జీవన చిత్రంపై మళ్లీ వెలుగు పూలు

పుష్పించాలని ఆకాంక్షిస్తూ

నేను కవిత్వంతో కరచాలనం చేస్తున్నా!

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు