మా రచయితలు

రచయిత పేరు:    అద్దేపల్లి జ్యోతి

కవితలు

నిన్న నేటి రేపటి మహిళ 

నిన్న చెప్పులు వేసుకోవటానికి ఆంక్షలతో భయపడేది 

చదువుకోవాలంటే యుద్ధాలు 

కన్యాశుల్కం సతీ సహగమనం బాల్య వివాహం 

ఇలా ఎన్నో ఎదుర్కొని

నేటి అవకాశాలను ఆకాశమే హద్దులా అందుకుని 

అన్ని రంగాలలో తనదైన ముద్రవేసి 

విజయభేరి మ్రోగించి ఇంటా బయటా 

తన సత్తా చాటుకుంది కానీ 

నెలల పసిగుడ్డు నుండీ ముదుసలి వరకూ 

కామాంధుల పైశాచికత్వానికి బలై పోయి ఆక్రొశిస్తోంది 

కనపడని మహిళల సంఖ్య తక్కువ కాదు 

రేపు ఒంటరి అమ్మగా మారి వివాహానికి దూరంగా 

టెస్టు ట్యూబు బేబీలకు తల్లిగా మనుగద సాగిస్తూ 

వృత్తి పరంగా ఎదుగుతూ పురుషాధిక్య సమాజంలో 

తన కంటూ స్థానాని పదిల పరుచుకుంటూ 

తనదైన జీవితాన్ని హాయిగా ఆనందంగా మలచుకిని 

ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది 

తథ్యం ఇది తథ్యం పురుషుల్ని సవాల్ చేస్తూ 

తన సత్తా చాటుతుంది పురాణ కాలం నుండీ 

అదే జరుగుతోంది జరగబోతోంది జరిగితీరుతుంది 

మహిళలారా బహు పరాక్ బహు పరాక్

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు