మనసు తోటలో స్నేహపరిమళాలు
విచ్చుకున్న పూల మెత్తదనం ముందు
మనుషులే కుంచించుకపోతూ
రక్తబంధం విలువ నేతిబీర చందమై
“మనీ" బంధాలే ఆదర్శంగా
లెక్కల త్రాసులో లెక్కదప్పిన మనిషిదనం
మారని భూమి, ఆకాశమూ, చంద్రుడూ
అలుపెరుగని ప్రయాణికులై సంచరిస్తూనే ఉన్నారు
మనిషే......
సోమరై, ఒంటరై, నిస్సారంగా, నిర్వేదంగా,
అన్నీ టెడ్డూ, ఫుడ్డూ, రోగాల పుట్టై.........
జంతువులన్నీ సహజంగా జీవిస్తున్నై.......
కానీ.......
మనిషే నీటినీ, కన్నీటిని, కొనుక్కోడానికి లెక్కలేస్తూ ...
నిరాదరణ, నిర్లక్ష్యం, అనే మాటేలేదు ప్రాణకోటికి
ఇపుడు......
మనిషికే నైతిక విలువల్ని నేర్పాల్సిన సందర్భం....
ఇకనైనా
మంచితనం తీగలుగా సాగి
మనిషి సహజంగా శ్వాసిస్తూ
మట్టితల్లికి గౌరవాన్ని నిలబెట్టాలి