కవితలు

(December,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

జీవన స్మృతులు...!

స్వేచ్ఛగా విహరించిన పక్షులు!

స్వచ్ఛమైన గాలి పీల్చిన వృక్షాలు!

 

రోడ్ల నిర్మానుష్యం!

తగ్గిన కాలుష్యం!

 

శూన్యమైన ట్రాఫిక్ జాములు!

మూసిన  సినీ 'మాలులు'!

 

ఆరిపోయిన సిటీ సిగ్నల్స్!

ఆగిపోయిన టీవీ సీరియల్స్!

 

ఇంటివద్దకే కూరగాయలు, పండ్లు!

దుమ్ముపట్టి మొరాయించిన బండ్లు!

 

నిత్యవసరాలకై ఇక్కట్లు!

కుదేలైన షేర్ మార్కెట్లు!

 

సాయంత్రం చప్పట్లు!

వెలిగించిన దీపాలు!

 

మూసిన దేవాలయాలు!

మూగబోయిన విద్యాలయాలు!

 

స్తంభించిన రవాణాలు!

నిలిచిన ప్రయాణాలు!

 

కరువైన మందు!

ఫంక్షన్లు బందు!

 

ఆగిన గడియారాలు!

పెరిగిన క్షవరాలు!

 

బడుగు జీవి కష్టాలు!

వ్యాపారుల నష్టాలు!

 

వలస కూలీల అవస్థలు!

కూలిన ఆర్ధిక వ్యవస్థలు!

 

తగ్గిన జీతాలు!

తలొగ్గిన జీవితాలు!

 

సానిటైజర్లు చల్లిన చేతులు!

మాస్కులు తొడిగిన మూతులు!

 

ఆన్లైన్ బోధన తరగతులు!

లక్డౌన్ "జీవన స్మృతులు"!

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు