మా రచయితలు

రచయిత పేరు:    కడరి మహేందర్

కవితలు

ఓ రైతన్న
 

కరోనా నిర్బందమాయే ఓ రైతన్న

కల్లంలో వడ్ల గింజలాయే ఓ రైతన్న

 

తాలు అంటున్నరు ఓ రైతన్న

నిన్ తార్మారు జేస్తున్నరు ఓ రైతన్న

 

తాలున్న మద్దతు ధరనిరి ఓ రైతన్న

నిన్నెంతో మురిపించిరి ఓ రైతన్న

 

ప్రతి గింజ కొంటమనిరి ఓ రైతన్న

క్వింటాల్ కి నాల్గు కిలోలు కోసిరి ఓ రైతన్న

 

మిల్లర్ల దోపిడాయే ఓ రైతన్న

నీ మెతుకులే గుంజుడాయే ఓ రైతన్న

 

రైతే రాజనిరి ఓ రైతన్న

నీ నడుమిరిసిరి ఓ రైతన్న

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు