ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
కొన్ని ప్రశ్నలు - వేల ఆలోచనలు
(ఇద్దరు స్నేహితురాళ్ల సంభాషణ)
నేను : స్త్రీకి శత్రువు ఎవరు
తాను : భయము బలహీనత
నేను : స్త్రీగా పుట్టడం గర్వమా లోపమా
తాను : సామాజిక లోపాలతో వ్యక్తిగత గర్వము.
నేను : స్త్రీ కి నిజంగా సాధికారిత ఉందా లేదా
తాను : ఏ విధమైన సాధికారిత లేదు.ఇంకా సాధికారత కోసం యుద్ధం చేసే స్థితే ఉంది
నేను : అత్యాచారం అనే భావన ను తీసేస్తే ఎలా ఉంటుంది
తాను : చేయడం కుదరదు. ఎందుకంటే శీలం అనే భావన స్త్రీలకు అపాదించడం మానరు కనుక.
నేను : స్త్రీ స్త్రీ తో సహజీవనం పెరగడానికి కారణాలు ఏంటి
తాను : ఇది చాలా అవాంచితము. పురుష ప్రవృత్తి నచ్చకపోవడంతో ఇలా జరుగుతుంది అని నా ఉద్దేశం
నేను : ఆడ శిశువుల సంఖ్య తగ్గడంతో భవిష్యత్తులో సమాజం ద్రౌపది ప్రథ అంగీకరిస్తుందా
తాను : తప్పకుండా అంగీకరిస్తుంది. అవసరం అన్ని చేయిస్తుంది.
నేను : పెరుగు తోడు వేయలేదని రాత్రి నిద్రపోయేటప్పుడు స్త్రీలకు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది?
తాను : పితృస్వామ్య రాజ్యము లో వంటింటి మహారాణి గనుక ,
నేను : స్త్రీ పురుషులు ఒకరికొకరు ప్రస్తుతం అవసరం ఉన్నారా..
తాను : ఉన్నారు కానీ ఇద్దరికీ సమానా అవకశాలు, ఉన్నత సంస్కారం ఉండాలి
నేను : ఇన్ని రకాల ప్రశ్నలు చర్చలు స్త్రీ గురించి ఇంకా ఎందుకు జరుగుతున్నాయి
తాను : స్త్రీ పురుష సమానత్వం లేదు కనుక
నేను : సృష్టిలో రెండు వివిధ ప్రవృత్తులలో జన్మించిన స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని కోరుకోవడం
ఎంతవరకు సమంజసం.?
తాను : ఇద్దరు మనుషులే కాబట్టి సమానత్వం కావాలి