మా రచయితలు

రచయిత పేరు:    అనిల్ బుజుగుండ్ల

కవితలు

కల్లోల కరోనా

 

ప్రస్తుత కరోనా ప్రభలిన తరుణంలో

అందరూ ఇండ్లకి తాళాలేసుకుని

ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి

ఇంతటి గడ్డు పరిస్థితిలో

వైద్యులు, పారిశుధ్య కార్మికులు

కొంతమంది పోలీసులు

రేపటి మానవ భవిషత్తు కోసం

వారు వారి కుటుంబాలని వదిలేసారు

వారి జీవితాలని వదిలేసారు

చివరికి వారి ప్రాణాలని పణంగపెట్టి

ప్రమాదాలని సవాల్చేస్తూ

రేపటి సమాజం కోసం పనిచేసేవారు ఒకవైపు

ప్రభుత్వ అసమర్థత వలన

కన్నీటిని అరచేతిలో పట్టుకొని

కాలే డొక్కలతో ఎండిన డెక్కలతో

అడుగడుగునా రక్తపు ముద్రలేస్తూ

ఆకలి వేకిలితనానికి రాలిపోతున్నావారు ఒకపైపు

మంత్రాలు చేసి మాయ చెయ్యగలమాన్నవారు

ఇప్పుడు ఎ మూలన ఉన్నారో ?

మా పాలనలో

బతుకులు బాగుపడుతాయని

రెచ్చిపోయిన అసెంబ్లీ రౌడీలు

ఏ  రాజకీయం చేస్తున్నారో ?

ఇప్పటికైనా ప్రజలు

పాలకుల మోసాలని తెలుసుకుంటారని ఆశిస్తూ

కేటుగాల్లని చితికిల పడేస్తూ వచ్చిన

కరోనా పోవాలని కోరుకుంటూ

కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వారికి

వందనాలు తెలుపుకుంటూ

కాలే కడుపు బాదని ప్రభుత్వం

ఇకనైనా పట్టించుకోవాలని కోరుకుంటూ

 

           

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు