కవితలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

చిత్రగుప్తా, కొంచెం డిస్టెన్స్!

చిత్రగుప్తా, మానవులంతా కుప్పలు కుప్పలుగా వచ్చుచున్నారేమిటి?

వీరికి కొత్త సమస్యొకటి వచ్చినది, ప్రభూ!

అందుకే ఇలా వచ్చుచుంటిరి!

 

ఏమైనా ప్రళయం సంభవించినదా?

వీరి బాధను మాటల్లో వర్ణించలేకున్నా ప్రభూ!

 

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబ్బో, వీరి ప్రతిభ మేటిదన్నావు కదా!

హిమ శిఖరము కరిగినదా?

లేదు ప్రభూ!

 

సూర్యుడేమైనా కోపంతో రగిలిపోయాడా?

కాదు ప్రభూ!

 

మరి యెలా మరణించితిరి, సునామీ సంభవించినదా?

అటువంటి ఉపద్రవాలు కాదు ప్రభూ!

మరి..!

 

కంటికి కనిపించని క్రిమి ఒకటి

వీరికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది!

 

కంటికి కనిపించని క్రిమియా!

అవును ప్రభూ, కాలు కదపరాదట, కరచాలనం చేయరాదట!

 

సిగ్గుచేటు...

ఇంత బతుకు బతికి

ఇంత మేధస్సు కలిగి ఉండి

క్రిమి చేతిలో మరణించుటయా!

 

కరోనా అనే క్రిమి వీరిని పగబట్టినది ప్రభూ!

ప్రాణాలను హరించివేస్తున్నది!

 

స్వార్థపరుడైన మనిషి చివరికి కరోనా... కరోనా... అని రోదించవలసి వచ్చినదా!

 

ప్రభూ, వీరికి బతికే మార్గం లేదా?

తప్పులకు చింతించవలె

ప్రకృతిని ప్రేమించవలె

భూమి అన్ని జీవులది!

ఇకనైనా అర్థం చేసుకున్నయెడల బతుకుదురు,

మారనిచో మానవజాతే సమసిపోవును!

 

చిత్రగుప్తా, ఎందుకైనా మంచిది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి!

వీరినసలే నమ్మరాదు

మనకు కరోనా సోకినచో పోవుటకు వేరే లోకం లేదు!!

 


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు