కవితలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కరో నా..!

క్రూరత్వంతో బూజు పట్టి మురికితో మిగిలిన భూమిని పఢో నా 

ఓ కరోనా! ఈ జగతిని నీ చేతి సఫాయీతో స్వచ్ఛా జగత్ కరో నా 

 

కరకు రాతి గుండెలలో గరక పోచలను నువ్ పూయించి

ఓ కరోనా! మనిషి మనిషిలో మానవత్వమును భరో నా 

 

ధనము, ఘనము, మనము పోవాల్సిందేగా ఏనాటికైనా 

అన్నీ నశించేవే ఈ నశ్వర జగములో అని తుమ్ సమ్జావో నా 

 

కులాల కుళ్ళు మతాల ముళ్ళు పీకేసి వాటన్నిటినీ తీసేసి 

సృష్టికర్తను గుర్తుకు తెచ్చే భక్తి గీతమును తుమ్ దిల్ భర్ గాఓ నా 

 

పరమ పావన ప్రకృతికి పూర్వ శోభను నువ్ చేకూర్చి 

పంతం పట్టక అనంతమైన కాలగర్భంలోకి తుమ్ ఛలో నా 

 

నా ఇల్లంటే నాకెంతో ఇష్టం, నువ్వింకా ఉంటే ఎంతో కష్టం 

నీ కాష్ఠము కాలకముందే.. ఓ కరోనా! తేరే ఘర్ తుమ్ జాఓ నా

 

 

 


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు