రాగానే మిత్రుని పట్ల కోపం
జాగు చేయక తెలిపాను అతనికి
వెంటనే ఉల్లాసం కలిగింది మనసుకి
శత్రువు యెడల కలిగిన కోపం
దాచాను మనసులో అతనికి తెలుపక
ఏపుగా పెరిగింది అది ఎడతెగక
భయంతో దానికి పోసాను నీళ్లు
రాత్రి పగలు ప్రాణంగా నా కన్నీళ్లు
వెచ్చపరిచాను దానిని చిరునవ్వుతో
సుతిమెత్తగా కపటపు ఊసులతో
ఎదుగుతూ వుంది అది రాత్రి పగలు
కాసేంత వరకు ఓ పూట ఆపిలు
చూస్తున్న అతని కళ్ళలో కసి
మెరుస్తూ వున్న ఫలం నాదని తెలిసి
దొంగలాగా దూరాడు తోటలోకి
సూర్యుడు చేరగానే పడమటి మాటుకి
ఉత్సాహంగా ఉదయాన్నే తోటలోకి వెళ్ళగా
చెట్టు క్రింది పడివున్నాడు శత్రువు శవంలాగా...
బాల్యం నాకు నేర్పిన మాటలు
ఉహించలేదు అవుతాయని ఉట్టి మాటలు--
కలిసుండాలి
కల్మషంలేకుండా ఉండాలి
కలివిడిగా తిరుగాలి
తిరుగనివాడికి లోకజ్ఞానము పూజ్యం
తిరిగే వాడిదే ఈ రాజ్యం
ఈ పాఠాలూ తిరగబడ్డాయి
పురాణాల్లోని రాక్షసులు
పేదరాశి పెద్దమ్మ కథల్లోని భక్షకులు
నిజంగా నిజమైయ్యారు
నీతో నీలోనే ఉన్నారు.
దూరం పెరిగేకొద్దీ
ప్రాణం పెరుగుద్ది
బందీవైతేనే స్వేచ్ఛ
బయపడితేనే దైర్యం ఉన్నట్టు
మాట్లాడకపోతేనే మేలు చేసినట్టు
ఆప్యాయ కౌగిలింత
అనాగరికపు వింత
ఆధునిక మానవ కరచాలనం
కరోనా మరణ వాంగ్మూలం
ముసుగు చాటు ముఖం
కనిపించని భావాలూ
ఆస్పష్టపు అనురాగాలు
పక్కవారు అపరిచుతులై
నీవాళ్ళు అంటరానివాల్లై
ఒంటరిగానే వచ్చావని
ఒంటరిగా నే జీవించడం తెలుసుకో
కొత్త పాఠాలు నేర్చుకో
విడిగావుంటేనే బలపడతాం
తప్పించుకొని తిరుగుతేనే నిలబడుతాం
దూరంలోనే వుంది అందాల తీరం
నమస్కారాలోనే వుంది మమకారం
కడగని చేతులు భస్మాసుర హస్తాలు
చాచని కరములే మానవాళికి నేస్తాలు
కనింపించని శత్రువుని
జయించూదాము కనిపించకనే
పరిశుభ్రతే ఆయుధముగా చేబూని
పదండి లోనికి పదండి
ఇల్లే స్వర్గ సీమని
ఎవరి ఆశలు మరియు అవసరాలు
తన పిత్రార్జిత భూ సంపద పరిధి లోనే వుంటాయో
ఎవరైతే తన పురిటి గడ్డ గాలిపీల్చి తృప్తి చెందుతాడో
తన పశువుల పాలు త్రాగి , తన పొలము పంటను తిని
తన పెంపుడు గొర్రెల ఉన్ని ని దుస్తుల గా మలుచుకొని
తను నాటిన చెట్ల వలన ఎండ నుండి నీడను
చలినుండి వెచ్చదనాన్ని పొందు వాడు
సంతోషకరమైన మనిషి
తన ప్రమేయము లేకుండానే జీవితము లో
గంటలు, దినాలు, సంవత్సరాలు
ఆరోగ్యము, మనశ్శాంతి తో గడచిపోతాయో
రాతిరి గాఢ నిద్దుర, పఠనము మరియు విశ్రాంతి
కలగలిపిన వినోదము
నిర్మలమైన మానసిక స్థితి ధ్యానము తో
పొందువాడు భాగ్యవంతుడు
అలా నన్ను బ్రతుకనివ్వు,
చాటుగా, అపరిచితునిగా
నా మరణము ఎవరికీ దుఃఖము కలగనీయకుండా
తీసుకెళ్ళు ఈ ప్రపంచము నుండి నన్ను రహస్యంగా
నేనెక్కడ విశ్రమించానో తెలిపే శిలా ఫలకము లేకుండా
(ఆంగ్ల మూలం: Alexander Pope’s Ode on Solitude)
“నిలబడితే ఫర్లాంగు, కూర్చుంటే రెండు మైళ్ళు, తింటే ఆరు,” అంది బసంతి.
"అవును ఆలస్యమైతే ఆ కోపిష్టి షావుకారు ఎవరి మాట వినిపించు కోడు " అంది హిరా.
షావుకారు లల్లా నానక్ చంద్ మిఠాయి షాపు కు కొద్ధి అడుగుల దూరం లో పాల కుండలను దింపుకోని వాళ్లు అసహనంగా కూర్చున్నారు. చలి కాలపు గాలులనుండి రక్షణకు తమ రంగుల గుడ్డలను సర్దు కున్నారు. వారు లోయల్లో సంచార జీవితము గడిపే యాదవ కులాలని చెందిన స్త్రీలు. ఉదయాన్నే పర్వతాలు దాటి ఇక్కడి కి పాలు అమ్మడానికి వస్తారు.
"ఈయన చెవిటి వాని చెక్కర కూడా తిన్నాడు," షావుకారిని చూడగానే నలుబై సంవత్సరాల బసంతి ముఖము వికారముతో నిండి పోయింది.
రక రకాల మిఠాయిలు క్రమపద్ధతిలో మూడెంచల చెక్క ఫ్రేమ్ మీద అమర్చబడి వున్నాయి. ఎటువంటి మూత లేకపోవటం వలన, ఆకలితోవున్న బక్క బాలచని ఈగలు వాటిపై దాడి చేస్తున్నాయి. ఆశగా వాటివైపు చూస్తూ హిరా అంది, "చిన్నమ్మ, ఈయన దగ్గర బోలెడు మీఠాయులు వున్నాయి."
" ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరుగదు. వాటిని తినే భాగ్యం మనకు లేదు అమ్మాయి," అంది బసంతి, " మొన్న మీ తమ్మునికని కాస్త మిఠాయి అడిగితే, రూపాయికి సేరు, నీకు ఎన్ని అణాల మిఠాయి కావలి అన్నాడు?"
“మిఠాయి తిని చాలా రోజులైంది. నాకు. ఇప్పుడు వాటిని ఎలా తినాలో కుడా మరిచిపోయాను." హీరా అంది బాధతో.
"ఈ రోజు కొంచం మిఠాయి కొంటాను. దాని కోసం పాలు ఎక్కువగా తెచ్చాను"
రండి. రండి. మీ పాలు చూపించండి. తొందరగా రండి, " అన్నాడు నానక్, “: మీకు తెలువదు తెల్లోళ్ళు మంచంలోనే ప్రాతఃకాల భోజనము చేస్తారు."
“పద చిన్నమ్మ,,” అంది హీరా ఆతురతతో. తన పడుచు చేతులతో పాల కుండను తలపై పెట్టుకుంది.
“పోయే ముందు నాకు కాస్త చేయి అందించు. నాకు తెలుసు. నీకు రైస్ కేక్ తినాలనే తొందర. కానీ ఈ ముసలిదానికి సహాయం చెయ్యి. ఏదేమైనా, నేనే ముందు. నానక్ కు నేను పాలు అమ్మడం మొదలు పెట్టినప్పుడు నీ వింక పుట్టనే లేదు.
“రండి. రండి. పోట్లాడకుండా రండి.” నానక్ అరిచాడు. ఆ అరుపుకు అతని చెవులకున్న బంగారు రింగులు కదిలి పోయాయి .
హీరా తలపై వున్నా కుండను దించి, బసంతి కి కుండానెత్తడములో సహాయము చేసింది. ఆ సమయములోనే, తన కొంగు అంచులో మిఠాయి కోసం దాచిన నాణెములు చేతులో వేసుకుని, పాల కుండను తలపై కి ఎత్తు కుంది.
పాల కుండను దించుతూ, “అయ్యా నా లెక్క చేయండి” అంది బసంతి , “చలికాలము వచ్చేసింది. మేము మా పశువులతో మైదాన ప్రాంతము వైపు పోతున్నాము. రాత్రి పడిన వర్షానికి పూర్తిగా తడిసిపోయాము. మమ్మల్ని చెట్లు ఏవిదంగాను రక్షించలేక పోయాయి. మేము వెళ్లే ముందు పశువులు మేపినందు సర్కారోళ్లకు సుంకము చెల్లించాలి. లేకపోతే వాళ్ళు మా వొంటి మీది బట్టలు లాక్కుంటారు.”
“మీరు ఇల్లు కట్టుకోవలసింది" అన్నాడు నానక్.
“మీ లాగ భాగ్య వంతులము కాదు అయ్యా,” అంది బసంతి
“మంచి పనికి, మంచి జీతం,” అన్నాడు నానక్.
“మంచి జీతం, మంచి పని, ,” అంది హిరా మధ్యలో కలుగచేసుకుంటూ.
“ఆ, ఆ నీవైతే ఓ లక్ష పలుకుతావు,” అన్నాడు నానక్, “నీకైతే పనిచేయకున్న జీతము ఇయ్య వచ్చు.”
" మరి ఎందుకు, నాకు ఇంతకాలం కాస్త మిఠాయి బహుమతి గా దొరకలేదు." అంది హీరా, సిగ్గుతో కొంగు ను తలపైన సవరించుకుంటూ .
“తిండిపోతు ఆకలినైనా తీర్చొచ్చు, కానీ నీవు దాని కళ్ళల్లోవున్న ఆకలిని సంతృప్తి పరుచలేవు," అంది బసంతి. హీరా పట్ల షావుకారి శ్రద్ధను చూసి అసూయా పడింది. "మిఠాయి మింగుతున్నావా, లేక బేరమాడుతున్నావా? ఇదిగో ఈ పాలు తీసుకో. ఈ రోజు మీ జీతగాడు ఎక్కడ?"
“అరేయ్, ఎక్కడున్నవు? ఓ మున్షి సింఘా” అరిచాడు నానక్, దురద గజ్జలను గోక్కుంటూ.
“ఆయా జి,” ఓ బక్క చిక్కిన సిఖ్ యువకుడు తల దించు కోని అతి విధేయంగా సమాధానమిచ్చాడు, "కడాయిని కడిగి సిద్ధంగా వుంచాను."
"వాళ్ళ పాల కుండలు తీసుకొని ఆ కడాయి లో పోయి. అంత పెద్ద కడాయి ని ఇక్కడకేం తెస్తావులే." అన్నాడు నానక్.
పాత చొక్కా పైజామా చిరుగుల నుండి మున్షి చిక్కి శల్యమైన శరీర భాగాలు కనిపిస్తున్నాయి. మున్షి రాగానే, నానక్ మురికిపట్టిన పరుపు నుంచి తన బరువైన కాయాన్ని అతి కష్టంగా లేపి, చీకటి గుహలాంటి గదిలోకి వెళుతూ అన్నాడు " నిన్నటి కాచిన పాలు తెస్తాను, ఇద్దరు గొల్లోళ్లు కాస్త ఆగండీ."
"ఎందుకు,ఆ పాలను తాగడానికి ఇక్కడేమి కుక్కలు లెవా?" అంది బసంతి, " ఇంతవరకు నువ్వు ఎవరికీ ఏమి ఇచ్చినోడివికాదు."
“ఓ మున్షి, సాహెబ్ ల కోసం హీరా పాలను పక్కకుపెట్టు. బసంతివి కడాయి లో పోయి," అంటూ నానక్ వెనుదిరిగాడు.
“ఓ మున్షి, మొదట నా పాలను చూడు. పిల్లలు ఎదురు చూస్తుంటారు. సూర్యుడి ఇప్పటికే నెత్తిమీదికి వచ్చాడు. నీవెప్పుడైనా పొద్దెక్కగా చూసావా? పశువుల మందను మేతకు తోలుకుపోవాలి. ఇంకా మీ యజమాని దగ్గర డబ్బులు తీసుకోవాలి....”
"ఆగిన లేదా పోయిన బిచ్చగాడికి ఓరిగేదేం లేదు,” హీరా వినయముతో అంది.
మున్షి , మొదట మా పిన్ని పాలు తీసుకో,"
“పిల్ల! ఎదిగే వరకు ఓపికబట్టు. నీవు ఇంకా పనిచేయాలి. పిల్లల్ని ఏమిలేకుండానే పోషించవలసి వుంది. ఇప్పుడు నీవు అక్రమంగా నీ తల్లితండ్రుల తిండి, తింటుంటే వారు ఆ అక్రమ మైన తిండిని నీ వయసు ను ఎరగా వేసి, నిన్ను బయటికి పంపి సిగ్గులేకుండా సంపాదిస్తుంన్నారు. నా బిడ్డనైతే ఇలా బజారులో విడిచిపెట్టి, ఇలా ఇటువంటి కామాంధులైన దుఃఖానుదారుల తో ఇకపకలు సహించను. ఇటువంటి చిన్నపిల్ల , అమ్మలారా, ఊహించండి, ప్రపంచం ఎటుపోతోంది. నా ఏకం అర్థం కావడం లేదు. మా రోజుల్లో ఐతే .....
మున్షి బసంతి పాలను దుకాణం లోకి తెస్తున్నపుడు, హీరా ఓ శబ్దము విన్నది... ఏమిటది... నీళ్ళా? ఆ వెంటనే షావుకారు నానక్ చంద్ నిన్నటి మరగపెట్టిన పాలున్న ఓ పాత్రతో బయటకు వచ్చాడు.
“ఓయ్, మున్షి, పాలు కడాయి లో పోసాక, థర్మామీటర్ తీసుకొని బయటకు రా. ఆ చీకట్లో ఏమి కనిపించదు," గట్టిగ అరిచాడు నానక్ చంద్.
" నాకు ఓ అణా మందము మిఠాయి ఇవ్వు" అంది హీరా, తన చేతిలో నాలుగు పైసలు నానక్ కు చూపిస్తూ.
“నాణాలు అక్కడ వుంచు" అన్నాడు నానక్, ఓ హిందువు లాగ జంకుతూ. మిఠాయి తరాజు లో తూచి ఓ పాత పేపర్ ముక్క లో పెట్టి, పొట్లం గా చుట్టి లక్ష విలువచేసే నవ యువతి వైపు విసిరాడు.
తన శక్తి నంత కూడగట్టుకొని పాల కడాయిని బయటకు తెచ్చి, షావుకారి మురికిపట్టిన కౌంటర్ పక్కనే వున్నా పొయ్యి పెట్టినప్పుడు, పాలిపోయిన మున్షి ముఖము రక్తము తో నిండు గా కనిపించింది.
“మీటర్ ఏది ?" అన్నాడు నానక్ దర్వాజా వెనుక దుమ్ముపట్టిన గోడపైన దానికోసం పుణుకుతూ. ఆయాసంతో వున్న మున్షిని చూస్తూ, నానక్ అన్నాడు, “రా, రా. ఆ పాలు గిన్నెలో పొయ్యి ఖంసమా వాళ్ళ అబ్బాయి వస్తుంటాడు .”
ఎట్టకేలకు మీటర్ దొరికింది. మురికి ధోతి అంచుతో దాన్ని తుడిచి, పాలల్లో పెట్టాడు.
“మోసానికి తెగబడ్డావు, కాదా, బసంతి ? “
“ఎందుకు?” అడిగింది బసంతి ఆశ్ఛర్యంగా.
“ఎందుకు, ఏమైనా తప్పు దొర్లిందా?" అడిగింది హీరా, మిఠాయి ని కొంగు అంచున ముడేస్తూ .
వికారమైన ముఖాన్ని మరి వికారంగా పెట్టి, నాటకీయంగా కాసేపు ఆగాడు . తర్వాత ఇలా అన్నాడు "ఈ పాలల్లో నీళ్లు వున్నాయి" కోపాన్ని నటిస్తూ, తన జీతగాడి వైపు తిరిగి "మిగతా పాలను కూడా తీసుకొనిరా, ఓయ్ మున్షి "
ఆ యువకుడు హీరా కు చెందిన పాలున్న కడాయి బయటకు తెచ్చాడు. నానక్ ఆ పాలల్లో మీటర్ పెట్టాడు .
" ఎక్కడో ఏమో జరిగింది," అంది హీరా , అప్పుడు తను విన్న నీటి చప్పుడుకు పాలల్లో నీటికి సంబంధము గురించి ఆలోచిస్తూ.
“అచ్చా, ఏమో జరిగిందా ? ఓ ఓ చక్కని చుక్క," బసంతి కోపము తో ఊగిపోయింది . “ఎక్కడో ఏమో జరిగిందా! ఓహో, ఓ కాకి బాషా మరో కాకి మాత్రమే అర్థమవుతుంది. నా గురించి ఆలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం. నీవు బికారి దానివి కాను. నీకు మొఖం నిండా నల్లమచ్చలు రాను.. నేను నీళ్లు కలిపినా పాలు తెచ్చానని అనడానికి నీకెంత ధైర్యం! నీ కెంత ...”
“చిన్నమ్మ నీగురించి నేనేమి అనలేదు నీవెందుకు నన్ను తిడ్తున్నావు. అటు చూడు, నా పాలను కూడా పరీక్షిస్తున్నాడు.... “నానక్ వైపు తిరిగి, “ నా పాలలో నీళ్లున్నాయని అనేవు , ఎందుకంటే నేనే స్వతహాగా పాలు పితికాను సేఠు,” అంది హీరా
నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంది బసంతి నానక్ తన హీరా పాల గూర్చి ఎటువంటి అభిప్రాయం తెలపగా ముందే. "నాకు తెలుసు, నీవు పాలల్లో నీళ్లు కలపకపోతే, ఆవులకు నీళ్లు తాగించి పాలు పితికే రకం నీది! నా పిల్లల నోటికాడి అన్నం లాక్కునన్నావు!"
“అవును'" అన్నాడు నానక్, "ఈ పాలు కుడా పలచగా వున్నా యి. ఈ మీటర్ పని చేయకపోయినా, పాలు మాత్రం చిక్కనివి కావు."
“సేఠ్ జి, అలా కానే కాదు," హీరా అభ్యంతరం తెలిపింది. "దేవుని మీద ఒట్టు, మా అమ్మ నాన్న మీద ఒట్టు, నాకు అతి ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు. పాలల్లో నీరు కలుప లేదు."
“అంటే నా పాలల్లో ఉన్నాయా, లంజ," అరిచింది బసంతి. “కుక్క లా పో, పిల్లి లా రా. పో. పో. యజమానుల కు నీవంటే ఇష్టం. నీ తండ్రి చచ్చి నీ తల్లి విధవగాను! నువ్వు అనాధవు గాను! మీరందరు చచ్చిపోను! మీరందరు పోయాక, నేను ఈ నానక్ దుఖాణాన్నీ కొని, మిఠాయి అందరికి పంచి పెడతాను”
“జాగ్రత్తగా మాట్లాడు చిన్నమ్మ," హీరా అంది. " తెలివిలేని ముసలిదానా, నన్నెందు కు ఆడిపోసుకుంటావు ? ఒక్క కట్టెపుల్ల ఎప్పుటికీ మండదు, కాలదు, వెలుఁగదు. నీవు ఆ జగడాలే పుట్టించే వాడి మీద నీ కోపాన్ని చూపించు, ఆ జగడా ... "
“నన్ను జగడాలమారి అన్నారంటే పోలీసువాళ్ళను పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను" అన్నాడు
నానక్, కోపాన్ని నటిస్తూ. "నీచమైన గొల్ల జాతి ఆడవాళ్లుమీరు. మీరు గొడవ పడి, నింద నా మీద వేస్తారా, ఎంత అహంకారం ?"
“ఏదీ పోలీస్ వాళ్ళను పిలువు, చూస్తా, అంది హీరా. "నీ మీద ఉమ్మివేస్తా . నీవు లోపడికి వెళ్ళినప్పుడు ఎం చేసావో నాకు తెలుసు. “ వాడి కుట్రలు కుతంత్రాలు గుర్తుకు రాగానే కోపంతో రగిలిపోయింది. ఒక సారి ఆమె సాంగత్యం పొందడానికి షావుకారు తన వ్యాపారకిటుకులు, ఎట్లా తన పొట్ట పెంచాడు ఏవిదంగా నగరంలో పెద్ద బిల్డింగ్ నిర్మించాడు, అన్నీ హీరాకు చెప్పాడు. కానీ తర తరాల బానిసత్వపు జీవనం వల్ల ఆమె నోరు తెరువలేక పోయింది.
"అవును బసంతీకి ఏమి తెలువదు. నీకే తెలుసు కదా ముండా," అంది బసంతి. "లంజ, చేతులు కడుక్కోవడానికి అద్దము అవసరం. నీవు లోపడి వెళ్లి కెలావు. కావున నీవు మాట్లాడ గలవు. కొందరవి నోటిమాటలైతే నేను చేతులు వాడుతాను," “లంజ, నీ తలను కాగడా తో దువ్వుతాను. నీది పాపిష్టి బ్రతుకు. నీ తలమీద నా కోపం లాగా మరిగే నీటిని పోస్తాను. నిన్ను ప్రాణముండగానే నమిలేస్తాను!" తిట్టుకుంటూ. బసంతి హీరా మీద పడి తన గొళ్లతో రక్కుతూ గుడ్డల్ని చించి , తల వెంట్రుకల్ని పట్టి లాగింది .
మున్షి వాళ్ళ మధ్య చొరబడి విడిపించే ప్రయత్నం చేసాడు.
"ఓయ్ మున్షి, నీవు కలుగచేసుకోకు, వాళ్ళను వొదిలిపెట్టు. ఆ దొంగలిద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోని చావనివ్వు!" నానక్ అన్నాడు. " "కడుపు నిండే దాకా తిని, తలలు పగిలేదాకా తన్నుకోండి."
కానీ మున్షి వాళ్ళను విడదీసాడు. ఇంకా నే వుంది "దాన్నీ దాని సంబధీకుల్ని నమిలి తింటాను. పీరీల పండు వరకు దాన్ని నేను తింటాను ... అని తిడుతూవున్నా బసంతిని ప్రక్కకు తీసుకెళ్లాడు.
ఆమెను శాంత పరుచుటకు ఆ తమాషా చూస్తున్న వారిలో ఒకడున్నాడు. “నీవు తింటావో లేదో గాని, అక్కడ కూర్చొని వున్న తోడేలు మాత్రం మహా భయంకరమైంది.,”
" అయన మిమ్మల్ని గొడవ పడేటట్లు ప్రోత్సహిస్తున్నాడు, " అన్నాడు మున్షి . యజమానికి వినిపించకుండా, తన చేయిని నోటి కి అడ్డం పెట్టుకొన్నాడు.
కానీ నానక్ దగ్గరగా ఉండడం, మరియు అతను ఓ కొన్ను తనపై వేసి వుంచడము వలన పాలల్లో నీళ్లు కలిపింది తన యజమాని అని , హీరా అన్న మాటలు షావుకారు లోపలికి వెళ్ళినప్పుడు చేసిన చేసిన కుట్ర గురించే గాని, తనను అనుమానించడము కాదు అని చెప్పలేకపోయాడు.
“అచ్చా, నా లెక్క తేల్చు,” అంది బసంతి, మున్షి తన చెవిలో చెప్పిన మాటల్లో విషయాన్నీ గ్రహించి.
మంచి నీళ్లకు మరియు ఉప్పు నీళ్లకు ఒకే ధర," అంటే ఏమి ధర లేదన్నట్లు ... మీరెప్పుడు మంచి పాలు పోసారో ఎప్పుడు చెడ్డ పాలు పోసారో నాకుతెలియదు. కానీ నాకు తెసిందేందంటే పోలీసువాళ్ళకు బాగా డబ్బులిచ్చి వారు నన్నులాక్ అప్ చేయకుండ చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళు నిజమైన నేరస్థులను పట్టుకుంటారు ఎందుకంటే నా జీతగాడు మరియి జనమందరి ముందు మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు .”
"ఓయ్, సేఠ్ నానక్ చంద్, ఆమె డబ్బులు ఆమెకు ఇచ్చి, ఈ పంచాయఠీ ఆపు, " ఆ గుంపులోవున్న పక్క దుఖానం యజమాని అన్నాడు.
"అవును. అవును డబ్బులిచ్చి వాళ్ళను పోనివ్వు, " మరో వ్యక్తి అన్నాడు.
“లేదు. లేదు , వాళ్ళు దొంగలు.” అన్నాడు నానక్
“ఓయ్, సేఠ్ నానక్ చంద్, వాళ్ళను పోనివ్వు,” ఇంకా కూచొనే వున్నా పక్క దుకాణం యజమాని అన్నాడు.
“అచ్చా,,మీ ఇద్దరు లం.. లు రండి. ఈనెల మీరుపోసిన పాలకు గాను చెరో రూపాయీ చొప్పున ఇస్తాను. అది నేను చేసే దానం. అసలు మిమ్మల్ని పోలీసుకు అప్పగించాలి ," అంటూ , నానక్ చిలుము పట్టిన పైసల గళ్ళ నుండి రొండు నాణేలు తీసి వారి వైపు విసిరాడు.
యాదవ స్త్రీలు నిశ్చేష్టులయ్యారు.. పోట్లాడి పోట్లాడి అలిసిపోయారు. ఇంకా ఏమాత్రం గొడవ పడే ఓపిక వారికి లేదు.
"నేను పోలీసులను పిలవకముందే ఇక్కడినుండి వెళ్లిపోండి, పోండి."
“పోండి పోండి నీచుని దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆశించవద్దు " అక్కడున్న ఓ దయగలిగిని మనిషి అన్నాడు.
“పోండి పోండి. డబ్బున్న కిరాయిదారుకి జమానతు అవసరము ఉండదు,” మరో వ్యక్తి అన్నాడు.
వారు కిందపడిన నాణెలని పదిలంగా తీసుకున్నారు. అప్పుడు బసంతి హీరా తో ఇలా అంది, " పద అమ్మాయి. వీడు ఎనిమిది గంజుల పాలు తాగి పదహారు షుగర్ ప్లమ్స్ తింటే మనం మాత్రం దుబ్బ బుక్కి మన కాలేయాల రక్తం తాగుదాము."
"అవును పిన్ని, వాడు చచ్చిపోతే ఎవరు దుఃఖించరు ఒక్క కాకులు తప్ప!" జవాబిచ్చింది హీరా.
వారు తమ ముఖాలను దాచుకొని అక్కడినుండి వెళ్లిపోయారు.
అనగనగా ఓ జ్యోతిష్కుడు
సరిగ్గా మధ్యాహ్నం సమయానికి, అతడు తన మూటను విప్పి వృత్తిపరమైన వస్తువులను పరచాడు. అందులో, పన్నెడు గవ్వలు, ఓ నోటు బుక్కు మరియు వింతైన నమూనా చిత్రములు గీసివున్న ఓ గుడ్డ ముక్క, ఓ తాళపత్రములకట్ట వున్నాయి. అతని నుదురు పవిత్రమైన విబూది మరియు కుంకుమ పూతల తో వెలిగిపోతుంది. అతని కళ్ళు కస్టమర్లకొరకు వెతుకులాట ప్రయత్నం లో కలిగిన ఆతురతతో ప్రకాశించునున్నాయి. కానీ అమాయకులైన కస్టమర్లు దాన్ని అతని లోని ఓ దివ్య శక్తిగా భావించి ఆనంద పడతారు. రంగులద్దిన నుదురు మరియు పొడుగాటి నల్లని చెంపల జుట్టు మధ్యలో అమర్చినట్లున్నఅతని కళ్ల మహత్వము మరింత పెరగడానికి అతడు వాటిని పలువిధాలుగా తిప్పుతాడు. ఇటువంటి స్థితి లో ఓ పిచ్చివాడి కళ్ళు కూడా చమక్కు మంటాయి. అన్నింటికి మించి, అతడు కాషాయపు గుడ్డను తల పాగా చుట్టు కొన్నాడు. తన అలంకరణలో ఈ రంగులక్రమాన్నిఅతడెప్పుడు తప్పలేదు. దహిలియా కాండాలను లేదా కాస్మోస్ ను ముసురుకున్న ఈగల వలె, కస్టమర్లు అతని కి ఆకర్షితులవుతారు. టౌన్ హాలుకు వెళ్లే దారికి ఓ వైపునున్న విశాల మైన చింత చెట్టు కొమ్మ నీడలో అతడు కూర్చున్నాడు. అది అన్నిరకములుగా అనుకూలమైన స్థలము. ఆ ఇరుకైన మార్గము వెంట వివిధ రకాల వ్యాపారా లకు సంబంధించిన దుఖాణాలు ఉండడం వలన అక్కడ ఎప్పుడు జనముతో రద్దీగా ఉంటుంది. మందులు అమ్మేవారు, దొంగిలించిన వస్తువులు అమ్మేవారు మరియు ఓ పాతబట్టల వేలందారు రోజంతా జనాన్ని ఆకర్శించడానికి పెట్టే కేకలతో ఆ చుట్టుపక్కలు కోలాహలంగా ఉంటుంది. అతని పక్కనే ఒకరు పల్లీలు అమ్మేవాడున్నాడు అతను పెద్ద గొంతుతో పల్లీలను రోజుకో వింతైన పేరుతో పిలుస్తూ జనాన్ని ఆకర్షిస్తూ వున్నాడు. ఓ రోజు బాంబే ఐస్ క్రీము , మరో రోజు ఢిల్లీ ఆల్మండ్ ఇంకొక రోజు రాజా'స్ డెలికేసి అంటూ తన వ్యాపారాన్ని కసితో కొనసాగిస్తున్నాడు. ఎప్పుడూ చూసిన, జనం అతని చుట్టూ గుమిగూడి వుంటారు. పల్లీలకోసము వచ్చే వారు చాలామంది జ్యోతిష్కుని ముందునుంచే పోతూంటన్నారు. జ్యోతిష్కుడు ఆ పక్క కాలుతున్న పల్లీల కుంపటి వెలుగులో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. కొంత వరకు మున్సిపాలిటీ దీపాల సౌకర్యము లేకపోవడం వలన ఆ ప్రాంతం ఓ రకమైన మార్మిక రూపును సంతరించుకొంది.
