మా రచయితలు

రచయిత పేరు:    సలోమీ (విద్యార్థి)

కవితలు

నా కోసమే..

నేను పుట్టినప్పుడు నవ్విన పెదవులు నావి కావు..

నేను మరణించినప్పుడు ఏడ్చే కళ్ళు నావి కావు...

ఆ చిరునవ్వులు నా కోసమే..

ఆ కన్నీటి కెరటాలు నా వీడ్కోలు...కోసమే

ఏకాంతాన్ని ఇష్టపడు...

అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది..

కాలం తో స్నేహం చేయి 

ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది..

భవిషత్తుకి గమ్యం చూపిస్తుంది...

నీ ప్రయత్నంలో  నమ్మకం ఉంచు... విజయాన్ని సాదిస్తుంది..

ఏకాంతాన్ని ఇష్టపడు...

అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది..

కాలం తో స్నేహం చేయి 

ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది..

భవిషత్తుకి గమ్యం చూపిస్తుంది...

నీ ప్రయత్నంలో  నమ్మకం ఉంచు... విజయాన్ని సాదిస్తుంది..

ప్రతిక్షణం

ఏకాంతాన్ని ఇష్టపడు...
అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది..
కాలం తో స్నేహం చేయి 
ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది..
భవిషత్తుకి గమ్యం చూపిస్తుంది...
నీ ప్రయత్నంలో  నమ్మకం ఉంచు... విజయాన్ని సాదిస్తుంది

ప్రతిక్షణం 

ఏకాంతాన్ని ఇష్టపడు...

అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది..

కాలం తో స్నేహం చేయి 

ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది..

భవిషత్తుకి గమ్యం చూపిస్తుంది...

నీ ప్రయత్నంలో  నమ్మకం ఉంచు... విజయాన్ని సాదిస్తుంది.. 

కథలు

విజయం

      అదో చిన్న పల్లెటూరు, పచ్చదనంతో  చూడముచ్చటగా ఉంటుంది. ఆ పల్లెకు సమీపంలో చిన్న పూరిగుడిసె ఉంది. అందులో తల్లికూతుళ్ళు ఉండే వాళ్లు.కూతురి పేరు అనృత అమ్మ పొలం పనులు చేస్తుంది.తండ్రి తన  చిన్నతనంలోనే  చనిపోయాడు. ఉన్నదల్లా  ఒక ఎకరం పొలం ఆ పూరిగుడిసే.అనృత పాఠశాలకి వెళ్తుంది. తరగతిలో తానె మెరుగైన విద్యార్థి ఉపాధ్యాయులు అందరూ తనని మెచ్చుకుంటారు.చదువులో దిట్ట మంచి అమ్మాయి. తనకి చదువు చూడటానికి అందంగా ముద్దుగా ఉన్నా తనకి దేవుడు ఒక లోటు పెట్టాడు అదే తను అందరిలా మాట్లాడలేదు.పుట్టుకతోనే మూగది. తను మూగదనే కారణంచే తోటి విద్యార్థులు హేళన చేస్తూ ఉంటారు.తనతో స్నేహం చేయటంలో అయిష్టంగా ఉండేవాళ్ళు.ఒక రోజు పాఠశాలలో పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు దూరంగా మెట్లు పక్కన అనృత కూర్చొని ఎదో రాస్తోంది. అప్పుడే  అటుగా వెళ్తున్న రాజు అనే ఉపాద్యాయుడు మెట్లు ఎక్కబోతున్న సమయంలో అనృతని గమనించి తనలోని కళను చూసి ఆశ్చర్యపడ్డాడు.తనదగ్గరకి వెళ్లి మాటల్లో పెట్టి తన కి ఒక మంచి బొమ్మ గీసుకొని రమ్మని చెప్పి వెళ్లి పోయాడు. అనృత ఇంటికి వెళ్లి పాఠశాలలో జరిగిందంతా మరిచి అమ్మతో ఆడుకుంటూ పొలం లో తిరిగి ఇంటికి వెళ్లి తిని బయట పడుకుని అమ్మతో తన రాజు ఉపాద్యాయుడు గురించి సైగల్లో చెప్పుతుండగానే అనృత యొక్క అమ్మ నిద్రలోకి జారుకుంటుంది.అనృత ఆలా చల్లని వెన్నెల వెలుగులో చంద్రుని చూస్తూ పిల్ల గాలులో ఎదో పాట వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది.

ఇంతలో  ఉపాద్యాయుడు చెప్పినది గుర్తుకి వస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి పుస్తకాల సంచి తీసి తన ముందు ఉన్న ప్రకృతిని చూసి అందంగా అలా తన తెల్ల కాగితంలో దించుతుంది. రాత్రి ఆలసాయం గా నిద్రపోతుంది. ఉదయానే అమ్మకి ఇంటి పనుల్లో సాయం చేసి పాఠశాలకి వెళ్లే ముందుగా తను గీసిన ప్రకృతి బొమ్మ ను అమ్మకి చూపిస్తుంది. పాఠశాలకి వెళ్లిన వెంటనే ఉపాధ్యాయుడి వెతికి తన చిత్రాన్ని చూపిస్తుంది.అప్పుడే వార్తపత్రికను చదువుతున్న ఆ ఉపాద్యాయుడు అనృతని గమనించి ఆ బొమ్మ ను చూసి మెచ్చుకుంటారు. అప్పుడే ప్రకృతి అందం అనే బొమ్మల పోటీ వివరాలు చూసింది గుర్తుకి వస్తుంది. వెంటనే అనృత గీసిన ఆ బొమ్మను ఆ చిరునమకి పంపిస్తాడు. రెండు రోజుల తర్వాత తనకి ఆ పోటీలో రూ.500 బహుమానంగా వస్తుంది. ఆ డబ్బులని పాఠశాలలో జరిగే ఉదయ ప్రేయర్ సమయంలో విద్యార్థులు అందరి మధ్య అనృత ని పిలిచి మెచ్చుకొని ఇస్తాడు.తను ఆ డబ్బులని తీసుకొని ఆ ఉపాధ్యాయుడి సాయంతో అమ్మకి చెప్పులు కొంటుంది మిగిలిన డబ్బులని అమ్మకి ఇస్తుంది. అమ్మ అనృత తెలివిని తనలోని ఆరాటాని చూసి మురిసిపోతుంది. అనృత తనలోని లోటును ఆలోచించి నిశబ్దంగా ఉండకుండా తనలోని నైపుణ్యాన్ని వెలిపుచింది.

సమయాన్ని అవకాశాల్ని సరిగ్గా ఉపయోగిచుకుంది.

 

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు