సాహితీ మిత్రులారా,
నిరంతర ప్రజాస్వామిక సంభాషణ కోసం, అధ్యయనాత్మక సాహిత్యం కోసం, కాసింత వెలుతురు కోసం ఒక ప్రవాహం... ఒక ప్రయాణం.......!గోదావరి నది తెలంగాణలో ప్రముఖ జీవనది. ప్రవహించే గోదావరి మాకు ప్రేరణ. గోదావరి నిత్య ప్రజా చైతన్యానికి ప్రతీక. ఎన్నో చారిత్రక సంఘటనలకు సజీవ ప్రత్యక్ష సాక్షి .
నిర్దిష్ట కాలంలో మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఉత్పత్తి సంబంధాలను, ఆ ఉత్పతి సంబంధాలను నియంత్రించే ఉత్పతి సాధనాలను- తమ స్వాధీనంలో పెట్టుకున్న ఉత్పత్తి శక్తులను చిత్రించి, నియంత్రించే, నిరోధించే సాహిత్యానికి ఈ అంతర్జాల పత్రికలో అధిక ప్రాధాన్యత ఇస్తాం.
ఒక మాటలో చెప్పాలంటే సామాజిక చలనాన్ని చిత్రించే కథలకు, కవితలకు, విమర్శకు, పరిశోధక వ్యాసాలకు గోదావరిలో సముచిత స్థానం ఉంటుంది.
అదే సమయంలో తర్కబద్ధం కాని సాహిత్యానికి, వ్యక్తిగత భావోద్వేగాలకు గోదావరిలో ఎలాంటి స్థానం ఉండదు.
సాహితీవేత్తల అనుభవాల నమోదును, చారిత్రక సత్యాల చిత్రణను గోదావరి తన భాధ్యతగా భావిస్తుంది.
విస్మరణకు, వివక్షతకు గురి కాబడిన, విస్మృత రచయితలను, వారి సాహిత్యాన్ని గోదావరి పరిచయం చేస్తుంది. ఇందులో మినహాయింపులు, పరిమితులు లేవు. పేజీల హద్దులు, ఆంక్షలు అసలే లేవు.
రచనల ప్రచురణలో ఎలాంటి భౌగోళిక వివక్షత చూపకుండా, ప్రవాస ఆంధ్రుల, ఆదివాసి, బహుజన జీవిత అనుభవాలకు , అస్తిత్వ పోరాటాలకు గోదావరిలో సముచిత స్థానం కల్పిస్తూ, స్థల కాల సందర్భాలలో నిలబడి చేసే సాహిత్య పరిశీలనే - నిజమయిన విమర్శగా భావిస్తూ, గోదావరి పత్రికలో ఇలాంటి విమర్శకు అధిక ప్రాధాన్యత ఇస్తాం.
ప్రజా కళారూపాలను అక్షరీకరిస్తూ , ప్రపంచ సాహిత్యంలో ప్రజా జీవితాన్ని ఎత్తి పట్టిన రచనలను, అనువాదాలను గోదావరి ఆదరిస్తూ, ఎలాంటి రాజకీయాలకు, వాద వివాదాలకు చోటివ్వకుండా, బహుళ ప్రజాస్వామిక వేదికగా నిలబడి, భిన్న అస్తిత్వాలను గౌరవిస్తాం.
రచయితల అభిప్రాయాలతో సంపాదక వర్గానికి ఏకీభావం ఉండనవసరం లేదని గమనించగలరు.
సాహితీవేత్తలు, సాహిత్య విద్యార్థులు సహృదయంతో నిత్య సాహిత్య గోదావరికి స్వాగతం చెప్పాలని కోరుకుంటూ, కొత్త సంవత్సరంలో, కొత్త సృజన లోకంలోకి స్వాగతం చెబుతున్నాం.
గౌరవ సంపాదకులు
ఆచార్య కాత్యాయనీ విద్మహే
సాహిత్య విమర్శకులు, పరిశోధకులు.
సంపాదకులు
వంగాల సంపత్ రెడ్డి , అసిస్టెంట్ ప్రొఫెసర్, వరంగల్
సంపాదక వర్గం
దాసరి మల్లయ్య
గత ఐదు సంవత్సరాల నుండి కథలు, కవిత్వం వ్రాస్తున్నారు
ఉప్పులేటి సదయ్య
సాహిత్య విద్యార్థి.
కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు వ్రాస్తున్నారు.
న్యాయ సలహాదారులు
ఈదుల మల్లయ్య, అడ్వకేట్