దుఖాణములోని లైట్లు , ఒకటి రెండు లాంతర్లు, అక్కడక్కడ కాగడాలు మరియు పాత సైకిలు డైనమోలు ఆ ప్రదేశాన్ని వెలుతురుతో నింపాయి. కొందరు జ్యోతిష్కునివలె ఎటువంటి దీపాలు లేకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నలు వైపుల నుండి వచ్చే కాంతిపుంజాల మెలికలతో అదొక వింత ప్రదేశములా కనిపిస్తుంది. ఇటువంటి వాతావరణము జ్యోతిష్కునికి బాగాకలిసివచ్చింది, ఎందుకంటే అతడు ఈ వృత్తి చేపడతాడని ఎప్పుడు అనుకోలేదు. అదియునుగాక ఇతరులకు ఏమి జరుగుతుందో తెలియడం కన్నా, , ముందు తనకు ఎప్పుడేమి జరుగుతుందో అసలు తెలియని స్థితి. అమాయకులైన తన కస్టమర్ల వలె తనకు కూడా తారాబలము గురించి తెలియదు. కానీ తను చెప్పే విషయాలు ప్రతివాడిని సంబ్రమాశ్చర్యానికి గురిచేసేవి. అదంతా తన ఉజ్జాయింపు మరియు కాస్త లోకజ్ఞానం తో సాధ్యమైన దే. ఏది ఏమైనా అతనుచేసే వృత్తి ఓ నిజాయితి పరుడి పనివంటిదే. సాయంకాలానికి ఇంటికి తీసుకుపోయే డబ్బుకు అతడు ఆర్హుడే.
అతడు ఎటువంటి ఆలోచన చేయకుండానే తన ఊరి నుండి వచ్చేసాడు. ఒకవేళ అక్కడే వుండి ఉంటే తన పూర్వీకులవలె వ్యవసాయము చేస్తూ పెళ్లి చేసుకొని ముసలి వాడయ్యే వరకు ఆ పాతకాలపు ఇంటిలో జీవనము సాగించేవాడు. కానీ అదిజరుగేది కాదు. అతడు ఎవరికీ చెప్పకుండానే ఇల్లువిడిచి దాదాపు రెండు వందల మైళ్ళు దూరం చేరేవరకు విశ్రమించలేదు. ఓ గ్రామస్థునికి ఈ దూరం అతి పెద్దది. తనకు తన ఊరికి మధ్య ఓ మహాసముద్రము పరచబడినట్లు వుంది!
మనుషులు సాధారనంగా జీవితంలో ఎదుర్కొనే సమస్యలు - పెళ్లి, డబ్బు మరియు మానవ సంబంధాల చిక్కుముడులు గూర్చి అతనికి అనుభవపూర్వ జ్ఞానముంది. బహుకాల అభ్యసనము వలన అతని అర్థము చేసుకునే శక్తి మరింత పదునెక్కింది. కేవలముఐదు నిమిషాల్లోనే సమస్య ఏంటో అతనికి బోధపడుతుంది. ప్రతి ప్రశ్నకు అతడు మూడు నయా పైసలు తీసుకొంటాడు. తన దగ్గరికొచ్చిన వ్యక్తి కనీసం పది నిముషాలు మాట్లాడేవరకు తాను నోరు విప్పుడు. ఆ సమయం లోనే తనకు ఓ పన్నెండు సమాధానాలకు సరిపడే సమాచారం లభ్యమౌతుంది. ఎప్పుడైతే ఎదుటివాని చెయ్యి తదేకంగా చూస్తూ " అన్నివిషయాలల్లో నీవు నీ శ్రమకు దగ్గట్టుగా ఫలితము పొందలేక పోతున్నావు" అని అతడు చెప్పినప్పుడు, పదిమందిలో తొమ్మండుగురు నిజమేనని వొప్పు కొంటారు. "మీ కుటుంబములో నీవంటే ఇష్టపడని స్త్రీ ఎవరైనా ఉన్నారా?" అని అతడు ఓ ప్రశ్న ను సందించేవాడు. లేక అతడు ఎదుటి వ్యక్తి యొక్క గుణ గణాలను పరిశీలన చేస్తూ, "నీ సమస్యలకు నీ వ్యక్తిత్వమే కారణమూ. శని ఆధిపత్య కారణంగా నీ స్థితి ఇంకొక విధంగా ఉండడానికి వీలులేదు.” "నీకు కాస్త దూకుడెక్కువ, నీవు పైకి కఠువుగా కనిపిస్తావు " అంటూ చెప్పుకుంటూ పోతాడు. అతని ధోరణి జనానికి బాగా నచ్చుతుంది. పల్లీల వాడు మంటనార్పి పోవడానికి సిద్ధమైనాడు. తన వ్యాపారాన్ని కూడా ఆపాలని జ్యోతిష్కునికి ఇదొక సంకేతము. ఎందుకంటే పల్లీలు అమ్మేవాడు వెళ్ళిపోతే దూరము నుండి వచ్చే వెలుతురు కిరణము తప్ప మొత్తము చీకటే. ఆ వెలుతురు కూడా తనకు కొద్దీ దూరములో ఆగిపోతుంది. గవ్వలు మరియు ఇతర వస్తువులను సంచిలో సర్దుతున్నపుడు వెలుతురు కు ఎవరో అడ్డంగా వచ్చారు. తలెత్తి చూసే సరికి తన ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి వున్నాడు. మరొక బేరము దక్కిందని తలచి, "నీవు దుఃఖంలో ఉన్నట్లు గా కనిపిస్తున్నావు. ఇలా కూర్చోని నాకు చెప్పు నీకు ఉపశమనం దొరుకుతుంది" అన్నాడు జ్యోతిష్కుడు. ఎదురుగావున్నతను ఎదో నసిగాడు. తనకు చెప్పుమని జ్యోతిష్కుడు అతన్ని మరోమారు అడిగాడు. వెంటనే ఆ కొత్త వ్యక్తి తన హస్తాన్ని జ్యోతిష్కుని ముక్కు దగ్గర పెట్టి, " నిన్ను నీవు జ్యోతిష్కుడవని అనుకుంటున్నావా?" అని అన్నాడు. జ్యోతిష్కుడు దానిని ఓ ఛాలెంజ్ భావించి , అతని చెయ్యిని వడి పెడుతూ ఒంటరి కాంతి కిరణము వైపు తిప్పాడు: "నీ స్వభావము .... " అంటూ ఎప్పటిలాగా తన ధోరణిలో చెపుతుండగా, ఎదురుగావున్న వ్యక్తి "ఆపు," అని అన్నాడు. "పనికొచ్చేదేమైనా ఉంటే చెప్పు."
మన జ్యోతిష్కుడు కాస్త ఆసహనానికి గురై "నేను ప్రతి ప్రశ్నకు మూడు పైసల చొప్పున తీసుకొంటాను. నేనిచ్చే సమాధానాలు నీ పైసలకు సరిపోతాయి,” అని అన్నాడు. అటువైపునున్న మనిషి వెంటనే తన చేయిని వెనుకకు లాక్కొని ఒక అణా తీసి అతనివైపు విసిరి ఇలా అన్నాడు, "నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీవు మోసం చేస్తున్నావని నేను నిరూపిస్తే న అణా డబ్బులు వడ్డీతో తిరిగివ్వాలి. "
"ఒకవేళ నా జవాబులు నిన్ను సంతృప్తి పరిస్తే నాకు ఐదు రూపాయలు ఇస్తావా ?"
“ఇవ్వను.”
"లేకపోతే ఎనిమిది అణాలైనా ఇస్తావా?"
“సరే. అయితే ఒక షరతు. నీవు తప్పు అని నిరూపించితే దానికి రెట్టింపు డబ్బు నాకివ్వాలి,” అన్నాడు ఆ కొత్త వ్యక్తి. కొంతసేపు తర్జన భర్జన తర్వాత ఇద్దరు ఓ ఒప్పందానికి వచ్చారు. జ్యోతిష్కుడు దేవుణ్ణి స్మరిస్తుండగా, కొత్త వ్యక్తి చుట్టను వెలింగించాడు. జ్యోతిష్కుడు అగ్గిపుల్ల వెలుగులో ఆ వ్యక్తి యొక్క మొఖం చూసాడు. కాస్త విరామం ....రోడ్డు మీద కార్ల హారన్ శబ్దాలు, జట్కా బండి చోదకులు తమ గుర్రాలను తిట్టడము మరియు జనం ఎడతెగని సంభాషణలతో ఆ సాయంకాలము ఆ పార్కు పరిసరాలు చికాకుగా అనిపించింది. కొత్త వ్యక్తి చుట్టను కాలుస్తూ పొగను గుప్పు గుప్పున వొదులుతూ జ్యోతిష్కుని ముందు కౌర్యంగా కూర్చుని వున్నాడు. జ్యోతిష్కుడు అసౌకర్యంగా కనిపించాడు.
“నీ అణా నీవు తీసుకో. ఇటువంటి పందేలు నాకెప్పుడూ తెలియవు. ఇప్పటికే ఆలస్యమైంది... ఇంటికి వెళ్ళాలి. “జ్యోతిష్కుడు మూట సర్దుకుంటున్నాడు. అవతలివాడు జ్యోతిష్కుని చేయి గట్టిగా పట్టుకొని "నీవు తప్పించుకోలేవు. నా దారిన నేను వెళ్తుంటే, నీవు ఇందులోకి లాగావు,” అని అన్నాడు. జ్యోతిష్కుని గొంతు భయముతో మూగపోయింది. "ఈ రోజు పోనివ్వు. నీతో రేపు మాట్లాడుతాను." అతడు తన చేయిని ముందు చాపుతూ " పందమంటే పందమే. కానివ్వు" అన్నాడు. తడారిన గొంతుతో జ్యోతిష్కుడు జోస్యాన్ని చెప్పడం మొదలెట్టాడు: “నీజీవితములో ఓ స్త్రీ…..”
"ఆపు"అన్నాడు అవతలివాడు. “అదంతా నాకవసరంలేదు. నేనిప్పుడు తలపెట్టిన పనిలో విజయము పొందుతాన లేదా ? దీనికి సమాధానము చెప్పి వెళ్ళిపో. లేకుంటే నువ్వు పైసలన్నీ కక్కే వరకు నిన్నొదలి పెట్టను.”
“సరే విను చెప్పుతాను. కానీ నేను చెప్పేది నీకు నిజమనిపిస్తే ఒక రూపాయి ఇస్తావా? లేకుంటే, నేను అసలు మాట్లాడను. నీకిష్టమైంది నీవు చేసుకో.” చాలాసేపు బేరమాడిన తర్వాత అవతలివాడు అంగీకరించాడు. “నువ్వు చచ్చిపోయావని వదిలేసారు. ఇది వాస్తవమా కాదా?”
“ఆహా! ఇంకా చెప్పు”
“నీ శరీరములో ఒకసారి కత్తి దిగింది?" అన్నాడు జ్యోతిష్కుడు
" భలే వాడివే" అంటూ తన రొమ్ము బాగాన వున్న కత్తి గాటును చూపించాడు.
"ఆ తర్వాత నిన్ను దగ్గరలో వున్నా వ్యవసాయ బావిలోకి తోసేసి నీవు చచ్చావని వదిలిపెట్టి వెళ్లారు."
“అప్పుడు ఆ మార్గములో వెళుతున్న ఓ మనిషి అనుకోకుండా బావిలోకి తొంగి చూడకపోతే నేను చచ్చేవాడినే.” అన్నాడు అవతలి వ్యక్తి ఆశ్చర్యంగా. “వాడిని నేనెప్పుడు పట్టుకుంటాను?,” అడిగాడుఅతను పిడికిలి బిగించుతూ.
"మరో జన్మలో ," సమాదానము ఇచ్చాడు జ్యోతిష్కుడు. "నాలుగు నెలల క్రితమే సుదూర పట్టణము లో అతడు చనిపోయాడు. నీవు అతన్ని ఎప్పటికి కలువలేవు." ఆ వార్త విని అవతలివాడు బాధతో మూలిగాడు. జ్యోతిష్కుడు చెప్పుకుంటూపోతున్నాడు.
“గురు నాయక్”
“నా పేరు నీకు తెలుసా?” అన్నాడు అవతలివాడు ఆశ్చర్యంగా.
“అన్ని తెలిసినట్టుగానే ..., నేను చెప్పేది జాగ్రత్తగా విను. గురు నాయక్. ఈ టౌన్ కు ఉత్తరము దిక్కున రెండు రోజులు ప్రయాణము చేస్తే మీ వూరు వస్తుంది. వచ్చే ట్రైన్ ఎక్కి ఎవరికి కనిపించకుండ పో. నీవు మళ్ళీఊరొదిలి వెళ్ళితే నీకు మరో గండము ఎదురయే అవకాశముంది. ” ఓ చిటికెడు పవిత్రమైన విభూదిని అతనికి ఇస్తూ "దీన్నీ నుదిటి మీద పూసుకొని ఇంటికెళ్ళిపో, ఎన్నడూ దక్షిణ దిక్కు ప్రయాణము చేయకు. నీవు వందసంవత్సరములు జీవిస్తావు. " అని అన్నాడు.
“మళ్లీ నేనెందుకు ఊరొదిలి పోతాను.” అన్నాడు అవతలివాడు ఆలోచిస్తూ. “వాడిని వెతికి పట్టుకుని చంపడానికి మాత్రేమే అప్పుడప్పుడు బయటకెళ్లుతున్నాను,” అన్నాడు అతడు, విచారంగా తల ఊపుతూ. “వాడు నా చేతుల నుండి తప్పించుకున్నాడు. కనీసము వాడు ఘోరమైన చావు చచ్చాడనుకొంటా!”
"అవును" అన్నాడు జ్యోతిష్కుడు. "అతడు లారీ కిందపడి నలిగి చచ్చిపోయాడు." అది విని అవతలివాడు సంతృప్తి చెందినట్లుగ కనిపించాడు.
జ్యోతిష్కుడు సరంజామాను తన సంచిలో సర్దుకునే సరికి ఆ ప్రాంతంమంతా నిర్మానుష్యమైంది. ఆకుపచ్చ వెలుతురు కిరణము కూడా పోవడము వలన అంతట చీకటి మరియు నిశ్శబ్దం ఆవరించింది. ఆ కొత్త వ్యక్తి జ్యోతిష్కుడికి సరిపడా నాణేలను ఇచ్చి చీకట్లో కి జారుకున్నాడు.
జ్యోతిష్కుడు ఇంటికి చేరే సరికి దాదాపు మధ్య రాత్రి కావస్తుంది. గలమ దగ్గర నిలబడి ఎదురుచూస్తున్న భార్య అతని ఆలస్యానికి కారణమడిగింది. చేతిలోని నాణేలను ఆమె వైపు విసిరి, "వాటిని లెక్కించు. అవన్నీ ఒకే మనిషి ఇచ్చాడు. " అన్నాడు జ్యోతిష్కుడు.
"మొత్తం పన్నెండున్నర అణాలు," అంది ఆమె లెక్కిస్తూ. ఆమెకు అమితానందమైంది. "రేపు బెల్లం, టెంకాయ కొంటాను. చిన్నది చాల రోజులనుండి మిఠాయిలు కావాలని అడుగు తూ వుంది. మంచి తీపి పదార్థం ఏదైనా చేసి దానికి పెడతాను."
"ఆ నికృష్టుడు మోసము చేసాడు! రూపాయి ఇస్తానని ఒప్పుకున్నాడు,,” అన్నాడు జ్యోతిష్కుడు. ఆమె అతని వైపు చూసింది. "నీవు కలత చెందినట్లు కనిపిస్తున్నావు. ఏమి జరిగింది?
“ఏమి లేదు.”
భోజనం తర్వాత మంచము మీద కూర్చొని, “నీకు తెలుసా? ఈ రోజు ఓ పెద్ద బరువు గుండెలమీదినుండి దిగిపోయింది. ఇంత కాలము నా చేతులకు ఓ మనిషి రక్తమంటుకుందని బాధపడ్డాను. ఆ కారణంగానే నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చి నిన్ను పెళ్ళాడి ఇక్కడ స్థిరపడ్డాను. కానీ అతను బ్రతికే వున్నాడు,” అన్నాడు తన భార్య తో
ఆమెకు ఊపిరాగినంతపనైంది. "నీవు హత్యాప్రయత్నం చేసావా?"
“అవును. మావూరిలో నేను పనిపాట లేక వెర్రివానిగా తిరుగుతున్న సమయములో జరిగింది. ఒక రోజు మేము కొందరము యువకులము కలిసి తాగం. జూదమాడాం. తర్వాత బాగా దెబ్బలాడుకొన్నాం …. అవన్నీ ఇప్పుడెందుకులే! నిదురోస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది,” అంటూ అవలించుతు మంచంపైన ఒళ్ళువాల్చాడు .
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు