కవితలు

(February,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సరే వెళ్లిపో

సరే కానివ్వు!

చేసిన అప్పులు

నీ మెడ చుట్టూ బిగుసుకుంటుంటే

చిందించిన స్వేదానికి 

ఆవిరైన రుధిరానికి

గిట్టుబాటులేక కొట్టుమిట్టాడుతుంటే

కోటలు దాటిన మాటలు

బతుక్కింత భరోసా ఇవ్వలేకుంటే

ఉరే సరని అనిపిస్తోంది కదూ

సరే కానివ్వు!

నీ భారం దించేసుకో!

 

తరతరాల అన్నపూర్ణను

రుద్రభూమిని చేసి తరలిపో!

నిన్నే నమ్ముకుని ఎదురుచూస్తున్న

మూగ కళ్లముందు తలదించుకుని వెళ్లిపో!

నువ్వో యోధుడవని గర్వంగా చెప్పుకునే

నీ కొడుక్కి,'నాన్నా!నేను చేతకాని వాడినని'

చెప్పి, పయనమైపో!

అక్కడ గట్టు మీద కూర్చొని

నీకోసం ఒక సూర్యుడ్ని

వెలిగించాలని తపిస్తున్నాడే

ఆ అక్షర బ్రహ్మకు

ఓసారి వీడ్కోలు చెప్పి వెళ్లిపో!

 

వెళ్లేముందు...

నిన్నడ్డం పెట్టుకుని గద్దెనెక్కిన నేతలకు

తలకొరివి పెట్టి, రుణం తీర్చుకుని వెళ్లిపో!

నీ చావు డప్పు

ఒక సమరభేరి అవుతుందంటే

నీ బలిదానం 

ఒక కనువిప్పు అవుతుందంటే

నీ అస్త్రసన్యాసం

మరో నాగలికి జీవం పోస్తుందంటే

ఈ కన్నీటి పరంపర 

నీతోనే ఆగిపోతుందంటే

సందేహించకు! వెళ్లిపో!

చచ్చిన వరి కంకుల మీద

నీ చివరి కన్నీటి చుక్కతో

మరణ వాగ్మూలం రాసి,వెళ్లిపో!


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు