కవితలు

(February,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

దేవుడొక విద్రోహశక్తి 

పిండం కాకులుతప్ప 

ఆత్మలు తినవని దేశం ఎప్పుడు 

తెలుసుకుంటుందో

ఆవు హాట్ టాపిక్కయిన 

ఉద్రిక్త సందర్భాల మీదగా 

పారే పంచకంతో పాపాల్ని ఎంతకాలం

కడుక్కుంటుందో

తాళిబొట్టులోని మహత్తు

జిందగీని ఇంకెన్నిసార్లు బురిడీ కొట్టిస్తుందో

గాలి భూతాన్ని 

గాజుసీసాలో బందించిన మొనగాడు

మనిషి భూతాన్ని ఎప్పుడు బందిస్తాడో

జీహాద్ అంటే

జనాన్ని చంపడమని

ఏ పవిత్రగ్రంథంలో చెప్పబడిందో

దేవుని రాజ్యం సిద్దింపజేయడానికి

దైవజనుల్ని లోబరుచుకోవాలని

ఏ టెస్టామెంట్ నూరిపోసిందో

వంచకులు దేవుళ్ళౌతున్న నేపధ్యాల నేపధ్యంలో

సతుల పాతివ్రత్యాం శంకించబడదని 

ఎలా అనుకోవాలి

రంకు బొంకుల రాద్ధాంతాల్ని

భూమి భుజాలు వాచేటట్టు

ఎన్నితరాలు మోస్తుందో

ఎవడో నాయకుడు  కోసం

యాగాలు చేస్తున్న వెర్రినాదేవుళ్ళారా

పసికందుల  ప్రాణ మానాల కోసం

కనీషం ఒక్క మంత్రాన్నైనా

అడ్డం వెయ్యండిరా నాయనా

ఇదంతా చూస్తుంటే ఈరోజూ రేపూ

మనిషి సారధ్యంలో జరిగే మారణకాండలో

ఇప్పుడిక దేవుడో విగతజీవి

ఇంకా చెప్పాలంటే 

మానవుడు మలిచిన విద్రోహశక్తి


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు