కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఓ కూలి అన్న   
 

వలస వచ్చిన ఓ కూలీ అన్న

 నెర్రెలు వాసేనా నీ బతుకు

 

నేను ఎట్లా రాస్తునే  ఓ కూలి అన్న  నేనెట్లా

పాడుదును   ఓ కూలి అన్న  

 

వేల మైళ్ళు నడుచుడే ఓ కూలి అన్న

 

రైలు పట్టాల మీద ప్రయాణమే ఓ కూలి అన్న

ఎటు వచ్చునో తెల్వదాయే ఆ గూడ్సు బండి

ఓ కూలి అన్న

 

 

నేను ఎట్లా రాస్తూనే  ఓ కూలి అన్న  నేనెట్లా

పాడుదును   ఓ కూలి అన్న

 

 కరోనా లాక్డౌన్ ఆయే ఓ కూలీ అన్నా

నీకు రొట్టెముక్క కరువాయే  ఓ కూలి అన్న

 

మేడ్చల్ రోడ్డు  నీ ఇల్లాయేనే ఓ కూలన్న

కన్నతల్లై కడుపు నింపుతుండే ఓ కూలన్న

 

నేను ఎట్లా రాస్తూనే  ఓ కూలి అన్న  నేనెట్లా

పాడుదును   ఓ కూలి అన్న

 

మేడ్చల్  రోడ్డు పై అన్నం పెట్టిన అన్నలకు అక్కలకు

ఉద్యమాభి వందనాలు

 

నేను ఎట్లా రాస్తూనే  ఓ కూలి అన్న  నేనెట్ల

పాడుదును   ఓ కూలి అన్న

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు