కవితలు

(March,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

బతుకు మలుపు

బంగారు బాల్యపు ఎగుడు దిగుడు జీవితాలదిద్దుకొంటూ బతుకును నందనవనంలా దిద్దుకొని మురుస్తూ

ఎరుకను కనలేక మలుపుకై ఆశిస్తూ , అన్నివేళ్ళు సమానం కావన్న నిజాల నిట్టూర్పుల సెగతో పట్టుదలగా ఎదగడమే

పంతాల మలుపు

 

 

గెలుపు ఓటముల గుణ పాఠాలతో

 గురువు బోధనలతో గుర్తెరిగి ప్రతిభకు పదును పెడుతూ

పడిలేచే కెరటంలా పయనిస్తూ బతుకు మలుపుకు బాట వేసుకునే బాధ్యత మలుపు

 

కన్నవారికలలు పంటలుగా కారుణ్యపు మనసున్న మనుషులుగా

సామాజిక చైతన్య సిరికి చేయూతనిస్తూ

 బతుకు బండికి కందెనై

బహు రూపాలతో మనసున్న మనిషిగా మార్గమందిస్తూ మానసికానందమొందడమే

మహికి మలుపు

 

సరి లేరు సాటి లేరన్న అహంకారాన్ని స్పీడ్ బ్రేకర్ తో సరి చేస్తూ

 అతివేగం లో ఆనందమొందినా

పట్టు తప్పామా పరలోక పిలుపే నన్న జాగ్రత్తలను పాటిస్తూ

పుట్టుకకు పరమార్థముంటుందని తెలిసి మసలుకుంటూ నడవడమే తెలివైన మలుపు

 

 


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు