అమ్మకి సాయం జేస్తూ
అన్నీ విషయాలు పంచుకుంటూ
ఆనందంగా జీవించవలసిన
ఆ యుక్త వయస్సులో
పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి
ఆ తర్వాత పిల్లలు
వారి బాగోగులు చూసుకుంటూ
భర్తకి సర్దిపెడుతూ
ఆ చిన్న వయసులోనే
కుటుంబ భారాలు మోయనేరుస్తావ్ నీవు...అమ్మా!
మీ అమ్మ నాన్నలు గుర్తుకొచ్చి
ఎన్నిసార్లు ఏడ్చావో నువ్వు
మీ అక్క తమ్ముడి స్వరం
వినలేక ఎన్నిసార్లు
కంట తడి పెట్టవో నువ్వు
ఆరోగ్యం ఎలా వున్నా
నీ డ్యూటీ నీదే
నీకు చేయుతనిచ్చే
నిన్ను ఓదార్చే దిక్కు తోచదు నాకు
ఎలా ఆపగలను నీ మనోవేదన
కన్నీటితోనైనా దింపు
నీ యెదలోని భాధ
భర్త తిట్లు పిల్లలతో భాధ
అన్నీటిని ఒరుస్తావు భరిస్తావు
నీ భాధ చెప్పవు
మా బాధని తీరుస్తావు
నా మదిలో ఎప్పుడూ ఒక ప్రశ్న
అది నీకెలా సాధ్యం? ఓ అమ్మా...
బయట ఏది జరిగినా ఇంట్లో చెప్తావు
కానీ ఇంట్లో జరిగేవి ఏవైనా
గడపదాటి బయటికి పోనివ్వవు
అమ్మా నాన్న కుటింబికులు గుర్తుకొస్తే
భర్తకి జెప్పి ఓదార్పు పొందాలనుకుంటావు
కానీ భర్తే కరిస్తే
దుఃఖం తో నీలో నీవే కుమిలిపోతావు
అమ్మ నాన్నలయ్యాక మనల్ని కన్న
అమ్మా నాన్నలకి దూరం అవ్వాలా
నా తలిదండ్రులతో గడిపిన రోజులు
గుర్తులుగా మిగిలిపోవలా
నా తోడ బుట్టిన వారికి పరాయి దానిని అవ్వాలా?
అని నీవేప్పుడూ అనుకుంటావా
మీ కుటుంబాన్ని నీ కుటుంబంలో
చూసుకుంటూ
అన్నిటినీ దాచి ఇస్తావు వెచ్చని చిరునవ్వు
నిజంగానే వస్తే
ఇంకెంత బాగుంటుంది నీ నవ్వు
రేపు నేను ఇంతేనా అమ్మా...?