నాన్న... నాకున్న
పెద్ద ఆస్తి అందరికన్నా
తననెప్పుడూ మరవలెను
ఏ కాలమైనా
కష్టాన్ని దాచుకొని జీవితాంతం
ఆనందాలని పంచే ఒక మహానియమైన రూపం
నాన్న...నువు ఆ ఇనుప పెట్టె
వేడికి ఉండి
నన్ను ఫ్యాన్లో కూలర్లో ఉంచుతున్నావ్
ఆ పెట్టె వేడికి నీ చర్మం
ఎన్నిసార్లు కాలిపోయిందో
నువ్వు ఎన్నిసార్లు బాధపడి వుంటావో నాన్న
మాకు మంచి ఆహారం పెట్టడానికి
చదువు అందించడానికి
నువ్వెన్ని పస్తులున్నావో నాన్న
అందరూ నిన్ను ఎగతాళి చేస్తుంటే
ఎన్ని సార్లు కన్నీళ్లు
దిగమింగావో నాన్న
నీ కష్టం ఇంకెన్నాళ్లు నాన్న