ఆ క్షణం గాలికి ఊపిరాడలేదు వెలుగు చిట్లి చీకటిగా ముక్కలైంది. మౌనజలపాతానికి కాలం మెత్తగా కరిగి కొట్టుకుపోతుంటే భావం బరువుగా తెలియాడుతూ చూపలను వాటేసుకుని సన్నని ప్రయాణంలో ఇరుకుమాటలఅర్థాలఒత్తిడిలో తీయని తెల్లని మాట ఛాయలెక్కడనివెదుకుతూ ఒంటరిగా నాలో నేను ఇంకిపోయాను నీ ఆలోచనల తేమను దాటుకుంటూ...