కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఒక చిన్న బంగారపు గింజ

ఆ వూరి లోని ఓ వీధిలో

నేను ఎప్పటిలానే ఇల్లిల్లూ తిరుగుతూ బిక్షమెత్తుకుంటున్నాను

అంతలో

దూరం నుండి నీ బంగారు రధం అందమైన కలలా కన్పించింది

నేను ఆశ్చర్యముతో చూసాను ఎవరీ రాజాధిరాజు అని!

 

నాలో ఆశలో మొలకెత్తాయి

నా దుర్దినాలు తొలగిపోయే కాలం సమీపించిన్దనిపించింది

అక్కడే నిలబడి అడక్కుండానే రాబోయే బిక్ష కోసం

అన్నివైపుల వేదజల్లబడుతున్న అనంతమైన సంపద కోసం ఆశగా ఎదిరిచూస్తున్నాను

 

నా అదృష్టం

నీ రధం నేను నిల్చున్న చోటనే ఆగింది

నీ చల్లని చూపులు నాపై వాలాయి

చిరునవ్వు చిందిస్తూ నీవు రధం దిగి నావైపు వచ్చావు

చివరికి నా అదృష్టం పండినదని సంతోషించాను

అంతలో హటాత్తుగా నీవు చేయి సాచి

“నీవు నాకేం ఇస్త్తావు?” అని అడిగావు

 

ఒక రాజాధిరాజు ఒక బిక్షగాన్ని చేయి సాచి అడగటం పరిహాసం కాక మరేమిటి?

నాకు ఏమిచెయ్యాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయాను

కాసేపటికి తేరుకొని

నా జోలేలోనుండి మెల్లగా వెదికి అతి చిన్న ధాన్యపు గింజను బయటికి తీసి నీ చేతిలో ఉంచాను

 

ఆరోజు సాయంకాలం బిక్షాటన ముగిసిన తర్వాత

నా జోలెలోని బిక్షని బయటికి తీసి చూసిన నాకు నోట మాట రాలేదు

నా పేద సంపాదనలో ఒక చిన్న బంగారపు గింజ మిలమిలా మెరిసింది

నమ్మలేక పోయాను,

నీవు నన్ను అడిగినప్పుడు

నా సర్వస్వం నీదేనని చెప్పలేక పోయానని

వెక్కి వెక్కి ఏడ్చాను

(రవీ౦ద్రనాద్ టాగూరు కవిత A Little Grain of Gold కు అనువాదం)

 


ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు