కవితలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఓ నా డిగ్రీ పట్టా

నా డిగ్రీ పట్టా

రాజ్యం

అహంకారానికి బలైపోతున్న

నా డిగ్రీ పట్టా

నీవు నా చెంతకు చేరి

నన్ను మురిపించితివి

నన్ను  కన్న వారిని  మురిపించితివి

నా డిగ్రీ పట్టా

 

నువ్వు ఇచ్చిన ధైర్యం

నా డిగ్రీ పట్టా

గర్జించిన నా గొంతుకు ధైర్యం

నా డిగ్రీ పట్టా

 

 ఉస్మానియా నాలుగు గోడల మధ్య

ఎత్తిన గొంతులు ఎన్నో

నా డిగ్రీ పట్టా

నేడు రాజ్యం నిర్బంధంలో  బందీ అయిపోతున్నారు

నా డిగ్రీ పట్టా

 

పాఠం చెప్పిన గురువు నిర్బంధంలో

నా డిగ్రీ పట్టా

పాఠం విన్న విద్యార్థి నిర్బంధంలో

నా డిగ్రీ పట్టా

 

నిటారుగా ఉన్న  రాజ్యానికి

నువ్వు ఇచ్చిన ధైర్యం అంటే  భయం

అందుకే నాపై నిర్బంధం

నా డిగ్రీ పట్టా

 

సంపద లేకున్నా

నా డిగ్రీ పట్టా

నువ్వు ఇచ్చిన ధైర్యం ఆనందం

నా డిగ్రీ పట్టా

 


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు