తెల్లొడి నుండి నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది
తెల్లొడు మారిండు నల్లొడి చేతికి స్వాతంత్ర్యం వచ్చింది
దేశంలొ అగ్రవార్ణాల పై మూడింటికి తెలంగాణలొ దొరలు దేశ్ముఖ్ లకు స్వాతంత్ర్యం వచ్చింది
ఆధిపత్య కులాలకు సామాజిక దూరానికి,అసమానతల పెంపుకు,ఆర్థిక దోపిడీకి స్వాతంత్ర్యం వచ్చింది
బహుజన స్వాతంత్ర్యం వచ్చేదెప్పుడో జెండాలు మోసినోడు జెండాలు కట్టినోడు జెండాలను ఎగిరేసే దెప్పుడో
నాకు ఇంకా ఎప్పుడొచ్చునో స్వాతంత్ర్యం ఆమోదించిన రాజ్యాంగానికి 70ఏన్లు నిండినా
మాట్లాడే స్వేచ్ఛను హరించే రాజ్యం నుండి ఎప్పుడొచ్చునో స్వేచ్ఛ స్వాతంత్ర్యం
ఇష్టదైవానికి నిష్టగా మధ్యవర్తి లేకుండా గర్భగుడిలో భగవంతుని ప్రతిమకు
ఎదురెదురు కూర్చొని కనులార్చి మనసిప్పి విన్నపాలు విన్నవించే స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చు నో
నచ్చిన మతాన్ని స్వీకరించి నిర్భీతితో అవలంభించే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చు నో
నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామి గా ఎంచుకునే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చు నో
స్త్రీ స్వేచ్చ స్త్రీ పురుష సమానత్వం ఎప్పుడొచ్చు నో
స్త్రీ పట్ల అసభ్య ఆలోచన అపహరణ, అత్యాచార, హత్యలు స్త్రీ శృంగార ఆటవస్తువుల ధోరణి
ఎప్పుడు మాసిపోతాయో
మానసిక, సామాజిక, ఆర్థిక,మత ,ప్రాంత, రాజకీయ, రాజ్యాధికార స్వేచ్చా సమానత్వం ఎప్పుడు సిద్దిస్తుందో
నిర్భయంగా నా ఆలోచనలను నలుదిక్కులకు చేరేలా గర్జించే స్వేచ్ఛ ఎప్పుడొస్తుందో