మా రచయితలు

రచయిత పేరు:    డా . పాలకుర్తి దినకర్

కవితలు

ఇసుకలో పాదముద్రలు

ఓ రాత్రి నాకో కల వచ్చింది

అ కలలో సముద్ర తీరం వెంట నేను నా ప్రభువుతో కలిసి నడుస్తున్నాను

నల్లటి ఆకాశంలో నా జీవితంలోని కొన్ని దృశ్యాలు  మెరుపులా మెరిసాయి

ప్రతి దృశ్యంలో రెండు జతల పాద ముద్రలు ఇసుకలో ముద్రించబడి వున్నాయి

అందులో ఒకటి నాది మరొకటి నా ప్రభువుది

 

నా జీవితంలోని చివరి దృశ్యం నా ముందు ప్రత్యక్షమైన తర్వాత

నేను వెనుతిరిగి ఇసుకలోని ఆ పాదముద్రల వైపు చూసాను

చాలా సార్లు నేను గమనించినదేమిటంటే నా జీవిత ప్రయాణంలో

ప్రత్యేకంగా నేను దుఖ:బరితంగా ఉన్నప్పుడు

ఒక్కజత పాదముద్రలే గోచరించాయి

 

ఈ విషయం నన్ను చాలా కలిచివేసింది, వెంటనే నేను దీనికి కారణం ప్రభువుని అడిగాను

“ఓ ప్రభు, నేను నీ వెంట నడిచే నిర్ణయం తీసుకున్న తర్వాత

నీవు నావెంటే ప్రయాణిస్తానని మాట ఇచ్చావు

కాని నేను ఒక విషయం గమనించాను

నా జీవితంలో విషాదకరమైన మరియు వేదనాభరితమైన క్షణాల్లో

నా జీవిత గమనoలో ఒక జత పాద ముద్రలు మాత్రమే కనిపించాయి

నాకు అసలే అర్ధంకావడం లేదు ఎందుకు నేవు నన్ను వదిలి వెల్లావు

నాకు నీ అవసరం వున్న సమయంలో

 

ప్రభువు మెల్లగా అసలు రహస్యం వివరించాడు,

“నా చిట్టి తల్లి, నీవంటే నాకెంతో ఇష్టం నిన్ను నీను ఎన్నటికీ వీడను

నీ కష్టాల్లో మరియు నీ పరీక్షా సమయాల్లో

నీకు కనిపించిన ఆ ఒక్క జత పాదముద్రలు ఎవరివో కావు

నావే,

ఆ సమయంలో నేను నిన్ను ఎత్తుకున్నాను.

(మేరి స్టీవెన్సన్ కవిత Footprints in the Sand కు అనువాదం)

ప్రేమానంతర ప్రేమ

రోజు  వస్తుంది

  రోజు  ఆనందంతో  సంతోషంతో

నిన్ను నువ్వే కలుసు కుంటావు.

నీ గుమ్మం లోనే  

నిన్ను నువ్వే పలకరించు కుంటావు

నీ అద్దంలోనే నిన్ను నువ్వు చూసి నవ్వుకుంటావు

 

అతన్ని  దగ్గరగా  కూర్చోమంటావు

తినమంటావు

అపరిచితునితో

నువ్వు తప్పక ప్రేమలో పడతావు

అతనెవరో కాదు నీవే

అతన్ని నీవు

తినమంటావు,తాగమంటావు.

నీ హృదయమే అర్పిస్తావు.

 

అపరిచితుడైతే నిన్ను ప్రేమించాడో

నీ జీవితమంతా

ఎవరి కోసమైతే అతన్ని నిర్లక్ష్యం చేసావో

ఎవరైతే నిన్ను నిజంగా హృదయపూర్వకంగా

తెలుసుకున్నారో

పుస్తకాల అల్మారలోని ప్రేమలేఖల్ని బయటకు తీయి

 

ఫోటోలను చూడు 

నిరాశ ప్రతులను చదువు

అద్దంలో కనిపించే

నీ మూర్తిని మెల్లగా ఒలుచుకో

ఇక నైన నిశ్చింతగా కూర్చో ...

ఇప్పటికైనా నీ జీవితాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయి 

 

(నోబెల్ పురస్కార గ్రహీత వాల్కాట్ కవిత Love after Love కు స్వేచ్చానువాదం)

ఒక చిన్న బంగారపు గింజ

ఆ వూరి లోని ఓ వీధిలో

నేను ఎప్పటిలానే ఇల్లిల్లూ తిరుగుతూ బిక్షమెత్తుకుంటున్నాను

అంతలో

దూరం నుండి నీ బంగారు రధం అందమైన కలలా కన్పించింది

నేను ఆశ్చర్యముతో చూసాను ఎవరీ రాజాధిరాజు అని!

 

నాలో ఆశలో మొలకెత్తాయి

నా దుర్దినాలు తొలగిపోయే కాలం సమీపించిన్దనిపించింది

అక్కడే నిలబడి అడక్కుండానే రాబోయే బిక్ష కోసం

అన్నివైపుల వేదజల్లబడుతున్న అనంతమైన సంపద కోసం ఆశగా ఎదిరిచూస్తున్నాను

 

నా అదృష్టం

నీ రధం నేను నిల్చున్న చోటనే ఆగింది

నీ చల్లని చూపులు నాపై వాలాయి

చిరునవ్వు చిందిస్తూ నీవు రధం దిగి నావైపు వచ్చావు

చివరికి నా అదృష్టం పండినదని సంతోషించాను

అంతలో హటాత్తుగా నీవు చేయి సాచి

“నీవు నాకేం ఇస్త్తావు?” అని అడిగావు

 

ఒక రాజాధిరాజు ఒక బిక్షగాన్ని చేయి సాచి అడగటం పరిహాసం కాక మరేమిటి?

నాకు ఏమిచెయ్యాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయాను

కాసేపటికి తేరుకొని

నా జోలేలోనుండి మెల్లగా వెదికి అతి చిన్న ధాన్యపు గింజను బయటికి తీసి నీ చేతిలో ఉంచాను

 

ఆరోజు సాయంకాలం బిక్షాటన ముగిసిన తర్వాత

నా జోలెలోని బిక్షని బయటికి తీసి చూసిన నాకు నోట మాట రాలేదు

నా పేద సంపాదనలో ఒక చిన్న బంగారపు గింజ మిలమిలా మెరిసింది

నమ్మలేక పోయాను,

నీవు నన్ను అడిగినప్పుడు

నా సర్వస్వం నీదేనని చెప్పలేక పోయానని

వెక్కి వెక్కి ఏడ్చాను

(రవీ౦ద్రనాద్ టాగూరు కవిత A Little Grain of Gold కు అనువాదం)

 

ఓ వృద్ద విరాగి

నా దృష్టిలో సంపదలు చంచలమైనవి

ప్రేమ త్రుణీకరించదగినది

కీర్తి కాంక్ష ఒక స్వప్నం మాత్రమే

రేపు తెల్లారగానే మాయమైపోతుంది

 

ఒకవేళ నేను ప్రార్దిoచినట్లయితే

అది నా పెదవులను నా కొరకు మాత్రమే కదుపుతుంది

నా హృదయాన్ని వదిలి మీరంతా వెళ్లి పొండి

నా స్వేచ్చను నాకు ప్రసాదించండి

 

          నాకు మరణం సమీపిస్తుంది

          సమయంలో నేను ప్రార్దించేది ఒక్కటే

          జననంలో మరణంలో నా ఆత్మ స్వేచ్చగా ఉండాలి

          నేను దైర్యంగా కష్టాలను ఎదుర్కోవాలి.

(ఎమిలి బ్రాoట్ ఆంగ్ల కవిత The Old Stoic కు అనువాదం)

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు