ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
ఆమె ఓ సూర్యుడు
కరోనా సంగ్రామంలో
ముఖ్యభూమిక ఆమె
రెండు చేతుల్ని నాలుగుగా చేసుకుని
నిరంతర శ్రమకు తార్కాణంగా
నిలువెత్తు స్వరూపం గా
వంటింటిన,ఇంటి నుంచే చేసే ఆఫీస్ పనిలో
పనే పనిగా
పరుగులు.. ఉరుకులు
వడ్డనలు నాలుగింతలాయె
విసుగు విరామానికి చోటు లేదాయె
నా వాళ్ళంతా నాతోనే ఉన్నారన్న ఆనందంతో
రెట్టించిన ఉత్సాహం తెచ్చుకుని
సంసారం నావను నడిపిస్తోంది
భుజం తట్టే వారు లేకున్నా
సంసార నావను నడిపిస్తూ
ఉన్న పని వాళ్ళను భద్రత రూపంలో దూరం చేసినా
నవ్వుతూ నవ్విస్తూ
ప్రేమను పంచుతోంది గృహిణిగా
ప్రాణాలుపై ఆశ వదులుకుని
కన్న బిడ్డలకు దూరంగా
విధి నిర్వహణే ధ్యేయంగా
రోగుల రక్షణలో పలుపంచుకుని
నేనున్నాను అంటోంది డాక్టరుగా
ఇందుగలడందులేడని
సర్వోత్తము డెందెందు వెదికి చూసిన అందెందే ఉన్నా డన్నట్లుగా
ఇప్పుడు మహిళ
పారిశుద్ధ్య శుభ్రతలో
ప్రజా పరిపాలన లో
నివారణ చర్యల్లో
పిల్లల ఆలనా పాలనలో
ఆన్లైన్ చదువుల్లో
సహకారం ఎక్కడ అవసరమంటే
అక్కడ నేను న్నాను అంటోంది
బాధ్యత బరువు ఎంతున్నా
పట్టించుకునే స్థితిలో ఆమె లేదు
పోరాటంలో రుద్రమను తలపిస్తూ
అది పోలీస్ ఐనా
శాస్త్రవేత్తగా నైనా
పాత్రకు జీవం పోయటమే కర్తవ్యంగా
అడుగులు వడివడిగా కదిలిస్తోంది
అలల కెరటంలా ఉరుకుతూ
ఈ పరుగు అస్త్రంలా సాగుతూనే
లక్ష్యం దిశలో!