అతిధి సంపాదకీయం

ఒక సాహిత్య సంస్థ యాబై సంవత్సరాలుగా ఎలా మనుగడలో ఉండగలిగింది.?  ఏ సామాజిక రాజకీయ ఆర్థిక సందర్భంలో ఎలా నిలబడగలిగింది?  ఒక సంస్థ అలా నిలబడడానికి దారితీసిన సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతి కవీ ప్రతి రచయిత విశ్లేషించుకునే సమయం. కల్పనలో విహరిస్తూ ఇదే సాహిత్యం అనుకునే రచయితలు, కవులు ఆలోచించవలసిన సందర్భం ఇది. ఇట్లాంటి  సమయంలోనే గోదావరి  మీ ముందుకు వస్తున్నది.

సాహిత్యం ఒక సామాజిక బాధ్యతగా భావించి, సామాజిక సాంస్కృతిక వైవిధ్యాన్ని చిత్రిస్తూ  పరితపించే రచనలను  ఎత్తి పట్టడం మన తక్షణ కర్తవ్యం. సమాజ భిన్నత్వాన్ని అంగీకరించడం, ప్రత్యామ్నాయ  ఆలోచనలని స్వాగతించడం  ఒక సమాజ ప్రజాస్వామిక దృక్పథాన్ని వ్యక్తం చేస్తుంది. 

విభిన్న సమూహాల ఆకాంక్షల వ్యక్తీకరణకు అవకాశం  లేని సమాజం గడ్డకట్టుకు పోతుంది. భిన్న సమూహాల ఆకాంక్షల  వ్యక్తీకరణ దిశగా నిర్మాణాత్మక చర్చలను, సూచనలను  ఆహ్వానిస్తున్నాం.  మీ సూచనలే మా గోదావరి  ప్రవాహానికి ఇంధనం.

సామాజికంగా సమకాలినతతో లేని ఏ సాహిత్యం ఎక్కువ కాలం నిలబడదు. 

విస్తృతమవుతున్న మార్కెట్ సంస్కృతి మానవీయ సంబంధాలను విధ్వంసం చేస్తున్న తీరు ఆలోచనాపరులను కలిచివేస్తున్నది.

ఇతర పత్రికలు