పేగుబంధం తెంచకుంటే జన్మజరగదు తెలుసుకో
కంకులన్నీ కోయకుంటే గింజరాలదు తెలుసుకో
చెట్టునిండా పచ్చదనమే నిండిఉంటే హాయిలే
ఎండిమోడై బ్రతుకుఉంటే పిట్టవాలదు తెలుసుకో
గుట్టుచప్పుడు కానిప్రేమలు కాముకతనే తెలుపులే
కుప్పతొట్టిలొ జారవిడిచిన బ్రతుకు పండదు తెలుసుకో
సూర్యరశ్మికి సాగరమ్మే ఆవిరౌనది సహజమే
ఉప్పునీటితొ తృష్ణతీర్చగ మార్గముండదు తెలుసుకో
నవ్వుపులిమిన దాగుతుందా మనసులో నీ కపటమే
రాంకిముందర కుప్పిగంతులు వేయకుదరదు తెలుసుకో ( మక్తా)