నాలుగు గోడల మధ్యలో ఒక సోఫా చూస్తుండగా రెండు కుర్చీలు దగ్గరగా రెండు కప్పులు కాఫీ వాసనతో నాలుగు కళ్ళు ఒక చూపుతో... రెండు మనసులు ఒకే తలపుతో.... మెరిసే మాటలకు రూపం తెచ్చే ఆ రోజుకు కాళ్లకు మ్రొక్కుతూ నీలోనన్ను చూసుకుంటా నాలో నిన్ను చూపుకుంటా ఒక మల్లె తోడుగా ఒక క్షణం నీడగా ఓ తీపి జ్ఞాపకాన్ని మనసు కాగితంపై కవితగా వ్రాసి ఇస్తాను జీవితాంతం గుర్తుండేలా...