కవితలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఇక సెలవు

బతుకు దెరువు

బతుకు బరువు

 

పగలణకా రాత్రణకా

కాలంతో పయనం

 

పాణమెంతో ఆగమైనా

పరుగాపని బరువులాయే

 

కడుపు నిండదాయే

జేబు నిండకపాయే

 

పిల్లలోకాడ పెద్దలోకాడ

చిన్ననాటి దోస్తులోకాడ

 

పల్లెలెమో సిన్నబోయే

పట్టణాలు స్మశానాలయే

 

బతుకు దెరువుకు

బయలు దేరిన

బాటసారికి...

 

తనువు భారమాయే

కట్టడిలేని కరోనా

మహా ఘోరమాయే

 

బతుకులన్నీ ఆగమాయే

ప్రభుత్వాలు చేతులెత్తే

జీవితాలపై నమ్మకమే పోయె

 

అమ్మా...

కరోన నాకొచ్చినా 

ఆశ్చర్య పోవద్దమ్మా

అనుమాన పడకండమ్మా

మీకు రాకుండా జాగ్రత్త పడాలమ్మా


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు