ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
ఆమె పరాయి
ఆమె జీవితం లో ఆమె పరాయి
ఆమె జోలెలోకే...
ఆమె భవిష్యత్తును దానంగా వేస్తూ..
నాన్నో అన్నో..వరుడో కుమారుడో
ఎవరో ఒకరు..దానకర్తగా..
కళ్ళున్నాయని.. కలలను పెంచుకుంది
ఆ కలల కాళ్ళనెవరు విరగ్గొట్టారో..?
ఎగిరేందుకు రెక్కలొస్తున్నాయని
ఎగిరెగిరి పడేవి..!
ఆ రెక్కల నెవరు కత్తరించారో..?
తరాలు దాటుతున్నా
ఆమెకవగతం కాదు ఎందుకో..?
ఆ కనుబొమలు ముడిపడకూడదు..!
కనురెప్పలు పైకెత్తకూడదు..!
కోమలాంగులు.. కుశలమా...?
మౌనం... అంగీకారమే కద..!
అయ్యో....!
తెలిసీ కావాలనే లోయలోకీ దూకమన్నాక
జలపాతం భయం గూర్చి
అడగడం హాస్యాస్పదం కాదా..?
యాదృచ్ఛికమైతే తప్ప
ఆమె ఎదలోని రొదని వినేదెవరు..?
ఆమె...అంతరిక్షంలో కెళ్ళొచ్చినా
తన అస్తిత్వం గూర్చి
అవే జవాబులు లేని ప్రశ్నలు
పెళ్లి తోనే..హృది ని
అనాచ్ఛాదితంగా చేసేసుకుంటుందామె
మాటలకు..చేతలకు పద్దులు
తరాజులో తూచి..
తరచి తరచి చూడబడుతూ..
అన్ని ఆంక్షలను భరిస్తూ మన్నిస్తూ..ఇంకా
కాలికింద పువ్వామె
ముల్లు పై పడ్డ...అరిటాకామె...
ఈ ప్రేలాపనలను..
విని విని విసుగెత్తిందా ప్రాణం
ఎంతకాలమిలా...?
భ్రాంతుల లోనే సాగిపోతూ..
మనువు పెత్తనాన్ని భారంగా.. మోస్తూ..
ఉదయపు లేత కిరణాల..
వెచ్చని కాపురాలే.. అనుకుంటుంది
మధ్యాహ్నం కిరనాల వాడి
కాఫురంలో కడగండ్ల కత్తుల్ని చూపేదాకా..!
ఆ ఎడారి స్వప్నం
అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ..
సాధికార ఒయాసిస్సే !