ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
నానీలు..
1. మట్టిలో నీరేకాదు
కన్నీరొలికినా
చెట్టై
పలుకుతుంది
2. అధ్యయనం లేని విద్య
సాగుచేయని నేల
పండేదక్కడ
పల్లెర్లే
3. గురుశిష్యులదేమి
బంధం
వారి ఎదల్లో అతడు
వాడని సుమగంధం
4. ఆడకూతురని
అలకెందుకు
మానవజాతికే
మాతృమూర్తి కదా
5. నేలతల్లిదెప్పుడూ
ఒకటే కల
కాలే కడుపుల్లో
బువ్వై బ్రతకాలని
6. చీకటి వెలుగులే కదా
ఈ లోకం
నలుపును కావరంతో
నలుపొద్దు
7. తెలుగెక్కడికీ
పోలేదు
స్మార్ట్ గా తయారై
ఆన్ లైన్లో అలరిస్తోంది