బోసినవ్వులతో, ముద్దులొలికే మాటలతో,
తడబడే నడకలతో, చిలిపి చేష్టలతో
కన్న హృదయాలను రంజింపజేసిన
మా ప్రియ తనయ
మేధోసంపన్నయై, మృదుభాషియై,
స్నేహశీలియై,బహుముఖ ప్రజ్ఞాశాలియై
తనకు తానే సాటియనిపించుకున్న
మా ప్రియ తనయ
పెద్దలయెడ వినయ విధేయతలు,
పిన్నలయెడ ప్రేమాభిమానాలు ,
తల్లిదండ్రుల యెడ పూజ్యభావం కలిగిన
మా ప్రియ తనయ
ఇంతటి స్నేహశీలిని , ప్రతిభశాలిని ,
వినయశీలినికుమార్తెగా బడసిన
ఆ తల్లిదండ్రులెంత భాగ్యశాలులోయని
ఎల్లరిచే నుతింపబడిన సుగుణాలరాశి
మా ప్రియ తనయ