అదొక మహావృక్షం
యాభై ఏళ్ళ క్రితం ఓ మొక్క
శాఖోపశాఖలుగా
విస్తరించింది
ఎందరికో
ఆశ్రయం అభయమిచ్చింది
నరకాలనే
ప్రయత్నం జరగని రోజు లేదు
కొన్ని కొమ్మలని రాల్చినా
చిగురు తొడుగుతూ
కొత్త కొమ్మలతో అలాగే ఆదర్శంగా
వృక్షం
బతకాలని
నీరుపోసే వారెందరో
బతుకు నే ప్రశ్నగా సంధిస్తూ
చెరలో
కాసిన కాయలెన్నో
పండ్లయి రాలినయ్
రాల్చబడినయ్
వృక్షం మాత్రం పచ్చగా
రాజ్యాలు వస్తున్నాయి
పోతున్నాయి
వృక్షంపై కన్నెర్ర
వ్రేళ్ళూనుకుని పోయిన
వృక్షం ఎన్నో గాయాల సాక్ష్యంగా
పక్షులు కొమ్మలపై గేయాలు పాడుతూ
పడుతూ లేస్తూ
చస్తూ పుడుతూ
వృక్షం అండగా
ఆ వృక్షమే శ్రీశ్రీ నాటింది