అలసి సొలసిన అరికాళ్ళు
ఇంటికి చేరుకున్నాకే కదా! సేద తీరేది
దుమ్ము పట్టిన పాదాపాదాలు
నీళ్ళల్ల కడిగితేనే కదా! మైల పోయేది
అక్కడిక్కడ అంటుకున్న చేతులు
సబ్బు రుబ్బుతేనే కదా! పరిశుభ్రమయ్యేవి
చంచలమై గిరగిర తిరిగిన మనస్సు
సంసార నీడకే కదా! నిమ్మలం అయ్యేది
వరండా వాకిలి ఆవలి నుంచి
ఆకాశం చూస్తేనే కదా! మనిషి ఉల్లాసం
ఇంటి పట్టున ఉంటేనే అసలుంటది
ఇళ్లంటేనే ఆమె అమ్మ పిల్లలు జెల్లల సందోహం...