కవితలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఏమిటో ఈ కలికాలం?

ఏమిటో కలికాలం

అర్ధం కాని మాయాజాలం

మానవత్వం ఉన్నవాడు కాదంట

మనీ ఉన్నవాడే మనిషంట

శ్రమించేవాడు కాదంట

సోకులొలికేవాడు శ్రమకారుడంట

రాతి విగ్రహానికి నిత్య నైవేద్యాలు

ప్రాణమున్న మనిషికేమో

ప్రతిరోజూ ఆకలిపస్తులు

పైసా ఉన్న వానిదే పాలన

అది లేని వారి జీవితం హేళన

ఎందుకో మానవుడు

గుణం చూడటం మానేసి

కులం గొడుగు పడుతున్నాడు

మనుషులంతా సమానమేనని మరచి

మతం ముసుగు వేస్తున్నాడు

పేదవారి ఆకలి కడుపులలోని

ఖాళీ గురించి పట్టింపు లేదు కానీ

ఆలయాలలోని హుండీలు మాత్రం

పోటీ పడి నింపేస్తున్నారు

ఏమైపోతున్నాయి నైతిక విలువలు

ఎటుపోతోంది లోన దాగివున్న సంస్కారం

అల్లారుముద్దుగా పెంచినందుకు

నేడు తల్లిదండ్రులకు దక్కుతున్న బహుమానం

- " వృద్ధాశ్రమం "

మానవతా విలువలు మరచి

మగువల జీవితాలను తన

రాక్షస కోరల్లో బంధించేస్తున్న

సమాజంలో

మమతల జల్లులు

కురిసేనా ఎన్నటికైనా

అనురాగపు సిరిమల్లెలు

విరిసేనా ఎప్పటికైనా

చుట్టూరా అన్యాయపుభూతం

తాండవిస్తున్నా

ప్రశ్నించడం లేదు

నాలుక , ఎందుకని ??

ఇంకెన్నాళ్లు మౌనం

ఇకనైనా మేలుకో మానవా

ప్రతిఘటించు తప్పుని

సంస్కరించు మంచిని

తీర్చిదిద్దు సమాజాన్ని

భావి భారతదేశ భవిష్యత్తుని !!

 

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు