కవితలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నిరీక్షణ

చిగురు తొడిగిన వసంతాగమన గాలులలో

మత్తెక్కించే అమావాస్య నిశిలో

మధు చషకాలను తాగి నిషా ఎక్కిన

మిణుగురులా తిరుగుతున్నాను.

 

నా అంతరంగంలో తళుకులీను నీతలపుల జల్లును

ఎలా వర్ణించను

ఏమని నిర్వచించనే అప్సరసా...

 

నా తీక్షణమైన చూపులు

ఆకాశాన్ని చీల్చి విశ్వయానం చేస్తుంటే

నక్షత్రవాటికలో కదలాడుతున్న

నీ విచ్చుకున్న ముఖారవింద వర్చస్సును చూసి,

మృగతృష్ణ నన్ను నిలువునా

నీ జ్ఞాపకాల ప్రవాహంలో ముంచుతుంది.

 

క్షణం దశాబ్దమై

నిమిషం శతాబ్దమై

గంట యుగమై

సంవత్సరం బ్రహ్మ కల్పాంతమై గడిచిపోయిన

గతించిన కాలంలో

నీ కన్దోయి నుంచి  వేగంగా

నా మనసును తాకిన చూపుల ప్రేమఅంబులను

రత్నఖచిత అమ్ములపొదిలో భద్రపరచాను.

 

నీ అపురూప అమూల్యమైన

అరుణాధర మధురామృతం కోసం,

స్మృతి పథంలో విస్తృత బాటసారినై

నీకై తపిస్తూ

నీ పేరునే జపిస్తూ

నీకోసం భగ్నప్రేమికుడనై  ప్రయాణిస్తున్నాను.

మరోమారు మరిచిపోని హేమంత తుషారంలో

నా బిగికౌగిలిలో నిన్ను బంధించాలని నిరీక్షిస్తున్నాను.

 

 


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు