అది ప్రపంచమంతా వ్యాపించింది
వీధులన్నీ విస్తుపోయాయి
నిశబ్దం కూడా నియంతలా పాలిస్తుంది
ఎర్రగా పొడిచే సూరీడు కూడా ఏడుస్తున్నాడు
చంటి పిల్లాడిలా
కాలం పదునైన కొడవలిలా మారింది
పచ్చని బ్రతుకులపై కోతకు కదిలింది
ప్రతి రోజు యుద్ధంలా సాగుతుంది
బలైపోయేది బందూకుకో బాంబుకో కాదు
భయంకరమైన విషాణువికి ! !