మా రచయితలు

రచయిత పేరు:    అంజనీ దేవి

కవితలు

విశ్వవిజేతలం మనమే

ఎందుకు మిత్రమా చింతతోఉన్నావు

కరోన నిన్ను కూడా కల్లోల పరిచిందా

ఆ దిగాలెమిటి ఆగుబులేమిటి

మనుగడ కోసం సాగించే యుద్ధం

మనకు కొత్థేమి కాదు కదా

విప్పారిన కళ్ళతో చూడు

వాస్తవాలు విస్మయపరుస్తాయి

విర్రవీగినదంతా వెర్రిగా ఓడుతుంది

ఏది కొత్త నీకు

అంటచ్ బులిటీ నా క్వారంటై నా

శుచినా శుభ్రమా 

వ్యాధులతో పోరాటమా

మనుగడ కోసం సాగించే యుద్ధం

మనకు కొత్త ఏమి కాదు కదా

కొంత కోల్పోయామెమో గాని

మొత్థంగా కాదు కదా

స్త్రీలుగా నెలసరి లో క్వారంటన్

దళితులుగా సోషల్ డిస్ట్ న్స్ ఎదుర్కోలేదా

ఎంగిలి వద్దంటే వెంగళాయిగా చుస్థిరి

 పారిశ్రామిక విప్లవం నిన్ను యంత్రంగా

సామ్రాజ్యవాదం నిన్ను ఆయుదంగా

మార్చికుందా

అగ్ర రాజ్యాల ఉగ్రరూపం 

ఎంతోకాలం సాగదులే

నాగరికత సంస్కృతులు

పునరుధ్హానం అవుతాయని

అనేక  వృత్తంతాలు న్నాయి కదా

ధైర్యంగా ఉండు మిత్రమా

రేపటి రోజు మనదే

మన నమస్కారం ప్రపంచ సంస్కారమైనట్టు

మన సంస్కృతి విశ్వ సంస్కృతి

కాబోతుంది

కొంత కాలం ఒంటరితనం జయించు

ఆకాంక్షను ఆరాటాన్ని అదుపులో పెట్టు

రేపటి ప్రపంచపు ఆశా జ్యోతులం మనమే

కృత్రిమ అభివృద్ధి చెందిన దేశాలన్నీ

మానవ వనరుల్ని కోల్పోతున్న వైనం 

బ్రిటనొక్కటే కాదు 

ప్రపంచానికి ఆషాకిరణం 

మన యువతే.

కరోనాను జయిస్తే

విశ్వ విజేతలం మనమే

           

 

రంగస్థలం పై సీన్లు మారుతున్నాయి 

అదొక రంగస్థలం  పాత్రలు

మనిషి  త్రేతాయుగపు దైవం

కలియుగ దైవం కంత్రీ కరోనా

 

ఇప్పుడు రంగస్థలం పై సీన్లు మారాయి

స్క్రిప్ట్ లో లేనిది ప్రదర్షింపబడుతుంది

వినోదమంత విషాదమైంది

కథ పూర్తి కాకుండానే పాత్ర కనుమరుగైంది

బాధ్యతలన్ని అర్ధాంతరంగా ఆపేసి

ఎవరో పిలిచినట్టు వెల్లి పోతున్నారు

ఒక్కరొక్కరుగా కాదు సమూహాలుగా

రంగస్థలం కళతప్పుతుంది

 

యంత్రాల మోతలాగిన చోట

కార్మికుల ఆకలి కేకలు విపిస్తున్నాయి

వలస పక్షులన్నీ వరుస కడుతున్నాయి

ఆకురాలే కొమ్మపై నిలువలేక

 

లాక్ డౌన్ లో పైకంతా ప్రశాంతతే

బ్యాంకర్  లలో దాగిన ఉన్మాది వలే

 

వంట రూముల్లో యుద్ధ విన్యాసం

డైనింగ్ టెబుల్  ఒక నృత్య రూపకం

కాస్త కాఫీ అంటే అమ్మో కరోన అంటూ వీధి గుమ్మం లో ఆగిన సోపాతి

 

నక్షత్రం లా మెరిసి మురిపిస్తు విరాళం

వెలుగులు సోకేదెవరికో

 

అభివృద్ధి మంత్రమిపుడు

కరోనా జపమైంది

వృద్ధి వ్యూహాలిపుడు

లేబరేటరీల్లో పరీక్షకు నిలబడ్డాయి

 

క్షీనోపాత ప్రయోజన సూత్రం

అనుభవం లోకి వస్తున్నది

 

అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనిచందం

అగ్ర రాజ్యాల అందమిపుడు

కరెన్సీ ల వేటలో కరోనా చిక్కింది

ప్రజలు లేనిదే ప్రగతెక్కడుంది

 

ఇంతకాలం త్రేతాయుగపు రాతిదైవం

మొక్కులు ముడుపులు రక్షించాయా

 

ఇప్పిడిక కలియుగ దేవుళ్ళక మొక్కాలి

 

ఇప్పుడిక ఆసుపత్రులే గాలిగోపురాలు

పాలకులే ద్వారాపాలకులు

డాక్టర్.పోలీస్ రైతు పారిశుద్ద కార్మికులు

నాలుగు దిక్కుల దేవుళ్ళు

ఆంక్షలు పాటించడమే యజ్ఞం

నియంత్రణలు యాగాలు

 నమో కదలాడే కలియుగ దేవుల్లారా

          నమో నమః

            

రంగస్థలం పై సీన్లు మారుతున్నాయి

అదొక రంగస్థలం  పాత్రలు

మనిషి  త్రేతాయుగపు దైవం

కలియుగ దైవం కంత్రీ కరోనా

 

ఇప్పుడు రంగస్థలం పై సీన్లు మారాయి

స్క్రిప్ట్ లో లేనిది ప్రదర్షింపబడుతుంది

వినోదమంత విషాదమైంది

కథ పూర్తి కాకుండానే పాత్ర కనుమరుగైంది

బాధ్యతలన్ని అర్ధాంతరంగా ఆపేసి

ఎవరో పిలిచినట్టు వెల్లి పోతున్నారు

ఒక్కరొక్కరుగా కాదు సమూహాలుగా

రంగస్థలం కళతప్పుతుంది

 

యంత్రాల మోతలాగిన చోట

కార్మికుల ఆకలి కేకలు విపిస్తున్నాయి

వలస పక్షులన్నీ వరుస కడుతున్నాయి

ఆకురాలే కొమ్మపై నిలువలేక

 

లాక్ డౌన్ లో పైకంతా ప్రశాంతతే

బ్యాంకర్  లలో దాగిన ఉన్మాది వలే

 

వంట రూముల్లో యుద్ధ విన్యాసం

డైనింగ్ టెబుల్  ఒక నృత్య రూపకం

కాస్త కాఫీ అంటే అమ్మో కరోన అంటూ వీధి గుమ్మం లో ఆగిన సోపాతి

 

నక్షత్రం లా మెరిసి మురిపిస్తు విరాళం

వెలుగులు సోకేదెవరి కో

 

అభివృద్ధి మంత్రమిపుడు

కరోనా జపమైంది

వృద్ధి వ్యూహాలిపుడు

లేబరేటరీల్లో పరీక్షకు నిలబడ్డాయి

 

క్షీనోపాత ప్రయోజన సూత్రం

అనుభవం లోకి వస్తున్నది

 

అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనిచందం

అగ్ర రాజ్యాల అందమిపుడు

కరెన్సీ ల వేటలో కరోనా చిక్కింది

ప్రజలు లేనిదే ప్రగతెక్కడుంది

 

ఇంతకాలం త్రేతాయుగపు రాతిదైవం

మొక్కులు ముడుపులు రక్షించాయా

 

ఇప్పిడిక కలియుగ దేవుళ్ళక మొక్కాలి

 

ఇప్పుడిక ఆసుపత్రులే గాలిగోపురాలు

పాలకులే ద్వారాపాలకులు

డాక్టర్.పోలీస్ రైతు పారిశుద్ద కార్మికులు

నాలుగు దిక్కుల దేవుళ్ళు

ఆంక్షలు పాటించడమే యజ్ఞం

నియంత్రణలు యాగాలు

 నమో కదలాడే కలియుగ దేవుల్లారా

          నమో నమః

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు